Super Star Krishna Meets Sitara And Gautam, Deets Here - Sakshi
Sakshi News home page

Namrata shirodkar : అది ఎప్పుడూ మిస్‌ చేసుకోం.. ప్రేమిస్తూనే ఉంటాం

Mar 8 2022 9:53 AM | Updated on Mar 8 2022 4:57 PM

Meets Super Star Krishna with Sitara And Gautam - Sakshi

Superstar Krishna Best Moments With His Grandchildren: సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు మంచి ఫ్యామిలీ పర్సన్‌ అని అందరికి తెలిసిందే. స్టార్‌  హీరో అయినప్పటికీ తన కుటుంబ సభ్యులతో ఎప్పుడు నార్మల్‌గానే ఉంటాడు. విరామం దొరికితే చాలు ఫ్యామిలీతో టూర్స్‌ వేస్తుంటాడు. ఇది తన తండ్రి సూపర్‌ స్టార్‌ కృష్ణ నుంచే నేర్చుకున్నానని మహేశ్‌ చెబుతుంటాడు. అప్పట్లో   కృష్ణ ఫుల్‌ బీజీగా ఉన్నప్పటికీ.. కుటుంబానికి మాత్రం సమయం కేటాయించేవాడట. ప్రతి రోజు ఉదయం కచ్చితంగా ఫ్యామిలీతో కలిసి టిఫిన్‌ చేసేవాడట. రాత్రి పిల్లలతో మాట్లాడేవాడట. ఇప్పుడు మహేశ్‌ కూడా అదే వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. షూటింగ్‌ లేకుండా ఖాలీగా ఉంటే.. ఆ సమయాన్ని అంతా ఫ్యామిలీకే కేటాయిస్తాడు. అలాగే వారానికి ఒక్క రోజు అయినా.. తన ఫ్యామిలీ అంతా కృష్ణ ఇంట్లో గడుపుతుంటుందట. తాజాగా ఈ విషయాన్ని నమ్రత సోషల్‌ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. 

సూపర్ స్టార్ కృష్ణ, సితార, గౌతమ్ ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. ‘మండే లంచ్.. ఎప్పుడూ మిస్ అవ్వం.. ఎన్నో కథలు చెబుతుంటారు.. ఆయన్నుంచి ఎంతో నేర్చుకోవచ్చు.. మేం అంతా కూడా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం మామయ్య గారు’అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఫోటో చూసి మహేశ్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇక మహేశ్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన  పరుశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement