goutham
-
చరణ్ అన్న మాటతో చాలా సంతోషంగా ఫీలయ్యా: బిగ్‌బాస్ రన్నరప్ గౌతమ్
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-8 గ్రాండ్‌గా ముగిసింది. ఈ సీజన్ విజేతగా నిఖిల్ ట్రోఫితో పాటు ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు. అయితే ఈ సీజన్ రన్నరప్‌గా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గౌతమ్ నిలిచాడు. చాలా వరకు ఆడియన్స్ గౌతమ్ గెలుస్తాడని ముందే ఊహించారు. కానీ అనూహ్యంగా రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ గ్రాండ్ ఫినాలేకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరై విజేతకు ట్రోఫీని అందజేశారు.(ఇది చదవండి: షో అయిపోగానే కావ్య దగ్గర వాలిపోతానన్న నిఖిల్.. ఇప్పుడేమో!)అయితే గ్రాండ్ ఫినాలేలో రామ్ చరణ్ అన్నను కలవడం సంతోషంగా ఉందని గౌతమ్ అన్నారు. అమ్మ నీకు చాలా పెద్ద ఫ్యాన్ అని రామ్ చరణ్ నాతో అన్నాడని తెలిపాడు. ప్రతి రోజు బిగ్‌బాస్ చూసి నాకు నీ గురించి చెబుతూ ఉంటుందని చరణ్ అన్న చెప్పాడు. నేనే విన్నర్ అవుతానని సురేఖ అమ్మగారు చెప్పారని చరణ్ అన్న నాతో అన్నారు. నువ్వు ఏం ఫీలవ్వకు.. నీకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారని చరణ్ అన్న చెప్పడం నా జీవితంలో గర్వించదగిన సందర్భమని గౌతమ్ వెల్లడించారు. నేను గెలవలేదని ఫీలవుతుంటే.. నువ్వు కచ్చితంగా నిలబడతావ్.. అంటూ చరణ్ అన్న నాకు ధైర్యం చెప్పాడని గౌతమ్ ఎమోషనల్ అయ్యారు. -
తెర వెనక 'బిగ్‌బాస్ 8' ఫినాలే హంగామా (ఫొటోలు)
-
నీకిష్టమొచ్చినట్లు చేయాలంటే కుదరదు.. కెప్టెన్‌కు శివాజీ కౌంటర్!
బిగ్ బాస్ సీజన్- 7 తొమ్మిదో వారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే నామినేషన్స్‌లో ఉన్నవాళ్లకి ఎలిమినేషన్ టెన్షన్ మొదలైంది. ఈ వారం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. అయితే ప్రస్తుతం హౌస్‌లో రెండు టీమ్స్ మధ్య ఛాలెంజ్‌ల పర్వం కొనసాగుతోంది. కెప్టెన్సీ కంటెండర్‌షిప్ టాస్క్ నడుస్తుండగా ఇరు జట్ల మధ్య వాదనలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. (ఇది చదవండి: రాహుల్ గురించి రతికనే చెప్పింది.. బిగ్ బాస్ విన్నర్ అతనే గ్యారెంటీ: దామిని) కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం బిగ్‌బాస్ బాల్స్ టాస్క్ ఇచ్చాడు. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. టాస్క్‌లో భాగంగా గౌతమ్ టీం బిగ్‌బాస్ ఓ స్పెషల్ పవర్ ఇచ్చాడు. గౌతమ్ టీం దగ్గర బాల్స్‌తో.. అవతలి టీం వద్ద ఉన్న బాల్స్‌ను మార్చుకోవచ్చని ఆఫర్ ఇచ్చాడు. దీంతో గౌతమ్ టీం సభ్యులు ఎగిరి గంతేశారు. అయితే బిగ్‌బాస్ నిర్ణయంపై శివాజీ కాస్తా అసహనం ప్రదర్శించారు. గోల్డెన్ బాల్ వాళ్లకే, అన్ని వాళ్లకేనా బిగ్ బాస్ అంటూ తనలో తాను మాట్లాడుకున్నారు. అయితే బాల్స్ మార్చుకునే సమయంలో శివాజీ, కెప్టెన్ గౌతమ్ మధ్య మాటల యుద్ధం తలెత్తింది. మీకు తగినట్లు రూల్స్ మార్చుకుంటే మీరే ఆడుకోండన్న అంటూ గౌతమ్ అనడంతో.. మధ్యలో నేను మాట్లాడతా అన్న కదా అంటూ ప్రియాంక చెప్పింది. ఆ తర్వాత నీకిష్టమొచ్చినట్లు చేయాలంటే ప్రతిసారి చేయం మేము.. ఏం చేయాలో బిగ్ బాస్ చెప్తాడు కదా.. అంతవరకు ఆగలేవా నువ్వు? నీకు అనుకూలంగా ఉన్నప్పుడేమో చాలా సైలెంట్‌గా ఉంటావ్.. అని శివాజీ ఫైరయ్యాడు. దీంతో నేను ఏం తప్పు చేశానో చెప్పండి అంటూ గౌతమ్ ప్రశ్నిస్తాడు. నీతో నేను మాట్లాడలేనమ్మా.. కావాలనే వాదన పెట్టుకుంటావా? అని శివాజీ అనడంతో.. ఇక్కడ ఎవరికీ అలాంటి అవసరం లేదన్న అని గౌతమ్ అనడంతో అక్కడితో ప్రోమో ముగుస్తుంది. బాల్స్ టాస్క్‌లో మాత్ర బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్టులతో మరింత రసవత్తరంగా మారింది. హౌస్‌లో ఏం జరగనుందో ఇవాల్టి ఎపిసోడ్ చూస్తేనే క్లారిటీ వస్తుంది. (ఇది చదవండి: సినిమా రిలీజ్.. ఏడుస్తూ వీడియో షేర్ చేసిన హీరోయిన్!) -
నేనడిగింది చేస్తేనే వస్తా..! లేదంటే.. యువకుడు ఏడు గంటల పాటు హల్చల్!
భద్రాద్రి: తన తాతల నుంచి వచ్చిన రెండున్నర ఎకరాల భూమి, ఇంటిని ఉపసర్పంచ్ అక్రమంగా అక్రమించుకున్నారంటూ మండలంలోని కిన్నెరసాని గ్రామానికి చెందిన సురుగు గౌతమ్ అనే యువకుడు సోమవారం సెల్ టవరెక్కి నిరసన తెలిపాడు. కొత్తగూడెం విద్యానగర్‌లో ఉంటున్న గౌతమ్ కిన్నెరసానిలో తన తల్లిదండ్రులకు చెందిన ఇల్లు, రెండున్నర ఎకరాల భూమిని ఉపసర్పంచ్ కొంగర అప్పారావు ఆక్రమించాడని, ఇల్లు, భూమి ఇప్పించాలని రెవెన్యూ అధికారుల చుట్టూ ఎన్నిసా ర్లు తిరిగినా పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. తనకు న్యాయం చేసేంతవరకు కిందకు దిగేది లేదని భీష్మించాడు. ఇదే సమస్యపై గతంలో కొత్తగూడెంలో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉదయం 7 గంటల నుంచి సెల్ టవర్‌పై నిరసన వ్యక్తం చేస్తుండగా సమాచారం అందుకున్న రూరల్ ఇన్చార్జ్ ఎస్ఐ భిక్షం, డీటీ వినయ్ శీలాశ్రీరాం, ఆర్ఐ హచ్యా ఘటనా స్థలానికి వెళ్లి కిందకు దిగివస్తే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినా గౌతమ్ దిగి రాకపోవడంతో మధ్యాహ్నం 1.30 గంటలకు సీఐ వినయ్‌కుమార్ సెల్‌టవర్ వద్దకు చేరుకుని ఫోన్ ద్వారా నచ్చజెప్పారు. భూమి, ఇంటికి సంబంధించిన కాగితాలు సక్రమంగా ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకవెళ్లి సమస్య పరిష్కరించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగివచ్చాడు. అనంతరం కిన్నెరసానిలో ఆక్రమణకు గురైన ఇల్లు, భూమిని గౌతమ్ అధికారులకు చూపించగా పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి భూ రికార్డులను తీసుకుని కలెక్టరేట్‌కు వెళ్లారు. సమస్యను డీఆర్ఓ రవీంద్రనాథ్‌కు వివరించగా అక్రమించిన వ్యక్తికి నోటీసులు ఇవ్వాలని డీటీని ఆదేశించారు. -
'నా ఎలిమినేషన్‌కు కారణం అతనే'.. శుభశ్రీ కామెంట్స్ వైరల్!
ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్-7 మరింత ఆసక్తిమారంగా మారింది. ఇప్పటికే ఐదువారాలు పూర్తి కాగా.. ఐదుగురు కంటెస్టెంట్స్ సొంతింటికి వచ్చేశారు. అయితే ఈవారంలో నామినేషన్స్ టైంలో ఇద్దరు ఎలిమినేట్ కావొచ్చని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా ఒకరని సీక్రెట్ రూమ్‌లోకి పంపారు బిగ్ బాస్. ఈ వారంలో శుభశ్రీ రాయగురు ఇంటిముఖ పట్టింది. అయితే ఎలిమినేషన్ తర్వాత శుభశ్రీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. హౌస్మేట్స్ గురించి తన అభిప్రాయాలను పంచుకుంది. (ఇది చదవండి: 'గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అన్నాడు'.. బాలయ్య కామెంట్స్ వైరల్!) నేను విన్నర్ అవుదామనే వచ్చాను కానీ కుదరలేదు.. అయితే హౌస్‌లో డీలక్స్ రూమ్‌లోని ఓ ప్లేస్‌ను చాలా మిస్సవుతున్నానని తెలిపింది. హౌస్‌లో లవ్ ట్రాక్స్ నడిచాయన్న ప్రశ్నకు శుభశ్రీ మాట్లాడుతూ.. ఆ ఛాన్సే లేదంటూ సమాధానమిచ్చింది. ఆ తర్వాత గౌతమ్‌తో చేతిలో ఒక బొమ్మ శుభశ్రీ నిజమేనా? అనడంతో.. అలాంటిదేం కాదంటూ చెప్పుకొచ్చింది. మీరు బయటికి రావడానికి ఎవరు కారణమని అనుకుంటున్నారు? అని ప్రశ్నించగా.. కచ్చితంగా అమర్దీప్ వల్లేనంటూ ఆన్సరిచ్చింది. అంతే కాదు హౌస్‌లో గౌతమ్ నమ్మదగిన వక్తి కాదని శుభశ్రీ వెల్లడించింది. కాగా.. ఐదో వారంలో మొత్త ఏడుగురు నామినేట్ కాగా.. శివాజీకి అత్యధిక ఓట్లు వచ్చాయి. చివరిస్థానంలో నిలిచి శుభశ్రీ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. మరో కంటెస్టెంట్‌ను బిగ్ బాస్ సీక్రెట్లో బంధించాడు. ఇక ఇప్పటి నుంచి బిగ్ బాస్ 2.0 అంటూ మరో ఐదుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి తీసుకొచ్చారు. (ఇది చదవండి: అతన్ని చూస్తే భయమేస్తోంది.. రిటైర్ అవుతానంటున్న బ్రహ్మజీ!) -
లాయర్లా మాట్లాడకు.. నువ్వెంత.. శివాజీపై శివాలెత్తిన గౌతమ్!
ఈ ఏడాది ఉల్టా పల్టా అనే సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన బిగ్‌బాస్ సీజన్-7 అదే రేంజ్లో దూసుకెళ్తున్నాడు. హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య హాట్ హాట్ వాతావరణం నడుస్తోంది. గతవారం సింగర్ దామిని ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారంలో నామినేషన్స్‌లో ఎవరు నిలుస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఇవాళ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూస్తే హౌస్‌లో నామినేషన్స్ ప్రక్రియ హీట్ పెంచుతోంది. అమర్దీప్ ఫైర్ ఏ టాస్క్ జరిగిన ప్రతి ఒక్కరికీ అదే విధంగా బిహేవియర్ ఉండాలి అని జడ్జిని ప్రశ్నిస్తాడు డాక్టర్ బాబు గౌతమ్. దీనికి శివాజీ ప్రతి ఒక్కరితో నీకు అనవసరం అంటూ కౌంటర్ ఇస్తాడు. కానీ నా ఇంట్లో వాళ్ల గురించి అవసరమే అని గౌతమ్ అడగడంతో.. ఇదే కేవలం గేమ్ మాత్రమే.. ఫ్యామిలీ కాదు అని శివాజీ అంటాడు. ఆ తర్వాత మీరు లాయర్ లాగా వన్‌సైడ్ మాత్రమే మాట్లాడుతున్నారంటూ గౌతమ్ కౌంటరిస్తాడు. శివాజీ తీరుతో విసుగు చెందిన గౌతమ్ నువ్వెంత? అంటూ శివాజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయితే ఈ వారంలో నామినేషన్స్ బాధ్యత శోభా శెట్టి, శివాజీ, సందీప్‌ల మీద పెట్టాడు బిగ్ బాస్. వీరు ముగ్గురు జ్యూరీ మెంబర్లుగా వ్యవహరించనున్నారు. అయితే కంటెస్టెంట్ తాము ఎవరినీ నామినేట్ చేయాలనుకున్న వారికి సంబంధించి సరైన కారణాలు చెప్పాల్సి ఉంటుంది. అయితే ఆ ఇద్దరిలో ఎవరినీ నామినేట్ చేయాలో జడ్జిలు నిర్ణయిస్తారు. నువ్వు ఎంత.. శివాజీపై గౌతమ్ ఫైర్ ఈ క్రమంలో మన డాక్టర్ బాబు గౌతమ్.. యావర్. తేజలను నామినేట్ చేసేందుకు కారణాలు చెప్పాడు. ఏ టాస్క్ ఓడిపోయినా కూడా యావర్ ఓవర్‌గా రియాక్ట్ అవుతుంటాడు అని ఇలా ఏదో కారణం చెప్పబోయాడు గౌతమ్. ఇంటి సభ్యులందరికీ ఇబ్బందిగా ఉందని అంటాడు. అది నీకు సంబంధిచిన సమస్య కాదు అని శివాజీ అంటాడు. ఇది ఫ్యామిలీ అని గౌతమ్ అంటాడు.. ఇది ఫ్యామిలీ కాదు.. ఆట అని శివాజీ సమాధానం ఇస్తాడు. దీంతో హౌస్‌లో హీట్ ఓ రేంజ్‌కు దూసుకెళ్లింది. ఇదిలా ఉంటే.. ఆ తర్వాత అమర్ దీప్, ప్రశాంత్‌ల మధ్య మాటల తూటాలు పేలాయి. నువ్వు రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నావంటూ అమర్ దీప్ ప్రశాంత్‌కు కౌంటరిస్తాడు. నీకు రెండు మొహాలు, రెండు నాలుకలతో మాస్క్ వేసుకుని ఆడుతున్నాడని ప్రశాంత్‌పై అమర్ దీప్ ఫైర్ కాగా.. దీనికి సైతం వ్యంగంగానే సమాధానమిస్తాడు ప్రశాంత్. ఆ తర్వాత ఏకంగా రేయ్ నువ్వు సెగలుగా నవ్వొద్దంటూ అమర్ దీప్ వార్నింగ్ ఇస్తాడు. అయితే దీనికి నా ఆట నేను ఇలాగే ఆడతా అని పల్లవి ప్రశాంత్ అంటాడు. నువ్వు కూడా రెండు మొహాలు కాదా అమర్‌దీప్‌ను అనడంతో వీరిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. నేను ఇలానే ఉంటా అనే అమర్ దీప్ అంటే.. నేను కూడా ఇంతే అంటూ పల్లవి ప్రశాంత్ అనడంతో ప్రోమో ముగిసింది. రోజు రోజులు హౌస్‌లో హీట్ పెంచుతోన్న నామినేషన్స్ ప్రక్రియ ఈ వారంలో ఎవరెవరూ నామినేట్ అవుతారో వేచి చూడాల్సిందే. ఈ సీజన్లో నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ హీట్ పెంచుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా హౌస్ మేట్స్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తాజాగా రిలీజైన మరో ప్రోమోలో గౌతమ్‌కృష్ణను పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. కారణాలపై ప్రశాంత్ మాట్లాడుతూ.. 'అమ్మాయి అరిచినప్పుడు నువ్వూ అరువు. మస్తు అనిపిస్తది. కానీ మళ్లీ ఇక్కడకు వచ్చి షర్ట్ తీయడం నాకు నచ్చలేదు.' అని అన్నాడు. ఆ తర్వాత రతిక పొట్టి దుస్తులు వేసుకోవడంపై ప్రశాంత్ మాట్లాడగా గొడవ మరింత ముదిరింది. రతికను ఏదో సరదాగా అన్నానని ప్రశాంత్ చెప్పగా.. మజాక్ చేయడానికి నేనెవర్రాభయ్ నీకు అంటూ రతిక మండిపడింది. మరో వైపు శుభ శ్రీని అమర్దీప్ నామినేట్ చేయగా.. ప్రియాంకతో ఫేవర్‌గా ఉన్నానంటే అది మా స్ట్రాటజీ. ఆ పాయింట్ నాకు హర్టింగ్గా అనిపించింది. నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని తన కారణం చెప్పాడు. దీనికి శుభశ్ ఆగ్రహంతో అదొక కారణమా? ఛీ అంటూ మండిపడింది. దీంతో విరిద్దరీ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ రెండు ప్రోమోలు వైరల్‌గా మారాయి. -
పాఠాలు చెప్పి.. ప్రశ్నలు అడిగి..
నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లి ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ వీపీ గౌతమ్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడి తొలిమెట్టు కార్యక్రమం అమలుపై ఆరా తీశాక విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. పలువురు విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టడంతో పాటు కొన్ని పాఠ్యాంశాల్లోని సందేహాలను నివృత్తి చేశారు. సమాధానాలు సరిగ్గా చెప్పిన వారిని అభినందించడంతో విద్యార్థులు ఉప్పొంగిపోయారు. అనంతరం స్థానిక జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో మన ఊరు–మన బడి కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఈవో యాదయ్య పాల్గొన్నారు. -
అది ఎప్పుడూ మిస్ చేసుకోం.. ప్రేమిస్తూనే ఉంటాం : నమ్రత ఎమోషల్ పోస్ట్
Superstar Krishna Best Moments With His Grandchildren: సూపర్ స్టార్ మహేశ్ బాబు మంచి ఫ్యామిలీ పర్సన్ అని అందరికి తెలిసిందే. స్టార్ హీరో అయినప్పటికీ తన కుటుంబ సభ్యులతో ఎప్పుడు నార్మల్‌గానే ఉంటాడు. విరామం దొరికితే చాలు ఫ్యామిలీతో టూర్స్ వేస్తుంటాడు. ఇది తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నుంచే నేర్చుకున్నానని మహేశ్ చెబుతుంటాడు. అప్పట్లో కృష్ణ ఫుల్ బీజీగా ఉన్నప్పటికీ.. కుటుంబానికి మాత్రం సమయం కేటాయించేవాడట. ప్రతి రోజు ఉదయం కచ్చితంగా ఫ్యామిలీతో కలిసి టిఫిన్ చేసేవాడట. రాత్రి పిల్లలతో మాట్లాడేవాడట. ఇప్పుడు మహేశ్ కూడా అదే వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. షూటింగ్ లేకుండా ఖాలీగా ఉంటే.. ఆ సమయాన్ని అంతా ఫ్యామిలీకే కేటాయిస్తాడు. అలాగే వారానికి ఒక్క రోజు అయినా.. తన ఫ్యామిలీ అంతా కృష్ణ ఇంట్లో గడుపుతుంటుందట. తాజాగా ఈ విషయాన్ని నమ్రత సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ, సితార, గౌతమ్ ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘మండే లంచ్.. ఎప్పుడూ మిస్ అవ్వం.. ఎన్నో కథలు చెబుతుంటారు.. ఆయన్నుంచి ఎంతో నేర్చుకోవచ్చు.. మేం అంతా కూడా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం మామయ్య గారు’అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసి మహేశ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక మహేశ్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
ఘనంగా హీరోయిన్ కాజల్ సీమంతం.. ఫోటోలు వైరల్
Kajal Aggarwal Baby Shower Photos Viral: హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆమె సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య కాజల్ సీమంత వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా 2020 అక్టోబర్30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో కాజల్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలె న్యూ ఇయర్ సందర్భంగా కాజల్ ప్రెగ్నెన్సీని అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన కాజల్ తమ మొదటి బిడ్డ రాక కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇక రీసెంట్‌గానే కాజల్ కూడా తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
భర్త విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్న కాజల్
Kajal Agarwal Shocking Decision About her Husband: హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన భర్త విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆమె భర్త గౌతమ్ కిచ్లును సినిమాల్లోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చందమామ ప్రయత్నాలు మొదలుపెట్టిందట. గతేడాది గౌతమ్‌ను పెళ్లి చేసుకున్న కాజల్ త్వరలోనే భర్తను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకొంటుందట. తాను సైన్ చేసిన సినిమాల్లో గౌతమ్‌కి కూడా ఏదైనా రోల్ ఇప్పించమని మేకర్స్‌ను కోరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.చదవండి: పుష్ప: హాట్ టాపిక్‌గా మారిన సమంత రెమ్యునరేషన్ అంతేకాకుండా పాత్ర చిన్నదైనా పర్వాలేదని, కానీ కీలకంగా ఉండాలని కండీషన్లు సైతం పెడుతుందట. గతంలో వీరిద్దరూ కలిసి తమ బిజినెస్ కోసం ఓ యాడ్ షూట్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భర్తతో కలిసి బిగ్ స్క్రీన్‌ను షేర్ చేసుకోవాలని కాజల్ తాపత్రయపడుతుందట. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. చదవండి: అలా వెళ్తేనే ఆఫర్లు వస్తాయా?..భూమిక షాకింగ్ కామెంట్స్ బాక్సింగ్ లెజెండ్‌తో లైగర్ విజయ్..ఫోటో వైరల్ -
గౌతమ్ తను నాతో ఎక్కువ టైం ఉండట్లేదు: కాజల్
సెలబ్రిటీ కపుల్స్‌లో కాజల్ అగర్వాల్-గౌతమ్ కిచ్లు జంట ఒకటి. వీరిద్దరి పెళ్లి విషయం ప్రపంచానికి తెలిసినప్పటి నుంచి తరుచూ వార్తలో నిలుస్తున్నారు. గతేడాది ఆక్టోబర్ 30న పెళ్లి పీటలెక్కిన ఈ జంట ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే పెళ్లి అనంతరం కాజల్ సినిమాలతో, గౌతమ్ తన బిజినెస్‌లో బిజీగా ఉన్నారు. దీంతో ఒకరితో ఒకరు ప్రేమగా సమయం గడిపేందుకు కుదరడం లేదు. ఈ క్రమంలో తన భర్త గురించి చెబుతూ కాజల్ సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశారు. గౌతమ్ ఇచ్చిన అయిదు డిఫరెంట్ ఫ్లేవర్ చాక్లెట్లను ముఖానికి అడ్డంగా పట్టుకొని ఫోటోకు ఫోజిచ్చారు. అయితే కాజల్‌కు ఇష్టమని చాక్లెట్లు ఇవ్వలేదు. దీని వెనుక ఓ బలమైన కారణం కూడా ఉందడోయ్. పెళ్లి తర్వాత గౌతమ్ తన వృత్తిపరమైన పనుల్లో బిజీగా మారిపోయాడు. ఈ క్రమంలో తనుకున్న వర్క్స్ కారణంగా చందమామతో సమయం గడిపేందుకు సరిగా వీలు దొరకడం లేదు. అందుకే ఇంటికి తిరిగొచ్చినప్పుడు తనకు ఇష్టమైన చాక్లెట్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి ఆమెను కూల్ చేశాడు. ఈ విషయాన్ని కాజల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నారు. గౌతమ్ బహుమతిగా ఇచ్చిన చాక్లెట్ల ఫోటోను షేర చేస్తూ.."నా భర్త నాతో ఎక్కువ సమయం వెచ్చించలేకపోవడంతో దానికి బదులు ఇలా వీటిని తీసుకొచ్చాడు. నా డైట్ కూడా నాశనం చేస్తుంది. ఏది ముందు తినేశానని మీరు అనుకుంటున్నారు. అనే క్యాప్షన్ జతచేశారు. చదవండి: ఆ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న కాజల్ వైరలవుతున్న రామ్‌చరణ్- ఉపాసన రొమాంటిక్ ఫోటో -
వీరిలో నా డార్లింగ్ ఎవరబ్బా: కాజల్ భర్త
గతేడాది అక్టోబర్ 30న ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. సడెన్‌గా కాజల్ తన ప్రేమ, పెళ్లి విషయం చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేయడంతో వీరిద్దరి టాపిక్ కొంతకాలం వరకు టాలీవుడ్లో సెన్సేషనల్‌గా మారింది. పెళ్లి తర్వాత కూడా కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే చందమామ చేతిలో.. చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ భారతీయుడుతో పాటు హిందీలో ‘ముంబాయి సాగా’ సినిమాలో నటిస్తోంది. సినిమాలతోపాటు కాజల్ తన వ్యక్తిగత జీవితానికి కూడా ఎక్కవగానే ప్రధాన్యతే ఇస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా భర్త గౌతమ్‌తో సమయం గడుపుతోంది. అంతేగాక ఇప్పుడిప్పుడే తన ప్రేమ మధుర జ్ఙాపకాలను బయటకు తీస్తోంది. చదవండి: స్టార్ హీరోయిన్ల మధ్య డిజిటల్ వార్ కాగా సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో కాజల్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించి నేటికి ఏడాది పూర్తయ్యింది. 5 ఫిబ్రవరి 2020న కాజల్ మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ వేడుకకు కాజల్ కుటుంబసభ్యులతోపాటు గౌతమ్ కూడా హాజరయ్యాడు. అయితే ఆవిష్కరణ ముందురోజే గౌతమ్ సింగపూర్ చేరుకొని కొన్ని గంటలపాటు కాజల్‌తో గడిపి మరుసటి రోజు బిజినెస్ పని మీద జర్మని వెళ్లాడు. కానీ గౌతమ్ వచ్చినట్లు మీడియాకు పెద్దగా తెలియదు. తాజాగా తన భర్తతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్చేస్తూ కాజల్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో గౌతమ్.. కాజల్, మైనపు విగ్రహం మధ్యలో నిలబడి అసలైన కాజల్ ఎవరని చూస్తున్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లా: శ్వేతాబసు ప్రసాద్ View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) Deeply humbled and ecstatic to be honoured, standing amongst global icons. Feels like I'm seeing myself through the eyes of an artist 😍 The resemblance is uncanny and the attention to detail is spectacular. pic.twitter.com/WmOz38QBpS — Kajal Aggarwal (@MsKajalAggarwal) February 5, 2020 -
హనీమూన్‌కు వెళుతున్న కొత్త జంట
ముంబై : ప్రేమించిన ప్రియుడిని పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. గత వారం కాజల్ తన చిరకాల స్నేహితుడు గౌతమ్ కిచ్లును కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహామాడారు. ముంబైలోని ఓ హోటల్లో ఈ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం కాజల్ భర్త కిచ్లుతో ముంబైలో ఉన్నారు. కాగా పెళ్లి అనంతరం కేవలం రెండు వారాలు మాత్రమే బ్రేక్ తీసుకొని మళ్లీ సినిమా షూటింగ్లో కాజల్ పాల్గొననున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో ఫిమేల్ లీడ్‌లో కాజల్ నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్లో కాజల్ మరో వారంలో తిరిగి జాయిన్ కానున్నారని, ఈ షెడ్యూల్డ్ పూర్తి అయిన తరువాత హనీమూన్ ప్లాన్ చేసుకోనున్నట్లు వదంతులు వ్యాపించాయి. చదవండి: కాజల్ అగర్వాల్ వెరీ వెరీ స్పెషల్ అయితే ఈ వార్తలకు భిన్నంగా కాజల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సినిమా షూటింగ్‌కు ముందే నూతన దంపతులు ఇద్దరు ఇప్పుడే హనీమూన్ ప్లాన్ చేసుకున్నారు. ఈ విషయాన్ని కాజల్ తన సోషల్ మీడియా అకౌంట్లో తెలిపారు. తాము హానీమూన్ వెళుతున్నట్లు శనివారం ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్టు చేశారు. తమ పేర్లతో ఉన్న పౌచ్‌లతో పాటు పాస్ట్ పోర్ట్లని షేర్ చేశారు. దీనికి ‘బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నాం.. రెడీ టూ గో’ అనే కామెంట్ చేశారు. అయితే ఎక్కడికి వెళుతున్నారనేది మాత్రం చెప్పలేదు. ఇదిలా ఉండగా కాజల్, గౌతమ్ జంటకు నెటిజన్స్ హ్యాపీ జర్నీ అని కామెంట్స్ పెడుతున్నారు. చదవండి: కాజల్ నో చెప్పింది ఇందుకే.. -
తమిళంపై ఫోకస్ పెట్టారా?
తమిళ సినిమాలపై ఎక్కువ దృష్టిపెట్టినట్టున్నారు సమంత. ఆమె అంగీకరిస్తున్న సినిమాలన్నీ తమిళ భాషవే కావడం అందుకు కారణం. ‘మాయ, గేమ్ ఓవర్’ చిత్రాల దర్శకుడు అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ సినిమా కమిటయ్యారు సమంత. ఇది ద్విభాషా చిత్రం అని సమాచారం. దాని తర్వాత విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. విజయ్ సేతుపతి హీరోగా నటించనున్న ఈ సినిమాలో నయనతార, సమంత హీరోయిన్లు. ఇదో రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ అని తెలిసింది. తాజాగా మరో తమిళ సినిమాకు కూడా ఓకే చెప్పారని కోలీవుడ్ టాక్. గౌతమ్ అనే నూతన దర్శకుడు చెప్పిన కథ సమంతకు బాగా నచ్చిందని, ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. ఈ సినిమాలో హీరో ఎవరు? ఏ జానర్ సినిమా అనేది ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే ‘కత్తి, తేరీ, మెర్సల్, ఇరంబుదురై, సూపర్ డీలక్స్’ వంటి సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో తమిళ ప్రేక్షకులకు ఫేవరెట్ అయ్యారు సమంత. ప్రస్తుతం ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా కమిట్ కాకపోవడం తెలుగు ఫ్యాన్స్‌కు చిన్న నిరాశే అని చెప్పొచ్చు. -
మా భూమి @ 40
ఇండస్ట్రీ కొన్నిసార్లు మూస దారిలో ప్రయాణిస్తుంటుంది... అదే రహదారని భ్రమపడేంత. కొన్నిసార్లు ఆ దారిని ఏమాత్రం లెక్క చేయకుండా.. కొత్త దారుల్ని వెతుక్కుంటూ కొన్ని సినిమాలు వెళ్తాయి. ‘పాత్ బ్రేకింగ్’ సినిమాలంటాం వాటిని. 40 ఏళ్ల క్రితం చేసిన అలాంటి ప్రయత్నమే ‘మా భూమి’. ఫలితం – ప్రభంజనం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో వచ్చిన సినిమా ‘మా భూమి’. తెలుగు సినిమాల్లో సంచలనాలను ప్రస్తావించాల్సినప్పుడల్లా ‘మా భూమి’ని నెమరువేసుకుంటూనే ఉన్నాం. ఇవాళ మళ్లీ గుర్తు చేసుకుందాం. నేటితో ‘మా భూమి’ 40ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి వంద విశేషాలు ఉంటాయి. కానీ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమైన 40 విశేషాలు మీకోసం. ► కిషన్ చందర్ రాసిన ‘జబ్ ఖేత్ జాగే’ అనే ఉర్దూ నవల ఈ సినిమాకు స్ఫూర్తి. ► ప్రఖ్యాత బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ సలహా మేరకు గౌతమ్ – ఘోష్‌ను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. ► దర్శకుడు గౌతమ్ ఘోష్‌కి ఇదే తొలి సినిమా. ► నవల ఆధారంగా గౌతమ్ ఘోష్ ఓ కథను రాసుకొచ్చారు. కానీ నిర్మాతలకు అంతగా నచ్చలేదు. మళ్లీ తెలంగాణాలో పలు ప్రాంతాలు సందర్శిస్తూ ఈ కథను రాసుకున్నారు. ► ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్ కుమారుడు త్రిపురనేని సాయిచంద్ ఈ సినిమా ద్వారానే పరిచయమయ్యారు. ► ఈ సినిమాను నిర్మించడమే కాకుండా స్క్రీన్‌ప్లేను అందించారు బి. నర్సింగరావు. ► ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాలలో ఈ సినిమాకు నంది అవార్డులు వరించాయి. ► కార్వే వారీ ప్రపంచ చలన చిత్రోత్సవాల్లో మన దేశం తరఫున అధికారికంగా ఎంపికయిన చిత్రం ‘మా భూమి’. ► సీఎన్ఎన్– ఐబీఎన్ తయారు చేసిన ‘వంద అత్యుత్తమ భారతీయ చిత్రాల’ జాబితాలో ‘మా భూమి’ చోటు చేసుకుంది. ► ఈ సినిమా చిత్రీకరణ చాలా భాగాన్ని మెదక్ జిల్లాలోని మంగళ్పర్తిలో చేశారు. అది బి. నరసింగరావుగారి అత్తగారి ఊరే. ► లక్షన్నర బడ్జెట్ అనుకుని మొదలయిన ఈ చిత్రం పూర్తయ్యేసరికి ఐదున్నర లక్షలయింది. ► ఈ సినిమాకు గౌతమ్ ఘోష్ భార్య నిలాంజనా ఘోష్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించారు. ► ఈ సినిమాకు సంబంధించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ను దర్శకుడు గౌతమే స్వయంగా చూసుకున్నారు. ► పాపులర్ నటి తెలంగాణ శకుంతల ఈ సినిమా ద్వారానే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ► కేవలం ఉదయం ఆటగానే ప్రదర్శించేట్టు ఈ చిత్రాన్ని విడుదల చేశారు. విడుదల తర్వాత హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో ఏడాది పాటు నిర్విరామంగా ఆడింది. ► ప్రజాగాయకుడు గద్దర్ తొలిసారి స్క్రీన్ మీద కనిపించిన చిత్రం ఇదే. ► తెలంగాణ పల్లె జీవితం ఎలా ఉండాలో అర్థం చేసుకోవడానికి గౌతమ్, నర్సింగరావు తెల్లవారగానే పల్లెలోకి వెళ్లి ఊరిలోని ప్రజలు ఎలా జీవిస్తున్నారో గమనిస్తూ ఉండేవారట. ► సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ఇల్లును కుదవపెట్టారట నర్సింగరావు. ► సినిమాలో ఒక సన్నివేశంలో శవం దగ్గర ఏడ్చే సన్నివేశం ఉంది. కానీ ఆ సీన్లో యాక్ట్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదట. సుమారు మూడు నాలుగు ఊర్లు గాలించి పోచమ్మ అనే ఆవిడను తీసుకువచ్చి నటింపజేశారట. ► ఈ సినిమాలోని ‘బండెనక బండి కట్టి... పదహారు బళ్లు కట్టి..’ పాట చాలా పాపులర్. మొదట ఈ పాటను నర్సింగరావు మీద తీశారు. రషెష్ చూసుకున్న తర్వాత నా కంటే గద్దర్ మీద చిత్రీకరిస్తే బావుంటుంది అని సూచించారు నర్సింగరావు. ► మా భూమి చిత్రాన్ని మార్చి 23నే విడుదల చేయాలని దర్శక–నిర్మాతల ఆలోచన. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్‌లను ఉరి తీసింది మార్చి 23వ తేదీనే. ఆ రోజు విడుదల చేస్తే ఆ ముగ్గురికీ నివాళిలా ఉంటుందని భావించారట. ► సినిమా పూర్తయి సెన్సార్‌కి నిర్మాతల జేబులు ఖాళీ అయిపోతే సహ నిర్మాత రవీంద్రనాథ్ పెళ్లి ఉంగరాలను తాకట్టుపెట్టి వచ్చిన రూ.700లతో సెన్సార్ జరిపించారు. ► సహజత్వానికి దగ్గరగా ఉండాలని సాయి చంద్ పాత్రకు ఊర్లోని వారి బట్టలను అడిగి తీసుకుని కాస్ట్యూమ్స్‌గా కొన్ని రోజులు వాడారు. ► ఈ సినిమా మొత్తాన్ని మూడు షెడ్యూల్స్‌లో 50 రోజుల్లో పూర్తి చేశారు. ► షూటింగ్స్, సెన్సార్ వంటి అవరోధాలన్నీ దాటినప్పటికీ ఈ సినిమాను కొనుగోలు చేయడానికి పంపిణీదారులెవ్వరూ ముందుకు రాలేదు. ఇదేదో రాజకీయ పాఠాలు చెబుతున్న సినిమాలా ఉందని కామెంట్ చేశారట. చివరికి లక్ష్మీ ఫిలింస్, శ్రీ తారకరామా ఫిలింస్ వారు ఈ సినిమాను విడుదల చేశారు. ► ఈ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించిన రవీంద్రనాథ్, ఆయన భార్య సినిమా విడుదలైన మూడో రోజు సినిమా చూడటానికి థియేటర్‌కి వెళ్లారు. కానీ వారికి కూడా టికెట్లు దొరకలేదట. ► ‘చిల్లర దేవుళ్లు’ తర్వాత సినిమా సంభాషణల్లో పూర్తి స్థాయి తెలంగాణ యాసను వాడిన సినిమా ఇదే. ► యూనిట్ దగ్గర ఉన్న కొత్త చీరలు, రుమాల్లు, పంచెలు గ్రామంలో వారికి ఇచ్చి వారి దగ్గర ఉన్న పాత బట్టలు తీసుకుని చిత్రీకరణ కోసం వినియోగించేవారట చిత్రబృందం. ► తొలుత ఈ సినిమాకు ‘జైత్రయాత్ర’ అనే టైటిల్‌ని పరిశీలించారట. భూమి కోసం పోరాటం జరుగుతుంది. ‘మన భూమి’ పెడితేనే బావుంటుందని నర్సింగరావు సూచించారట. ► సినిమాలో గడీను ముట్టడి చేసే సన్నివేశాల చిత్రీకరణకు ఆ గ్రామ ప్రజలు సహకరించలేదు. చివరికి వారి అనుమతి లేకుండానే చిత్రబృందం తయారు చేయించుకొని తెచ్చుకున్న తలుపును బద్దల కొట్టినట్టుగా షూట్ చేశారు. ► 1948లో హైదరాబాద్ రాష్ట్రంపై భారతప్రభుత్వం చేసిన సైనిక చర్యకు సంబంధించిన సన్నివేశాలనే సినిమాలో వినియోగించుకున్నారు. ∙పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు నటీనటుల గాయాలకే రోజుకో ఐయోడిన్ సీసా ఖాళీ అయ్యేదట. ► చిత్రకారుడు తోట వైకుంఠం ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు.. ఇదే తొలి సినిమా. ► దేవీప్రియ ఈ సినిమాకు పబ్లిసిటీ ఇన్చార్జ్గా పని చేశారు. ► ఈ సినిమాలోని ‘పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మొనగాడా..’ పాటను సీనియర్ రచయిత సుద్దాల హనుమంతు రచించారు. ప్రస్తుతం ప్రముఖ గేయ రచయితగా కొనసాగుతున్న సుద్దాల అశోక్ తేజ ఆయన కుమారుడే. ► సినిమా చిత్రీకరిస్తున్న రోజుల్లో యూనిట్ మొత్తం మంగళ్ పర్తిలోనిæ బడిలో నివసించారు. ఆ పక్కనే ఉన్న బావి దగ్గర మగవాళ్లు స్నానాలు చేసేవారు. స్త్రీలేమో ఆ ఊర్లోని సంపన్న కుటుంబీకుల ఇంట్లోని స్నానాల గదులు వాడుకునేవారట. ► ఈ సినిమా నిర్మాణానికి మూడేళ్ల సమయం పట్టింది. ► ఈ సినిమా నెగటివ్ పాడైపోవడంతో 2015 ప్రాంతంలో డిజిటలైజ్ చేసి డీవీడీ విడుదల చేశారు. ‘మాభూమి’ చిత్రంలో సాయిచంద్ సాయిచంద్, రమణి మాభూమి షూటింగ్ సందర్భంగా గద్దర్, దర్శకుడు గౌతమ్, బి.నరసింగరావు, నీలంబన ఘోష్ – గౌతమ్ మల్లాది -
షెకావత్ బుకీలను పరిచయం చేసేవాడు
కర్ణాటక, బనశంకరి: కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) క్రికెట్ పోటీల్లో బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ కేసును విచారణ తీవ్రతరం చేసిన బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు గురువారం బళ్లారి టస్కర్స్ జట్టు కెప్టెన్‌తో మరో క్రికెటర్‌ను అరెస్ట్ చేశారు. బళ్లారి జట్టు కెప్టెన్ సీఎం గౌతం, క్రికెటర్ అబ్రార్ ఖాజీని అరెస్ట్ చేసి విచారణ తీవ్రతరం చేశామని జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్‌పాటిల్ తెలిపారు. రూ.20 లక్షలకు స్పాట్ ఫిక్సింగ్ సందీప్ తెలిపిన మేరకు... పోలీసులకు పట్టుబడిన ఇద్దరు క్రికెటర్లు 2019 కేపీఎల్ టోర్నీ హుబ్లీ, బళ్లారి జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. మ్యాచ్‌లో నిదానంగా బ్యాటింగ్ చేయడానికి వీరు బుకీలనుంచి రూ.20 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. బెంగళూరు జట్టుపై ఆడిన మరో మ్యాచ్‌లోనూ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. ఈ ఇద్దరు క్రికెటర్లు పలు జాతీయస్థాయి టోర్నీల్లో ఆడినవారే కావడం గమనార్హం. మ్యాచ్ ఫిక్సింగ్‌తో సంబంధమున్న మరికొందరిని కనిపెట్టి పూర్తి ఆధారాలతో త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు. షెకావత్ అరెస్టుతో కదిలిన డొంక రెండురోజుల క్రితం మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగస్వామిగా ఉన్న బెంగళూరు బ్లాస్టర్ జట్టులో బ్యాట్స్‌మెన్ నిశాంత్ సింగ్ షెఖావత్‌ను అరెస్టు చేసి విచారణ చేపట్టగా అతడు ప్రముఖ బుకీలతో సంప్రదింపులు జరిపినట్లు వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన షెఖావత్ కేపీఎల్ మొదటి సీజన్ నుంచి హుబ్లీ, మంగళూరు, శివమొగ్గ జట్లతరఫున ఆడుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరు బ్లాస్టర్స్ జట్టులో తరపున ఆడుతూ పరారీలో ఉన్న ప్రముఖ బుకీలైన సయ్యాం, జతిన్, చండీఘడ్ బుకీ మనోజ్ కుమార్‌తో షెఖావత్ నిత్యం సంప్రదించేవాడు. ఇప్పటికే పోలీసులకు పట్టుబడిన బెంగళూరు బ్లాస్టర్స్ జట్టు బౌలింగ్‌కోచ్ విను ప్రసాద్, బ్యాట్స్‌మెన్ విశ్వనాథన్‌లకు బుకీలను పరిచయం చేసింది షెకావతే. మైసూరులో 2018 ఆగస్టు 31 హుబ్లీ టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ మధ్య మైసూరు శ్రీకంఠ దత్త నరసింహరాజు ఒడయార్ మైదానంలో క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించారు. ఈ మ్యాచ్‌కు కొద్దిరోజులకు ముందు మైసూరులో ఓ హోటల్ బుకీ మనోజ్ ను నిశాంత్‌సింగ్ షెకావత్ సంప్రదించాడు. అనంతరం వినుప్రసాద్, విశ్వనాథన్‌ను పిలిపిం చి మాట్లాడారు. అప్పుడు డబ్బు చేతులు మారి ఉండవచ్చని అనుమానం ఉంది. షెకావత్‌కు అన్ని జట్లలో కోచ్‌లు, ఆటగాళ్లతో పరిచయం ఉంది. ఇతడు బుకీలను ఆటగాళ్లకు పరిచయం చేసి దందాను విస్తరించేవాడు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సందీప్‌పాటిల్ తెలిపారు. ఢిల్లీ బుకీలైన జతిన్, సయ్యాం అరెస్ట్ కోసం లుక్‌అవుట్‌నోటీస్ విడుదల చేశామన్నారు. వారిద్దరూ విదేశాల్లో తలదాచుకున్నట్లు తెలిసిందన్నారు. ఈ కేసులో బెళగావి ప్యాంథర్స్ జట్టు యజమాని అష్పాక్ అలీతార్‌ను అరెస్ట్ చేయగా అతనిచ్చిన సమాచారం ఆధారంగా కేసు విచారణ తీవ్రతరం చేశామన్నారు. బళ్లారి టస్కర్స్ జట్టులో డ్రమ్మర్ భవేశ్‌ను కూడా ఫిక్సింగ్ కేసులో అరెస్టు చేశారు. ♦ ఏమిటీ: కొన్నేళ్ల క్రితం ఐపీఎల్ తరహాలో అట్టహాసంగా ఆరంభమైన కర్ణాటక ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఫిక్సింగ్, బెట్టింగ్ దందా ♦ ఎలా, ఎవరు: ఓ జట్టు యజమాని, కొందరు ఆటగాళ్లు, పలు రాష్ట్రాలకు చెందిన బుకీలు కుమ్మక్కై మ్యాచ్ ఫలితాలను ముందే నిర్దేశించడం. ♦ ఇప్పటివరకు అరెస్టయింది: బెళగావి ప్యాంథర్స్ జట్టు యజమాని అష్పాక్ అలీతార్, బెంగళూరు బ్లాస్టర్స్ జట్టు బౌలింగ్‌కోచ్ విను ప్రసాద్, బ్యాట్స్‌మెన్ విశ్వనాథన్, మరోఆటగాడు షెకావత్, డ్రమ్మర్ భవేశ్. పరారీలో ఉన్న ఢిల్లీ బుకీలు సయ్యాం, జతిన్ ♦ ఎలా మొదలైంది: ఆటగాడు షెకావత్ బుకీలను ఆటగాళ్లకు పరిచయం చేసేవాడు. -
ప్రిన్స్ ఇంట ‘బాయిదూజ్’ సంబరం
బంజారాహిల్స్: కార్తీకమాసంలో ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన ‘బాయిదూజ్’ వేడుక ఇప్పుడు దక్షిణాదికీ విస్తరించింది. ఈ పండగ రోజు అక్క,చెల్లెళ్లు తమ సోదరులకు హారతి ఇచ్చి నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలని పూజలు చేస్తారు. అంతేకాదు ఆ రోజు తమ సోదరులకు బహుమతులు కూడా ఇస్తారు. రాఖీ పండుగ తరహాలో జరిగే ఈ వేడుక బుధవారం టాలీవుడ్ హీరో, ప్రిన్స్ మహేష్‌బాబు ఇంట్లో చేసుకున్నారు. కూతురు సితార తన అన్న గౌతంకృష్ణకు నుదుటున బొట్టు పెట్టి హారతి ఇచ్చింది. ఈ సెలబ్రేషన్స్ ఫొటోలను నమ్రతా శిరోద్కర్ ఇంస్టాగ్రామ్ లో పోస్టు చేశారు. వీటిని చూసిన ప్రిన్స్ అభిమానులు తెగ ఆనందపడుతున్నారు. View this post on Instagram Bhau beez😍😍this yearly tradition when Sitara is looking to make some money to buy extra robux for a strange game these kids play these days 😘😘😘and parallelly hoping that her brother will always stand strong behind her like a rock ❤️❤️on the other hand her brother is hoping this little celebration gets over quickly so he can change back into his pyjamas 🤣🤣🤣🤣 I love my kids😘😘#myworld #bhaubeez #grateful ❤️❤️happy Diwali everyone and a happy new year 🤗🤗 @anoushkaranjit we missed u my sweetie 😘😘😘 A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Oct 29, 2019 at 6:56am PDT -
దుబాయ్‌లో బెస్ట్ ఫ్రెండ్‌తో...
‘గడుపుతున్న క్షణాలను ఆనందంగా జీవిస్తేనే అవి గడిచాక అద్భుతమైన జ్ఞాపకాలుగా మిగులుతాయి’ అంటున్నారు మహేశ్‌బాబు. ప్రస్తుతం మహేశ్ తన కుటుంబంతో కలసి దుబాయ్‌లో హాలిడే చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది చివర్లో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడం కోసం ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్‌తో పాటు దుబాయ్ వెళ్లారు. కుటుంబంతో కలసి గడుపుతున్న ఆనంద క్షణాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు నమ్రత. ‘‘నా బెస్ట్ బడ్డీతో (బెస్ట్ ఫ్రెండ్) మంచి టైమ్ స్పెండ్ చేస్తున్నాను’’ క్యాప్షన్ చేస్తూ తనయుడు గౌతమ్‌తో దిగిన ఫొటోను పంచుకున్నారు మహేశ్. కుమారుడిని బెస్ట్ బడ్డీ అని సంబోధించడం చూస్తుంటే వీళ్లిద్దరూ తండ్రీ కొడుకల్లా కంటే ఫ్రెండ్స్ లా ఉంటారని ఊహించవచ్చు. -
ఆమెతో థాయ్‌లాండ్ చుట్టొచ్చాడు
తమిళసినిమా: యువ నటుడు గౌతమ్ కార్తీక్ వర్ధమాన నటి వైభవి శాండిల్యతో థాయ్‌లాండ్ చుట్టొచ్చాడు. ఇంతకు ముందు హరహర మహాదేవకీ వంటి విజయవంతమైన చిత్ర కాంబినేషన్ గౌతమ్‌కార్తీక్, దర్శకుడు సంతోష్ పి.జయకుమార్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు’ ఇందులో సర్వర్‌సుందరం, చక్క పోడు పోడు రాజా చిత్రాల ఫేమ్ వైభవి శాండిల్య నాయకిగా నటిస్తోంది. మరో నటి చంద్రిక దెయ్యంగానూ, నటి యాషిక ప్రధాన పాత్రలోనూ నటిస్తున్నారు. రాజేంద్రన్, కరుణాకరన్, బాలశేఖరన్, మధుమిత, మీసైమమురుక్కు చిత్రం ఫేమ్ షారా ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. దీనికి సంగీతాన్ని బాలమురళీబాలు, ఛాయాగ్రహణం తరుణ్బాలాజీ అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తలుపుతూ ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు చిత్ర షూటింగ్‌ను గత అక్టోబర్ నెలలో ప్రారంభించాయని తెలిపారు. ఇటీవలే థాయ్‌లాండ్‌లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని చెన్నైకి తిరిగొచ్చి ఇక్కడ పాటను చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. తదుపరి మళ్లీ తుది షెడ్యూల్ చిత్రీకరణ కోసం త్వరలో థాయ్ లాండ్ వెళ్లనున్నట్లు వెల్లడించారు. నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2018 ఆరంభంలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు సంతోష్ పి.జయకుమార్ తెలిపారు. -
పుట్టినరోజు వేడుకల్లో విషాదం
హైదరాబాద్: తన పుట్టిన రోజు వేడుకల్లో మద్యం తాగిన యువకుడు ఇంటి పైనుంచి పడి మృతిచెందాడు. ఈ ఘటన నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో శనివారం చోటు చేసుకుంది. సైదాబాద్ సింగరేణికాలనీలో గౌతమ్ అనే యువకుడు స్నేహితులతో పెంట్‌హౌస్‌లో పుట్టునరోజు వేడుకలు చేసుకున్నాడు. ఈ సందర్భంగా స్నేహితులతో కలిసి గౌతమ్ మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఉన్న గౌతమ్ ప్రమాదవశాత్తూ నాలుగో అంతస్తు పై నుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు ఘటనా స్థలాలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సమంత మళ్లీ మాయ చేస్తుందట..!
హైదరాబాద్: టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రంతోనే టాప్ లెవల్ కి ఎదిగిన హీరోయిన్ సమంత రుతు ప్రభు(29). ఫస్ట్ మూవీతోనే యూత్ లో మాంచి క్రేజ్ కొట్టేసిన సామ్ తన మొదటి రీల్ హీరోనే రియల్ హీరోగా ఎంచుకుంది. అయితే మళ్లీ 'ఏ మాయ చేశావే' లాంటి లవ్ స్టోరీ మూవీని త్వరలోనే చేయబోతోందిట. అక్కినేని నట వారసుడు, టాలీవుడ్ టాప్ స్టార్ నాగచైతన్యతో నటించిన'ఏ మాయ చేశావే' లాంటి మరో సినిమాను చేయబో్తోందిట. తొలి సినిమాతోనే మాయ చేసిన ఈ అమ్మడు త్వరలోనే అలాంటి సినిమా చేయబోతున్నానంటూ స్వయంగా వెల్లడించింది. సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని చెప్పింది. ఏ మాయ చేశావే లాంటి అద్భుతమైన ప్రేమ కథా చిత్రం మళ్లీ ఎపుడు చేయబోతున్నారని పుప్పాల గౌతం ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. దానికి సమంత సూన్ అని సమాధానం చెప్పింది. దీంతో మరోసారి లవ్ స్టోరీ చేయనుందనే ఆనందంలో మునిగిపోయారట అభిమానులు. మరోవైపు సూన్ అని సింపుల్ గా తేల్చేసిందా? లేక రీల్ లైఫ్ లో నిజంగానే మరోసారి మాయ చేయనుందా అనే డైలమాలో పడిపోయారట. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సమంత.. తనకు వర్క్ పవరంగా 2017 కొంచెం కష్టమైన సంవత్సరమని చెప్పింది. పెళ్లి తరువాత సినిమాల్లో నటిస్తానని స్పష్టంచేసిన ఈ ఏడాది5,6 సినిమాలు చేస్తున్నట్టు వెల్లడించింది. దీంతోపాటు 2016 లో తనకిష్టమైన మూవీ దంగల్ అని చెప్పింది. కాగా ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమ్మూ బృందావనం, దూకుడు ఈగ ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది , 24, అ ఆ తదితర చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. మరోవైపు టాలీవుడ్ సూపర్ స్టార్స్ సమంత- నాగచైతన్య ప్రేమ, పెళ్లి ఇండస్ట్రీలో హాట్ టాపిక్. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. Soon -
ఆసక్తి రేపుతున్న 'మను' ఫస్ట్ లుక్
హైదరాబాద్: టాలీవుడ్ లో బ్రేక్ కోసం అష్టకష్టాలుపడుతున్న యువ హీరో, సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం కొడుకు గౌతమ్ తాజా చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. గౌతం హీరోగా తెరకెక్కుతున్న రాబోయే చిత్రం 'మను' ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మరో హాస్యనటుడు వెన్నెల కిషోర్ ఈ మను ఫస్ట్ లుక్ ను రీట్విట్ చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ ' మను' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరినీ మెప్పించేందుకు కష్టపడ్డట్టేకనిపిస్తోంది. కాగా 'పల్లకిలో పెళ్లి కూతురు' ,'వారెవ' , ' బసంతి' సినిమాలతో తెరకు పరిచయమయ్యాడు గౌతం. నటన పరంగా మార్కులు బాగానే పడినప్పటికీ, ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా విజయం సాధించలేకపోయాయి.. దీంతో ఈ యంగ్ హీరో ఈసారి ఎలాగైన సక్సెస్ సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. గౌతం హీరోగా సినిమాలు తీసి ఇప్పటికే చేతులు కాల్చుకున్న పలువురు నిర్మాతలకు ఈ సారైనా గుడ్ న్యూస్ అందిస్తాడా.. వేచి చూడాల్సిందే. And #Manu First look -
గౌతం పోజిచ్చి.. మహేశ్ క్లిక్ చేస్తే.. ఖలీఫా అదృశ్యం!
నిజమే మన హీరోలకు సినిమాల్లో ఏదైనా సాధ్యమే. వారు తలుచుకుంటే ప్రపంచంలో అతిపెద్ద నిర్మాణమైనా బూర్జు ఖలీపానైనా కనపించకుండా కనుమరుగు చేయగలరు. కానీ నిజజీవితంలోనూ అలాంటి రేరెస్ట్ ఫీట్‌ను టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, ఆయన తనయుడు గౌతం ఆల్మోస్ట్ సాధించారు! విషయమేమిటంటే షూటింగ్‌లతో బిజీగా ఉన్న మహేశ్‌బాబు కాస్తా తీరిక చేసుకొని.. కుటుంబంతో కలిసి దుబాయ్ విహారానికి వెళ్లారు. దుబాయ్ ఆయన ఫేవరెట్ హాలీడే స్పాట్. ప్రస్తుతం అక్కడ ఎంజాయ్ చేస్తున్న మహేశ్‌బాబు ఓ అరుదైన ఫొటోను తన అభిమానులతో ట్వీట్టర్లో పంచుకున్నారు. ప్రపంచంలో అతిపెద్ద నిర్మాణమైన బూర్జు ఖలీఫా వాతావరణ ప్రభావంతో మేఘాలలో కలిసిపోగా.. దాని ఎదురుగా గౌతం పోజును మహేశ్ ఫొటోలో బంధించారు. ఆ ఫొటోను ట్విట్టర్లో పెట్టి.. 'అరుదైన దృశ్యం. బూర్జు ఖలీఫా మేఘాలలో అదృశ్యమైంది. అవాస్తవిక వాతావరణం దుబాయ్‌లో ఇది. లవ్ ఇట్' అంటూ ఆయన పంచుకున్నారు. అన్నట్టు మహేశ్‌బాబు తాజా సినిమా 'బ్రహోత్సవం' టీజర్ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు విడుదల కానుంది. A rare sight ..The Burj Khalifa disappears into the clouds ..unreal weather in Dubai .love it. pic.twitter.com/dRhTkIi0rr — Mahesh Babu (@urstrulyMahesh) December 26, 2015 -
'బసంతి' ఆడియో రిలీజ్ హైలెట్స్
-
'1 నేనొక్కడినే' వాల్ పోస్టర్స్