Month of Ramadan
-
రంజాన్ యాప్
- ‘ఇ-రమదాన్’ పేరిట రూపొందించిన మణిపాల్ యువకులు - సహరీ, ఇఫ్తార్ సమయాలతో పాటు సమీపంలోని మసీదుల వివరాలు లభ్యం సాక్షి, బెంగళూరు: ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో అనుసరించే ధార్మిక కార్యక్రమాల వివరాలను తెలియజేసే విధంగా ప్రత్యేక యాప్ అందుబాటులోకి వచ్చింది. మణిపాల్‌కు చెందిన ‘తోన్సే టెక్నాలజీస్’ సంస్థ ‘ఇ-రమదాన్’ పేరిట యాప్‌ను రూపొం దించింది. పవిత్ర రంజాన్ మాసంలో పాటించాల్సిన పద్ధతులు, ఉపవాస నియమాలు, ప్రత్యేక ప్రార్థనల వివరాలతో పాటు స్థానిక సమయాన్ని అ నుసరించి సహరీ, ఇఫ్తార్ వేళలు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇదే సందర్భంలో స్థానికంగా ఉన్న మసీదుల చిరునామాలు, అక్కడికి ఎలా చేరుకోవాలనే మార్గ సూచికలు సైతం యాప్‌లో పొందుపరిచారు. కేవలం ఆధ్యాత్మిక విషయాలే కాక ఆరోగ్య సంబంధ విషయాలను సైతం పొందుపరిచారు. ఉపవాస సమయంలో ఎలాంటి ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఆహారపదార్థాలను సహరీ, ఇఫ్తార్ సమయాల్లో తీసుకుంటే ఎలాంటి మేలు జరుగుతుంది అనే విషయాలను విపులంగా వివరించారు. అంతేకాక పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని ప్రస్తుతం అరబిక్, ఇంగ్లీషు భాషల్లో ఈ యాప్‌లో పొందుపరిచారు. ఈ రెండు భాషల్లోనే కాక త్వరలోనే అన్ని దక్షిణాది భాషల్లోనూ పవిత్ర ఖురాన్ గ్రంధాన్ని ఈ యాప్‌లో పొందుపరిచే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. మిత్రుడితో కలిసి.... మణిపాల్‌కు చెందిన మహమ్మద్ యూనస్ రహమతుల్లా తోన్సే(26) మంగళూరులోని సహ్యాద్రి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం మణిపాల్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో స్నాతకోత్తర(పోస్ట్ గ్రాడ్యుయేషన్) పూర్తి చేశారు. కాగా, విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించడంతో పాటు వారిని ఎంటర్పెన్యూర్స్గా తీర్చిదిద్దేందుకు గాను యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మణిపాల్ యూనివర్సిటీ టెక్నాలజీ బిజినెస్ ఇంకుబేటర్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యుడిగా చేరిన తాన్సే సహ విద్యార్థి అయిన నిహాల్ కార్కళ(23)తో కలిసి ‘తాన్సే టెక్నాలజీస్’ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ నుంచే ప్రస్తుత ‘ఇ-రమదాన్’ యాప్‌ను అభివృద్ధి చేశారు. ఈ విషయంపై యాప్ రూపకల్పనలో ప్రధాన భూమిక పోషించిన తాన్సే మాట్లాడుతూ....‘ప్రస్తుతం యాప్‌ల వినియోగం జీవన విధానంలో ఒక భాగమైపోయింది. టెక్నాలజీని ఎక్కువగా వినియోగించుకునే యువతను ప్రధానంగా దష్టిలో పెట్టుకొని, పవిత్ర రంజాన్ మాస పవిత్రతను, ఈ మాసంలో అనుసరించాల్సిన ఆధ్యాత్మిక విధి, విధానాలను యువతకు చేరువ చేసేందుకు ‘ఇ-రమదాన్’ యాప్‌ను రూపొందించాం. యాప్‌ను విడుదల చేసిన వారంలోనే దాదాపు 2000 డౌన్లోడ్స్ నమోదయ్యాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘ఇ-రమదాన్’(్ఛఖ్చఝ్చఛ్చీ) యాప్‌ను ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు’ అని తెలిపారు. -
ప్లస్ టేస్ట్.. ప్లస్ ఏరియా..
