control room
-
సైబర్ వల : ఎంత ప్రచారం చేస్తున్నా, మోసపోతున్న అమాయకులు
గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంకు అకౌంట్ వివరాలు, ఆధార్, పాన్ కార్డు నంబర్లు, ఓటీపీల వంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదని పదేపదే పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ అనేక మంది అమాయకులు సైబర్ మోసగాళ్ల చేతిలో సులభంగా మోసపోతున్నారు. ఆ తరువాత అసలు విషయం తెలుసు కుని లబోదిబోమంటున్నారు. గడచిన మూడు నెలల్లో వెలుగుచూసిన సంఘటనలలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఏకంగా రూ.1,085 కోట్ల మేర మోసపోయినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మూడు నెలల్లో నేషనల్ సైబర్ క్రైం రిపోరి్టంగ్ పోర్టల్ (ఎన్సీసీఆర్పీ) హెల్ప్‌లైన్ నంబరుకు 64 వేలకుపైగా ఫిర్యాదులు వచ్చాయి. దీన్ని బట్టి సైబర్ మోసగాళ్లు ఏ స్ధాయిలో రెచ్చి పోతున్నారో ఇట్టే అర్ధమవుతోంది. ముంబై మినహా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అప్రమత్తమైన సైబర్ డిపార్టుమెంట్ పోలీసులు మరికొందరని రూ.119 కోట్లు మోసపోకుండా కాపాడడంలో సఫలీకృతమయ్యారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నా... సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దంటూ వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా అనునిత్యం ప్రభుత్వం హెచ్చరిస్తోంది.మీ బంధువులు అనారోగ్యంతో అస్పత్రిలో చేరారని, మీ పిల్లల్ని ఏదో కేసులో నేరం కింద పోలీసులు అరెస్టు చేశారని, బ్యాంకు మేనేజర్లు , సీబీఐ, కస్టమ్ డిపార్టుమెంట్ ఇలా రకరకాల శాఖల నుంచి, అలాగే కేవైసీ చేయాలని, ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని ఇలా రకరకాల వంకలతో సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఫోన్లు వస్తే స్పందించవద్దని, ఏ బ్యాంకు సిబ్బందీ ఇలా ఫోన్లో వివరాలు అడగరనే సందేశాలను గత కొద్ది రోజులుగా టెలికామ్ డిపార్టుమెంట్ ద్వారా వినిపిస్తున్నారు. అయినప్పటికీ అనేకమంది అమాయకులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు.కొందరు ఆలస్యంగానైనా మేలుకుని 1930 నంబరుకి ఫిర్యాదు చేస్తున్నారు. ఈమేరకు పోగొట్టుకున్న సొమ్మును పూర్తిగా కాకపోయినా కొంతమేర అయినా పోలీసులు కాపాడగలుగుతున్నారు. లేదంటే బ్యాంక్ ఖాతాలోంచి మొత్తం డబ్బులు ఖాళీ అయ్యే ప్రమా దం ఉంటుంది. ఇలాంటి సైబర్ మోసాలను అరికట్టేందుకు ఇటీవల న్యూ ముంబైలోని మహాపే ప్రాంతంలో అత్యాధునిక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 150పైగా సిబ్బంది, 24 గంటలు విధులు నిర్వహిస్తారు. 1930 హెల్ప్‌లైన్ నంబరుకు ప్రతీరోజు సగటున ఏనిమిది వేల వరకూ ఫిర్యాదులు వస్తుంటాయి. కంట్రోల్ రూం సిబ్బంది ఈ ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తారని, సా«ధ్యమైనంత వరకు అమాయకులు మోసపోకుండా ప్రయత్నిస్తుంటారని మహారాష్ట్ర సైబర్ డిపార్టుమెంట్ సూపరింటెండెంట్ సంజయ్ లాట్కర్ తెలిపారు. విదేశీ సిమ్‌కార్డులతో మరింత చిక్కు: సంజయ్ లాట్కర్ ఇదిలాఉండగా సైబర్ మోసగాళ్లు ఒకసారి వినియోగించిన ఫోన్ నంబర్లను మరోసారి వాడరు. వీటిని ఎలాగోలా సంపాదించిన కొందరు నేరగాళ్లు యువతి, యువకులు, మహిళలను మీ ఫోటోలను అశ్లీలంగా మార్చి సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. బాధితులు ఈ నంబర్లు గురించి తెలిపేందుకు వీల్లేకపోవడంతో ఏమీతోచక కొందరు, పరువు పోతుందన్న భయంతో కొందరు, ఇలా వేలాది మంది పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఆగిపోతున్నారు. గడచిన మూడు-నెలల్లో 1930 హెల్ప్‌లైన్ నంబరుకు వచి్చన 28,209 ఫిర్యాదుదారులు కంప్లైంట్ చేసిన 2,713 మొబైల్ నంబర్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. మిగతా నంబర్ల గురించి ఆమాత్రం సమాచారం కూడా లేదు. దీన్ని బట్టి సైబర్ నేరగాళ్లు విదేశీ సిమ్ కార్డుల ద్వారా ఫోన్ చేస్తున్నారని, ఒకసారి వాడిన సిమ్ కార్డును మరోసారి వినియోగించడం లేదని తెలుస్తోంది. దీంతో నేరగాళ్లందరినీ పట్టుకోవడం సాధ్యం కావడం లేదని సంజయ్ లాట్కర్ తెలిపారు. -
HYD: అత్యవసరమైతేనే బయటకు రావాలి
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను అప్రమత్తం చేశారు. మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ సూచనలు, రేపటి వరకు అతిభారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జోనల్ కమిషనర్లతో మంగళవారం కాన్ఫరెన్స్ నిర్వహించారామె. లోతట్టు ప్రాంతాల్లో అస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మేయర్ అధికారులను ఆదేశించారు. అలాగే.. పోలీస్, జీహెచ్ఎంసీ శాఖల సమన్వయంతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రేపటి వరకు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిందని. దీంతో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని కోరారామె. ► ప్రజలు అత్యవసరం పని ఉంటేనే బయటి రావాలని తెలిపారు. హిమాయత్, ఉస్మాన్ సాగర్ జంట జలయాలు గేట్లు ఎత్తి వేసిన నేపథ్యంలో మూసి నది లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జోనల్ కమిషనర్ లను ఆదేశించారు. హెల్ప్ లైన్ కు వచ్చిన పిర్యాదులకు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులకు మేయర్ సూచించారు. ఇప్పటికే నగరం, శివారుల్లోని పలు కాలునీలు నీట మునిగి చెరువుల్ని తలపిస్తున్నాయి. జలాశయాలకు నీరు పోటెత్తడంతో గేట్లు వదిలి.. దిగువనకు విడుదల చేస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ముందస్తుగానే ఖాళీ చేయాలని కోరుతున్నారు అధికారులు. లోతట్టు ప్రజల్ని అప్రమత్తం చేయండి భారీ వర్షాలకు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ సూచించారు. జంట జలాశయాల గేట్లు తెరిచినందున మూసీ పరివాహక ప్రాంతాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారుల్ని కోరారాయన. ప్రజలు కూడా ఏదైనా సమస్య ఎదురైతే జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ నెంబర్ 040-2111 1111 డయల్ 100 ఈవీడీఎం కంట్రోల్ రూం నెంబర్ 9000113667 ► మరోవైపు మంత్రి తలసాని సైతం హైదరాబాద్ వర్ష పరిస్థితులపై అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్లపై నీరు నిలిచిపోకుండా చూడాలని, కూలిన చెట్లు, కొమ్మలను వెంటనే తొలగించాలని, హుస్సేన్‌సాగర్.. ఉస్మాన్ సాగర్ నీటి స్థాయిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రత్యేకించి నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపైనా తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సేవలకు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూంను సంప్రదించాలని ప్రజలను కోరారు. ► ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. వీలును బట్టి వర్క్‌ఫ్రమ్ చేసుకోవాలని సూచించారు. అలాగే.. ఆఫీస్‌లకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్ రద్దీ దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. -
అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్:రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటం, గోదావరి నది ఉగ్రరూపం దాల్చడం నేపత్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూ, తక్షణ చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచించారు. భద్రా చలంలో ముంపునకు గురయ్యే అవకాశాలున్న లోతట్టు ప్రాంతాల ప్రజలను యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని.. గతంలో వరదల సందర్భంగా సమర్థవంతంగా పనిచేసిన అధికారుల సేవలను వినియోగించు కోవాలని చెప్పారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ దళాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇక తక్షణమే భద్రాచలం వెళ్లి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు చేపట్టాలని హైదరాబాద్ కలెక్టర్ దుర్శెట్టి అనుదీప్‌ను సీఎం ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం, కొత్తగూడెం కలెక్టరేట్, భద్రాచలం తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీఎస్, డీజీపీ సమీక్ష సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌తో కలసి గోదావరి పరీవాహక జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భారీ వర్షాలు, గోదావరి వరద నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని శాంతికుమారి ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, సరిపడా మందులు, విద్యుత్ పరికరాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఏవిధమైన సహాయ, సహకారాలైనా రాజధాని నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గోదావరి పరీవాహక ప్రాంతాల పోలీసు అధికారులతో ఇప్పటికే సమీక్షించామని.. సహాయ కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేశామని డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. ఐజీ చంద్రశేఖర్‌రెడ్డిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెంటనే వెళ్లి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించామని వెల్లడించారు. ‘అవసరమైతే హెలికాప్టర్ సేవలు’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటం, గోదావరి ఉగ్రరూపం దాల్చడం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూ తక్షణ చర్యలకు ఉపక్రమించాలని సీఎస్ శాంతికుమారికి సూచించారు. భద్రాచలంలో ముంపునకు గురయ్యే అవకాశాలున్న లోతట్టు ప్రాంతాల ప్రజలను యుద్ధప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని.. గతంలో వరదల సందర్భంగా సమర్థంగా పనిచేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ దళాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇక తక్షణమే భద్రాచలం వెళ్లి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు చేపట్టాలని హైదరాబాద్ కలెక్టర్ దుర్శెట్టి అనుదీప్‌ను సీఎం ఆదేశించారు. ‘వారం రోజులు నిరసనలు వాయిదా’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బీఆర్ఎస్ చేపట్టిన రైతు నిరసనలను వారం రోజులు వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంటు విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలను భారీ వర్షాల నేపథ్యంలో వారంపాటు వాయిదా వేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు కేటీఆర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత రైతులందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎండగట్టేలా నిరసన కార్యక్రమాలను పార్టీ కొనసాగిస్తుందని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు, రైతులకు ఈ వారం రోజులపాటు అండగా ఉండాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను, నాయకులను, కార్యకర్తలను కేటీఆర్ కోరారు. -
జూలై 1 నుంచి ఆపరేషన్ ముస్కాన్–9
ఖలీల్‌వాడి: జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహించాలని డీసీపీ(అడ్మిన్) మధుసూదన్‌రావు ఆదేశించారు. ఇన్చార్జి సీపీ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్లో వివిధ శాఖల అధికారులతో ఆపరేషన్ ముస్కాన్–9 సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ(అడ్మిన్)మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 18 ఏళ్లలోపు తప్పిపోయిన, వదిలేసిన, కార్మికులుగా ఉన్న బాలబాలికలు ఉన్నట్లయితే.. అలాంటి వారి సమాచారం సేకరించి రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించాలన్నారు. బాలలతో బలవంతంగా భిక్షాటన చేయించిన వారిపై, వెట్టి చాకిరి చేయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ప్రత్యేకంగా డివిజన్ పరిధిలో ఎస్సై, నలుగురు సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. ప్రజలు తప్పిపోయిన బాలురు, బాలికలు ఉన్నట్లయితే అలాంటి వారి సమాచారం, బాలకార్మికుల గురించి సమాచారం తెలిస్తే డయల్ 100, స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూం సెల్ నెంబర్ 87126– 59777, నిజామాబాద్ ఇన్చార్జి ఎస్సై 80965– 73004, ఆర్మూర్ ఇన్చార్జి ఎస్సై 94401–40022, బోధన్ ఇన్చార్జి ఎస్సై 94412–50992 నంబర్లకు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని తెలిపారు. సమావేశంలో ఎస్బీ శ్రీశైలం, సీసీఆర్బీ మోహన్, యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సీఐ గోపినాథ్, జిల్లా లేబర్ ఆఫీసర్ యోహన్, జిల్లా సంక్షేమ అధికారి రసూల్‌బీ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ సంపూర్ణ, జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్య, బాల రక్ష భవన్ కో–ఆర్డినేటర్ విజయలక్ష్మి, నిజామాబాద్ ఇన్చార్జి మహిళా ఆర్ఎస్సై స్రవంతి తదితరులు పాల్గొన్నారు. -
టెన్త్ పరీక్షలకు సకలం సిద్ధం
రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరగనున్న టెన్త్ పబ్లిక్పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. విద్యార్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందిలేకుండా అన్ని జాగ్రత్తలు చేపడుతోంది. వారికి అవసరమైన ఫర్నిచర్, మంచినీటి సదుపాయంతో పాటు అత్యవసర సమయాల్లో సేవలందించేందుకు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతోంది. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చర్యలు చేపట్టారు. కొత్తగా పునర్విభజించిన 26 జిల్లాల ప్రాతిపదికన ఇవి జరుగుతాయి. ఆయా జిల్లాల డీఈఓలు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ అన్ని జిల్లాల అధికారులు, వివిధ శాఖల అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. – సాక్షి, అమరావతి ఉ.9:30 నుంచి మ.12:45 గంటల వరకు.. ఈ పరీక్షలు ఉ.9:30 నుంచి మ.12:45 గంటల వరకు 3.15 గంటల పాటు నిర్వహిస్తారు. అభ్యర్థులను ఉ.8:45 నుంచి 9:30 వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. తద్వారా వారు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలను రాయగలుగుతారని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. అలాగే.. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్‌తో సహా, ఎవరూ మొబైల్ ఫోన్లను పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లడానికి అనుమతించరు. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, కెమెరాలు, ఇయర్ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్‌వాచ్‌లు, బ్లూటూత్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలనూ అనుమతించరు. ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. విద్యాశాఖతో పాటు రెవెన్యూ, పోలీసు, పోస్టల్, ఆర్టీసీ, వైద్యారోగ్య శాఖ, ఏపీ ట్రాన్స్‌కో తదితర విభాగాలు ఈ పరీక్షల ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నాయి. ప్రతి పాయింట్లోనూ పోలీసు భద్రత పరీక్ష పత్రాల రక్షణ దృష్ట్యా అన్ని డిస్ట్రిబ్యూషన్, స్టోరేజ్ పాయింట్ల వద్ద కాన్ఫిడెన్షియల్ ఎగ్జామినేషన్ మెటీరియల్‌కు భద్రత ఉండేలా పోలీసులను ఏర్పాటు చేయనున్నారు. వీటిని తీసుకెళ్లే వాహనాలకు జిల్లా కేంద్రాల నుంచి ఎస్కార్ట్ ఏర్పాటుచేస్తారు. పరీక్షా కేంద్రాల సందర్శనకు పోలీసు ఫ్లయింగ్ స్క్వాడ్లతో పాటు కేంద్రాల వద్ద సాయుధ గార్డులను పెట్టనున్నారు. ఇక ప్రశ్నపత్రాల లీకేజీ, నకిలీ ప్రశ్నపత్రాలు మొదలైన వాటికి సంబంధించిన పుకార్లను నిలువరించే చర్యలకు వీలుగా మొబైల్ పోలీస్ స్క్వాడ్లకు సూచనలు అందిస్తారు. ఎక్కడైనా తప్పిదాలు జరిగితే సంబంధిత సిబ్బందిని వెంటనే విధుల నుంచి తప్పించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేస్తారు. శాంతిభద్రతల నిర్వహణకు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించనున్నారు. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్, నెట్‌సెంటర్లను మూసి ఉంచేలా చర్యలు తీసుకోనున్నారు. పరీక్ష కేంద్రాలకు పరీక్షలు జరిగినన్ని రోజులూ నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల రాకపోకలకు వీలుగా ఆర్టీసీ కూడా చర్యలు తీసుకుంటోంది. అన్ని రూట్లలో ఎక్కువ సంఖ్యలో బస్సులు నడపనున్నారు. హాల్ టికెట్ ఉన్న అభ్యర్థులు అన్ని పరీక్షల రోజుల్లో వారి నివాసం నుండి పరీక్షా కేంద్రానికి ఉచితంగా ప్రయాణించడానికి అనుమతిస్తారు. అలాగే.. ♦ఎండల దృష్ట్యా విద్యార్థులు అస్వస్థతకు, అనారోగ్యానికి గురికాకుండా పరీక్ష కేంద్రాల్లో ఏఎన్ఎంల నియామకంతో పాటు తగిన మెడికల్ కిట్లను వైద్యశాఖ ఏర్పాటుచేయనుంది. మొబైల్ మెడికల్ వాహనాలను కూడా అందుబాటులో ఉంచనుంది. ♦ అన్ని పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్‌తో పాటు వెంటిలేషన్, పరిశుభ్ర వాతావరణం, ఉండేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. ♦ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్‌లో సహా అన్ని జిల్లాల విద్యాధికారి కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేయనున్నారు. డైరెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 0866–2974540 ♦ వొకేషనల్ పబ్లిక్ పరీక్షలతో సహా అన్ని సబ్జెక్టులకు బార్‌కోడింగ్ విధానాన్ని పొడిగించనున్నారు. కోడింగ్ విధానంపై జిల్లా స్థాయిలో బార్కోడ్ సూపర్వైజర్లు, ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇస్తారు. సమాధాన పత్రాలను కోడింగ్ విధానంలో మూల్యాంకనం చేయనున్నారు. ♦ కోడింగ్ నంబర్ల పరిశీలన తదితర పనులు నిర్వహించాల్సి ఉన్నందున ఇన్విజిలేటర్లు ఉ.8:15లోపు సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్‌కి రిపోర్ట్ చేయాలి. ♦ విద్యార్థులకు ఇచ్చే గ్రాఫ్‌లు, మ్యాప్ పాయింట్లు, సమాధానాల బుక్లెట్లపై రోల్ నెంబర్, పేరు వంటివి రాయకూడదు. గ్రాఫ్‌లు, మ్యాప్ పాయింట్లు అటుఇటు కాకుండా ఉండేందుకు బుక్లెట్పై క్రమసంఖ్యను రాసేలా చూడాలి. -
రాచకొండ నుంచే మునుగోడు ‘కంట్రోల్’.. ప్రతి పోలింగ్ కేంద్రంలో..
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక పోలింగ్‌కు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. గురువారం జరిగే పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నిక జరిగేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును, పోలింగ్ సరళిని పర్యవేక్షించడానికి రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఐటీ బృందాలను కూడా నియమించామని వివరించారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని చౌటుప్పల్, నారాయణపూర్ మండలాలు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రెండు మండలాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. అదనపు సీపీ జి.సుధీర్‌బాబు, డీసీపీలు నారాయణరెడ్డి, శ్రీబాల, అదనపు డీసీపీ భాస్కర్, ఏసీపీ ఉదయ్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బందోబస్తులో 2 వేల మంది.. పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం 2 వేల మంది రాచకొండ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసులు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ వంటి ఆరు కంపెనీల బలగాలను మోహరించినట్లు సీపీ భగవత్ తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు ఒక ఎస్ఐ ఇన్చార్జిగా ఉంటారన్నారు. మునుగోడులో మొత్తం 298 పోలింగ్ స్టేషన్లుండగా.. చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల పరిధిలో 82 పోలింగ్ కేంద్రాలలో 122 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని వివరించారు. మొబైల్ స్ట్రయికింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్, ప్రత్యేక నిఘా బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా విధులలో పాల్గొంటాయని చెప్పారు. 16 పోలింగ్ కేంద్రాలలో 35 పోలింగ్ స్టేషన్లను అత్యంత సమస్యాత్మక స్టేషన్లుగా గుర్తించామని, ఆయా స్టేషన్లలో బందోబస్తును మరింత పటిష్టం చేయాలని సిబ్బందికి సూచించామని వివరించారు. భారీగా నగదు, బంగారం స్వాధీనం.. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద పోలీసు బృందాలు 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తుంటాయని సీపీ తెలిపారు. ఇప్పటివరకు వాహన తనిఖీలలో రూ.4 కోట్ల నగదు, వెయ్యి లీటర్ల మద్యం, 3.5 కిలోల బంగారం, 11.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. గురువారం సాయంత్రం 6 గంటల వరకూ మద్యం దుకాణాలు మూసి ఉంటాయని, పోలింగ్ రోజున అక్రమంగా మద్యం విక్రయాలు, సరఫరా చేసిన వ్యక్తులకు జరిమానాలు, శిక్షలు తప్పవని హెచ్చరించారు. సెల్ఫీలు దిగొద్దు.. పోలింగ్ కేంద్రాల ఆవరణలో సెల్ఫోన్లు నిషేధమని, సెల్ఫీలు దిగడంతో పాటు, ఎవరికి ఓటు వేశారో తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టకూడదని, నిబంధనలు అతిక్రమించిన వారిపై జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని సీపీ భగవత్ హెచ్చరించారు. చదవండి: ఎప్పటికప్పుడు లెక్కలు వేస్తూ..! మునుగోడులో పరిస్థితిపై కేసీఆర్ ఆరా -
తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు, జీహెచ్ఎంసీ అత్యవసర భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గురువారం పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో నేటి సాయంత్రం వానలు కురిశాయి. అయితే, మరో మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈనేపథ్యంలో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు వర్షాలపై జీహెచ్ఎంసీ అత్యవసరంగా సమావేశమైంది. జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 040-21111111, 040-29555500 వాగులో ప్రాణాలు అరచేతపట్టుకుని కామారెడ్డి జిల్లాలోని శెట్పల్లి వాగులో చిక్కుకుపోయిన ముగ్గురిని స్థానికులు,పోలీసుల సహకారంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. చేపల వేటకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు వరద ఉధృతి ఎక్కువ కావడంతో చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. చెట్టుపైనే ఉండి సాయం కోసం ఎదురుచూశారు. విషయం తెలుసుకున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఘటనస్థలానికి పంపించారు. తాడు సాయంతో వారు బాధితులను ఒడ్డుకు చేర్చారు. దీంతో కొన్ని గంటల ఉత్కంఠకు తెరపడింది. స్థానికులు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఒడ్డుకు చేరిన అనంతరం బాధితులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. -
వరద పెరుగుతుండటంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం
-
ఉన్నా... లేనట్లే
సాక్షి, హైదరాబాద్: పోలీసు, ఆబ్కారీశాఖల్లో ఖాకీ డ్రెస్ ధరించిన ప్రతి ఉద్యోగి ప్రధాన కర్తవ్యం నేరాల నియంత్రణ. కానీ ఎక్సైజ్‌లో కొంతకాలంగా ఆ విధి నిర్వహణ కొరవడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నార్కోటిక్ డ్రగ్స్ నేరాల కట్టడిలో ఆబ్కారీ యంత్రాంగం విఫలమవుతోంది. కొందరు అధికారులు మాత్రమే నిజాయితీగా విధులు నిర్వహిస్తుండగా ఎక్కువ మంది ఎక్సైజ్ స్టేషన్ల వారీగా ఆదాయంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పోలీసు కంట్రోల్ రూమ్ తరహాలో ఆబ్కారీ శాఖలోనూ ప్రత్యేక కంట్రోల్ రూమ్ వ్యవస్థ ఉన్నప్పటికీ ఆచరణలో అలంకారప్రాయంగా మారింది. దీనిపై సరైన ప్రచారం లేదు. మరోవైపు గంజాయి, కోకైక్ వంటి మత్తు పదార్థాల సరఫరాపై సమాచారాన్ని రాబట్టుకునేందుకు గతంలో బలమైన ఇన్ఫార్మర్ వ్యవస్థ పని చేసేది. ఒకరిద్దరు అధికారులు అలాంటి ఇన్ఫార్మర్ల నుంచి వచ్చే సమాచారం ఆధారంగానే డ్రగ్స్ నియంత్రణలో మంచి ఫలితాలను సాధించారు. కానీ ఇప్పుడు కంట్రోల్ రూమ్, ఇన్ఫార్మర్ వ్యవస్థ రెండూ దాదాపుగా నిర్వీర్యమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో డ్రగ్స్ సరఫరా, విక్రేతలను, బాధితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎక్సైజ్‌శాఖ పనితీరు పరిమితంగా మారింది. పోలీసులకు ధీటైన యంత్రాంగం ఉన్నప్పటికీ ఆ స్థాయిలో పనిచేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. వంద తరహాలో 24733056 నంబర్ .... ఒకవైపు రాడిస్బ్లూ హోటల్ వంటి ఉదంతాలు వెలుగు చూస్తున్నప్పటికీ మరోవైపు గంజాయి, ఇతర మత్తుపదార్థాల వెల్లువ కొనసాగుతూనే ఉంది. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ మీదుగా మత్తుపదార్థాలు సరఫరా అవుతున్నాయి. అంతేకాకుండా స్కూళ్లు, కాలేజీలు, నగర శివార్లే ప్రధాన అడ్డాలుగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2016లో అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్ కంట్రోల్ రూమ్ వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. స్కూళ్లు, కాలేజీల నుంచి నేరుగా సమాచారం అందేలా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. 2017 వరకు ఈ వ్యవస్థ సమర్థవంతంగా పని చేసింది. 24 గంటల పాటు ఫిర్యాదులను స్వీకరించేందుకు సిబ్బందిని నియమించారు. ఎక్కడి నుంచైనా టోల్ ఫ్రీ నంబర్ 24733056కు సమాచారం అందజేయవచ్చు. ఇప్పటికీ ఈ నంబర్ అందుబాటులో ఉన్నప్పటికీ సరైన ప్రచారం లేకపోవడం వల్ల పెద్దగా ఫిర్యాదులు అందడం లేదు. బెల్ట్‌షాపులు, మైనర్లకు మద్యం అమ్మకాలు వంటి వాటిపైనే తరచు ఫిర్యాదులు అందుతున్నాయి.. కానీ నార్కోటిక్ నేరాలపైన రావడం లేదని ఓ అధికారి విస్మయం వ్యక్తం చేశారు. ఇన్ఫార్మర్ వ్యవస్థ లేకపోవడం కూడా ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. బర్త్‌డే పార్టీలు, వేడుకలే లక్ష్యం... బర్త్‌డే పార్టీలు, యువత ఎక్కువగా గుమిగూడేందుకు అవకాశం ఉన్న వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఒకరి నుంచి ఒకరికి ఈ అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఒక పార్టీలో నలుగురు కొత్తవాళ్లు గంజాయిని సేవిస్తే ఆ నలుగురు మరో నలుగురికి దాన్ని అలవాటు చేస్తున్నారు. ఇలా వేగంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విస్తరిస్తుంది. నగరంలోని ధూల్‌పేట్, నానక్‌రామ్‌గూడ, నేరేడ్మెట్, శేరిలింగంపల్లి, సూరారం, జీడిమెట్ల, కొంపల్లి, బోయిన్పల్లి, నాగోల్, కాప్రా, తదితర ప్రాంతాలు ప్రధాన అడ్డాలుగా మారాయి. (చదవండి: లగేజ్ బ్యాగేజ్‌లలో గంజాయి ప్యాకెట్లు..నలుగురు అరెస్టు) -
రైల్‌నిలయంలో వీడియో సర్వైలెన్స్ కంట్రోల్ రూమ్
సాక్షి, హైదరాబాద్: ప్రధానమైన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రాకపోకలు, పరిపాలనా కార్యకలాపాలను ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా చూస్తూ పర్యవేక్షించడానికి దక్షిణ మధ్య రైల్వే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. సీసీ కెమెరాల ద్వారా ఆయా స్టేషన్లలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ వీడియో సర్వైలెన్స్ సిస్టం కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. ఈ విధానంలో ఉన్నతాధికారులు రైల్ నిలయం నుంచి చూస్తూ ఆయా స్టేషన్లలో అధికారు లకు సూచనలు, ఆదేశాలు ఇవ్వడానికి వీలుంటుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 17 ముఖ్యమైన రైల్వే స్టేషన్లను ఈ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. తెలంగాణలోని ఆదిలాబాద్, బేగంపేట, లింగంపల్లి, మంచిర్యాల, వరంగల్ స్టేషన్లు, ఏపీ లోని గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగో లు, రాజమండ్రి, తుని, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ధర్మాబాద్, జాల్నా, నాగర్సోల్, పర్లివైద్యనాథ్ స్టేషన్లను ఈ కంట్రోల్ రూమ్ పరిధిలోకి తీసుకువచ్చారు. దీంతోపాటు ఆయా స్టేషన్లలో ప్రస్తుతం ఉన్న ఇంటిగ్రేటెడ్ సీసీకెమెరాల స్థానంలో ఇంటర్నెట్ ప్రొటోకాల్ ఆధారిత వీఎస్ఎస్ విధానం ఏర్పాటు చేశారు. రైల్‌టెల్ ఆధ్వర్యంలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌తో దీన్ని అనుసంధానించారు. మొత్తం 520 సీసీ కెమెరాలతో అనుసంధాన అయ్యిందని జీఎం గజానన్ మాల్యా పేర్కొన్నారు. ఆయా స్టేషన్లలో మనుషుల ముఖ కవళికలను స్పష్టంగా గుర్తించేందుకుగాను 4కే రెషల్యూషన్ అల్ట్రా హెచ్డీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చదవండి: డిజిలాకర్: ఆధార్‌ను ఆన్లైన్లోనే దాచుకొవచ్చు! యాపిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుగోడి ఫొటో -
‘నివర్’ పడగ; కంట్రోల్ రూమ్ నంబర్లు
సాక్షి, కడప: నివర్ తుపానును ఎదుర్కొనేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ సూచించారు. బుధవారం అర్ధరాత్రి దాటాక తుపాను ప్రభావం జిల్లాపై తీవ్రంగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించినట్టు ఆయన తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు కడప, రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయాలు, జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయాల్లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేయాలని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. (నివర్ తుఫాన్: 26 విమానాలు రద్దు..) కలెక్టర్ ఇంకా ఏమన్నారంటే.. నదులు, వంకలు పరివాహ ప్రాంతాలు, అన్ని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చెరువులు, కాలువలకు గండ్లు పడే అవకాశం ఉండొచ్చు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, అవసరమైన ఇసుక బ్యాగ్స్ ను అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలి. పూరి గుడిసెలు, పాత మిద్దెలు, మట్టితో కట్టిన ఇళ్ళల్లో నివసిస్తున్న ప్రజలు వెంటనే ఖాళీ చేసి బంధువుల ఇంటికి కానీ, లేదా ప్రభుత్వం చూపించే తాత్కాలిక పునరావాస కేంద్రాలకు చేరుకోవాలి. నివర్ తుఫాన్ కారణంగా రేపు (గురువారం) జిల్లాలో అన్ని పాఠశాలలు, కళాశాలకు సెలవు దినంగా ప్రకటించిన డీఈఓ శైలజ కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే.. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కంట్రోల్ రూమ్ : 08562 - 245259 సబ్ కలెక్టర్ కార్యాలయం, కడప : 08562 - 295990, 93814 96364, 99899 72600 సబ్ కలెక్టర్ కార్యాలయం, రాజంపేట : 08565 - 240066, 93816 81866 ఆర్డీవో కార్యాలయం, జమ్మలమడుగు : 96766 08282, 08560- 271088 దక్షిణమధ్య రైల్వే హెల్ప్లైన్లు నివర్ తుపాను నేపథ్యంలో రైల్ సర్వీసుల్లో మార్పులుండే అవకాశం ఉందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. తుపాను ప్రభావం చెన్నై, తిరుపతి, రేణిగుంట, పాకా వైపు వెళ్లే రైళ్లపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ప్రయాణికుల సమాచారం మేరకు హెల్ప్లైన్లు ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. ప్రయాణికులు సహాయం కోసం ఈ కింది నంబర్లలో సంప్రదించవచ్చు. సికింద్రాబాద్: 040-27833099 విజయవాడ: 0866-2767239 గుంటూరు: 0863-2266138 గుంతకల్లు: 7815915608 -
ఒక్కరోజులో 1,074 మంది రికవరీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారిలో గత 24 గంటల్లో 1,074 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. ఇప్పటిదాకా ఒక్కరోజులో కోలుకున్న వారిలో ఇదే అత్యధికం. రికవరీ రేటు ప్రస్తుతం 27.52 శాతానికి పెరిగిందన్నారు. ఇప్పటికే 11,706 మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కరోనా నిర్ధారణకు టెస్టింగ్ కిట్ల కొరత లేదన్నారు. కరోనా పరీక్షల సామర్థ్యం పెంచుతున్నామన్నారు. దేశంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు 24 గంటల వ్యవధిలో 83 మంది కరోనా కాటుతో ప్రాణాలు విడిచారు. అలాగే కొత్తగా 2,573 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే గరిష్టం. దీంతో మొత్తం మరణాలు 1,389కు, పాజిటివ్ కేసులు 42,836కు చేరాయి. సరుకు రవాణాలో సమస్యలుండొద్దు్ద దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య సరుకు రవాణా విషయంలో ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉత్పన్నతమైతే ట్రక్కు డ్రైవర్లు కంట్రోల్ రూమ్ నంబర్ ‘1930’కు ఫోన్ చేయాలని పేర్కొంది. ఈ కంట్రోల్ రూమ్ రోజంతా పనిచేస్తుందని కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రెటరీ పుణ్యసలీల శ్రీవాస్తవ సోమవారం చెప్పారు. డ్రైవర్లు ‘1930’కు ఫోన్ చేసి సాయం పొందవచ్చు. -
వలసకార్మికుల కోసం కంట్రోల్ రూమ్
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో వలసకార్మికులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర కార్మిక శాఖ ఉపక్రమించింది. కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను మరికొంత కాలం పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో వలస కూలీలు/కార్మికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేంద్ర కార్మిక శాఖ ప్రాంతాల వారీగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ రీజియన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నిర్వహణకు ప్రాంతీయ కార్మిక కమిషనర్‌తో పాటు ఇద్దరు సహాయ కార్మిక కమిషనర్లను నోడల్ అధికారులుగా కేంద్ర కార్మిక శాఖ నియమించింది. వీలైన పద్ధతిలో ఫిర్యాదులు కేంద్ర కార్మిక శాఖ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు మూడు పద్ధతుల్లో ఫిర్యాదులు/వినతులు అందించవచ్చు. కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. లేదా లిఖిత పూర్వక ఫిర్యాదు చేయాలంటే కంట్రోల్ రూమ్ ఈమెయిల్‌కు వినతి ఇవ్వవచ్చు. అదేవిధంగా పరిస్థితిని ప్రత్యక్షంగా వివరించదలిస్తే వాట్సాప్ ద్వారా వీడియో లేదా లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేయవచ్చు. కంట్రోల్ రూమ్ అధికారులు, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ అడ్రస్ -
రోజుకు 35 కాల్స్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల అమలులో రాష్ట్రంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు మంచి స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలు, వివిధ ప్రాంతాల నుంచి రోజుకు 35 వరకు కాల్స్ వస్తున్నాయని, ఈ కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన వారం రోజుల్లో 252 కాల్స్ వచ్చాయని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఇందులో తమకు ఆహార పదార్థాలు కావాలని, శానిటైజర్లు కావాలని ఎక్కువగా ఫోన్లు చేస్తున్నారని కంట్రోల్ రూం సభ్యులు చెబుతున్నారు. కాగా, ఈ కంట్రోల్ రూంను టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావు, ప్రధాన కార్యదర్శి ఎంఆర్‌జి.వినోద్‌రెడ్డితో పాటు పలువురు నేతలు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. కంట్రోల్ రూం నిర్వహణపై వినోద్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ప్రజలు తమకు చెబుతోన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని, కొన్నింటిని తామే పరిష్కరిస్తున్నామని చెప్పారు. దీనికి స్థానిక కాంగ్రెస్ నేతల సాయం తీసుకుంటున్నామని వెల్లడించారు. -
మున్సిపల్ ఎన్నికల కంట్రోల్ రూం ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) హెల్ప్‌లైన్ కమ్ కంట్రోల్ రూంను ఏర్పా టు చేసింది. ఇందుకోసం మూడు ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్లను కేటాయించింది. ప్రజలు, రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు తమకున్న ఫి ర్యాదులను 040–29802895, 040–29802897 నంబర్లకు ఫోన్ చేసి చెప్పవచ్చని, 040–29801522 నంబరుకు ఫ్యాక్స్ ద్వారా తెలియజేయవచ్చని పేర్కొంది. దీని బాధ్యతలను తేదీల వారీగా చూసుకోవాల్సిన సిబ్బందిని నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజకీ య పార్టీలు, ప్రజలు, పోటీ చేసే అభ్యర్థుల నుం చి వచ్చే ఫోన్ కాల్స్, ఫ్యాక్స్ అన్నింటిని రిసీవ్ చేసుకోవడం, వాటిని రిజిస్టర్లో రికార్డు చేయడం వంటి పనులను విధుల్లో ఉన్న సిబ్బంది చేపట్టాలని, ఫోన్ చేసిన వారితో గౌరవంగా మాట్లాడాలని అందులో పేర్కొన్నారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత మున్సిపల్ కమిషనర్/రిటర్నిం గ్ ఆఫీసర్/జిల్లా కలెక్టర్/పోలీసు అధికారులకు తెలియజేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
సరిహద్దు గ్రామాలపై నిఘా
సాక్షి, కర్నూలు/ మంత్రాలయం: ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక నిఘా వేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సంయుక్త చర్యలకు ఉపక్రమించారు. మంత్రాలయంలోని అబోడి ఫంక్షన్ హాలులో శనివారం జరిగిన సరిహద్దు జిల్లాల పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. కర్నూలు, రాయచూరు, జోగులాంబ గద్వాల, బళ్లారి జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో పాటు రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల సందర్భంగా సాంకేతికతను విరివిగా వినియోగించాలని నిర్ణయించారు. ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి.. పరస్పరం సమాచారాన్ని పంచుకోనున్నారు. సరిహద్దుల్లో ప్రత్యేకంగా ఎన్నికల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమన్వయంతో ముందుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేశారు. డ్రైడే రోజు కర్నూలు జిల్లాలోని అన్ని ప్రాంతాలతో పాటు సరిహద్దుల్లోని మద్యం దుకాణాలను మూసివేయించాలని నిర్ణయించారు. మూడు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా పేలుడు పదార్థాలను సరఫరా చేసే డీలర్లను గుర్తించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్లను ప్రలోభపెట్టడం, నగదు, చీరలు, ముక్కుపుడకలు, ఇతరత్రా కానుకల పంపిణీ, దొంగ ఓట్లు వేయడం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ ఫక్కీరప్ప, రాయచూరు కలెక్టర్ శరత్, ఎస్పీ కిషోర్‌బాబు, బళ్లారి అసిస్టెంట్ కమిషనర్ రమేష్, జోగులాంబ గద్వాల జిల్లా జాయింట్ కలెక్టర్ నిరంజన్‌రావు, ఎస్పీ లక్ష్మీనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఫ్లడ్ కంట్రోల్ రూం ఏర్పాటు
సాక్షి, భూపాలపల్లి : జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలు.. గోదావరి నీటిమట్టం పెరగడం.. వరద వస్తున్న నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయం కేంద్రంగా ఫ్లడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. దానికి ఏటూరునాగారం తహసీల్దార్‌ను ఇన్చార్జి గా నియమించారు. 24 గంటలు అధికారులు చేపట్టాల్సిన భద్రతా చర్యలపై చర్చించడంతోపాటు సమాచారాన్ని కంట్రోల్ రూం ద్వారా కలెక్టర్ సమీక్షించనున్నారు. ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో నిత్యం కురిసిన వర్షపాతాన్ని నమోదుచేయనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(టీడబ్ల్యూయూ) అధికారిని ఏటూరునాగారం మండలానికి నోడల్ అధికారిగా నియమించారు. వరద ప్రమాదాల నుంచి ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించడానికి వివిధ శాఖల అధికారులను 15 టీంలుగా విభజించారు. వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టీంటను అప్రమత్తం చేశారు. రామన్నగూడెం వద్ద గోదావరి నీటిమట్టం మరింత పెరిగి ప్రజలను పునరావాస కేం ద్రాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్నారు. 2, 3 ప్రమాద హెచ్చరికలు దాటితే మొదటి టీం ఏటూరునాగారంలోని హరిజనవాడ, నందమూరినగర్, నేతకానివాడ, రెండో టీం వాడగూడెం, మూడో టీం కుమ్మరివాడలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించానికి ప్రణాళికలు రూపొందిం చారు. వరద తీవ్రత నుంచి రక్షించుకునేలా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏటూరునాగా రం ఐటీడీఏ, పోలీస్‌ల సహకారంతో వాహనాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా ముందస్తుగానే గజ ఈతగాళ్లను, రెస్క్యూ టీంలను రంగంలోకి దించారు. హెల్ప్‌లైన్ సెంటర్ల ఏర్పాటు వరద భారీ నుంచి ప్రజలను రక్షించడానికి అధికారులకు తక్షణ సమాచారం ఇచ్చేందుకు హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. జిల్లా కార్యాలయంలో 08713248080, ఏటూరునాగారంఐటీడీఏలో 7901091265 / 08717231247, 08717231246, తహసీల్దార్ కార్యాలయంలో 7680906616 / 08717231100, మహదేవపూర్ తహసీల్దార్ కార్యాలయంలో 9652608367 హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రదించాలని కలెక్టర్ సూచించారు. -
పోలీసు అధికారుల పనితీరుకు రేటింగ్
సాక్షి, మహబూబాబాద్/వరంగల్ క్రైం: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో పోలీసు అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు.. ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు రాష్ట్రంలో థర్డ్‌పార్టీ ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. పోలీస్స్టేషన్లలో అందుతున్న సేవలపై ప్రజల సంతృప్తి ఆధారంగా రేటింగ్ ఇస్తామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అమలవుతుందని.. ధనిక పేద, ఆడ, మగ తేడాలు లేకుండా ఒకే విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంను ప్రారంభించారు. కమిషనరేట్‌లోని పలు విభాగాలను పరిశీలించారు. జాతీయ సాంకేతిక విద్యా సంస్థ(ఎన్ఐటీ)లో కమిషనరేట్ పరిధిలోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు(డీసీపీ), అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ), ఇన్స్పెక్టర్లు, వివిధ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. అంతకుముందు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. గుమ్ముడూరులోని సర్వేనంబరు 287లో జిల్లా పోలీసు కార్యాలయానికి కేటాయించిన స్థలాన్ని, జిల్లా పోలీసు కార్యాలయాన్ని పరిశీలించారు. -
విజయవాడలో కంట్రోల్ రూం ఏర్పాటు
విజయవాడ: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. ఎక్కడైన విపత్కర పరిస్థితులు తలెత్తితే ప్రజలు వెంటనే మచిలీపట్టణంలో 08672-252572, విజయవాడలో 0866-247484 నంబర్లకు ప్రజలు ఫోన్ చేయవచ్చని ఆయన తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. -
100 నంబర్‌కు 298 సార్లు..
విజయవాడ: పోలీస్ కంట్రోల్ రూంనకు దాదాపు 300 సార్లు ఫోన్ చేసి వేధించిన ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం గ్రామానికి చెందిన మురశి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు గత కొంతకాలంగా 100, 104, 108 నంబర్లకు ఫోన్ చేసి మహిళా సిబ్బందిని వేధించటమే పనిగా పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం మురళిని అదుపులోకి తీసుకున్నారు. మురళి మొత్తం 298 సార్లు పోలీస్‌కంట్రోల్ రూంలో ఉన్న 100 నంబర్‌కు ఫోన్ చేశాడని డీసీపీ పాలరాజు చెప్పారు. -
గ్రూపు - 2 పరీక్షల సందర్భంగా.. కంట్రోల్ రూం
అనంతపురం అర్బన్ : ఈ నెల 26న ఏపీపీఎస్సీ గ్రూప్ - 2 పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జేసీ లక్ష్మీకాంతం తెలిపారు. అధికారులకుగానీ, అభ్యర్థులకుగానీ ఏవైనా సందేహాలుంటే 84980 98220 నెంబర్‌కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. శుక్రవారం ఆయన తన చాంబర్లో డీఆర్వో సి.మల్లీశ్వరిదేవితో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. అందులో ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు జాగ్రత్తగా చేపట్టాలని, మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ సహాయ కార్యదర్శి రామనాథం శెట్టి, పర్యవేక్షకులు వరదరాజులు పాల్గొన్నారు. హాల్‌టికెట్లు రానివారు నామినల్ రోల్స్ పరిశీలించుకోవచ్చు గ్రూపు - 2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ హాల్ టికెట్ రాని అభ్యర్థులు కలెక్టరేట్లో నామినల్ రోల్స్ పరిశీలించుకోవచ్చని జేసీ తెలిపారు. శనివారం సాయంత్రంలోగా వీటిని చూసుకోవచ్చన్నారు. నామినల్ రోల్స్‌లో పేరు ఉంటే ఏదేని ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే పరీక్ష రాయడానికి అధికారులు సెంటర్‌ను కేటాయిస్తారన్నారు. -
దారి దోపిడీ దొంగల అరెస్ట్
కల్లూరు: జాతీయ రహదారిపై దోపిడీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేశామని కర్నూలు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. స్థానిక పోలీసు కంట్రోల్ రూమ్‌లో శనివారం.. డీఎస్పీ రమణమూర్తి, సీఐ నాగరాజుయాదవ్ సమక్షంలో నలుగురు దోపిడీ దొంగల అరెస్టును చూపించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. 44వ నెంబరు జాతీయ రహదారిపై ఉలిందకొండ పోలీసు స్టేషన్ పరిధిలో రెండు పర్యాయాలు దారి దోపిడీ జరిగిందన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో గుడిసె గోపురాలకు చెందిన ఆంజనేయులు గౌడు గొర్రెల ఆటోను ఆపి దోచుకున్నారని, రెండోసారి అనంతపురానికి చెందిన శివారెడ్డి (లారీ డ్రైవర్) జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా నిలబెట్టి బెదిరించి వారి వద్ద ఉన్న ఆభరణాలు, నగదు, తదితర విలువైన వాటిని దోచుకెళ్లారని తెలిపారు. అరెస్టు చేసిన వారి వద్ద నుంచి అరతులం బంగారు ఉంగరం, ఒక తులం వెండి ఉంగరం, ఒక కత్తి, ఒక ద్విచ క్రవాహనం, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దూపాడు సమీపంలోని కల్పన డాబా వీరిని ఉలిందకొండ ఎస్ఐ వెంకటేశ్వరరావు అరెస్ట్ చేశారన్నారు. దొంగలు వీరే.. వీకర్‌సెక్షన్ కాలనీకి చెందిన మార్కెండేయులు, రామచంద్రుడు, మహేశ్వరరెడ్డి, కోడుమూరుకు చెందిన మౌలాలి, గోపాలు అనే ఐదుగురు సంయుక్తంగా కలిసి వ్యభిచారం చేసే ఒక మహిళను బెదించి రోడ్డు పైకి తీసుకువచ్చి వాహనదారులను ఆకర్షించేవారు. మహిళ వద్దకు వాహనదారులు రాగానే పొలాల్లో దాక్కున్న వీరు వచ్చి కత్తితో బెదిరించి దోచుకునే వారు. ఐదుగురిలో గోపాల్ అనే వ్యక్తి పరారీలో ఉన్నారని, పట్టుకున్న నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించామని డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. -
దేవరగట్టులో కంట్రోల్ రూం ఏర్పాటు
హొళగుంద: దేవరగట్టు కొండల్లో ఈ నెల 11న జరిగే దసరా బన్ని మహోత్సవాల సందర్భంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ నాగేశ్వరరావు శనివారం విలేకరులకు తెలిపారు. మండలానికి నోడల్ ఆఫీసర్‌గా ఉన్న స్పెషల్ కలెక్టర్ సుబ్బారెడ్డి(98499 94521), ఆదోని ఆర్డీఓ ఓబులేసు(98499 04164), ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు(94407 95555), ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్(94910 00679), ఎక్సైజ్ శాఖాధికారులతో పాటు.. హొళగుంద, ఆలూరు, చిప్పగిరి, హాలహర్వి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్, పీఆర్ అధికారులు మొత్తం దాదాపు 50 మంది సిబ్బంది ఈ కంట్రోల్ రూంలో అందుబాటలో ఉంటారన్నారు. భక్తులకు ఇబ్బంది కలిగినా, అసౌకర్యాలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. -
