Guntur District Collector
-
కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: చట్ట ప్రకారం నడుచుకుంటామని కోర్టుకు చెప్పి, అందుకు విరుద్ధంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం భవనాన్ని కూల్చివేయడంపై ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ కార్యాలయం కూల్చివేతకు బాధ్యులైన సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మంగళగిరి, తాడేపల్లి మునిసిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్‌పై కోర్టు ధిక్కరణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. వైఎస్సార్సీపీ తరఫున పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎం.శేషగిరిరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.చట్ట ప్రకారం నడుచుకోమని కోర్టు ఆదేశించినా.. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం భవనాన్ని కూల్చివేసేందుకు మునిసిపల్ కమిషనర్ జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా వైఎస్సార్సీపీ భవనం విషయంలో చట్ట ప్రకారమే నడుచుకుంటామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు.దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఆ భవనం కూల్చివేత విషయంలో తదుపరి చర్యలు చేపట్టే ముందు చట్ట ప్రకారం నడుచుకోవాలని సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మునిసిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్‌ను ఆదేశిస్తూ ఈ నెల 21న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను వైఎస్సార్సీపీ తరఫు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి లిఖితపూర్వకంగా సీఆర్డీఏ కమిషనర్, మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆ మరుసటి రోజు తెల్లారి 5 గంటల సమయంలో పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కూల్చేశారు.కోర్టు ఆదేశాలను ధిక్కరించి పార్టీ భవనాన్ని కూల్చివేసినందుకు కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ తాజాగా వైఎస్సార్సీపీ పిటిషన్ దాఖలు చేసింది. అధికారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ఆ పిటిషన్లో పేర్కొంది. తాము ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకోకుండా, దానిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా ఏకపక్షంగా పార్టీ కార్యాలయాన్ని కూల్చేశారంది. ఇది కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.రాజకీయ నాయకులతో చేతులు కలిపిన ఈ ఇద్దరు అధికారులు రాజకీయ దురుద్దేశంతోనే ఏకపక్షంగా, దౌర్జన్యపూరితంగా తమ కార్యాలయాన్ని కూల్చేశారని తెలిపింది. వాస్తవానికి సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమం తరువాత ఎలాంటి కూల్చివేతలు చేపట్టడానికి వీల్లేదని ఇదే హైకోర్టు గతంలో తీర్పునిచ్చిందని తెలిపింది. కోర్టు ఆదేశాలంటే అధికారులకు లెక్క లేదని, ఇష్టానుసారం వ్యవహరించారని, వారి చర్యలను తీవ్రంగా పరిగణించాలని కోరింది. కూల్చివేత విషయంలో అధికారుల హడావుడిని గమనిస్తే వారి దురుద్దేశాలు అర్థమవుతాయంది. వారి చర్యలు కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తాయంది. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు వారిని శిక్షించాలని హైకోర్టును కోరింది.క్రిమినల్ చర్యలు కూడా..!ఇదిలా ఉండగా.. పార్టీ కార్యాలయాన్ని ఏకపక్షంగా, దురుద్దేశపూర్వకంగా కూల్చివేసినందుకు కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్‌పై క్రిమినల్ చర్యలకు సైతం వైఎస్సార్సీపీ సిద్ధమవుతోంది. వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయనుంది. -
కల్తీరాయుళ్లపై దాడులు నిరంతరం
గుంటూరు వెస్ట్: కల్తీ వ్యాపారుల లీలలు చూస్తుంటే తీవ్ర ఆందోళన కలుగుతోందని.. వీరిపై దాడులను గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు నిరంతరం జరపాలని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. కల్తీ వ్యాపారుల వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించవద్దన్నారు. గత సోమవారం ‘సాక్షి’లో ‘ఆహారం.. హాహాకారం’ శీర్షికతో వచ్చిన కథనం ఆధారంగా జిల్లా అధికారులు నాలుగు రోజులుగా వ్యాపార సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లపై పెద్దఎత్తున దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. శనివారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి జాయింట్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నమూనాలు సేకరించడం, పరీక్షలకు పంపడం తదితర అంశాలు వేగంగా చేపట్టాలన్నారు. కల్తీ ఉన్నట్లు తేలితే 6 నెలలు జైలుశిక్ష, రూ.5 లక్షలు జరిమానా విధిస్తారని కల్తీరాయుళ్లకు చెప్పాలన్నారు. వ్యాపారులకు కూడా చట్టంపట్ల అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కల్తీ వ్యాపారులను పట్టించాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఎవరైనా 1902 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేస్తే అధికారులు తక్షణం స్పందించాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న అధికారులపై కలెక్టర్ మండిపడ్డారు. ప్రజలకు ఎంతో ముఖ్యమైన ఆహార వస్తువులు కల్తీ జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటారని ప్రశ్నించారు. కఠినంగా వ్యవహరిస్తున్నాం కాగా, సమావేశంలో వివిధ శాఖల అధికారులు తాము చేపడుతున్న చర్యలను పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. ఇప్పటివరకు 124 వ్యాపార సంస్థలను తనిఖీచేసి 16 సంస్థలను సీజ్ చేశామన్నారు. 87 సంస్థల్లో శాంపిల్స్ సేకరించామన్నారు. కొన్ని శాఖల మధ్య సమన్వయ లోపం కూడా అక్రమార్కులు విజృంభించడానికి కారణమని, సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి.ప్రశాంతి, తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పద్మశ్రీ, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గౌస్ మొహిద్దీన్, పశుసంవర్థక శాఖ సంచాలకులు డాక్టర్ చిన్నయ్య , జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మహాసంకల్పం వ్యయం రూ.3.05 కోట్లు
-
బాబు గారి స్నానం చాలాకాస్ట్లీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పర్యటనలు, కార్యక్రమాల ఖర్చు చూస్తే అధికార యంత్రాంగానికి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. కేవలం వేల రూపాయలు ఖర్చయ్యే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు రూ.లక్షలు వెచ్చిస్తుండడం గమనార్హం. ఏ కార్యక్రమాన్నెనా ఒక మెగా ఈవెంట్ తరహాలో నిర్వహించి, భారీగా ప్రచారం పొందాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని, అందుకే ఖర్చు విపరీతంగా పెరిగిపోతోందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. చంద్రబాబు కార్యక్రమాల ఖర్చు ఒక్కోసారి లక్షలు దాటిపోయి కోట్ల రూపాయలకు చేరుతోంది. ఒక్క గుంటూరు జిల్లాలోనే ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సదస్సులు తదితర కార్యక్రమాలకు ఏకంగా రూ.18,26,73,821 ఖర్చు చేశారు. ఈ బిల్లులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కార్యక్రమాల ఏర్పాట్లు చేసిన ఏజెన్సీలు జిల్లా కలెక్టర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో సంబంధిత శాఖలు కూడా నిధులను విడుదల చేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కార్యక్రమాల ఖర్చులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను చెల్లించడానికి తక్షణమే నిధులు విడుదల చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా చంద్రబాబు స్నానం ఏర్పాట్ల కోసం రూ.2,41,91,500 ఖర్చయిందని, ఈ బిల్లు 2016 నుంచి పెండింగ్‌లో ఉందని లేఖలో స్పష్టం చేశారు. కేవలం ఒక్క గుంటూరు జిల్లాలోనే చంద్రబాబు కార్యక్రమాల ఖర్చు ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇంకెంత వ్యయం చేశారో చూస్తే గుండె గుబిల్లుమనడం ఖాయం. -
గుంటూరు కమిషనర్‌గా అనురాధ
♦ ఉన్నతాధికారుల ఉత్తర్వులు ♦ రెండు నెలలుగా ఇన్చార్జిగా కొనసాగుతున్న వైనం ♦ ఎట్టకేలకు పూర్తిస్థాయిలో నియామకం సాక్షి, గుంటూరు : గుంటూరు నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్‌గా మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ సి.అనురాధను నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.కరికాల వలవన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు కమిషనర్‌గా పనిచేసిన నాగలక్ష్మి ఈ ఏడాది మే నాలుగో తేదీన ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో గుంటూరు ఆర్డీ అనురాధకు ఫుల్ అడిషనల్ చార్జి ఇచ్చి ఇన్చార్జి కమిషనర్‌గా నియమించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిని నియమిస్తారనే వాదనలు వినిపించినప్పటికీ తాజాగా అనురాధను కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పుకార్లకు తెర పడింది. అనురాధకు 2015లో ఐదు నెలలపాటు గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన అనుభవంతో పాటు, మూడేళ్లుగా ఆర్డీగా పనిచేస్తుండటంతో నగరపాలక సంస్థపై పూర్తి అవగాహన ఉంది. నగరాభివృద్ధికి కృషి చేస్తా... అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో గుంటూరు నగరాభివృద్ధికి కృషి చేస్తానని అనురాధ చెప్పారు. తనపై నమ్మకంతో కమిషనర్‌గా నియమించిన ఉన్నతాధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నగర ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. మున్సిపల్ ఇన్చార్జి ఆర్డీగా రమణి గుంటూరు మున్సిపల్ ఆర్డీగా పనిచేస్తున్న చల్లా అనురాధను కమిషనర్‌గా నియమించడంతో ఏపీఎండీపీ ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఏవీ రమణికి ఇన్చార్జి ఆర్డీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. గ్రేడ్–3 మున్సిపల్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్న డి.మేరీగోల్డ్ డైమండ్‌ను గుంటూరు మెప్మా అసిస్టెంట్ డైరెక్టర్‌గా నియమించారు. -
కలెక్టర్‌ను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు
-
బకెట్లో పెట్రోల్ పోస్తుండగా అంటుకున్న మంటలు
-
కలెక్టరేట్ సమీపంలో అగ్నిప్రమాదం
-
కలెక్టరేట్ సమీపంలో అగ్నిప్రమాదం
గుంటూరు: గుంటూరు కలెక్టరేట్ సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్‌లో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించి పెట్రోల్ బంక్ పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే పెట్రోల్ బంక్ పూర్తిగా దగ్ధమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
డీఎస్పీ, సీఐలకు నోటీసులు
హిందూపురం అర్బన్ : హిందూపురం ముక్కిడిపేట అలీస్ట్రీట్లో నివాసముంటున్న షబానాబేగం అనే మహిళ వన్‌టౌన్ పోలీస్‌స్టేçÙన్లో సమాచారం కోరింది. అయితే వారు ఇవ్వలేదు. దీంతో రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్‌కు ఆమె అప్పీల్ చేసుకుంది. ఈ క్రమంలో డీఎస్పీ, సీఐలను వివరణ కోరుతూ గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం హాజరు కావాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు బాధితురాలు పేర్కొన్నారు. వివరాలు.. 2014లో షబానాబేగంపై ఆమె భర్త షకీబ్ అహమ్మద్ దాడి చేసి అప్పటి మూడేళ్ల కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లారని వన్‌టౌన్ పోలీసులకు రిజిస్ట్రర్ పోస్టు ద్వారా ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కోరుతూ 2016 మే 9న వన్‌టౌన్ సీఐ పేరిట సమాచారం హక్కు చట్టం ద్వారా కోరింది. అయితే వారు సరైన సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆమె తిరిగి రెండో అప్పీల్æకింద డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆ అప్పీల్‌ను డీఎస్పీ తోసిపుచ్చడంతో తాను రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశానని ఆమె చెప్పింది. ఈ మేరకు కమిషనర్ కేసును పరిశీలించి తనతో పాటు డీఎస్పీ, సీఐలకు వివరణ కోరుతూ సోమవారం (26వ తేదీ) గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. -
రోహిత్ వేముల దళితుడే
గుంటూరు కలెక్టర్ ధ్రువీకరణ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో జనవరి 17న ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల దళితుడేనని గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే ధ్రువీకరించారు. నేషనల్ కమిషన్‌కు సమర్పించిన నివేదికతో రోహిత్ ఎస్సీ మాల కులస్తుడని పేర్కొన్నారు. దీంతో రోహిత్ బీసీ అనే వాదనకు తెరపడింది. వర్సిటీ యాజమాన్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు రోహిత్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే. రోహిత్‌తో సహా నలుగురు విద్యార్థుల వెలివేత, అనంతరం రోహిత్ ఆత్మహత్య యావత్ దేశాన్నే కుదిపేసింది. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ అప్పారావు, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, మంత్రి స్మృతి ఇరానీల జోక్యం వల్లే తన కుమారుడు రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ అతడి తల్లి రాధిక ఫిర్యాదు చేయడంతో వారిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అయితే రోహిత్ తండ్రి బీసీ(వడ్డెర) కనుక అతని కులమే రోహిత్ కులమని నమ్మించేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. పిల్లల పెంపకంలో కానీ, వారి విద్యాబుద్ధుల విషయంలోగానీ, చివరకు కుటుంబం గురించి గానీ ఎటువంటి బాధ్యతలు నెరవేర్చని రోహిత్ తండ్రి కులం కాక, రోహిత్ తల్లి రాధిక కులమే రోహిత్‌కి చెందినట్టు ఆధారాలతో సహా నిరూపించడం కేసులో కీలక మలుపుగా భావించొచ్చు. గుంటూరు తహసీల్దారు రిపోర్టు ఆధారంగా రోహిత్ కులాన్ని కలె క్టర్ ధ్రువీకరించారు. ఇది విద్యార్థుల ఐక్యపోరాటాల ఫలితమని, రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్టు చేయాలని హెచ్‌సీయూ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ప్రశాంత్, మున్నా, వెంకటేశ్ చౌహాన్,అర్పిత అన్నారు. -
రేపు వైఎస్సార్ సీపీ ధర్నా
♦ సర్కారు వైఫల్యాలపై గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరసన ♦ రైతుకు మద్దతుగా ఆందోళన ♦ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావాలి ♦ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పట్నంబజారు(గుంటూరు) : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేర కు గుంటూరులోని కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఆయా విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ అసమర్థత, ఖరీఫ్ తరుణంలో రైతులను ఆదుకోవడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించకపోవడం, కేంద్రంలో వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధరను పెంచడంలో కృషి చేయలేకపోవడం, ఎరువులు, విత్తనాలు సరఫరా చేయలేకపోవడం, రుణాలు సకాలంలో అందకపోవడం వంటి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఈ ధర్నా నిర్వహిస్తున్నట్టు మర్రి రాజశేఖర్ తెలిపారు. ప్రస్తుత కాలంలో రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రైతుల సమస్యలను పక్కన పెట్టి ‘ఓటుకు కోట్లు’ కేసులో మునిగిపోయారని, పరిపాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కనీసం రైతులకు విత్తనాలు, ఎరువులు అందజే సేందుకు దృష్టి సారించకపోవడం సిగ్గుచేటన్నారు. గత సంవత్సరం పండించిన పంట అమ్ముడుపోక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం గురించి మాట్లాడకుండా తక్కిన పనికిరాని విషయాలన్నీ చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు చెప్పిన అబద్ధపు మాటలు నమ్మి ఓట్లు వేసిన రైతులకు వెన్నుపోట్లు పొడుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుదన్నారు. రైతుల సమస్యల కోసం చేపడుతున్న ధర్నా కార్యక్రమంలో పార్టీలోని ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని కోరారు. విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పీఆర్కే పిలుపు మాచర్లటౌన్ : వైఎస్సార్ సీపీ చేపడుతున్న ధర్నాను విజయవంతం చేయాలని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, తెలుగుదేశం ప్రభుత్వం కాలం వెళ్లదీస్తూ ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. -
యువత భవిత కోసమే శివాజీ ఆమరణ దీక్ష
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ సినీ నటుడు శివాజీ ఆదివారం గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహర దీక్షను చేపట్టారు. శివాజీ చేపట్టిన దీక్షకు మాల మహనాడు, గిరిజన సమాఖ్య విద్యార్థి నేతలతోపాటు పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. శివాజీ చేపట్టిన దీక్ష స్థలి వద్దకు స్థానికులతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర విభజన జరిగి ఏడాదైనా ఇప్పటి వరకు ఆంధ్ర్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను ప్రకటించలేదు. అదికాక ప్రత్యేక హోదా సాథ్యం కాదంటూ పలువురు మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో శివాజీ ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్షకు దిగారు. -
యువత భవిత కోసమే దీక్ష: నటుడు శివాజీ
గుంటూరు: రాష్ట్ర యువత భవితే లక్ష్యంగా ప్రత్యేక హోదా కోసం దీక్ష చేపడుతున్నట్టు సినీనటుడు శివాజీ తెలిపారు. ఏపీకి ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతూ 48 గంటల దీక్షను ఆయన గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆదివారం ప్రారంభించారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ శివాజీ మెడలో పూల మాలవేసి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ... జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఉద్యమంలో కలసి రావాలని కోరారు. తాను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చానని, ఆంధ్ర ప్రేక్షకుల అభిమానంతోనే ఇంతటి వాడినయ్యానని ఆ రుణం తీర్చుకోవటానికే ఈ ఉద్యమం చేపట్టానని చెప్పారు. ఎన్నికల సమయంలో పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రకటించిన బీజేపీ జాతీయ నాయకులు నేడు లేనిపోని సాకులు చూపించడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధులు సైతం దీనిపై నోరుమెదపకపోవడం దారుణమని విమర్శించారు. బాబు వస్తే జాబు వస్తుందన్న టీడీపీ నాయకులు నేడు కేంద్ర ప్రభుత్వంలో ఉండి ప్రత్యేక ప్రతిపత్తి కోసం ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు విదేశాలు తిరుగుతున్నారని... అక్కడి వారు రాయితీలు కోరుతున్నారనీ, ప్రత్యేక హోదా లేకుండా రాయితీలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తాను ఈ ఉద్యమం చేస్తున్నందుకు బీజేపీ తనను బహిష్కరించినా సంతోషమేనని స్పష్టం చేశారు. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ మిజోరాం, అసోం, జార్ఖండ్ రాష్ట్రాలకు ఏ ప్రాతిపదికన ప్రత్యేక హోదా కల్పించారో ఆ అర్హతలన్నీ మన రాష్ట్రానికి ఉన్నాయన్నారు. శివాజీ ప్రాణాలు పోకముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరారు. దీక్షకు మాలమహానాడు, అమ్ఆద్మీ పార్టీ, యువజన కాంగ్రెస్, నవతరం పార్టీ నాయకులు, పలువురు విద్యార్థులు మద్దతు తెలిపారు. -
‘అప్పు రేపు’ చందంగా రుణమాఫీ
రాష్ట్రంలో రుణమాఫీ అంశం ‘అప్పు రేపు’ చందంగా మారిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి వాగ్దానాలకు మోసపోయిన ప్రజల పక్షాన నిలబడి వైఎస్సార్సీపీ శుక్రవారం చేస్తున్న మహాధర్నాకు ముఖ్యంగా రైతులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలు గుంటూరు కలెక్టరేట్‌కు తరలిరావాలని ఆయనతోపాటు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. గుంటూరు సిటీ: రాష్ట్రంలో రుణమాఫీ అంశం ‘అప్పు రేపు’ చందంగా మారిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. రుణమాఫీ సాధ్యం కాదని తెలి సినా, అలా చెప్పకుండా ప్రభుత్వం కప్పదాటు ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. మంగళవారం గుంటూరు అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ ముఖ్య నేతలు, సమన్వయకర్తల సమావేశం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు మ ర్రి రాజశేఖర్ అధ్యక్షత వహించగా తొలుత అంబటి మాట్లాడారు. రుణమాఫీపై రైతులకు మొదట్లో ఉన్న భ్రమలు కూడా పూర్తిగా తొలగిపోయాయని అంబటి అన్నారు. రుణమాఫీ ‘జరిగేదీ లేదు - చచ్చేదీ లేదు’ అన్న సంగతి అందరికీ తెలిసిపోయిందన్నారు. ఈ ప్రభుత్వమే మాఫీ అయిపోతే పీడా వదిలిపోతుందనే కసిలో ప్రజలంతా ఉన్నారని అన్నారు. మోసపోయిన ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ నిలబడి పోరాటం చేయాల్సిన అవసరాన్ని గుర్తించి పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మూడు అంచెల ఆందోళనా కార్యక్రమాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. తొలి విడత మండల కార్యాలయాలు, మలి విడతగా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, చివరగా తూర్పు గోదావరి జిల్లాలో రెండు రోజుల పాటు నిరాహారదీక్ష కార్యక్రమాన్ని ఆయన రూపొందించారన్నారు. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా శుక్రవారం గుంటూరులోని కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ, ఎన్నికల తర్వాత జిల్లా స్థాయిలో జరుగుతున్న మొట్ట మొదటి ఆందోళనా కార్యక్రమం ఇదేనన్నారు. తెలుగు దేశం ప్రభుత్వ ఆరు మాసాల పాలనలోనే ఇటు రైతులు అటు అన్ని వర్గాల ప్రజలు విసుగెత్తి పోయి ఉన్నారన్నారు. గ్రామాల అభివృద్ధికి వస్తున్న కేంద్ర నిధులను కూడా తెలుగుదేశం ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని మర్రి రాజశేఖర్ ఆరోపించారు. 5వ తేదీన కలెక్టరేట్ ఎదుట జరగనున్న మహాధర్నాను జయప్రదం చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు. గురజాల మాజీ ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, అధికారంలో లేమన్న నిరాశా నిస్పృహలను పక్కనబెట్టి, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతు సమస్యలపై రాజీలేని పోరాటం చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ, అమలు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన బాబు అన్ని రంగాల్లో విఫలమయ్యారని ఆరోపించారు.పార్టీ రాష్ట్ర కార్యదర్శి, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, ప్రజా సమస్యలు గాలికొదిలేసి పచ్చ చొక్కాల జేబులు నింపే కార్యక్రమంలో తెలుగు దేశం ప్రభుత్వం తల మునకలై ఉందని ఆరోపించారు. మహాధర్నాకు గుంటూరు నగరం నుంచి పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వెల్లడి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాపరిషత్‌లో వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ దేవళ్ళ రేవతి, తాడికొండ, తెనాలి, వేమూరు, పెదకూరపాడు నియోజకవర్గాల పార్టీ సమన్వయ కర్తలు కత్తెర క్రి స్టీనా, శివకుమార్, మేరుగ నాగార్జున, హనిమిరెడ్డి తదితరులు మాట్లాడుతూ చంద్రబాబుకు స్వయంగా తాను చేసిన హామీల మీదే స్పష్టత లేదనీ, పథకాల అమల్లో కూడా చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. సమావేశంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ ముస్తఫా, జిల్లాలోని వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జిల్లా సేవాదళ్ చైర్మన్ కొత్త చిన్నపరెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ సయ్యద్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
గుంటూరు: హుదూద్ తుపాన్ నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. జిల్లాలో తుపాన్ వల్ల ఎక్కడ ఎటువంటి విపత్తు సంభవించిన 0863 -2234070, 2234301 నెంబర్లకు ఫోన్ చేయాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జిల్లా ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ కాంతిలాల్ దండే సమీక్ష నిర్వహించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించారు. నిజాంపట్నం ఓడరేవులో 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. -
గుంటూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు
గుంటూరు: జిల్లాకు హెలెన్ తుపాను ప్రభావం పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారి శ్రీహరికోట-ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం వున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించిన విషయం తెలిసిందే. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో తీరప్రాంతంలో అలలు భారీ ఎగసిపడే ప్రమాదం ఉందని, గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిజాంపట్నం, సూర్యలంక బీచ్‌లలో అలలు ఎగిసిపడుతున్నాయి. నిజాంపట్నం హార్బర్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీర ప్రాంతాల్లో పర్యవేక్షణకు అధికారులను నియామించారు. గుంటూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం ఫోన్ నంబర్లు: 0863 2234070, 2234301.