![Pooja Murthy Comments On Bigg Boss Housemates About Shivaji - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/25/Pooja-Murthy-Shivaji-01.jpg.webp?itok=3GSwa1Ry)
టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్‌లో మొదటి నుంచి మహిళా కంటెస్టెంట్స్‌ను ఎలిమినేట్ చేస్తూ వచ్చిన బిగ్ బాస్.. 2.0లోనూ అదే సాంప్రదాయం కొనసాగించారు. వరుసగా ఏడో వారంలోనూ లేడీ కంటెస్టెంట్ పూజా మూర్తిని ఎలిమినేట్ చేశారు. అయితే హౌస్ నుంచి బయటకొచ్చిన పూజా.. కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె చాలా విషయాలు పంచుకుంది. శివాజీ వల్లే ఆ ఇద్దరు ఆడుతున్నారా? అని యాంకర్ ప్రశ్నించగా.. పూజా ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చింది.
(ఇది చదవండి: నాలుగు కోట్ల కారు కొన్న స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!)
'పల్లవి ప్రశాంత్, యావర్‌కు శివాజీ సపోర్ట్‌గా ఉన్నారు. అంటే వాళ్ల గేమ్ వాళ్లు ఆడుతున్నారు. మనం కేవలం కొంతవరకు పుష్ చేయగలం. కానీ శివాజీ మాత్రం కాస్త ఎక్కువే సపోర్ట్ చేస్తున్నారు. వారంతా కలిసి బ్యాలెన్స్‌డ్‌గానే ఉన్నారు. వీళ్లిద్దరికైతే అందరికంటే ఎక్కువ మద్దతు ఇస్తున్నారు. తను ఆడట్లేదు, కానీ ఆడిస్తున్నాడు. ఆడట్లేదని చెప్పి నామినేట్ చేస్తే మాత్రం అసలు ఒప్పుకోడు.
ఇక అమర్‌దీప్ నాకు బయట కూడా బాగా తెలుసు. కానీ హౌస్‌లోకి వెళ్లాక పూర్తిగా మారిపోయాడు. తన ఒరిజినల్ క్యారెక్టర్‌ను వదిలేశాడు. నేను అందగాన్ని అంటూ రెచ్చిపోయే అమర్.. అక్కడ పూర్తిగా డీలా పడిపోయాడు. నేను అతనితో కలిసి పనిచేశా. నేను చూసిన అమర్.. లోపల కనిపిస్తున్న అమర్ వేరు. అతను తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు' అని తెలిపింది.
(ఇది చదవండి: స్టార్ కమెడియన్ కూతురు బర్త్ డే.. హాజరైన అగ్ర హీరోలు!)
Comments
Please login to add a commentAdd a comment