సాక్షి, హైదరాబాద్: అయ్యప్ప స్వామి దర్శనానికి కేరళలోని శబరిమల వెళ్లే యాత్రికుల కోసం ‘యాత్రి.కామ్’ సంస్థ దక్షిణ మధ్య రైల్వే సహకారంతో ‘రైల్ యాత్రి.డాట్ ఇన్ యాప్’ను ప్రారంభించింది. ఇందులో శబరిమలైకి సంబంధించిన అన్ని వివరాలతో పాటు రైళ్ల రాకపోకల సమాచారం అందుబాటులో ఉంటుంది. టికెట్ బుకింగ్‌తో పాటు ప్రయాణ సమయంలో ఆహార పదార్థాల సరఫరా వివరాలు కూడా ఇందులో పొందుపర్చారు. స్టేషన్ నుంచి శబరి కొండకు వెళ్లే మార్గాలు, ఇందుకు అనువైన సదుపాయాల వివరాలు కూడా ఉంటాయి.
శబరిమల యాత్రికుల కోసం ప్రత్యేక యాప్
Published Sat, Nov 22 2014 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM
Advertisement
Advertisement