అధికారులు అందుబాటులో ఉండాలి
ప్రజలకు పూర్తి సహాయం అందించాలి. లోతట్టు ప్రాంతాల వారిని పునరావాసాలకు తరలించాలి వైద్యాధికారులు అప్రమత్తం కావాలి సమీక్ష సమావేశంలో కలెక్టర్ కరుణ హన్మకొండ అర్బన్: ‘జిల్లాలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లు, చెరువులు దెబ్బతిన్నాయి. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయం అందించాలి’ అని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సదర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నగరంలో లోతట్టు ప్రాతాల ప్రజలను ప్రత్యేక శిబిరాల్లోకి తరలించాలని, వారికి అక్కడ భోజనం, వసతి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 60 చెరువులకు గండ్లు పడ్డాయని, వాటిని పూడ్చేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇగతా చెరువులు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తం కావాలని, అవసరమైన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం.. కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్ రూం ఉంటుందని, ఇక్కడ ముఖ్యమైన ప్రభుత్వ విభాగాల అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 18004252747కు ఫోన్ చేస్తే అధికారులు స్పందిస్తారని చెప్పారు. అగ్నిమాపక, మత్య్సశాఖల అధికారులు అత్యవసర సేవలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, ఎస్పీ అంబర్‌కిషోర్ ఝా, జేసీ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, గ్రేటర్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, డీఎంఅండ్‌హెచ్‌ఓ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
రంజాన్ వ్యాపారాలకు ప్రత్యేక అనుమతి
* సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూం * 22న పోలీస్ ఇఫ్తార్ * సీపీ మహేందర్‌రెడ్డి ప్రకటన బహదూర్‌పురా: రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం వ్యాపార సముదాయాలు ఉన్నచోట రోజంతా (24 గంటలు) వ్యాపారాలు కొనసాగేందుకు అనుమతిస్తున్నట్టు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం సాలార్జంగ్ మ్యూజియంలో మసీదు కమిటీతో పాటు సంబంధిత ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యుత్, జలమండలి, జీహెచ్ఎంసీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. నగర వ్యాప్తంగా లక్ష సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, దక్షిణ మండలంలోనూ పెద్ద ఎత్తున వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్ నిర్వహిస్తూ, 24 గంటల పాటు పెట్రోలింగ్, మహిళల రక్షణ కోసం షీ టీమ్ బృందాలను రంగంలోకి దింపామన్నారు. రంజాన్‌లో ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. నగర పోలీసు విభాగంలో ఈ నెల 22న చౌమహల్లా ప్యాలెస్‌లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. విద్యుత్, జలమండలి, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. మసీదుల వద్ద అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. చెత్త తొలగించేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో పనిచేసేందుకు సిబ్బందిని నియమించామని, నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సాయంత్రం నమాజ్ అనంతరం వచ్చే వ్యర్ధాలను ఎక్కడ పడితే అక్కడే వేయకుండా మసీదులకు ప్లాస్టిక్ కవర్లను సరఫరా చేస్తున్నట్టు వివరిచారు. నెల రోజులకు సరిపడ ప్లాస్టిక్ కవర్లను ఒక్కసారిగా మసీదులకు అందజేసి, సిబ్బంది ద్వారా వాటిని సేకరిస్తామన్నారు. మసీదుల ఇమామ్‌లు, కమిటీల సభ్యుల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశామని ఆయా విభాగాల అధికారులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో నగర ట్రాఫిక్ అడిషనల్ సీపీ జితేంద్ర, లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ శ్రీనివాసరావు, దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ, టీఎస్ఎస్పీడీసీఎల్ ఎస్ఈ ఆనంద్, జీహెచ్ఎంసీ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, దక్షిణ అడిషనల్ డీసీపీ బాబూరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ముంచెత్తిన ‘రోను’
ఎన్డీఆర్ఎఫ్తో పాటు 15 నేవీ బృందాలు సిద్ధం తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన యంత్రాంగం పెదగంట్యాడలో అత్యధికంగా 17 సెం.మీ. వర్షం కశింకోటలో 15.5 సెం.మీ. లోతట్టు ప్రాంతాలు జలమయం.. నీటమునిగిన వరి, చెరకు వేసవి దుక్కులకు అనుకూలం జిల్లాలో రోను తుపాను అలజడి సృష్టించింది. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఏజెన్సీలోని అనేక గిరిజన గ్రామాల్లో అంధకారం నెలకొంది. చోడవరం, అనకాపల్లిలో ఇళ్లు కూలాయి. కశింకోట, రాంబిల్లి, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. దేవరాపల్లిలో ఇంటి ముందు పోర్టికో కూలి తల్లీ కూతుళ్లు గాయపడ్డారు. అనంతగిరి సమీపంలో కేకే రైలు మార్గంలో కొండ చరియలు విరిగిపడి రైలు పట్టాల మీద పడటంతో గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది. జలాశయాల్లో నీటిమట్టం పెరుగుతోంది. అక్కడక్కడా పంటలకు నష్టం కలగజేసినప్పటికీ ఈ వర్షాలు వేసవి దుక్కులకు అనుకూలమని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. విశాఖపట్నం: మండువేసవిలో కుండపోత జిల్లాను ముంచెత్తింది. ‘రోవాను’ తుపాను వల్ల ఎదురయ్యే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ఇప్పటికే జిల్లా కేంద్రంలో టోల్‌ఫ్రీ నెంబర్‌తో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. గురువారం డివిజన్, మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్‌లు తెరిచారు. తుపానును ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ గురువారం మీడియాకు వివరించారు. తహసీల్దార్లు, ఎంపీడీఒలను మండల కేంద్రాల్లోనే ఉండేలా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్ తుపాను విపత్తును ఎదుర్కోడానికి వీలుగా జిల్లాలో అందుబాటులో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు నావీ అధికారులతో చర్చించి 15 ప్రత్యేక సహాయ బృందాలను సిద్ధం చేశారు. 96 తీరగ్రామాల్లో ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అవసరాన్ని బట్టి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. హుద్‌హుద్ తుపానుకు 250 కి.మీ వేగంతో గాలులు వేయగా...ప్రస్తుత రోవాను తుపాను సందర్భంగా తీరం వెంబడి 100 కి.మీ.వేగంతోనే ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనావేయడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని కలెక్టర్ ప్రకటించారు. ఈ గాలులుకు పూరిళ్లు ఎగిరి పోయే ప్రమాదం ఉన్నందున, పూరిళ్లలో నివసించే వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి తరలింపు నిర్ణయం తీసుకోనున్నారు. తుపాను షెల్టర్లు, ఫ్లడ్‌బ్యాంక్స్ పునరుద్ధరణ 86 తుఫాన్ షెల్టర్స్‌లో 36 షెల్టర్లను పునర్నిర్మించగా, మరో 15 వరకు పునరావాస కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా కమ్యూనిటీ హాల్స్, పాఠశాలలను కూడా సిద్ధం చేశారు. మండలాలకు అదనంగా బియ్యం నిల్వలను తరలిస్తున్నారు. జిల్లాలోని శారదా, వ రహా, గోస్తని, పెద్దేరు వంటి నదీ తీర ప్రాంతాల్లో 16 చోట్ల ఫ్లడ్ బ్యాంక్స్ బలహీనంగా ఉన్నట్టుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో గండ్లు పడకుండా ముందుజాగ్రత్త చర్యగా ఇరిగేషన్ శాఖ ద్వారా ఇసుక బస్తాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చోడవరం మండలం వడ్డాది వద్ద అత్యంత బలహీనంగా ఉన్న పెద్దేరు నదిగట్టుపై ఇసుక బస్తాలతో పటిష్టపర్చే చర్యలు చేపట్టారు. సబ్బవరం మండలం రాయపురాజుచెరువు గండిపడి 25 ఎకరాల కూర గాయల పంటలు దెబ్బతినడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న సాగు, తాగునీటి చెరువులను ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖాధికారులు పరిశీలిస్తున్నారు. నీరుచెట్టు కార్యక్రమంలో భాగంగా ఎక్కడైనా చెరువుగట్లు తొలగించి ఉంటే వెంటనే పూడ్చే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
జీహెచ్ఎంసీలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూం
హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన ఎమర్జెన్సీ కంట్రోల్‌రూంను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గురువారం మునిసిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో ఇటీవలి భారీ వర్షాలు, ఈదురుగాలులకు వివిధ విభాగాలు శక్తివంచన లేకుండా పనిచేసినప్పటికీ సమన్వయం లేకపోవడంతో సహాయ చర్యల్లో జాప్యం జరిగిందన్నారు. మరోవైపు ఇలాంటి సమయాల్లో ఎవరికి ఫోన్ చేయాలో, ఎవరు పరిష్కరిస్తారో తెలియక ప్రజల్లో అయోమయం ఏర్పడిందని తెలిపారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వైపరీత్యాల సమయంలో 24 గంటలపాటు పనిచేసేలా ఈ ఎమర్జెన్సీ కంట్రోల్‌రూంను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బాగా వాడుకలో ఉన్న 100 నంబర్‌నే కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. 100 నంబర్ ఏకకాలంలో 170 ఫిర్యాదులు స్వీకరించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నంబర్ దొరకని వారు జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ నంబర్ 040-21 11 11 11ను కూడా వినియోగించవచ్చునన్నారు. వీటిద్వారా అందే ఫిర్యాదులను కంట్రోల్‌రూమ్‌లోని ఆయా విభాగాల అధికారులు తక్షణం స్పందించి, చర్యలు చేపడతారన్నారు. జీహెచ్ఎంసీతో పాటు పోలీసు, విద్యుత్, జలమండలి, రెవెన్యూ, 108, ఎన్ఆర్ఎస్సీలు ఇందులో భాగస్వాములుగా ఉంటాయన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మాత్రమే కంట్రోల్‌రూం పని చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజలు కూడా విచక్షణతో ఫోన్ చేయాలని సూచించారు. మొబైల్యాప్.. ఫోన్ ద్వారా పూర్తిస్థాయి సమాచారం ఇవ్వలేని స్థితిలో ఉన్నవారు సైతం వినియోగించేలా మోబైల్యాప్ను కూడా అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. చెట్లు కూలినా, మరేదైన ప్రమాదం జరిగినా సదరు చిత్రాన్ని సెల్ఫోన్లో ఫొటో తీసి అప్లోడ్ చేస్తే.. దాన్ని ఎవరు పంపించారో వారి ఫోన్ నంబర్, ప్రమాదం ఏ ప్రాంతంలో జరిగింది, అక్కడ కు సమీపంలో ఉన్న సహాయక బృందాల వివరాలు తదితరమైనవన్నీ తెలుస్తాయన్నారు. దాంతో, రిసోర్స్మ్యాపింగ్ ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి తక్షణ చర్యలకు వీలుంటుందని చెప్పారు. -
తరుముకొస్తున్న తుపాను
రెండు రోజులపాటు భారీ వర్షాలు పల్లపు ప్రాంతాలు జలమయం చోడవరంలో గోడకూలి వృద్ధురాలి మృతి విరిగిపడిన చెట్లు.. విద్యుత్‌కు అంతరాయం వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరిక లోతట్టు ప్రాంతాలవారిని తరలించేందుకు సన్నాహాలు కంట్రోల్ రూముల ఏర్పాటు సాయానికి టోల్‌ప్రీ నెంబర్1800-4250-0001 అటు తిరిగి.. ఇటు తిరిగి.. తుపాను గండం ఉత్తర కోస్తా వైపు దూసుకొస్తోంది.. అదీ పెను తుపాను రూపంలో కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. నగరంలో ఉదయం నుంచీ ఎడతెరిపి లేని జల్లులు కురుస్తున్నాయి. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. చోడవరంలో గోడ కూలి వృద్ధురాలు దుర్మరణం చెందింది. గాలుల ప్రభావానికి చెట్లు కూలి విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లపై పడటంతో ఏజెన్సీతో సహా చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ తరుణంలో వాయుగుండం తుపానుగా.. పెను తుపానుగా మారనుందని.. అది ఉత్తర కోస్తా వైపు పయనిస్తోందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీర, పల్లపు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రోజంతా వాన విశాఖపట్నం: వాయుగుండం తుపానుగా మారడంతో జిల్లా అంతా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకంగా రెండు నెలల నుంచి నిప్పుల కుంపట్లో ఉన్న ప్రజలకు చల్లదనం పంచింది. బుధవారం వేకువజాము నుంచి దాదాపు రోజంతా వాన కురిసింది. తెరలు తెరలుగా విరామం ఇస్తూ వర్షం పడుతోంది. వాయుగుండం ప్రభావం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి బలమైన ఈదురుగాలులు వీయలేదు. దీంతో వర్షం కురిసినా జనజీవనానికి ఇబ్బంది కలగలేదు. విశాఖ ఏజెన్సీలో తప్ప విద్యుత్ సరఫరాకు, వాహనాల రాకపోకలకు జిల్లాలో పెద్దగా అంతరాయం ఏర్పడలేదు. వాయుగుండం గురువారానికి తుపానుగా మారనుంది. ప్రభావం మరో రెండ్రోజుల పాటు విశాఖ జిల్లాపై చూపనుంది. ఫలితంగా గురు, శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. వాయుగుండం తుపానుగా బలపడితే ఈదురుగాలులు కూడా వీస్తాయి. అందువల్ల జనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. తడిచిపోయిన వరి కుప్పలు చోడవరం, బుచ్యెయ్యపేట తదితర ప్రాంతాల్లో కోసి ఆరబెట్టిన రబీ వరి పనలు వర్షాలకు తడిసి ముద్దయ్యాయి. తగరపువలసలో 99 ఎకరాల్లోని ఉప్పు కుప్పలు వర్షపు నీటికి కరిగిపోయాయి. దీంతో ఉప్పు రైతులకు రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. ఏజెన్సీలో వాగులు పొంగిపొర్లడంతో గిరిజనులు రాకపోకలకు ఇబ్బందిపడ్డారు. విద్యుత్‌కు అంతరాయం.. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు ఒకింత అంతరాయం ఏర్పడింది. కొయ్యూరు మండలంలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పాడేరులోనూ పలు దఫాలు సరఫరా జరగలేదు. సన్‌సైడ్ కూలి వృద్ధురాలి మృతి చోడవరం: భారీ వర్షానికి ఇంటి శ్లాబ్ సన్‌సైడ్ కూలిపోవడంతో బుధవారం పట్టణంలోని గునిశెట్టివాని వీధికి చెందిన గేదెల నర్సయ్యమ్మ (78) అనే వృద్ధురాలు మృతిచెందింది. మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో ఇంటిగోడలు పూర్తిగా నానిపోయాయి. అసలే పాత ఇల్లు కావడంతో సన్‌సైడ్ కింద వర్షానికి ఆ వృద్ధురాలు నిలబడి ఉండగా ఒక్కసారిగా శ్లాబ్ సన్‌సైడ్ విరిగిపడింది. దీనితో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానిక 30 పడకల ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. -
అది..తీరని వేదన
‘ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనింపగలదు రాజకీయవేత్త గుండెలను స్పృశించగలదు భోగవంతుని విచలింపచేయగలదు.. భగవంతునికి నివేదించుకొనగలదు.. అదితీ..ఏమయిపోయావమ్మా..ఎక్కడున్నావు చిట్టి తల్లీ.. నీవు కనిపించక రెండు రోజులు దాటిపోయింది. నీవు లేకుండానే ఇంట్లో నిద్రలేని మూడు రాత్రులు గడిచిపోయాయి. రెప్పలు మూతపడటం లేదమ్మా..మానసికంగా అలసిపోయా..దిగులుతో కుంగిపోయా..కళ్లు నీళ్లింకిన బావులయ్యాయి. గుండెలు పిండేస్తున్నాయి.. నీ చిరు నవ్వులు. ముద్దు మాటల మూటలు క్షణం కూడా వీడకుండా వెంటాడుతున్నాయి. లేలేత పాదాలతో నీవేసిన చివరి అడుగు మురికి కూపంలో పడిందమ్మా..ఆ క్షణం నీవనుభవించిన బాధ గుండెల్ని మెలిపెడుతోంది.. నీకోసం వెతకని చోటులేదు..చిన్న కాలువ నుంచి పెద్ద గెడ్డల వరకూ అనువణువూ గాలించాం..చీకట్లు ముసురుకున్నా గాలింపు ఆపలేదమ్మా..కనిపించిన దారంతా కళ్లు చేసుకుని వెతికాం..అయినా నీ జాడలేదమ్మా.. విమానాలు కూలిపోతే సప్త సముద్రాలూ మధించి శకలాలేకాదు..బ్లాక్బాక్స్నూ వెలికి తీయగల సాంకేతిక సంపత్తి సొంతం చేసుకున్నాం. ప్రపంచాన్నే అరచేతిలో బంధించామంటూ గర్వపడుతున్నాం. గూగుల్‌తో సర్వాన్నీ చిటికెలో శోధిస్తున్నాం..సాధిస్తున్నాం.. కానీ ఏం ప్రయోజనం.. కాల్వలో పడి కళ్లముందే కొట్టుకుపోయిన నిన్ను రక్షించుకోలేకపోవడం ఎంతటి ఘోరవైఫల్యం.. మురికి కాలువలు కలిసే సాగరం చెంత హెలికాప్టరు గాలించి నిట్టూరిస్తూ వెనుతిరిగింది. 15మంది గజ ఈతగాళ్ల శ్రమా నిష్ఫలమైంది..250మంది నాలుగు పొక్లయిన్లతో చేసిన భారీ అన్వేషణా ముగిసిపోయింది. నీ జాడ గుర్తించలేకపోయింది....కానీ ఓడిపోయామని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేని మా గుండెలు పదే పదే ఓ కవి హృదయ ఘోష రూపంలో ఆర్తిగా ఇలా పలవరిస్తున్నాయి... ‘ఒక తల్లి నీరవాక్రోశ రవమ్ము విన్నంతవరకూ ఒక క్షత దుఃఖిత హృదయమూరడిల్లనంతవరకూ నాకు శాంతికలగదింక నేస్తం..ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను. చిన్నమ్మా..వీళ్ల మీద కోపగించకు.. వీళ్లనసహ్యించుకోకు... అదితి ఆచూకీ ప్రశ్నార్థకం - మూడురోజులవుతున్నా లభించని అదితి జాడ - తీవ్రతరమైన గాలింపు చర్యలు - వాసుపాలెంలో కంట్రోలు రూం అదితి జాడ ఎక్కడ. రోజులు గడుస్తున్నాయి. కాలం కరిగిపోతోంది. వందల మంది సిబ్బంది. డ్రైనేజీ,గెడ్డలు జల్లెడ పడుతున్నా అదితి ఆచూకీ సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలింది. గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో మద్దిలపాలెంలోని డ్రైనేజీలో పడిగల్లంతైన ఆరేళ్ల చిన్నారి అదితి కోసం గాలింపు ముమ్మరం చేశారు. జీవీఎంసీ, పోలీస్, అగ్నిమాపక, నేవీ, మత్స్యకారులు, డ్రైనేజీకి ఆనుకుని ఉన్న నివాస ప్రజలు వెతుకుతున్నా జాడ కనిపించడం లేదు. ఎవరీ అదితి.. బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చే స్తున్న చాడ శ్రీనివాస్, రేవతిల గారలపట్టి అదితి. ఇద్దరు మగపిల్లల సంతానం తర్వాత పుట్టిందీ సాయి లావణ్య అదితి(6). అదితి అంటే దేవత. ఈ చిన్నారి తల్లిదండ్రులు బెంగుళూరులో ఉద్యోగాలు చేస్తున్నందున సీతమ్మధారలోని తాతయ్య వద్ద ఉంటుంది. టింపనీ స్కూల్లో ఒకటో తర గతి చదువుతూ మద్దిలపాలెం కృష్ణ కళాశాల రోడ్డు భానునగర్ లోని ఐఒసి ఇనిస్టిట్యూట్‌లో ట్యూషన్ చదువుతుంది. సిమెంట్ పలకలు వల్లే ప్రమాదం... అదితి జారిపడిన డ్రైనేజీ వంద మీటర్ల మేర సిమెంట్ పలకలు ఉన్నందున ఆచూకి తెలియలేదు. డ్రైనేజీ వంద మీటర్ల తర్వాత ఉన్న భానునగర్ గెడ్డకు అనుసంధానమవువుంది. ఈ గెడ్డ ఎంవీపీకాలనీ, లాసన్స్‌బేకాలనీ మీదుగా వాసవానిపాలెం తీర సముద్రంలో కలుస్తుంది. ఘటన స్థలం నుంచి మూడు కిలో మీటర్లు పొడవునా ఈ గెడ్డ ప్రవహిస్తోంది. జీవీఎంసి సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ఈ గెడ్డ వెంబడి సముద్రం వరకు గాలించిన అదితి ఆచూకి ఎక్కడ లభ్యం కాలేదు. గెడ్డ ఒంపుల వద్ద పూడిక పోయిన పూడికలు,రాళ్లను నాలుగు జేసీబీలతో తొలిగించినా జాడ కనించలేదు. వాసువానిపాలెంలో కంట్రోలు రూం.. శనివారం గాలింపు చర్యలు తీవ్రం చేశారు. భానునగర్ నుంచి వాసవానిపాలెం సముద్రం వరకు విసృ్తతంగా గాలించారు. ప్రతీ వంద మీటర్లకు అయిదుగుర్ని పెట్టి ఆయా ప్రాంతంలో అణువణువు పరిశీలించారు. జీవీఎంసీ కమిషనర్ వాసువానిపాలెం తీరాన్ని సందర్శించారు. రెండున్నర కిలోమీటర్ల మేర 150 మందిజీవీఎంసీ సిబ్బంది గాలింపులో పాల్గొన్నారు. వాసువానిపాలెంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనరు చెప్పారు. ఏ సమాచారం తెలిసినా ఇక్కడకు తెలియజేయాలన్నారు. సముద్రంలో పది బోట్లు ద్వారా గాలించారు. రిషికొండ నుంచి ఆర్కే బీచ్ వరకు మత్స్యకారులను కాలినడకన వెతకాలని కోరారు. నేవీ హెలికాఫ్టర్ ద్వారా సముద్రంలో గాలించారు. మరోపక్క గజ ఈతగాళ్లు తమ పని కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిపితే రూ.50వేలు అదితి బీచ్‌లోకి వెళ్లుంటే 48 గంటల్లో తేలితుందని మత్స్యకారులు జీవీఎంసీ కమిషనర్‌కు వివరించారు. ఆతర్వాత ఆచూకీ లభ్యం కాకపోతో ఏం చేయాలనే విషయమై కమిషనర్ నేవీఅధికారులతో చర్చించారు. పాపపై ఇసుకమేటలు వేసుంటే కనిపించే అవకాశం లేదు కనుకభానునగ ర్ నుంచి గెడ్డలో మీటర్ లోతు వరకు జేసీబీలతో తవ్వించాలని ఆయన సూచించారు. అదితి ఆచూకి తెలిపిన వారికి రూ.50వేలు నగదు అందించే విధంగా ప్రకటిస్తామన్నారు. కమిషనరును అదితి తండ్రి శ్రీనివాసరావు..తాత కలిశారు. తమ బిడ్డ ఆచూకీ తెలిపేలా చర్యలుతీసుకోవాలని కోరారు. ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్ జీవీఎంసీకి చెందిన ముగ్గురు ఉద్యోగులను సస్పెన్షన్చేస్తూ జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. జోన్-2కు చెందిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ప్రమీలారాణి, శానిటరీ ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథరావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీరరాఘవులను సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. విధి నిర్వహణలో అలక్ష్యంగా ఉన్నందుకే ఈనిర్ణయం తీసుకున్నామన్నారు. -
బోనాల ఉత్సవాలకు కంట్రోల్ రూమ్
యాకుత్‌పుర: హైదరాబాద్ నగరంలో బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సర్దార్ మహల్ జీహెచ్ఎంసీ దక్షిణ మండలం కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని జోనల్ కమిషనర్ ఎం. బాలసుబ్రమణ్యం రెడ్డి తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్‌లో జీహెచ్ఎంసీలోని ఆరోగ్యం, పారిశుధ్యం, ఇంజనీరింగ్, సీపీడీసీఎల్, రెవెన్యూ, జలమండలి అధికారులు అందుబాటులో ఉంటారని.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా 040-24500254లో సమాచారం అందించాలని సూచించారు. మూడు షిఫ్టులలో 24 గంటల పాటు అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. -
కరువు తీరా వాన
- విశాఖలో 17 సెం.మీల భారీ వర్షపాతం - వాయుగుండంతో నేడూ, రేపూ ప్రభావం - అధికార యంత్రాంగం అప్రమత్తం - మత్స్యకారులు వేటకెళ్లొద్దని హెచ్చరిక - కలెక్టరేట్లో కంట్రోల్‌రూం ఏర్పాటు సాక్షి, విశాఖపట్నం: మూడు రోజుల నుంచి వాన ముంచెత్తుతోంది. కరువు తీరా వర్షం కురుస్తోంది. ఒక్కరోజూ వదలకుండా వాన ఇక చాలు అన్నంతగా దంచికొడుతోంది. నైరుతి రుతుపవనాల్లో చురుకుదనానికి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తోడైంది. ఫలితంగా కుంభవృష్టిని తలపిస్తోంది. జనజీవనాన్ని స్తంభింపచేస్తోంది. చిరు వ్యాపారులకు ఉపాధిని హరిస్తోంది. కుండపోతగా కురిస్తే ఎక్కడికక్కడే నీరు నిల్వ ఉండిపోయి పల్లపు ప్రాంతాలను జలమయం చేస్తుంది. కానీ ఏకధాటిగా కాకుండా కాస్త విరామం ఇస్తూ కురుస్తుండడం వల్ల ఒకింత ఊరటినిస్తోంది. లేదంటే ఇంతటి భారీ వర్షపాతానికి ఎంతో నష్టం వాటిల్లేది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు విశాఖలో 17 సెం.మీల భారీ వర్షపాతం నమోదయింది. ఈ సీజనులో ఇదే అత్యధిక వర్షం కావడం విశేషం. నగరంతో పాటు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. నక్కపల్లిలో 10 సెం.మీలు, ఏజెన్సీలోని పెదబయలులో 7.5 సెం.మీల వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వ ర్షాలకు మైదానంలోనూ, మన్యంలోనూ వాగు లు, వంకలు పొంగుతున్నాయి. నదుల్లోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తాండవ, వరహా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వానలకు కొన్నిచోట్ల చెరకు, మెట్టు పంటలు దెబ్బతిన్నాయి. కశిం కోట మండలంలో కాశీమదుం గ్రోయిన్ కొట్టుకుపోయింది. ఏజెన్సీలోని మత్స్యగెడ్డ పొంగి ప్రవహిస్తోంది. ఇతర గ్రామాలకు సంబంధాలు తెగిపోవడంతో మన్యంలో గిరిజనులు నాటుపడవల్లో ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. అయితే అనూహ్యంగా కురుస్తున్న వానలు అన్నదాతల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. ఇప్పటికే చెరువులు, రిజర్వాయర్లలోకి ఎగువ ప్రాంతాల నుంచి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ఇదే ఇప్పుడు రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. నేడు, రేపు కూడా.. మరోవైపు ఉత్తరాంధ్రపై రుతుపవనాలు చురుగ్గా ఉండడం, వాయుగుండం ప్రభావం వెరసి ఆది, సోమవారాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత వానలు తగ్గుముఖం పడతాయని అంటున్నారు. జిల్లాలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. విశాఖపట్నం, భీమునిపట్నం, గంగవరం పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద సూచికను జారీ చేసింది. -
ఎండ బాధితులకు కంట్రోల్ రూం ఏర్పాటు
తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడి ప్రతాపానికి వందల మంది మృత్యువాత పడుతుండటం తెలిసిందే. తాజాగా సోమవారం రోజున ప్రకాశం జిల్లాలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సందర్భంగా ఆ జిల్లా కలెక్టరు సుజాత వర్మ మాట్లాడుతూ.. 'ప్రజలు అప్పమత్తంగా ఉండాలి. వడదెబ్బ తగలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటి దాకా జిల్లాలో వడదెబ్బతో మృతిచెందిన వారి వివరాలను సేకరించేందుకు మండలాల వారీగా త్రిసభ్య కమిటీ వేశాం. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశాం. జిల్లా కలెక్టరేట్లో ప్రజలకోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. నంబరు 08592281400, 1077 టోల్ ఫ్రీ నంబరు' ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని కలెక్టర్ సుజాతశర్మ తెలిపారు. -
టెన్త్ పరీక్షల కోసం కంట్రోల్‌రూం
- సమస్యలుంటే 040- 23231858 నంబర్‌కు ఫోన్ చేయండి - జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి సాక్షి, రంగారెడ్డి జిల్లా: మార్చి 25 నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 427 పరీక్షా కేంద్రాలున్నందున ప్రతి కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు 94,181 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కేంద్రంలో నిరంతరంగా విద్యుత్తు సరఫరా చేయడంతోపాటు మౌలికవసతులు కల్పించాలన్నారు. ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యాశాఖలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. సమస్యలుంటే 040- 23231858 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. పరీక్ష నిర్వహణకు 4,710 మంది ఇన్విజిలేటర్లను నియమిస్తున్నామని, 45 రూట్ అధికారులు, 427 ఛీఫ్ సూపరింటెం డెంట్లు, 20 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించి పరీక్షలు పక్కాగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం డీఈఓ రమేష్ మాట్లాడుతూ ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.15వరకు పరీక్ష జరుగుతుందని, కొత్త పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తున్నందున విద్యార్థులు ప్రశ్నాపత్రాన్ని చదువుకునేందుకు వీలుగా 15 నిమిషాల సమయం అదనంగా ఇస్తున్నామన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ సుభాష్‌చంద్రబోస్, ఆర్టీఓ దుర్గాదాస్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాకు భారీ వర్షసూచన
ఒంగోలు టౌన్: జిల్లాకు భారీ వర్ష సూచన ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ(ఇండియన్ మెట్రాలాజికల్ డిపార్టుమెంట్) నుంచి సమాచారం అందింది. దీంతో కలెక్టర్ విజయకుమార్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అందరు జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు క్షేత్ర స్థాయిలో సిద్ధంగా ఉండాలని, ఉద్యోగులు తమ హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశించారు. సిబ్బంది అప్రమత్తం గా ఉండాలని, ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే జిల్లా యంత్రాంగానికి వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. బుధవారం తెల్లవారుజాము నుంచే జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఇప్పటికే కోస్తాలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పగటి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. కలెక్టరేట్, తహశీల్దార్ కార్యాలయాల్లోకంట్రోల్ రూమ్‌లు భారీ వర్షాల హెచ్చరికలతో కలెక్టరేట్‌తోపాటు అన్ని మండలాల తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్(08592 - 231400, టోల్ ఫ్రీ నెం 1077)ను ఏర్పాటు చేశారు. భారీ వర్షాలకు తోడు బలంగా గాలులు వీచే అవకాశాలు ఉండటంతో ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. తీర ప్రాంత మండలాలైన ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, చినగంజాం, వేటపాలెం, చీరాల, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరులో ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకొంది. -
కంట్రోల్ రూములోనే వేధింపులా?
చెన్నై, సాక్షి ప్రతినిధి:సాధారణ ప్రజలు లైంగిక వేధింపులకు పాల్పడితే పోలీసలుకు చెబుతాం, అలాంటిది పోలీసులే ఆ దుశ్చర్యకు పూనుకుంటే ఎవరికి చెప్పుకోవాలి. ఇదే ప్రశ్న కృష్ణగిరి ఎస్పీని మద్రాసు హైకోర్టు అడిగింది. ఈనెల 22వ తేదీలోగా పూర్తిస్థాయి నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ దారుణానికి సంబంధించి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబరు 8న రాజస్థాన్‌కు చెందిన నలుగురు మహిళలు, ఇద్దరు పిల్లలతో కలిసి హోసూరు బస్‌స్టేషన్ వద్ద నిలుచున్నారు. హోసూరు పోలీస్ కంట్రోల్ రూము హెడ్‌కానిస్టేబుల్ వారిని స్టేషన్‌కు తీసుకెళ్లాడు. వారివద్దనున్న డబ్బును తీసుకున్నాడు. ఆ తరువాత నలుగురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో వారు అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించాడు. అఖిలభారత జననాయక మాదర్ సంఘం అధ్యక్షులు వాసుకి ఈ దారుణ ఉదంతంపై మద్రాసు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. బాధిత మహిళలు ప్రస్తుతం ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. తమిళనాడు బాలల హక్కుల కమిషన్ పర్యవేక్షణలో సీబీసీఐడీ చేత విచారణ జరిగేలా ఆదేశించాలని, బాధిత మహిళలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణల ముందుకు ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపున న్యాయవాది నిర్మలారాణి వాదిస్తూ, న్యాయస్థానంలో పదిమంది ముందు చెప్పలేని భాషలో సదరు హెడ్ కానిస్టేబుల్ మహిళలను లైంగికవేధింపులకు గురిచేశాడని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువుల అమ్మకంతో జీవనం సాగించే బాధిత మహిళల జాడలేదని, లైంగిక వేధింపులకు పాల్పడిన హెడ్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేయలేదని న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లారు. వ్యాజ్యంలోని వివరాలను విన్న న్యాయమూర్తులు విస్తుపోయారు. పోలీసులే లైంగిక వేధింపులకు పాల్పడితే ఎలాగని కృష్ణగిరి జిల్లా ఎస్పీని ప్రశ్నించారు. ఆస్పత్రిలో చేరిన బాధిత మహిళల మెడికల్ రిపోర్టు, హెడ్ కానిస్టేబుల్‌పై తీసుకున్న క్రమశిక్షణ చర్య తదితర వివరాలతో ఈ నెల 22వ తేదీలోగా నివేదిక సమర్పించాలని కృష్ణగిరి ఎస్పీని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. కేసును సైతం 22వ తేదీకి వాయిదావేసింది. -
ప్రకాశం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలకు కలెక్టర్ విజయకుమార్ శుక్రవారం ఒంగోలులో పలు సూచనలు చేశారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న కారణంగా ఆయా ప్రాంతాల్లో సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించవద్దని ఆయన ప్రజలకు సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్షాల వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూమ్ నెంబ్లర్లు : 08592 281400, లేదా టోల్ ఫ్రీ నంబర్ : 1077కు ఫోన్ చేయాలని సూచించారు. -
62 రైళ్లు రద్దు.. 51 రైళ్ల దారిమళ్లింపు
* హుదూద్ తుపాను ప్రభావంతో రైల్వేశాఖ ముందస్తు చర్యలు * విశాఖపట్నం, భువనేశ్వర్‌వైపు లైన్ బ్లాక్ * ముఖ్యమైన రైళ్లు బలార్షా మీదుగా మళ్లింపు * పమాదకర వంతెనలు, చెరువు సమీప లైన్ల వద్ద వాచ్మెన్ ఏర్పాటు * నిరంతర నిఘాకు ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాను భీకరంగా విరుచుకుపడుతుందన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పకడ్బందీగా వ్యవహరించింది. గతంలో ఇలాంటి హెచ్చరికలు వెలువడ్డా... రైళ్లను నడిపేది. తీరా తుపాను విరుచుకుడ్డాక రైళ్లు నిలిచిపోయి ప్రయాణికులు నరకయాతనపడేవారు. ఈసారి అలాంటి పరిస్థితులు ఎదురుకావద్దన్న ఉద్దేశంతో తుపాను ప్రభావం ఉండే ప్రాంతాల్లో ఒక్కరైలునూ నడపకుండా పూర్తిగా నిలిపివేసింది. ముఖ్యమైన రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో దారిమళ్లించి వాటిల్లో ప్రయాణించేవారికి ఇబ్బందిలేకుండా వ్యవహరించింది. తుపాను భీకరంగా ఉండబోతుందం టూ నాసా హెచ్చరించిన నేపథ్యంలో చిన్న ప్రమాదం కూడా లేకుండా చూడాలని, రెలైక్కినందుకు ప్రయాణికులు ఇబ్బందిపడే పరిస్థితి రానీయొద్దని రైల్వే ఆదేశించటంతో దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. విజయవాడ-విశాఖపట్నం దారిలో రాజమండ్రి-విశాఖపట్నం మధ్య ఆదివారం తెల్లవారుజాము నుంచి రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. తుపాను తీరం దాటినా విశాఖపట్నం, భువనేశ్వర్‌లకు వెళ్లే రైళ్లను ముందుజాగ్రత్తగా సోమవారం సాయంత్రం వరకు రద్దు చేశారు. హౌరావైపు వెళ్లాల్సిన ముఖ్యమైన రైళ్లను విజయవాడ, బలార్షాల మీదుగా మళ్లించారు. ఫలితంగా 62 రైళ్లు పూర్తిగా రద్దు కాగా, ఐదు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 51 రైళ్లను దారిమళ్లించి నడిపారు. మరోవైపు రైలు మార్గాల పరిస్థితి ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు రైల్ నిలయంలో అత్యవసర కంట్రోల్ రూం ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ బాధ్యతను అదనపు జీఎం అగర్వాల్, చీఫ్ ఆపరేషనల్ మేనేజర్ ఝాలకు అప్పగించారు. అలాగే విజయవాడలో మరో అత్యవసర కంట్రోల్ రూం ఏర్పాటు చేసి అక్కడి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. వీటితోపాటు అనకాపల్లి, తుని, సామర్లకోట, కాకినాడ, రాజమండ్రి, నిడదవోలు, నూజి వీడు, భీమవరం, మచిలీపట్నం, నర్సాపూర్, గుడివాడ, ఏలూరు, గుంటూరు, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, రామగుండం, బెల్లంపల్లి, సిర్పూర్కాగజ్నగర్ స్టేషన్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. -
మహిళల కోసం పోలీసు కంట్రోల్ రూం
రాజధానిలోని అన్ని జోన్లు, ప్రతి జిల్లాలో పోలీస్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ప్రభుత్వానికి ప్రతిపాదించనున్న రాష్ట్ర మహిళా భద్రతా కమిటీ గుజరాత్, ముంబైలలో పర్యటించి వచ్చిన కమిటీ నేడు డీజీపీతో సమావేశం హైదరాబాద్: ఆపదలో ఉన్న మహిళలకు వెంటనే రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా మహిళా పోలీస్ కంట్రోల్‌రూంను ఏర్పాటు చేయాలని మహిళా భద్రతా కమిటీ రాష్ర్ట ప్రభుత్వానికి ప్రతిపాదించనుంది.అలాగే రాజధానిలోని అన్ని జోన్లతోపాటు, ప్రతి జిల్లాలో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయాలని కూడా సూచించనుంది. రాష్ర్టంలో మహిళలు, యువతులు, బాలికల భద్రత కోసం ప్రభుత్వం తీసుకువచ్చే చట్టాల కోసం తగిన సిఫారసులు చేయడానికి ఏర్పాటైన మహిళా భద్రతా కమిటీ సభ్యులు రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ సౌమ్యామిశ్రా, సీఐడీ ఐజీ చారుసిన్హా, హైదరాబాద్ నగర అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్) స్వాతి లక్రా రెండురోజుల పాటు గుజరాత్, ముంబైలలో పర్యటించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లోని వన్‌స్టాప్ క్రైం సిస్టంతోపాటు, మహిళలు ఆన్లైన్లో కంప్లయింట్ చేసే విధానాన్ని బృందం పరిశీలించింది. పోలీసు డయల్ 100 మాదిరిగా ఆపదలో ఉన్న మహిళల కోసం డయల్ 181 విధానాన్ని పరిశీలించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూం, అందులో మహిళలే పనిచేయడం, వచ్చిన కాల్లపై స్పందిస్తున్న తీరును పరిశీలించిన వారు ఆ విధానాన్ని రాష్ర్టంలోనూ అమలు చేయాలని ప్రతిపాదించనున్నారు. అలాగే, ముంబైలో ప్రతిజోన్‌లో ఒక ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు ద్వారా మహిళలకు అందుతున్న తక్షణ రక్షణను పరిశీలించారు. వీటిని మహారాష్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని అక్కడి అధికారులు కమిటీ సభ్యులకు వివరించారు. గుజరాత్, ముంబైలలో మహిళల భద్రతకు పనిచేస్తున్న వ్యవస్థలు, విధివిధానాలకు సంబంధించిన పుస్తకాలను పరిశీలించిన కమిటీ ముఖ్యమైన అంశాలతో ప్రభుత్వానికి సిఫారసులు చేయనుంది. అందులో భాగంగానే పోలీస్ కంట్రోల్ రూం, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ల ఏర్పాటు, మహిళా సిబ్బంది నియామకంపై సూచనలు చేస్తుంది. వీటికి తుదిరూపు ఇవ్వడానికి ఆదివారం డీజీపీ అనురాగ్‌శర్మ, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సునీల్ శర్మలతో మహిళా భద్రతా కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు. -
గుంటూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
గుంటూరు: హుదూద్ తుపాన్ నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. జిల్లాలో తుపాన్ వల్ల ఎక్కడ ఎటువంటి విపత్తు సంభవించిన 0863 -2234070, 2234301 నెంబర్లకు ఫోన్ చేయాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జిల్లా ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ కాంతిలాల్ దండే సమీక్ష నిర్వహించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించారు. నిజాంపట్నం ఓడరేవులో 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. -
ఆదిలాబాద్ కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని సిర్పూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌లలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులకు తక్షణ సాయం అందించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న ఎవరైన సాయం కోసం 08732-22302, 225529 ఈ నెంబర్లను సంపద్రించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఇది ఇలా ఉండగా సిర్పూర్లో 23 సెం.మీ, మంచిర్యాలలో 16 సెం.మీ, ఆసిఫాబాద్‌లో 13 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. భారీ వర్షాల కారణంగా శ్రీరామ్‌పూర్, డోర్నీ-1, డోర్నీ -2 కైరీగూడ ఓపెన్ కాస్ట్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.దీంతో సింగరేణికి తీవ్ర నష్టం ఏర్పడింది. -
సెల్‌ఫోన్‌తో కాల్ చేస్తే చాలు!
ప్రత్యేక యాప్ రూపకల్పనకు పోలీసు విభాగం నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఆపదలో ఉన్న మహిళలు పోలీసులకు సంబంధించిన నంబర్లకు ఫోన్ చేయడం, వారి ఇబ్బందిని వివరించడం, చిరునామాలు చెప్పడం అన్ని వేళల్లోనూ సాధ్యం కాకపోవచ్చు. వారికి ఆ వెసులుబాటు లభించే , కంగారు, టెన్షన్లో బాధితులకు ఆ ఆలోచన వచ్చే అవకాశాలు తక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర పోలీసు విభాగం, కాల్ చేస్తే చాలు.. దాన్నే ఫిర్యాదుగా పరిగణించడంతో పాటు ఇతర వివరాలు తెలియజేసేలా సెల్ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకునే ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని నిర్ణయించింది. వివిధ సాఫ్ట్వేర్ సంస్థలతో ఈ మేరకు సంప్రదింపులు జరుపుతోంది. మహిళలు తమ సెల్ఫోన్లలోకి డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ఈ యూప్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది నిత్యం కంట్రోల్ రూమ్‌లోని కంప్యూటర్లలో ఉండే సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానమై ఉంటుంది. ఆపదలో ఉన్న సమయంలో తమ సెల్ఫోన్లలో ఈ యూప్ కలిగిన మహిళలు.. పోలీసులు కేటాయించిన ప్రత్యేక సింగిల్ డిజిట్ నంబరుకు ఒకసారి డయల్ చేయగలిగితే చాలు. అది నేరుగా కంట్రోల్ రూమ్‌కు కనెక్ట్ అవుతుంది. దుండగులు బాధితురాలి చేతిలో ఫోన్ లాక్కుని కాల్ కట్ చేయాలని, ఫోన్ స్విచాఫ్ చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాదు. బాధితురాలు ఫోన్లో ఎలాంటి వివరాలూ చెప్పలేకపోయినా... ఆమెతో పాటు దుండగుల మాటలు, పరిసరాలకు సంబంధించిన ప్రతి శబ్దాన్నీ కంట్రోల్ రూమ్‌లోని సిబ్బంది వినగలుగుతారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) ద్వారా బాధితురాలు ఉన్న ప్రాంతాన్ని తక్షణమే గుర్తించి సమీపంలో ఉన్న పోలీసుస్టేషన్, గస్తీ సిబ్బందిని అప్రమత్తం చేసి అక్కడకు పంపిస్తారు. కంట్రోల్ రూమ్‌లోని సిబ్బంది కట్ చేస్తే మాత్రమే ఆ కాల్ కట్ అవుతుంది. అలా కట్ అరుున తర్వాత మాత్రమే సదరు ఫోన్‌ను ఎవరైనా స్విచ్ఛాఫ్ చేయగలుగుతారు. ఇప్పటికే మూడు సంస్థలు ఈ తరహాలో రూపొందించిన సాఫ్ట్వేర్, యాప్స్‌ను డీజీపీ జేవీ రాముడికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారుు. అయితే ఈ యూప్‌లు కేవలం నగరాలు, పట్టణాల్లో అత్యాధునిక సెల్ఫోన్లు కలిగిన వారికి మాత్రమే ఉపయుక్తంగా ఉంటారుు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సెల్ఫోన్లు ఉపయోగించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని భావిస్తున్న పోలీసులు.. అందరికీ అందుబాటులో ఉండే, మరింత సరళీకృత టెక్నాలజీ కోసం అన్వేషిస్తున్నారు. మరోపక్క హఠాత్తుగా, ఊహించని విధంగా ఆపదలు ఎదుర్కొనే అవకాశం గ్రామీణ ప్రాంత మహిళలకు తక్కువగా ఉంటుందని భావిస్తున్న ఉన్నతాధికారులు పై తరహా యాప్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారి కోసం ‘100’, ‘1091’ ‘199’ తరహా నంబర్లు ఉపకరిస్తాయని వారంటున్నారు. రాష్ట్ర రాజధాని గుర్తింపు, అక్కడ పోలీసు హెడ్-క్వార్టర్స్ నిర్మాణానికి స్థలం కేటాయింపు జరిగేలోపు ఈ యాప్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
వరద సహాయక చర్యలకు టోల్ ఫ్రీ నంబర్
*బల్దియాలో రౌండ్ ది క్లాక్ కంట్రోల్ రూం 18004251980 *53 డివిజన్లు, 42 విలీన గ్రామాలకు సేవలు *24 గంటలపాటు సేవలందించేలా ఏర్పాట్లు వరంగల్ : వర్షాకాలం నేపథ్యంలో ఉత్పన్నమయ్యే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వరంగల్ నగర పాలక సంస్థ అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ముంపు ప్రాంతాలు, కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాలు, చెట్లు, కరెంట్ స్తంభాలను గుర్తించి కార్యాచరణ ప్రారంభించారు. కార్పొరేషన్ పరిధిలోని 53 డివిజన్లతోపాటు నగరంలో విలీనమైన 42 గ్రామాల్లో సత్వర సహాయక చర్యలు చేపట్టడంలో భాగంగా 18004251980 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు వరంగల్‌లోని బల్దియా ప్రధాన కార్యాలయంలో రౌండ్ ది క్లాక్ కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు. 24 గంటలపాటు ఫిర్యాదులు స్వీకరిం చేలా ఉద్యోగులకు విడతల వారీగా విధులు కేటాయించారు. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 4... సాయంత్రం 4 నుంచి రాత్రి 12... రాత్రి 12 నుంచి ఉదయం 8 గంటల వరకు ఒక్కొక్కరు విధులు నిర్వర్తించనున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వారు నమోదు చేసుకుంటారని... ఆ తర్వాత నోడల్ అధికారులు వెంటవెంటనే సహాయక చర్యలు చేపట్టనున్నట్లు బల్దియా అడిషనల్ కమిషనర్ నలుపరాజు శంకర్ తెలిపారు. -
అశ్రునయనాల మధ్య...అంతిమ వీడ్కోలు
విజయనగరం కంటోన్మెంట్ : గుర్తు పట్టలేని విధంగా ఉన్న మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు, పిల్లలు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ముందుగా కలెక్టరేట్‌కు వచ్చి కంట్రోల్ రూమ్‌కు సమాచారమిచ్చిన అనంతరం ఆయా గ్రామాలకు చెన్నై అంబులెన్స్‌లు తరలివెళ్లాయి. దత్తిరాజేరు మండలం కె.కృష్ణాపురానికి చెందిన సిరిపురపు రాము, మక్కువ మండలం పెదైగైశీలకు చెందిన వెంపడాపు శంకరరావు, అదే గ్రామానికి చెందిన మజ్జి సరస్వతి, మక్కువ మండలం తూరుమామిడికి చెందిన నీలమాంబపురానికి చెందిన ముదిలి రామలక్ష్మి మృతదేహాలను ఆయా గ్రామాలకు తరలించారు. మృతదేహాలు గ్రామాలకు రాగానే ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఏ కంట చూసిన మంటికి జాలురువారుతున్న కన్నీటిధారలే కపినించాయి. ఎవరిని కదిపినా రోదన తప్ప వారి నోటవెంట మరో మాట బయటకు రాలేదు. గ్రామస్తులందరూ కలిసి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆచూకీ తెలియాల్సి ఉంది. తొమ్మిది మంది చెన్నైలోని రామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల తొలగింపు కొనసాగుతుండడంతో మిగతా వారి కోసం ఎదురుచూస్తున్నారు. బాడంగి మండల కేంద్రానికి చెందిన బొమ్మి అనసూయ క్షేమంగా ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. ఊరి కాని ఊరిలో మృతి.. ఊరవతల కడచూపు చెన్నైలో మృతి చెందిన వారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం వెళ్లిన వీరు అక్కడి భవన ప్రమాదంలో మృతి చెందడంతో కన్నీరుమున్నీరవుతున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వర్ణిస్తూ రోది స్తుండడం చూపరులను కూడా కంటతడిపెట్టుకునేలా చేస్తున్నాయి. సాధారణం గా ప్రమాదాల్లో మృతి చెందిన వారి మృతదేహాన్ని గ్రామాల్లో ఉంచరు. ఇది గ్రామీణ ప్రజల కట్టుబాటు. చెన్నైలో మరణించిన వారి మృతదేహాలను నేరుగా స్వగ్రామాలకు తీసుకు రాకుండా అంబులెన్స్‌ల్లో శ్మశాన వాటికలకు తరలించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు, కుటుంబ సభ్యులు నేరుగా శ్మశాన వాటికలకు తరలివెళ్లారు. ఊరుకాని ఊరిలో చనిపోయి ఊరవతల కడచూపులు మిగిల్చావా? దేవుడా అని బంధువులు, కన్నవారు మింటికి, మంటికి ఏకధాటిగా రోదించడంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలముకున్నాయి. అతను మా నాన్న కాదు... కె.కృష్ణాపురానికి చెందిన సిరిపురపు రాము మృతదేహం సాయంత్రానికి స్వ గ్రామం పక్కనే ఉన్న శ్మశానానికి చేరుకుంది. దీంతో గ్రామానికి చెందని ప్రజలతో పాటు కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. వీరితో పాటు కడసారి చూపు చూపించాలంటూ బంధువులు రాము ఇద్దరు కుమార్తెలనూ శ్మశానానికి తీసుకువచ్చారు. ఏడేళ్ల వేదశ్రీ, ఐదేళ్ల ఐశ్వర్యలకు సిరిపురపు రాము మృతదేహాన్ని చూపిం చారు. ప్రమాదంలో తండ్రి తలంతా ఛిద్రమైపోయినట్టు తెలియని ఆ చిన్నారులు మానాన్న కాదూ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నప్పుడు పంటి బిగువున దుఃఖాన్ని ఆపుకున్న వారు కూడా బోరున ఏడ్చేశారు. నాన్నను చూపించండి అంటూ ఇద్దరు చిన్నకుమార్తెలూ ఏడుస్తున్నప్పుడు అక్కడ వాతావరణం శోకసంద్రమైపోయింది. నేడు మరో నలుగురి మృతదేహాలు జిల్లాకు జిల్లాకు చెందిన మరో నలుగురి మృతదేహాలు బుధవారం ఆయా గ్రామాలకు చేరుకోనున్నాయని అధికారులు తెలిపారు. మక్కువ మండలం తూరుమామిడికి చెందిన సీర జయమ్మ, బాడంగి మండలకేంద్రానికి చెందిన బొంగుశాంత కుమారి, కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన పడాల చిన్నమ్మ, దత్తిరాజేరు మండలం కె.కృష్ణాపురానికి చెందిన వనం దుర్గ మృతదేహాలు రానున్నాయి. జిల్లాకు చెందిన మరో 26 మంది -
నరకం
‘జడి’సిన నగరం అకాల వానతో కకావికలం గోదారులైన రహదారులు స్తంభించిన రాకపోకలు రోడ్లపై నిలిచిన నీళ్లు పూడికతీయని నాలాలు లోతట్టు ప్రాంతాలు మునక సాక్షి, సిటీబ్యూరో: షరా మామూలు. శుక్రవారం కురిసిన వానతో నగరం కకావికలమైంది. సరిగ్గా కార్యాలయాలకు వెళ్లే.. తిరిగి వచ్చే వేళ కురిసిన వానతో రాకపోకలు స్తంభించాయి. పలుచోట్ల నాలాలు ఉప్పొంగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. మెహిదీపట్నం, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో కాలనీలు, బస్తీల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. నాలాలు, మురుగునీటి పైప్లైన్లలో పేరుకుపోయిన పూడికతో వర్షపు నీరు వెళ్లే దారి లేకుండాపోయింది. దీంతో నీరంతా సమీపంలోని రహదారులు, కాలనీలను ముంచెత్తింది. ఇంత జరిగినా జీహెచ్ఎంసీ, జలమండలిలోని అత్యవసర బృందాలు జాడలేకుండా పోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షం ప్రభావం ట్రాఫిక్‌పై పడింది. తెలుగుతల్లి ఫ్లైఓవర్, మలేషియా టౌన్షిప్, పంజగుట్ట, అమీర్‌పేట తదితర ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనాలు బారులుతీరి నిలిచిపోయాయి. ఉదయం వేళ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, పనులపై బయల్దేరిన జనం అవస్థలు పడ్డారు. తిరిగి సాయంత్రం పడిన వానతో ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుపోయారు. అబిడ్స్, కోఠి, నాంపల్లి, పంజగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, ఎస్.ఆర్.నగర్, తార్నాక, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, బాలానగర్, సనత్‌నగర్, మెహిదీపట్నం, చార్మినార్, బహదూర్‌పురా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నరకం చూపించింది. పూర్తికాని పనులు.. రోడ్లపైకి నీళ్లు వర్షం పడిన ప్రతిసారీ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడం నగరంలో షరా మామూలైంది. వాననీరు వెళ్లే దారిలేక రోడ్లపైనే నిలిచిపోతుండటం ఇందుకు కారణం. ఏటా ఎదురవుతున్న ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు, రోడ్లపై నీరు నిలవకుండా, లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో వరదనీటి సంపులు నిర్మించాలని, అవసరమైన పైప్ డ్రెయిన్లు వేయాలని, మరమ్మతులు చేయాలని, సీసీ రోడ్లు నిర్మించాలని అధికారులు భావించారు. తద్వారా ట్రాఫిక్ సమస్య తీరుతుందని అంచనా వేశారు. తరచూ నీరు నిలిచిపోతుండటం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు జరుగుతున్న నష్టాన్ని నివారించవచ్చని లెక్కలు వేశారు. ఈ క్రమంలో 104 నీటిముంపు ప్రాంతాలను గుర్తించారు. ఈ పనులన్నింటినీ వేసవిలోపు, వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలనుకున్నారు. 13 ప్రదేశాలకు మాత్రం ప్రథమ ప్రాధాన్యమిచ్చి ఏప్రిల్‌లోనే మరమ్మతులు చేయాలనుకున్నారు. ప్రణాళిక బాగానే ఉన్నా.. కార్యాచరణ కొరవడింది. దీంతో గురు, శుక్రవారాల్లో కురిసిన వానతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే పనులు చేయలేకుంటే, మిగతా ప్రాంతాల గురించి చెప్పాల్సిన పనే లేదు. ప్రథమ ప్రాధాన్యతనిచ్చిన పనుల అంచనా వ్యయం రూ. 61. 33 లక్షలు. నిధులున్నా పనులు పూర్తికాలేదు. ఫలితంగా నాలుగు చినుకులకే నగరవాసి నరకం చవిచూశాడు. ఇక, వర్షాకాలంలో పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా, బషీర్‌బాగ్, అంబర్‌పేట, అమీర్‌పేట ధరంకరం రోడ్డు ప్రాంతాల్లో చెట్లు కూలినట్లు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదులందాయి. లక్డికాపూల్లో పోలీస్‌స్టేషన్ సమీపంలో నీటినిల్వకు సంబంధించి ఫిర్యాదు అందింది. ఇదా మీ పనితీరు? నగరంలో నీటి నిల్వ ప్రాంతాలు, డీసిల్టింగ్ పనుల తనిఖీకి శుక్రవారం ఆయా ప్రాంతాలకు వెళ్లిన జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్.. పనుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశా రు. లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ వద్ద నీటి నిల్వ సమస్య గురించి గవర్నర్ నరసింహన్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో అధికారులపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రంగా హెచ్చరించారు. లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ దగ్గర పనులకు మార్గదర్శకాలతోపాటు అవసరమైన నిధులు మంజూరుచేసినా పనులెందుకు పూర్తి చేయలేదంటూ ఈఈపై విరుచుకుపడ్డారు. శుక్రవారం రాత్రిలోగా పనులు పూర్తి చేయకుంటే కఠిన చర్య లు తప్పవని సోమేష్‌కుమార్ హెచ్చరించారు. నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తిచేయనందునే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని కమిషనర్ అన్నారు. గతంలో తీవ్ర సమస్యగా ఉన్న మైత్రీవనం వద్ద అవసరమైన చర్యలు తీసుకున్నందున అక్కడ నీటినిల్వ సమస్య సమసిపోయిందని, 15 నిమిషాల్లో వరద నీరు మొత్తం వెళ్లిపోతోందన్నారు. తగినన్ని నిధులున్నా, ప్రజలు కష్టాలు పడుతున్నా చలించని ఇంజినీర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిషనర్.. ఈఎన్సీ ధన్సింగ్, చీఫ్ ఇంజినీర్ ఆంజనేయులు తదితరులతో కలిసి సీఎం క్యాంపు ఆఫీస్ నుంచి సోమాజిగూడ రాజీవ్‌గాంధీ విగ్రహం, బంజారాహిల్స్ పెన్షన్ ఆఫీస్, టోలిచౌకి, షేక్‌పేట, మైత్రీవనం ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. -
పక్కా ‘ట్రాక్’పై నిఘా
సైబరాబాద్‌లో జీపీఎస్ ఆధారంగా పనిచేసే ‘వీటీఎస్’ పోలీసు వాహనాల కదలికలపై కన్ను చాలావరకు తగ్గనున్న రెస్పాన్స్ టైమ్ నాలుగింటిలో ప్రయోగాత్మకంగా అమలు త్వరలో మరో 70 వెహికల్స్‌లో ఏర్పాటు సాక్షి, సిటీబ్యూరో: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అతి వేగంగా సేవలందించేందుకు సైబరాబాద్ కమిషనరేట్ రంగం సిద్ధం చేస్తోంది. జీఐఎస్, జీపీఎస్ టెక్నాలజీతో పనిచేసే వెహికల్ ట్రాకింగ్ సిస్టం (వీటీఎస్)ను ప్రవేశపెట్టబోతోంది. బాధితుల కాల్స్‌కు త్వరి తంగా రెస్పాన్స్ ఇచ్చేందుకు, పోలీసు గస్తీ వాహనాల కదలికలపై నిఘా ఉంచేం దుకు ఉపయోగపడే ఈ వ్యవస్థతో పలు అవస్థలు తప్పనున్నాయి. దీన్ని ఇప్పటికే ప్రయోగాత్మకంగా నాలుగు వాహనాల్లో ప్రవేశపెట్టారు. ఈ నెలాఖరుకు కమిషనరేట్‌లోని 70 గస్తీ వాహనాల్లో ఏర్పాటు చేయనున్నారు. గస్తీ వాహనాలపై నిఘా సైతం... ఈ వ్యవస్థతో పోలీసు వాహనాల గస్తీ సైతం పక్కాగా జరిగేలా నిఘా ఉంచే అవకాశముంది. {పస్తుతం ఈ వాహనాల గస్తీపై పలు ఫిర్యాదులు అందుతున్నాయి. తాజా ట్రాకింగ్ సిస్టం వల్ల ఏదైనా వాహనం ఎక్కడ గస్తీ నిర్వహిస్తోందన్నది స్పష్టంగా తెలుసుకోవచ్చు. వాహనాన్ని ఘటనాస్థలికి పంపేటప్పుడు దాన్లో ఉన్న ఇంధనం సరి పోతుందా? లేదా? అనేదీ ముందుగానే తెలుసుకోవచ్చు. ఒక్కో వాహనానికి నెలకు ఎంత డీజిల్ కేటాయించారు, దాని మైలేజ్ ఎంత? అది ఎన్ని కి.మీ. గస్తీ తిరిగింది? ఇంకా ఎంత డీజిల్ ఉంది? తదితర విషయాలనూ ఇది విశ్లేషిస్తుంది. ఓఆర్ఆర్ పెట్రోలింగ్ వాహనాలకూ.. ‘రెస్పాన్స్ టైమ్ తగ్గించడంతోపాటు గస్తీ వాహనాలపై నిఘా ఉంచడానికి వీటీఎస్ ఉపకరిస్తుంది. దీన్ని మొదటి దశలో 70 పెట్రోలింగ్ వాహనాల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఇటీవలే ఓఆర్ఆర్పై తనిఖీలు చేపట్టేందుకు అందుబాటులోకి తెచ్చిన ఐదు వెహికల్స్కూ ఏర్పాటు చేస్తాం. ఈ నెలాఖరుకు ఇది పూర్తవుతుంది. ఈ వ్యవస్థకు సంబంధించిన సమాచారం కంట్రోల్ రూమ్‌లో తెరపై కనిపించడంతోపాటు సర్వర్లోనూ డంప్ అవుతుంది. దానిలోకి లాగిన్ అయిన ఏ అధికారైనా ఎక్కడి నుంచైనా ఈ సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది.’ - అవినాష్ మహంతి, ట్రాఫిక్ డీసీపీ, సైబరాబాద్ వేగంగా స్పందించడమే ప్రధాన లక్ష్యం ఇబ్బందులు, సమస్యల్లో ఉన్న బాధితులు కంట్రోల్‌రూమ్‌కు ఫోన్ చేసి సాయం కోరగలరు తప్ప.. అన్ని సందర్భాల్లో వారి వివరాలు చెప్పే స్థితిలో ఉండరు. ఈ నేపథ్యంలో కంట్రోల్‌రూమ్‌కు వచ్చిన కాల్‌ను బట్టి అది ఏ ప్రాంతం నుంచి వస్తోందనేది సాంకేతికంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సమాచారం అందగానే ఎంత వేగంగా పోలీసులు స్పందించగలిగితే బాధితులకు అంత ఊరట లభిస్తుంది. ఈ రెస్పాన్స్ టైమ్ తగ్గించాలంటే రక్షక్, మొబైల్ వాహనాలు ఎక్కడున్నాయో వేగంగా తెలుసుకోవాలి. దీనికోసం ఆ వాహనాల్లో జీఐఎస్ (గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్), జీపీఎస్ (గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమ్) ఏర్పాటు చేస్తారు. వీటిని కంట్రోల్‌రూమ్‌లో ఉండే వీడియో వాల్‌కు అనుసంధానిస్తారు. ఫలితంగా ఓ వాహనం ఏ ప్రాంతంలో ఉందనేది స్క్రీన్‌పై గుర్తుల రూపంలో కనిపిస్తుంది. ఫోన్ వచ్చిన ప్రాంతానికి సమీపంలో ఉన్న వాహనానికి వైర్లెస్ సెట్‌తో సమాచారమిచ్చి అటు మళ్లిస్తారు. ఈ వ్యవస్థ ఏర్పాటు, నిర్వహణ కాంట్రాక్టును ఓ సంస్థ దక్కించుకుంది. ప్రయోగాత్మకంగా 4 వాహనాల్లో ఏర్పాటు చేసి సమస్యల్ని అధ్యయనం చేస్తోంది. -
గుంటూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు
గుంటూరు: జిల్లాకు హెలెన్ తుపాను ప్రభావం పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారి శ్రీహరికోట-ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం వున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించిన విషయం తెలిసిందే. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో తీరప్రాంతంలో అలలు భారీ ఎగసిపడే ప్రమాదం ఉందని, గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిజాంపట్నం, సూర్యలంక బీచ్‌లలో అలలు ఎగిసిపడుతున్నాయి. నిజాంపట్నం హార్బర్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీర ప్రాంతాల్లో పర్యవేక్షణకు అధికారులను నియామించారు. గుంటూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం ఫోన్ నంబర్లు: 0863 2234070, 2234301. -
హడలెత్తిస్తున్న హెలెన్
సాక్షి, నెల్లూరు: హెలెన్ తుపాన్ రూపంలో జిల్లాకు ముప్పు ముంచుకొస్తోంది. తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల పై-లీన్ తుపాన్ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో బీభత్సం సృష్టించిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. తుపాన్ శ్రీహరికోట-ఒంగోలు మధ్యలో కావలి వద్ద తీరం దాట నుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణపట్నం పోర్టులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ బుధవారం అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అందరినీ అప్రమత్తం చేశారు. ఇరిగేషన్, హెల్త్, వ్యవసాయశాఖ, ఆర్డబ్ల్యూఎస్, పోలీస్, ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. విపత్తును ఎదుర్కొనేందుకు ఇప్పటికే గుంటూరు జిల్లా రెస్క్యూ టీంలు జిల్లాకు చేరుకున్నాయి. అవసరమైతే మరిన్ని బృందాలను రప్పించేందుకు చర్యలు చేపట్టారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తుపాన్ పరిస్థితిపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కలెక్టర్ శ్రీకాంత్‌తో మాట్లాడారు. నెల్లూరులోని కలెక్టరేట్లో కంట్రోల్ రూం(0861-23311477,1331261) ఏర్పాటయింది. జిల్లా వ్యాప్తంగా 46 కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. కావలి, బోగోలు, అల్లూరు, చిల్లకూరు, అల్లూరు, కోట, వాకాడు, చిట్టమూరు, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు, తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం తదితర మండలాల్లోని తీరగ్రామాల నుంచి 25 వేల మందిని ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రంగం సిద్ధమైంది. భారీవర్షాలు కురిస్తే చెరువులకు గండ్లు పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారులను అలెర్ట్ చేశారు. కావలి డివిజన్ పరిధిలో బలహీనంగా ఉన్న చెరువు కట్టల వద్ద ఇసుకబస్తాలు సిద్ధం చేయాలని అధికారులను ఇరిగేషన్ ఎస్ఈ కోటేశ్వరరావు ఆదేశించారు. మరోవైపు తీరప్రాంతంలో మత్స్యకారులు అప్రమత్తయ్యారు. పడవలు, వలలను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకుంటున్నారు. టెన్షన్..టెన్షన్ తుపాను తీరం దాటే సమయంలో ఈదురుగాలులు 120 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో పూరిళ్లు, రేకులిళ్లలో నివాసం ఉంటున్న వారితో పాటు అరటి, కొబ్బరితోటలు సాగుచేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ఇందుకూరుపేట, కోవూరు, సంగం, బుచ్చిరెడ్డిపాళెం మండలాల్లో వందలాది ఎకరాల్లో అరటిపంట సాగవుతోంది. గాలి తీవ్రతకు అరటిచెట్లు నేలమట్టమయ్యే ప్రమాదమున్నందున ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా రొయ్యల రైతులకు కూడా ముచ్చెమటలు పడుతున్నాయి. వెనామీ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో తీరప్రాంతంలోని వేలాది ఎకరాల్లో రొయ్యలగుంటలు సాగుచేస్తున్నారు. కుండపోత వర్షం కురిస్తే గుంటలు తెగిపోయే ప్రమాదముంది. నీటిలో ఉప్పుశాతం తగ్గిపోయి సమస్యలు ఏర్పడుతాయని పలువురు రైతులు టెన్షన్ పడుతున్నారు. ఇటీవలే నారేతలు వేసుకున్న రైతులను ముంపు భయం వెంటాడుతోంది. -
అప్రమత్తం
=హెలెన్ తుపానుపై ముందస్తు చర్యలు =కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ =తీర మండలాల్లోనే ఉండాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం =పోర్టులో 2వ నంబర్ ప్రమాద సూచిక విశాఖ రూరల్: హెలెన్ ముప్పుతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గత అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలకు సమాయత్తమవుతోంది. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి నుంచి టోల్‌ఫ్రీ నంబర్ 1800-4250-0002ను అందుబాటులో ఉంచారు. వాస్తవానికి ఈ తుపాను గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయానికి ఒంగోలు సమీపంలో తీరం దాటుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ ఇటీవల వచ్చిన అల్పపీడనం మాదిరిగానే దీని గమనం కూడా అంచనాలకు అందడం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావం వల్ల కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. దీంతో ఓడరేవులో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ వెంటనే మండల ప్రత్యేకాధికారులకు, తహశీల్దార్లకు బుధవారం సాయంత్రం ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంతంలోని పది మండలాల్లో ప్రత్యేకాధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తహశీల్దార్లు కూడా అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత గ్రామాల్లో పరిస్థితులను గమనించాలన్నారు. రాత్రి నుంచే అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదు తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని కలెక్టర్ సూచించా రు. అలలు ఎగసిపడతాయని, తీరంలో 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని తెలిపారు. వేటకు వెళ్లిన వారు కూడా వెనక్కి తిరిగి రావాలన్నారు. బోట్లను, వలలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని, ఎటువంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
విశాఖ కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు
విశాఖపట్నంలో భారీ వర్షాల కారణంగా జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదివారం వెల్లడించారు. వర్షాల వల్ల ఎవరికి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1800- 42500002ను సంప్రదించాలని జిల్లా వాసులకు విజ్ఞప్తి చేశారు. అయితే యలమంచిలి కాలువకు గండి పండింది. దాంతో యలమంచిలిలోని పలు ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో స్థానిక ఎమ్మెల్యేలు భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారు. -
కంట్రోల్ రూమ్‌కు 30 కాల్స్
కలెక్టరేట్, న్యూస్‌లైన్: వర్ష బాధితుల సహాయార్థం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి సుమారు 30 మంది రైతులు ఫోన్ చేసి పంట నష్టంపై సమాచారం అందించారు. వరి, పత్తి, మొక్కజొన్న పంటలు నీటిపాలయ్యాయని, అధికారులు ఆదుకోవాలని రైతులు వేడుకున్నట్లు సిబ్బంది తెలిపారు. వెంటనే సంబంధిత తహశీల్దార్లకు సమాచారమందించామని చెప్పారు. తిమ్మాపూర్, మంథని, కమాన్‌పూర్, ధర్మారం, రామడుగు, చిగురుమామిడి, గంగాధర, పెద్దపల్లి, కోహెడ, జమ్మికుంట, కొడిమ్యాల తదితర మండలాల నుంచి ఎక్కువ ఫోన్లు వచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని నమోదు చేయడం, వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించేందుకు సూచనలు చేయడం, ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసే లక్ష్యంతో కలెక్టరేట్లో గురువారం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ప్రకటించినప్పటి నుంచి సదరు ఫోన్ మూగబోయింది. గురువారం అక్కడ పని చేస్తున్న సిబ్బంది కూడా ఈ విషయాన్ని గమనించలేదు. ఫోన్లు రావడం లేదని తీరిగ్గా కూర్చుండి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం తేరుకుని బీఎస్ఎన్ఎల్ వారికి సమాచారమిచ్చి మరమ్మతు చేయించారు. 24 గంటలు పనిచేసే ఈ కంట్రోల్ రూమ్‌లో మూడు షిప్టుల్లో ఇద్దరు చొప్పున రెవెన్యూ సిబ్బంది పనిచేస్తున్నారు. ఫోన్ చేసిన బాధితుల నుంచి పేరు, చిరునామా, సమస్య తెలుసుకుని నమోదు చేసుకుంటున్నారు. ఆ వివరాలను సంబంధిత తహశీల్దార్‌కు తెలియజేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టింపులేక ఉన్నతాధికారులకు చెప్పుకోవాలనుకున్న రైతులు తిరిగి అక్కడి అధికారులనే సంప్రదించాల్సిన పరిస్థితి వస్తోంది. -
మహబూబ్‌నగర్ కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు
భారీ వర్షాలు మహబూబ్‌నగర్ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. దాంతో జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా ఉన్నతాధికారులు శుక్రవారం వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా ఎవరికి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన వెంటనే 0854 2024 4519కు ఫోన్ చేయాలని జిల్లా ఉన్నతాధికారులు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దాదాపు 300 ఇళ్లు నేల మట్టం అయ్యాయి. జిల్లాలోని అన్నివాగులు, వంకలు వర్షపు నీటితో పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా దాదాపు 2 లక్షల ఎకరాల్లో పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. అలాగే 50 వేల ఎకరాల్లో వరి పంట పూర్తిగా నీట మునిగింది. -
తుఫాన్ టెన్షన్, అప్రమత్తమైన అధికార యంత్రాంగం
జిల్లాకు ‘ఫైలిన్’ తుఫాన్ హెచ్చరిక రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలియజేయడంతో యంత్రాంగం వీటిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమైంది. ప్రకాశం భవనంలోని కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ 08592-281400,ట్రోల్ ఫ్రీనెం. 1044ను ఏర్పాటు చేశారు. జిల్లాలోని 11 తీరప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించేందుకు వీలుగా ప్రత్యేకాధికారులను నియమించారు. బుధవారం రాత్రికే తమకు కేటాయించిన మండలాలకు చేరుకొని పరిస్థితులను అంచనా వేయాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఆదేశాలు జారీ చేశారు. రానున్న 48 గంటల్లో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని కోరారు. ఇప్పటికే వేట సాగిస్తున్న మత్స్యకారులు వెంటనే తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్టణంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం 1వ ప్రమాద హెచ్చరిక , కృష్ణాపట్నం నుంచి 2వ ప్రమాద హెచ్చరిక విడుదల చేశాయి. ఉధృతంగా సముద్రం వాయుగుండం తుఫాన్‌గా మారడంతో సముద్రతీరం ఉధృతంగా ఉంది. ప్రస్తుతం గంటకు 40 నుంచి 60 కి.మీ. మేర గాలులు వీస్తున్నాయి. గురువారం ఉదయం నాటికి 100 కి.మీ. మేర గాలులు వీచే అవకాశాలున్నాయి. రాత్రి 8 గంటల నాటికి గాలుల తీవ్రత 150 కి.మీ.కు, శుక్రవారం ఉదయం నాటికి 175 కి.మీ. మేర పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మండలాలకు నియమించిన స్పెషల్ ఆఫీసర్లు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. జిల్లాకు ప్రత్యేకాధికారి:తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాకు ప్రత్యేకాధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జిల్లా కలెక్టర్‌గా పని చేసిన కరికాలవళవన్ను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించిం ది. స్పెషల్ ఆఫీసర్ గురువారం జిల్లాకు చేరుకోనున్నారు. తుఫాన్ తీవ్రత సద్దుమణిగే వరకు ఆయన ఇక్కడే ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధి కారులను అప్రమత్తం చేయనున్నారు. -
ఫైలిన్ తుపానుపై అప్రమత్తం
* తుపానుకు ముందస్తు చర్యలు * కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు * టోల్ ఫ్రీ నంబర్ 1800-4250-0002 * ప్రతి మండలానికి ప్రత్యేకాధికారి నియామకం విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ కేంద్రం నుంచి బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌కు సమాచారం అందింది. దీంతో అధికారులను కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌లు అప్రమత్తం చేశారు. కలెక్టరేట్లో డిప్యూటీ తహశీల్దార్ నేతృత్వంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి నుంచి టోల్ ఫ్రీ నంబర్ 1800-4250-0002ను అందుబాటులో ఉంచారు. అర్ధరాత్రి నుంచే అన్ని చర్యలు చేపట్టాలని, జిల్లాలో ఉన్న అన్ని పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అధికారులు, ఉద్యోగులందరూ సమైక్యాంధ్ర కోసం సమ్మెలో ఉన్నారు. కానీ సమ్మెలో ఉంటూనే అత్యవసర సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. వీరితో పాటు మండలాధికారులు, వీఆర్వోలు, ఇతర ఉద్యోగులు అందుబాటులో ఉండాలని బుధవారం సాయంత్రం నుంచి అధికారులు సమాచారమందిస్తున్నారు. గత ఏడాదిలో వచ్చిన నీలం తుపాను కారణంగా జిల్లాలో చాలా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పంటలు, ఆస్తి నష్టం తీవ్రంగా జరిగింది. కేవలం గ్రామాల్లోనే కాకుండా నగరంలో కూడా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ‘న్యూస్‌లైన్’ చెప్పారు. నగరంలో కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అవసరమైన అత్యవసర సామగ్రిని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. నేడు అత్యవసర సమావేశం తుపాను హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ సాల్మర్ ఆరోఖ్యరాజ్ గురువారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లో మండలాధికారులు, తహశీల్దార్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు. మండలాల వారీగా ప్రత్యేకాధికారులను నియమించనున్నారు. మైదాన ప్రాంతాల్లోనే కాకుండా ఏజెన్సీలో కూడా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి స్థానికులను సురక్షిత ప్రాంతలకు తరలించేందుకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేయాలని ఆర్డీఓలను ఇప్పటికే ఆదేశించారు. -
42 చోట్ల విద్యుత్ అంతరాయం
విశాఖపట్నం, న్యూస్‌లైన్: వినియోగదారుడు: సార్ నేను అడ్డురోడ్డు దగ్గరున్న కొరుప్రోలు నుంచి అప్పలనాయుడ్ని మాట్లాడుతున్నాను. నిన్న అర్ధరాత్రి నుంచి మా ఊర్లో కరెంట్ లేదు. రాత్రి నుంచి ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎవరూ ఎత్తలేదు. ఉదయాన్నే కరెంట్ ఆఫీస్‌కు వెళ్తే అక్కడ ఎవరూ లేరు. కంట్రోల్ రూం సిబ్బంది: ఒక ఏఈ గార్ని మీ ఊరికి, దేవరాపల్లికి ప్రత్యేకంగా పంపించాం. ఈ ఊర్లోనే పెద్ద సమస్య తలెత్తింది. అందుకే ఈ ఊరు గుండా వెళ్లే లైన్ల ద్వారా సరఫరా నిలిచిపోయింది. కరెంట్ మాత్రం ఎప్పుడొస్తుందో చెప్పలేం గానీ త్వరలోనే ఇచ్చేస్తాం... ఇదీ జిల్లాలో కరెంట్ పరిస్థితి. పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి అంధకారం నెలకొంది. ఎప్పుడొస్తుందో తెలియని వినియోగదారులు కరెంట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 42 చోట్ల విద్యుత్ లైన్లు తెగిపోయాయి. విద్యు త్ ఉద్యోగుల సమ్మెతో కోటవురట్ల మండలంతోపాటు నర్సీపట్నం, నాతవరం మండలాల్లోని గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి. కోట వురట్ల మండలం పాములవాకలో 33 కె.వి సబ్‌స్టేషన్ ఉంది. దీని పరిధిలోని ఆక్సాహేబుపేట, వేములపూడి ఫీడర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ కారణంగా నాతవరం మండల చెర్లోపాలెం, కోటవురట్ల మండలం రామన్నపాలెం, పి.కె.పల్లి, చినబొడ్డేపల్లి, ఆర్.కొత్తూరు, కె.కొత్తూరు, బోడపాలెం, నర్సీపట్నం మండ లం అమలాపురం, దుగ్గాడ, బంగారయ్యపేట, యరకన్నపాలం, వేములపూడి గ్రామాల్లో గురువారం సాయంత్రం 4 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇలా 13 గ్రామాల్లో అంధకారం అలుముకుంది. విద్యుత్ సమస్య తో చినబొడ్డేపల్లి, కె.కొత్తూరు, ఆర్.కొత్తూరు, బోడపాలెం, పి.కె.పల్లి, రామన్నపాలెం తదితర గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు పనిచేయక ఆయా గ్రామాల వారు ఇబ్బంది పడుతున్నారు. ఎస్.రాయవరం మండలం కొరుప్రో లు సబ్ స్టేషన్లో బ్రేక్‌డౌన్‌తో దాని పరిధిలోని18 గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ప్రజలు ఇబ్బందికి గురయ్యారు. ప్రైవేటు వారితో శుక్రవారం పునరుద్ధరించడంతో కొందరు ఊపిరి పీల్చుకున్నారు. సిబ్బంది సమ్మె కారణంగా నర్సీపట్నంలో గురువారం రాత్రి 7 గంటలకు సరఫరా నిలిచిపోయింది. ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో పునరుద్ధరణ కాలేదు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధి లో 148గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. మరో 150 గ్రామాల్లో తరచూ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఆయా ప్రాంతాల నుం చి తరచూ ఫిర్యాదులు నమోదవుతున్నాయి. అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్న సమస్యలే..! జిల్లా వ్యాప్తంగా పలు ఫిర్యాదుల్లో వచ్చేవన్నీ చిన్నచిన్న సమస్యలే. ఫ్యూజ్‌ను సరి చేస్తే అనేక గ్రామాలకు విద్యుత్‌ను పునరుద్ధరించవచ్చు. కానీ ఆ పని చేసేందుకు కూ డా సిబ్బంది లేకపోవడంతో గ్రామాలకు గ్రామాలు అం దకారంలోనే మగ్గుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్లు పేలిన సం ఘటనలు రెండు మూడు చోట్ల మాత్రమే ఉన్నాయి. వా టిని మార్పు చేసేందుకు కాస్త సమయం పడుతుంది. కానీ గ్రామాల్లో ఫ్యూజ్ ను సరి చేయడానికి కూడా ఉద్యోగు లు ముం దుకు రాకపోవడంతో సమస్య జఠిలంగా ఉం ది. సమైక్యాంధ్ర కోసం సమ్మె చేస్తున్న విద్యుత్ ఉద్యోగులు ఆదివారం నుంచి విధుల్లో చేరనున్నారు. ఆ రోజు ఉదయం మొబైల్ సిమ్‌లను తిరిగి స్వాధీనం చేసుకుని విధుల్లో చేరతారు. -
కడపలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
జిల్లా కలెక్టరేట్లో వరద సహాయక చర్యల్లో భాగంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ బుధవారం కడపలో వెల్లడించారు. అందులో భాగంగా 08562- 246344 ఫోన్ నెంబర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అత్యవసర సేవల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1077ను కూడా ఏర్పాటు చేశామన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ రోజు ఉదయం ముద్దునూరు మండలం కలమలలోని కృష్ణా నగర్వంక పొంగిపొర్లుతుంది. దాంతో ఆ నీటి ప్రవాహంలో పడి ఓ మహిళ మృతి చెందగా, మరో మహిళ గల్లంతైంది. అలాగే చన్నమండం మండలంలో కూడా వరదలు పోటెత్తాయి. దాంతో మాండవ్య నదీలోని నీటి ప్రవాహ వేగం మరింత ఉధృతంగా మారింది. దాంతో రహదారులు ఎక్కడికక్కడ తెగిపోయాయి. జిల్లాలోని శ్రీనివాస రిజర్వాయర్‌లో వరద నీరు భారీగా చేరింది. దాంతో ఆ ప్రాజెక్టు సమీపంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. దీంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ నేపథ్యంలో ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. -
హెచ్‌పీసీఎల్ బాధితుల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు
నగరంలోని హెచ్‌పీసీఎల్ సంస్థకు చెందిన రిఫైనరీలో నిన్న సాయంత్రం చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ శనివారం సందర్శించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆ సంస్థ ఉన్నతాధికారులనడిగి తెలుసుకున్నారు. హెచ్‌పీసీఎల్ ప్రమాద ఘటన వివరాలకు సంబంధించి విశాఖపట్నంలోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఆ ప్రమాద ఘటనలో మరణించిన, గాయపడిన వారి వివరాల కోసం ఈ ఫోన్ నెంబర్180042500002 ఫోన్ చేయాలని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన మృతుల సంఖ్య శనివారం ఉదయానికి నాలుగుకు చేరింది. అయితే ఆ ప్రమాదంలో గాయపడి నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 36 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.