సెల్‌ఫోన్‌తో కాల్ చేస్తే చాలు! | Now, women will call using Cell Phone through from New APP | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌తో కాల్ చేస్తే చాలు!

Published Fri, Aug 29 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM

Now, women will call using Cell Phone through from New APP

ప్రత్యేక యాప్ రూపకల్పనకు పోలీసు విభాగం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఆపదలో ఉన్న మహిళలు పోలీసులకు సంబంధించిన నంబర్లకు ఫోన్ చేయడం, వారి ఇబ్బందిని వివరించడం, చిరునామాలు చెప్పడం అన్ని వేళల్లోనూ సాధ్యం కాకపోవచ్చు. వారికి ఆ వెసులుబాటు లభించే ,  కంగారు, టెన్షన్‌లో బాధితులకు ఆ ఆలోచన వచ్చే అవకాశాలు తక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర పోలీసు విభాగం, కాల్ చేస్తే చాలు.. దాన్నే ఫిర్యాదుగా పరిగణించడంతో పాటు ఇతర వివరాలు తెలియజేసేలా సెల్‌ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకునే ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని నిర్ణయించింది. వివిధ సాఫ్ట్‌వేర్ సంస్థలతో ఈ మేరకు సంప్రదింపులు జరుపుతోంది. మహిళలు తమ సెల్‌ఫోన్లలోకి డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుగా ఈ యూప్ ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇది నిత్యం కంట్రోల్ రూమ్‌లోని కంప్యూటర్లలో ఉండే సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానమై ఉంటుంది. ఆపదలో ఉన్న సమయంలో తమ సెల్‌ఫోన్లలో ఈ యూప్ కలిగిన మహిళలు.. పోలీసులు కేటాయించిన ప్రత్యేక సింగిల్ డిజిట్ నంబరుకు ఒకసారి డయల్ చేయగలిగితే చాలు.
 
  అది నేరుగా కంట్రోల్ రూమ్‌కు కనెక్ట్ అవుతుంది. దుండగులు బాధితురాలి చేతిలో ఫోన్ లాక్కుని కాల్ కట్ చేయాలని, ఫోన్ స్విచాఫ్ చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాదు. బాధితురాలు ఫోన్‌లో ఎలాంటి వివరాలూ చెప్పలేకపోయినా... ఆమెతో పాటు దుండగుల మాటలు, పరిసరాలకు సంబంధించిన ప్రతి శబ్దాన్నీ కంట్రోల్ రూమ్‌లోని సిబ్బంది వినగలుగుతారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) ద్వారా బాధితురాలు ఉన్న ప్రాంతాన్ని తక్షణమే గుర్తించి సమీపంలో ఉన్న పోలీసుస్టేషన్, గస్తీ సిబ్బందిని అప్రమత్తం చేసి అక్కడకు పంపిస్తారు. కంట్రోల్ రూమ్‌లోని సిబ్బంది కట్ చేస్తే మాత్రమే ఆ కాల్ కట్ అవుతుంది. అలా కట్ అరుున తర్వాత మాత్రమే సదరు ఫోన్‌ను ఎవరైనా స్విచ్ఛాఫ్ చేయగలుగుతారు. ఇప్పటికే మూడు సంస్థలు ఈ తరహాలో రూపొందించిన సాఫ్ట్‌వేర్, యాప్స్‌ను డీజీపీ జేవీ రాముడికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారుు.
 
 అయితే ఈ యూప్‌లు కేవలం నగరాలు, పట్టణాల్లో అత్యాధునిక సెల్‌ఫోన్లు కలిగిన వారికి మాత్రమే ఉపయుక్తంగా ఉంటారుు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సెల్‌ఫోన్లు ఉపయోగించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని భావిస్తున్న పోలీసులు.. అందరికీ అందుబాటులో ఉండే, మరింత సరళీకృత టెక్నాలజీ కోసం అన్వేషిస్తున్నారు. మరోపక్క హఠాత్తుగా, ఊహించని విధంగా ఆపదలు ఎదుర్కొనే అవకాశం గ్రామీణ ప్రాంత మహిళలకు తక్కువగా ఉంటుందని భావిస్తున్న ఉన్నతాధికారులు పై తరహా యాప్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారి కోసం ‘100’, ‘1091’ ‘199’ తరహా నంబర్లు ఉపకరిస్తాయని వారంటున్నారు. రాష్ట్ర రాజధాని గుర్తింపు, అక్కడ పోలీసు హెడ్-క్వార్టర్స్ నిర్మాణానికి స్థలం కేటాయింపు జరిగేలోపు ఈ యాప్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement