బాస్‌ మళ్లీ వస్తున్నాడు | Superstar Rajinikanth Sivaji The Boss Movie Re Releasing In Theatres, Check Release Date Inside | Sakshi
Sakshi News home page

Sivaji The Boss Re Release: బాస్‌ మళ్లీ వస్తున్నాడు

Published Fri, Sep 13 2024 12:53 AM | Last Updated on Fri, Sep 13 2024 1:26 PM

Rajinikanth Sivaji: The Boss Movie Re Released

మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు బాస్‌. రజనీకాంత్‌ హీరోగా నటించిన సూపర్‌ హిట్‌ మూవీ ‘శివాజీ: ది బాస్‌’ ఈ నెల 20న రీ రిలీజ్‌కి ముస్తాబవుతోంది. శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్, శ్రియ జంటగా నటించిన చిత్రం ‘శివాజీ: ది బాస్‌’. ఈ సినిమాలో సుమన్‌ విలన్‌ పాత్ర చేశారు. ఎంఎస్‌ గుహన్, ఎం. శరవణన్‌ నిర్మించిన ఈ సినిమా 2007లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగులోనూ ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయింది.

తమిళ సినిమా ఇండస్ట్రీ చరిత్రలో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా ‘శివాజీ’ నిలిచింది. సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌కు ఇది నూరవ సినిమా కావడం విశేషం. సుమారు 17 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీ రిలీజ్‌ కానుంది. 4కే వెర్షన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. అయితే ఎంపిక చేసిన స్క్రీన్స్ లో ‘శివాజీ’ టికెట్‌ ధర రూ. 99 మాత్రమే ఉండనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement