
యువత భవిత కోసమే శివాజీ ఆమరణ దీక్ష
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ సినీ నటుడు శివాజీ ఆదివారం గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహర దీక్షను చేపట్టారు. శివాజీ చేపట్టిన దీక్షకు మాల మహనాడు, గిరిజన సమాఖ్య విద్యార్థి నేతలతోపాటు పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. శివాజీ చేపట్టిన దీక్ష స్థలి వద్దకు స్థానికులతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
రాష్ట్ర విభజన జరిగి ఏడాదైనా ఇప్పటి వరకు ఆంధ్ర్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను ప్రకటించలేదు. అదికాక ప్రత్యేక హోదా సాథ్యం కాదంటూ పలువురు మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో శివాజీ ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్షకు దిగారు.