చార్మినార్.. చారిత్రాత్మకంగా సిటీకి ప్లస్. హలీమ్.. రంజాన్ మాసంలో సిటీకి అందే ప్లస్ రుచి. హైదరాబాద్ బిర్యానీ.. ప్రపంచ ఖ్యాతి చెందిన ఈ ఘుమఘుమలు.. టేస్ట్ ఆఫ్ సిటీకి మెగా ప్లస్‌గా నిలిచింది. ఒక్కసారి ఈ దక్కన్ బిర్యానీ ముద్ద గొంతులోకి దిగితే.. మరో బిర్యానీ రుచి చేసినప్పుడల్లా.. హైదరాబాద్ గుర్తుకు రావాల్సిందే. హైదరాబాదీలకు అనుకున్నదే తడవుగా బిర్యానీ లాగించే అవకాశం ఉంది. మరి ఇతర నగరవాసులుకో..? మన సిటీ బిర్యాని టేస్ట్ చూడాలంటే వారంతా హైదరాబాద్‌కు రానక్కర్లేదు. మన సిటీ రెస్టారెంట్స్ బిర్యానీని వేడివేడిగా ఇతర రాష్ట్రాలకూ వడ్డించేస్తున్నాయి. మన సిటీలోని రెస్టారెంట్స్‌లో రాజస్థానీ ఫుడ్‌ఫెస్టివల్, పంజాబీ రుచులు, గుజరాతీ టేస్ట్లంటూ రోజూ ఏదో ఒక ఫుడ్ ఫెస్టివల్ జరుగుతూనే ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లోనూ.. హైదరాబాద్ ఫుడ్ ఫెస్టివల్స్ ఘనంగానే జరుగుతుంటాయి. చేయి తిరిగిన నలభీములు వండి వార్చినా.. హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ తీసుకురాలేకపోతున్నారు. ఈ సమస్యకు చెక్ పెడుతూ ‘బిర్యానీ బై ఎయిర్’ కాన్సెప్ట్ మొదలైంది. బెంగళూరు, ముంబై, పూణె.. నగరమేదైనా సరే హైదరాబాద్ దమ్ కీ బిర్యానీ రుచి చూడాలనుకుంటే ఇప్పుడు గంటల్లో పని. కాల్ చేసి ఆర్డర్ చేస్తే సరి సాయంత్రానికి వాళ్లింట్లో బిర్యానీ రెడీగా ఉంటుంది. ప్రస్తుతానికి వారానికి మూడు రోజులు ‘బిర్యానీ బై ఎయిర్’ అందుబాటులో ఉంది. ‘బిర్యానీ బై ఎయిర్’ సర్వీస్‌ను మేం ఈ మధ్యే మొదలు పెట్టాము. నాలుగు నెలలుగా ఆర్డర్లను బట్టి ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. వారానికి మూడు రోజులే సర్వీస్ ఉన్నా.. ఆ మూడు రోజుల్లోనే కనీసం రెండు వేల జంబో బిర్యానీల వరకు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఎక్కువ శాతం మటన్ బిర్యానీని కావాలంటున్నారు’ అంటున్నారు షా గౌస్ రెస్టారెంట్ ప్రొప్రయిటర్ మహ్మద్ రబ్బానీ. - శిరీష చల్లపల్లి -
ఈద్ ముబారక్
-
ఈద్ ముబారక్
కర్నూలు(కల్చరల్): ముప్పై రోజులుగా వినిపించిన ఔటు శబ్దాలు.. కనిపించిన సహేరీ ఇఫ్తార్ల సందళ్లు.. గుబాళించిన హలీమ్.. హరీస్‌ల ఘుమఘుమలు... ఇక నేటితో సెలవు చెప్పి వీడ్కోలు పలుకుతున్నాయి. రమ్యమైన రంజాన్ నెల వెళ్లొస్తానంటూ.. మేఘాల మాటున కనిపించీ కనిపించని నెలవంకకు సలాములు చెబుతూ వెళ్లిపోయింది. రంజాన్ చివరిరోజున అందరి మదిలో ఉల్లాసాలు నిండగా దూద్సేమియా పండగ వచ్చేసింది. మంగళవారం ఈదుల్ ఫితర్‌ను ముస్లింలు కనులపండువగా నిర్వహించుకోనున్నారు. సోమవారం సాయంత్రం నగరంలో హిందూ ముస్లింలు ఈద్‌ముబారక్ భాయ్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ కరచాలనం చేసుకున్నారు. వన్‌టౌన్, చిత్తారి వీధి, పూలబజార్, చిన్నమార్కెట్ వీధి, గనీగల్లి, ఖడక్‌పుర, పెద్దమార్కెట్ వీధి, పాతబస్టాండ్ సమీపంలోని కొత్తపేట, ఉస్మానియా కాలేజీ వీధి, సంకల్బాగ్, మద్దూర్‌నగర్, సి.క్యాంప్, కృష్ణానగర్, అబ్బాస్‌నగర్, అమీన్ అబ్బాస్‌నగర్, వెంకటరమణ కాలనీ తదితర ప్రాంతాల్లో రంజాన్ పండుగ కొనుగోళ్ల సందడి కనిపించింది. అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్, శ్రీనివాస క్లాత్ మార్కెట్, మించిన్బజార్లలో దుకాణాల వద్ద భారీ సంఖ్యలో మహిళలు గుమిగూడి వస్త్రాలు, టోపీలు, అత్తర్లు కొనుగోలు చేశారు. ఈద్గాకు వెళ్లే కంటే ముందే ఫిత్రా దానం ఈదుల్ ఫితర్ రోజున ముస్లిములు పేదలకు ఫిత్రా దానం చేయాలని రోజా మసీదు ఇమాం అబ్దుర్రజాక్ తెలిపారు. ప్రతి నిరుపేద ముస్లిం కుటు ంబం కూడా రంజాన్‌మాసం చివరి రోజైన ఈదుల్ఫితర్ను జరుపుకునేందుకే ఈ ఫిత్రా దానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాత ఈద్గాలో ఉదయం 9:30 గంటలకు కొత్త ఈద్గాలో ఉదయం 10 గంటలకు ఈదుల్ఫితర్ నమాజు జరుగుతుందన్నారు. ముస్తాబైన ఈద్గాలు నగరంలోని కొత్తబస్టాండ్ సమీపంలోని పాత ఈద్గా, సంతోష్‌నగర్ సమీపంలోని కొత్త ఈద్గా, వన్‌టౌన్‌లోని జమ్మిచెట్టు సమీపంలోని ఈద్గాలు ఈదుల్ఫితర్ నమాజు కోసం ముస్తాబయ్యాయి. ఈద్గా ప్రాంగణం శుభ్రపరచి, నీళ్ల సౌకర్యం, షామియానాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సి.క్యాంప్ మీదుగా కొత్తబస్టాండ్‌కు వెళ్లే వాహనాలను హైవే వైపుకు మళ్లించే ఏర్పాట్లు చేస్తున్నారు. -
రంజాన్‌లో ‘తరావీహ్’లకు ప్రాధాన్యం
బాన్సువాడ: శుభాల సరోవరమైన రంజాన్ నెలలో వీలైనంత అధికంగా దైవ ధ్యానం చేయమనీ, దివ్య ఖుర్ఆన్ను కనీసం ఒకసారైనా పూర్తిగా పారాయణం చేయమని మహా ప్రవక్త (సఅసం) బోధించారు. ముఖ్యంగా రంజాన్‌లో రాత్రి పూట దైవారాధనలో గడపడం పుణ్యప్రదమని హదీసుల ద్వారా రూఢీ అవుతోంది. అందుకే రంజాన్ నెలలో ముస్లింల కోసం తరావీహ్ నమాజ్గా ఖరారు చేయబడింది. ఈ నమాజ్ ఇషా నమాజ్ తర్వాత ప్రారంభమై సహరీ వేళ వరకు ఉంటుంది. తరావీహ్ నమాజ్ వ్యక్తిగతం గా కూడా చేయవచ్చు. సామూహికంగా కూడా చేయవ చ్చు. * జమాత్‌తో తరావీహ్ నమాజ్ చడవడం ఉత్తమం. తరావీహ్ జమాత్ పురుషుల కోసం ‘సున్నతె కిఫాయ’ అవుతుంది. వ్యక్తిగతంగా కూడా చేయవచ్చు. కానీ, సామూ హికంగా చేయడంతో చేకూరే ప్రయోజనాలు వ్యక్తిగతంగా చేయడంలో చేకూరవు. * మహిళలు కూడా తరావీహ్ నమాజ్‌ను సామూహికంగా చదవవచ్చు. వారికి మహిళ ఇమామత్ వహించవచ్చు. అయితే, పురుషుల జమాత్‌లో మాదిరిగా ‘ఇమామ్’ ముందు వరుసలో కాకుండా మహిళల వరుసలోనే నిలబడాలి. ఫర్జ్, విత్ ్రనమాజులలో మహిళలు ఇమామత్ చేయవచ్చు. * తరావీహ్ అనే పదం రాహత్ నుండి వచ్చింది. రాహత్ అంటే విశ్రాంతి అని అర్థం. అంటే విశ్రాంతి తీసుకొని మరీ చేయాల్సిన నమాజ్ అని భావం. తరావీహ్ నమా జ్ను రెండేసి రకాతుల చొప్పున విడదీసి చేయమని మహాప్రవక్త(స) ఉపదేశించారు. * హజ్రత్ ఆయెషా (రజి అల్లాహు అన్హ) ఇలా ఉల్లేఖించారు: మహాప్రవక్త (స) రంజాన్ నెలలో ఇషా నమాజ్ తర్వాత తరావీహ్ నమాజ్ చేస్తే చాలామంది అనుచరు లు ఆయనతో కలిసి నమాజ్ చదివారు. రెండో రాత్రి ఆయన (స) నమాజ్ చేస్తే ఇంకా ఎక్కువ మంది ఆయన్ని అనుసరించారు. రంజాన్ రాత్రుల్లో తరావీహ్ నమాజ్ చదవమని మహాప్రవక్త (స) తన అనుచరులకు ప్రబోధించారు. * అయితే ఈ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. ఎవరైతే నిష్కల్మషమైన విశ్వాసంతో, దైవ ప్రసన్నతా లక్ష్యంతో రమజాన్ రాత్రుల్లో దైవారాధనలో గడపారో వారి గత అపరాధాలు, జరగబోయే అపరాధాలు క్షమించబడతాయని మహా ప్రవక్త (స) ప్రవచించారు. * రాత్రి పొద్దు పోయాక తరావీహ్ నమాజ్ చడవడం ఉత్తమం. తరావీహ్‌లో ఒకసారి పూర్తి ఖురాన్ పఠించడం సున్నత్. ఒక వేళ హాఫిజ్-ఏ-ఖురాన్ అందుబాటులో లేని పక్షంలో అలమ్తర సూరా నుండి చిన్న సూరాలే పఠించవచ్చు.