భారీ వర్షాలు మహబూబ్నగర్ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. దాంతో జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా ఉన్నతాధికారులు శుక్రవారం వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా ఎవరికి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన వెంటనే 0854 2024 4519కు ఫోన్ చేయాలని జిల్లా ఉన్నతాధికారులు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దాదాపు 300 ఇళ్లు నేల మట్టం అయ్యాయి. జిల్లాలోని అన్నివాగులు, వంకలు వర్షపు నీటితో పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా దాదాపు 2 లక్షల ఎకరాల్లో పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. అలాగే 50 వేల ఎకరాల్లో వరి పంట పూర్తిగా నీట మునిగింది.