గుంటూరు: హుదూద్ తుపాన్ నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. జిల్లాలో తుపాన్ వల్ల ఎక్కడ ఎటువంటి విపత్తు సంభవించిన 0863 -2234070, 2234301 నెంబర్లకు ఫోన్ చేయాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం జిల్లా ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ కాంతిలాల్ దండే సమీక్ష నిర్వహించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించారు. నిజాంపట్నం ఓడరేవులో 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.