ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్-7 మరింత ఆసక్తిమారంగా మారింది. ఇప్పటికే ఐదువారాలు పూర్తి కాగా.. ఐదుగురు కంటెస్టెంట్స్ సొంతింటికి వచ్చేశారు. అయితే ఈవారంలో నామినేషన్స్ టైంలో ఇద్దరు ఎలిమినేట్ కావొచ్చని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా ఒకరని సీక్రెట్ రూమ్‌లోకి పంపారు బిగ్ బాస్. ఈ వారంలో శుభశ్రీ రాయగురు ఇంటిముఖ పట్టింది. అయితే ఎలిమినేషన్ తర్వాత శుభశ్రీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. హౌస్మేట్స్ గురించి తన అభిప్రాయాలను పంచుకుంది.
(ఇది చదవండి: 'గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అన్నాడు'.. బాలయ్య కామెంట్స్ వైరల్!)
నేను విన్నర్ అవుదామనే వచ్చాను కానీ కుదరలేదు.. అయితే హౌస్‌లో డీలక్స్ రూమ్‌లోని ఓ ప్లేస్‌ను చాలా మిస్సవుతున్నానని తెలిపింది. హౌస్‌లో లవ్ ట్రాక్స్ నడిచాయన్న ప్రశ్నకు శుభశ్రీ మాట్లాడుతూ.. ఆ ఛాన్సే లేదంటూ సమాధానమిచ్చింది. ఆ తర్వాత గౌతమ్‌తో చేతిలో ఒక బొమ్మ శుభశ్రీ నిజమేనా? అనడంతో.. అలాంటిదేం కాదంటూ చెప్పుకొచ్చింది. మీరు బయటికి రావడానికి ఎవరు కారణమని అనుకుంటున్నారు? అని ప్రశ్నించగా.. కచ్చితంగా అమర్దీప్ వల్లేనంటూ ఆన్సరిచ్చింది. అంతే కాదు హౌస్‌లో గౌతమ్ నమ్మదగిన వక్తి కాదని శుభశ్రీ వెల్లడించింది.
కాగా.. ఐదో వారంలో మొత్త ఏడుగురు నామినేట్ కాగా.. శివాజీకి అత్యధిక ఓట్లు వచ్చాయి. చివరిస్థానంలో నిలిచి శుభశ్రీ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. మరో కంటెస్టెంట్‌ను బిగ్ బాస్ సీక్రెట్లో బంధించాడు. ఇక ఇప్పటి నుంచి బిగ్ బాస్ 2.0 అంటూ మరో ఐదుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి తీసుకొచ్చారు.
(ఇది చదవండి: అతన్ని చూస్తే భయమేస్తోంది.. రిటైర్ అవుతానంటున్న బ్రహ్మజీ!)
Comments
Please login to add a commentAdd a comment