
Kajal Agarwal Shocking Decision About her Husband: హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన భర్త విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆమె భర్త గౌతమ్ కిచ్లును సినిమాల్లోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చందమామ ప్రయత్నాలు మొదలుపెట్టిందట. గతేడాది గౌతమ్‌ను పెళ్లి చేసుకున్న కాజల్ త్వరలోనే భర్తను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకొంటుందట. తాను సైన్ చేసిన సినిమాల్లో గౌతమ్‌కి కూడా ఏదైనా రోల్ ఇప్పించమని మేకర్స్‌ను కోరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.చదవండి: పుష్ప: హాట్ టాపిక్‌గా మారిన సమంత రెమ్యునరేషన్
అంతేకాకుండా పాత్ర చిన్నదైనా పర్వాలేదని, కానీ కీలకంగా ఉండాలని కండీషన్లు సైతం పెడుతుందట. గతంలో వీరిద్దరూ కలిసి తమ బిజినెస్ కోసం ఓ యాడ్ షూట్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భర్తతో కలిసి బిగ్ స్క్రీన్‌ను షేర్ చేసుకోవాలని కాజల్ తాపత్రయపడుతుందట. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది.
చదవండి: అలా వెళ్తేనే ఆఫర్లు వస్తాయా?..భూమిక షాకింగ్ కామెంట్స్
బాక్సింగ్ లెజెండ్‌తో లైగర్ విజయ్..ఫోటో వైరల్
Comments
Please login to add a commentAdd a comment