రంజాన్‌లో ‘తరావీహ్’లకు ప్రాధాన్యం | Taravih 'preference to In Ramadan | Sakshi
Sakshi News home page

రంజాన్‌లో ‘తరావీహ్’లకు ప్రాధాన్యం

Published Sun, Jul 6 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM

రంజాన్‌లో ‘తరావీహ్’లకు ప్రాధాన్యం

రంజాన్‌లో ‘తరావీహ్’లకు ప్రాధాన్యం

బాన్సువాడ: శుభాల సరోవరమైన రంజాన్ నెలలో వీలైనంత అధికంగా దైవ ధ్యానం చేయమనీ, దివ్య ఖుర్‌ఆన్‌ను కనీసం ఒకసారైనా పూర్తిగా పారాయణం చేయమని మహా ప్రవక్త (సఅసం) బోధించారు. ముఖ్యంగా రంజాన్‌లో రాత్రి పూట దైవారాధనలో గడపడం పుణ్యప్రదమని హదీసుల ద్వారా రూఢీ అవుతోంది. అందుకే రంజాన్ నెలలో ముస్లింల కోసం తరావీహ్ నమాజ్‌గా ఖరారు చేయబడింది. ఈ నమాజ్ ఇషా నమాజ్ తర్వాత ప్రారంభమై సహరీ వేళ వరకు ఉంటుంది. తరావీహ్ నమాజ్ వ్యక్తిగతం గా కూడా చేయవచ్చు. సామూహికంగా కూడా చేయవ చ్చు.
* జమాత్‌తో తరావీహ్ నమాజ్ చడవడం ఉత్తమం. తరావీహ్ జమాత్ పురుషుల కోసం ‘సున్నతె కిఫాయ’ అవుతుంది. వ్యక్తిగతంగా కూడా చేయవచ్చు. కానీ, సామూ హికంగా చేయడంతో చేకూరే ప్రయోజనాలు వ్యక్తిగతంగా చేయడంలో చేకూరవు.
* మహిళలు కూడా తరావీహ్ నమాజ్‌ను సామూహికంగా చదవవచ్చు. వారికి మహిళ ఇమామత్ వహించవచ్చు. అయితే, పురుషుల జమాత్‌లో మాదిరిగా ‘ఇమామ్’ ముందు వరుసలో కాకుండా మహిళల వరుసలోనే నిలబడాలి. ఫర్జ్, విత్ ్రనమాజులలో మహిళలు ఇమామత్ చేయవచ్చు.
* తరావీహ్ అనే పదం రాహత్ నుండి వచ్చింది. రాహత్ అంటే విశ్రాంతి అని అర్థం. అంటే విశ్రాంతి తీసుకొని మరీ చేయాల్సిన నమాజ్ అని భావం. తరావీహ్ నమా జ్‌ను రెండేసి రకాతుల చొప్పున విడదీసి చేయమని మహాప్రవక్త(స) ఉపదేశించారు.
* హజ్రత్ ఆయెషా (రజి అల్లాహు అన్‌హ) ఇలా ఉల్లేఖించారు: మహాప్రవక్త (స) రంజాన్ నెలలో ఇషా నమాజ్ తర్వాత తరావీహ్ నమాజ్ చేస్తే చాలామంది అనుచరు లు ఆయనతో కలిసి నమాజ్ చదివారు. రెండో రాత్రి ఆయన (స) నమాజ్ చేస్తే ఇంకా ఎక్కువ మంది ఆయన్ని అనుసరించారు. రంజాన్ రాత్రుల్లో తరావీహ్ నమాజ్ చదవమని మహాప్రవక్త (స) తన అనుచరులకు ప్రబోధించారు.
* అయితే ఈ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. ఎవరైతే నిష్కల్మషమైన విశ్వాసంతో, దైవ ప్రసన్నతా లక్ష్యంతో రమజాన్ రాత్రుల్లో దైవారాధనలో గడపారో వారి గత అపరాధాలు, జరగబోయే అపరాధాలు క్షమించబడతాయని మహా ప్రవక్త (స) ప్రవచించారు.
* రాత్రి పొద్దు పోయాక తరావీహ్ నమాజ్ చడవడం ఉత్తమం. తరావీహ్‌లో ఒకసారి పూర్తి ఖురాన్ పఠించడం సున్నత్. ఒక వేళ హాఫిజ్-ఏ-ఖురాన్ అందుబాటులో లేని పక్షంలో అలమ్‌తర సూరా నుండి చిన్న సూరాలే పఠించవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement