లాయర్‌లా మాట్లాడకు.. నువ్వెంత.. శివాజీపై శివాలెత్తిన గౌతమ్! | Bigg Boss Season 7 Day 23 Promo Highlights: Goutham Krishna Fire In Shivaji - Sakshi
Sakshi News home page

Bigg Boss Season 7 Promo: ప్రతి ఒక్కరితో నీకు అనవసరం.. శివాజీపై ఓ రేంజ్‌లో గౌతమ్ ఫైర్!

Published Tue, Sep 26 2023 4:45 PM | Last Updated on Tue, Sep 26 2023 6:12 PM

Bigg Boss Season 7 Promo Highlights  Goutham Fire On Shivaji - Sakshi

ఈ ఏడాది ఉల్టా పల్టా అనే సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన బిగ్‌బాస్‌  సీజన్-7 అదే రేంజ్‌లో దూసుకెళ్తున్నాడు. హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య హాట్ హాట్ వాతావరణం నడుస్తోంది. గతవారం సింగర్ దామిని ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారంలో  నామినేషన్స్‌లో ఎవరు నిలుస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఇవాళ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూస్తే హౌస్‌లో నామినేషన్స్ ప్రక్రియ హీట్ పెంచుతోంది. 

అమర్‌దీప్‌ ఫైర్

ఏ టాస్క్ జరిగిన ప్రతి ఒక్కరికీ అదే విధంగా బిహేవియర్ ఉండాలి అని జడ్జిని ప్రశ్నిస్తాడు డాక్టర్ బాబు గౌతమ్. దీనికి శివాజీ ప్రతి ఒక్కరితో నీకు అనవసరం అంటూ కౌంటర్ ఇస్తాడు. కానీ నా ఇంట్లో వాళ్ల గురించి అవసరమే అని గౌతమ్ అడగడంతో.. ఇదే కేవలం గేమ్ మాత్రమే.. ఫ్యామిలీ కాదు అని శివాజీ అంటాడు.   ఆ తర్వాత మీరు లాయర్‌ లాగా వన్‌సైడ్‌ మాత్రమే మాట్లాడుతున్నారంటూ గౌతమ్ కౌంటరిస్తాడు. శివాజీ తీరుతో విసుగు చెందిన గౌతమ్‌ నువ్వెంత? అంటూ శివాజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.  అయితే ఈ వారంలో నామినేషన్స్ బాధ్యత శోభా శెట్టి, శివాజీ, సందీప్‌ల మీద పెట్టాడు బిగ్ బాస్. వీరు ముగ్గురు జ్యూరీ మెంబర్లుగా వ్యవహరించనున్నారు. అయితే కంటెస్టెంట్ తాము ఎవరినీ నామినేట్ చేయాలనుకున్న వారికి సంబంధించి సరైన కారణాలు చెప్పాల్సి ఉంటుంది. అయితే ఆ ఇద్దరిలో ఎవరినీ నామినేట్ చేయాలో జడ్జిలు నిర్ణయిస్తారు. 

నువ్వు ఎంత.. శివాజీపై గౌతమ్ ఫైర్

ఈ క్రమంలో మన డాక్టర్ బాబు గౌతమ్.. యావర్. తేజలను నామినేట్ చేసేందుకు కారణాలు చెప్పాడు. ఏ టాస్క్ ఓడిపోయినా కూడా యావర్ ఓవర్‌గా రియాక్ట్ అవుతుంటాడు అని ఇలా ఏదో కారణం చెప్పబోయాడు గౌతమ్. ఇంటి సభ్యులందరికీ ఇబ్బందిగా ఉందని అంటాడు. అది నీకు సంబంధిచిన సమస్య కాదు అని శివాజీ అంటాడు. ఇది ఫ్యామిలీ అని గౌతమ్ అంటాడు.. ఇది ఫ్యామిలీ కాదు.. ఆట అని శివాజీ సమాధానం ఇస్తాడు. దీంతో హౌస్‌లో హీట్‌ ఓ రేంజ్‌కు దూసుకెళ్లింది. 

ఇదిలా ఉంటే.. ఆ తర్వాత అమర్ దీప్, ప్రశాంత్‌ల మధ్య మాటల తూటాలు పేలాయి. నువ్వు రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నావంటూ అమర్‌ దీప్‌ ప్రశాంత్‌కు కౌంటరిస్తాడు. నీకు రెండు మొహాలు, రెండు నాలుకలతో మాస్క్‌ వేసుకుని  ఆడుతున్నాడని ప్రశాంత్‌పై అమర్ దీప్ ఫైర్‌ కాగా.. దీనికి సైతం వ్యంగంగానే సమాధానమిస్తాడు ప్రశాంత్. ఆ తర్వాత ఏకంగా రేయ్ నువ్వు సెగలుగా నవ్వొద్దంటూ అమర్‌ దీప్‌ వార్నింగ్ ఇస్తాడు. అయితే దీనికి నా ఆట నేను ఇలాగే ఆడతా అని పల్లవి ప్రశాంత్‌ అంటాడు. నువ్వు కూడా రెండు మొహాలు కాదా అమర్‌దీప్‌ను అనడంతో వీరిద్దరి మధ్య  గొడవ తారాస్థాయికి చేరింది. నేను ఇలానే ఉంటా అనే అమర్‌ దీప్ అంటే.. నేను కూడా ఇంతే అంటూ పల్లవి ప్రశాంత్ అనడంతో ప్రోమో ముగిసింది. రోజు రోజులు హౌస్‌లో హీట్ పెంచుతోన్న నామినేషన్స్ ప్రక్రియ ఈ వారంలో ఎవరెవరూ నామినేట్ అవుతారో వేచి చూడాల్సిందే. 

ఈ సీజన్‌లో నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్‌ ప్రక్రియ హీట్‌ పెంచుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా హౌస్ మేట్స్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తాజాగా రిలీజైన మరో ప్రోమోలో గౌతమ్‌కృష్ణను పల్లవి ప్రశాంత్‌ నామినేట్‌ చేశాడు.  కారణాలపై ప్రశాంత్ మాట్లాడుతూ.. 'అమ్మాయి అరిచినప్పుడు నువ్వూ అరువు. మస్తు అనిపిస్తది. కానీ మళ్లీ ఇక్కడకు వచ్చి షర్ట్‌ తీయడం నాకు నచ్చలేదు.' అని అన్నాడు. 

ఆ తర్వాత రతిక పొట్టి దుస్తులు వేసుకోవడంపై ప్రశాంత్ మాట్లాడగా  గొడవ మరింత ముదిరింది. రతికను ఏదో సరదాగా అన్నానని ప్రశాంత్‌ చెప్పగా.. మజాక్‌ చేయడానికి నేనెవర్రాభయ్‌  నీకు అంటూ రతిక మండిపడింది. మరో వైపు శుభ శ్రీని అమర్‌దీప్‌ నామినేట్‌ చేయగా.. ప్రియాంకతో ఫేవర్‌గా ఉన్నానంటే అది మా స్ట్రాటజీ. ఆ పాయింట్‌ నాకు హర్టింగ్‌గా అనిపించింది. నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని తన కారణం చెప్పాడు. దీనికి శుభశ్ ఆగ్రహంతో  అదొక కారణమా? ఛీ అంటూ మండిపడింది. దీంతో విరిద్దరీ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ రెండు ప్రోమోలు వైరల్‌గా మారాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement