Taravih
-
పాక్‌లో సామూహిక ప్రార్థనలకు అనుమతి
ఇస్లామాబాద్: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభణ నేపథ్యంలో మతపరమైన సమావేశాలు, సామూహిక ప్రార్థనలపై పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం విదితమే. ముఖ్యంగా రంజాన్ మాసం సమీపిస్తున్న తరుణంలో సామూహిక ప్రార్థనలు రద్దు చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ఇతర వైద్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో తొలుత ఇదే బాటలో నడిచిన పాకిస్తాన్ తాజాగా యూటర్న్ తీసుకుంది. రంజాన్ మాసం మొదలుకానున్న తరుణంలో షరతులతో మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు మత గురువులతో ఆన్లైన్లో చర్చలు జరిపిన పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామూహిక ప్రార్థనలు విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే మతపెద్దలు ఇందుకు ససేమిరా అనడంతో ప్రభుత్వం వారి ఒత్తిళ్లకు తలొగ్గక తప్పలేదు. (భారత్ పాక్ మధ్య మాటల యుద్ధం) ఈ నేపథ్యంలో 20 అంశాల ప్రణాళిక ప్రతిపాదించి.. అధ్యక్షుడు మత గురువులను ఒప్పించారు. మసీదుల్లో తారావీ ప్రార్థనలు నిర్వహించేందుకు అనుమతించామన్న ఆయన... ప్రార్థనా సమయంలో కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సామూహిక ప్రార్థనల నేపథ్యంలో మసీదుల్లో పాటించాల్సిన నిబంధనల గురించి మార్గదర్శకాలు జారీచేశారు.(అమెరికా కంటే అధ్వాన్నంగా: బిలావల్ భుట్టో) 1. కార్పెట్లు, చాపలు పరచి ప్రార్థనలు చేయరాదు. మసీదు ఫ్లోర్‌ను ప్రతిరోజు విధిగా శుభ్రం చేసుకోవాలి. 2. ఇంటి నుంచే చాపలు తెచ్చుకుంటే అభ్యంతరం లేదు. 3. ప్రార్థనల అనంతరం ఎవరూ గుమిగూడకూడదు. 4. గార్డెన్ ప్రాంతం కలిగి ఉన్న మసీదుల్లో ఆరుబయటే ప్రార్థనలు చేస్తే మంచిది. 5. 50 ఏళ్లకు పైబడిన వారు, పిల్లలను మసీదులోకి అనుమతించరు. 6. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వైద్య నిపుణుల సూచనల ప్రకారం కచ్చితంగా భౌతిక దూరం పాటించాలి. 7. రోడ్లు, ఫుట్‌పాత్‌లు సహా ఇతర ప్రాంతాల్లో(బహిరంగ ప్రదేశాల్లో)తారావీ ప్రార్థనలు చేయరాదు 8. ఇంట్లో ప్రార్థనలు చేయడం శ్రేయస్కరం. 9. క్లోరినేటెడ్ వాటర్‌తో మసీదు పరిసరాలు శుభ్రపరచాలి 10. ప్రార్థనా సమయంలో ఒక్కో వ్యక్తి మరో వ్యక్తి నుంచి కనీసం ఆరు ఫీట్ల దూరంలో ఉండాలి 11. షేక్హ్యాండ్లు, ఆలింగనాలను పూర్తిగా మానేయాలి 12. ఇఫ్తార్, షేరీ విందులు నిర్వహించకూడదు తదితర 20 అంశాల ప్రణాళిక గురించి వారికి వివరించారు. -
రంజాన్‌లో ‘తరావీహ్’లకు ప్రాధాన్యం
బాన్సువాడ: శుభాల సరోవరమైన రంజాన్ నెలలో వీలైనంత అధికంగా దైవ ధ్యానం చేయమనీ, దివ్య ఖుర్ఆన్ను కనీసం ఒకసారైనా పూర్తిగా పారాయణం చేయమని మహా ప్రవక్త (సఅసం) బోధించారు. ముఖ్యంగా రంజాన్‌లో రాత్రి పూట దైవారాధనలో గడపడం పుణ్యప్రదమని హదీసుల ద్వారా రూఢీ అవుతోంది. అందుకే రంజాన్ నెలలో ముస్లింల కోసం తరావీహ్ నమాజ్గా ఖరారు చేయబడింది. ఈ నమాజ్ ఇషా నమాజ్ తర్వాత ప్రారంభమై సహరీ వేళ వరకు ఉంటుంది. తరావీహ్ నమాజ్ వ్యక్తిగతం గా కూడా చేయవచ్చు. సామూహికంగా కూడా చేయవ చ్చు. * జమాత్‌తో తరావీహ్ నమాజ్ చడవడం ఉత్తమం. తరావీహ్ జమాత్ పురుషుల కోసం ‘సున్నతె కిఫాయ’ అవుతుంది. వ్యక్తిగతంగా కూడా చేయవచ్చు. కానీ, సామూ హికంగా చేయడంతో చేకూరే ప్రయోజనాలు వ్యక్తిగతంగా చేయడంలో చేకూరవు. * మహిళలు కూడా తరావీహ్ నమాజ్‌ను సామూహికంగా చదవవచ్చు. వారికి మహిళ ఇమామత్ వహించవచ్చు. అయితే, పురుషుల జమాత్‌లో మాదిరిగా ‘ఇమామ్’ ముందు వరుసలో కాకుండా మహిళల వరుసలోనే నిలబడాలి. ఫర్జ్, విత్ ్రనమాజులలో మహిళలు ఇమామత్ చేయవచ్చు. * తరావీహ్ అనే పదం రాహత్ నుండి వచ్చింది. రాహత్ అంటే విశ్రాంతి అని అర్థం. అంటే విశ్రాంతి తీసుకొని మరీ చేయాల్సిన నమాజ్ అని భావం. తరావీహ్ నమా జ్ను రెండేసి రకాతుల చొప్పున విడదీసి చేయమని మహాప్రవక్త(స) ఉపదేశించారు. * హజ్రత్ ఆయెషా (రజి అల్లాహు అన్హ) ఇలా ఉల్లేఖించారు: మహాప్రవక్త (స) రంజాన్ నెలలో ఇషా నమాజ్ తర్వాత తరావీహ్ నమాజ్ చేస్తే చాలామంది అనుచరు లు ఆయనతో కలిసి నమాజ్ చదివారు. రెండో రాత్రి ఆయన (స) నమాజ్ చేస్తే ఇంకా ఎక్కువ మంది ఆయన్ని అనుసరించారు. రంజాన్ రాత్రుల్లో తరావీహ్ నమాజ్ చదవమని మహాప్రవక్త (స) తన అనుచరులకు ప్రబోధించారు. * అయితే ఈ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. ఎవరైతే నిష్కల్మషమైన విశ్వాసంతో, దైవ ప్రసన్నతా లక్ష్యంతో రమజాన్ రాత్రుల్లో దైవారాధనలో గడపారో వారి గత అపరాధాలు, జరగబోయే అపరాధాలు క్షమించబడతాయని మహా ప్రవక్త (స) ప్రవచించారు. * రాత్రి పొద్దు పోయాక తరావీహ్ నమాజ్ చడవడం ఉత్తమం. తరావీహ్‌లో ఒకసారి పూర్తి ఖురాన్ పఠించడం సున్నత్. ఒక వేళ హాఫిజ్-ఏ-ఖురాన్ అందుబాటులో లేని పక్షంలో అలమ్తర సూరా నుండి చిన్న సూరాలే పఠించవచ్చు.