Pooja Murthy
-
శివాజీ ఆడట్లేదు.. అతడు క్యారెక్టర్ వదిలేశాడు!: పూజా
టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్లో మొదటి నుంచి మహిళా కంటెస్టెంట్స్‌ను ఎలిమినేట్ చేస్తూ వచ్చిన బిగ్ బాస్.. 2.0లోనూ అదే సాంప్రదాయం కొనసాగించారు. వరుసగా ఏడో వారంలోనూ లేడీ కంటెస్టెంట్ పూజా మూర్తిని ఎలిమినేట్ చేశారు. అయితే హౌస్ నుంచి బయటకొచ్చిన పూజా.. కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె చాలా విషయాలు పంచుకుంది. శివాజీ వల్లే ఆ ఇద్దరు ఆడుతున్నారా? అని యాంకర్ ప్రశ్నించగా.. పూజా ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చింది. (ఇది చదవండి: నాలుగు కోట్ల కారు కొన్న స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!) 'పల్లవి ప్రశాంత్, యావర్‌కు శివాజీ సపోర్ట్‌గా ఉన్నారు. అంటే వాళ్ల గేమ్ వాళ్లు ఆడుతున్నారు. మనం కేవలం కొంతవరకు పుష్ చేయగలం. కానీ శివాజీ మాత్రం కాస్త ఎక్కువే సపోర్ట్ చేస్తున్నారు. వారంతా కలిసి బ్యాలెన్స్డ్గానే ఉన్నారు. వీళ్లిద్దరికైతే అందరికంటే ఎక్కువ మద్దతు ఇస్తున్నారు. తను ఆడట్లేదు, కానీ ఆడిస్తున్నాడు. ఆడట్లేదని చెప్పి నామినేట్ చేస్తే మాత్రం అసలు ఒప్పుకోడు. ఇక అమర్దీప్ నాకు బయట కూడా బాగా తెలుసు. కానీ హౌస్‌లోకి వెళ్లాక పూర్తిగా మారిపోయాడు. తన ఒరిజినల్ క్యారెక్టర్‌ను వదిలేశాడు. నేను అందగాన్ని అంటూ రెచ్చిపోయే అమర్.. అక్కడ పూర్తిగా డీలా పడిపోయాడు. నేను అతనితో కలిసి పనిచేశా. నేను చూసిన అమర్.. లోపల కనిపిస్తున్న అమర్ వేరు. అతను తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు' అని తెలిపింది. (ఇది చదవండి: స్టార్ కమెడియన్ కూతురు బర్త్ డే.. హాజరైన అగ్ర హీరోలు!) -
నువ్వసలు ఆడటానికే వచ్చావా? అన్న గీతూ.. దండం పెట్టేసిన పూజా
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ పేరుకు తగ్గట్లే అంతా ఉల్టాపుల్టాగా సాగుతోంది. ప్రేక్షకులు మాకొద్దు బాబోయ్ అని దండం పెట్టేసిన కంటెస్టెంట్ రతిక రోజ్‌ను తిరిగి హౌస్‌లోకి తీసుకురావడం.. షో మొదలైన నెల రోజులకు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కొత్తగా ఐదుగురు హౌస్‌లో ఎంట్రీ ఇవ్వడం.. ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. నిన్నటి సండే ఎపిసోడ్లో నిజాయితీగా గేమ్ ఆడిన పూజా మూర్తిని బయటకు పంపించేసి నెగెటివిటీ పోగు చేసుకున్న రతికాను హౌస్‌లోకి పంపించారు. అప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది హౌస్‌లో అడుగుపెట్టిన రెండు వారాలకే ఎలిమినేట్ అయిన పూజా మూర్తి తాజాగా బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొంది. ఇంటర్వ్యూలో తన ఫ్రస్టేషన్‌ను బయటపెట్టింది. తనను తుప్పాస్ కారణాలతో నామినేట్ చేశాడంటూ తేజ ఫోటోను ముక్కలు ముక్కలుగా చించేసింది. తనకు బదులుగా అశ్విని, భోలె షావళిలలో ఎవరైనా ఒకరిని పంపించేయాల్సిందని అభిప్రాయపడింది. ఒక మనిషిని కింది నుంచి పైదాకా చూసి హా.. నువ్వు ఫిజికల్లీ స్ట్రాంగ్లే అన్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది.. అశ్విని అలా చేసినప్పుడు తనకు పట్టరానంత కోపం వచ్చిందని పేర్కొంది. తర్వాత రైతుబిడ్డ ఫోటోను చింపేసింది. గైడ్ చేయడం కూడా ఒక గేమ్.. లోపల ఉన్నవాళ్లలో కొందరు ఆడకుండానే హౌస్‌లో ఎలాగోలా నెగ్గుకొస్తున్నారంది. ఇంతలో గీతూ.. నువ్వు హౌస్‌మేట్స్‌తో కలిసి ఆడటానికి వచ్చారా? వారిని ఎంకరేజ్ చేయడానికి వచ్చారా? అని సూటిగా ప్రశ్నించింది. తాను గైడ్ చేశానని, అది కూడా గేమే అని ఒప్పేసుకుంది పూజా. అయితే అంతిమ విజయం ఆటగాడిదే, కానీ కోచ్‌ది కాదని కౌంటరిచ్చింది గీతూ రాయల్. దీంతో ఆమె ప్రశ్నలకు దండం పెట్టేసింది పూజా మూర్తి. అయితే గీతూ చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఉందంటున్నారు నెటిజన్లు. ప్లేయర్ గెలుస్తాడు, కానీ కోచ్ కాదన్నది శివాజీకి కూడా వర్తిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: బిగ్‌బాస్.. పూజా మూర్తి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? -
బిగ్ బాస్ పూజాకు టాప్ రెమ్యునరేషన్ .. 'యావర్' కంటే ఎక్కువే
బిగ్ బాస్ 7వ సీజన్లో ఇప్పటి వరకు ఏడు వారాలు పూర్తి అయ్యాయి. కానీ బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ జరగని రీతిలో ఏడో వారంలో కూడా అమ్మాయినే (పూజా మూర్తి) ఎలిమినేట్ అయింది. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన పూజా మూర్తి కేవలం రెండు వారాలు మాత్రమే హౌజ్‌లో నిలబడింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన పూజా ఎక్కడా కూడా గేమ్‌లో అదుపు తప్పలేదు. ఓట్ల కోసం ట్రెండ్‌లో ఉన్న కంటెస్టెంట్ల వెంట తిరగలేదు. (ఇదీ చదవండి: ప్రభాస్ టార్గెట్ రూ. 5వేల కోట్లు.. పెళ్లి రూమర్స్‌పై ఏమన్నారు?) తనకు నచ్చిన విధంగానే ఉంటూ తన ఆటన కొనసాగించింది. ఎలాంటి వివాదాలకు ఛాన్స్ ఇవ్వకుండా గేమ్ ఆడింది.కానీ ఆమె ఆట తీరు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదనే చెప్పవచ్చు. గొడవలు పెట్టుకున్నా పర్వాలేదు కానీ కంటెంట్ ఎవరైతే ఇస్తారో వారికే ఎక్కువగా ఓట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకు పూజా కూల్ గేమ్ పెద్దగా ఆడియన్స్‌కు రీచ్ కాలేదని చెప్పవచ్చు. పూజా పలు సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ఆమె మొదటగానే అందరితో పాటు బిగ్ బాస్ హౌజ్‌లోకి రావాల్సి ఉంది. కానీ ఆమె తండ్రి హఠాత్తుగా మరణించడంతో వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చింది. అలా హౌస్‌లో రెండు వారాలు కొనసాగిన పూజా రెమ్యునరేషన్‌గా రూ. 4 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఒక వారానికి రూ.2 లక్షలు. బిగ్ బాస్‌లో యాంగ్రీమెన్‌గా కొనసాగుతున్న ప్రిన్స్ యావర్ అందరి కంటే తక్కువగా ఒక వారానికి లక్ష రూపాయలు తీసుకుంటున్నాడని టాక్. -
Bigg Boss 7: గేమ్ పేరు చెప్పి మోసం? నవ్వుతున్నారనే సోయి లేకుండా!
బిగ్‌బాస్ షోలో మళ్లీ షాకింగ్ ఎలిమినేషన్. అలానే అందరూ ఊహించిన కంటెస్టెంట్ రీఎంట్రీ వచ్చింది. దసరా సందర్భంగా ఎపిసోడ్ ఓ రేంజులో ప్లాన్ చేశారు. కానీ అది అలా అలా సాగింది. ఆటలు, పాటలు, కన్నీళ్లు.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్ బయటకొచ్చాయి. కానీ ఓ విషయమే ప్రేక్షకులకు గుండెల్లో గునపంలా గుచ్చుకుంది. మళ్లీ మళ్లీ ఆలోచించేలా చేసింది. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 49 హైలైట్స్‌లో చూద్దాం. దసరా స్పెషల్ తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి కొనసాగుతోంది. బిగ్‌బాస్ హౌసులోనూ పండగ సరదాతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఫుల్ కలర్ఫుల్గా రెడీ అయి వచ్చిన నాగార్జున.. హౌస్‌మేట్స్‌కి దసరా శుభాకాంక్షలు చెప్పాడు. దసరా(DASARA)లో ఆరు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఆరు గేమ్స్ పెడతానని, వీటిలో గెలిచినవాళ్లకి సర్ప్రైజులు ఉంటాయని చెప్పాడు. ఈ పోటీల్లో ఇరుజట్లు చెరో మూడింట్లో గెలిచి సమంగా నిలిచాయి. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' గౌతమ్ హీరోగా కొత్త సినిమా.. నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్) ఫస్ట్ టైమ్ ఏడ్చిన శోభా, యవర్ బిగ్‌బాస్‌లోకి వచ్చిన తర్వాత శోభా, యవర్ పెద్దగా ఏడవడం ఎవరూ చూడలేదు. వీళ్లు అలా స్ట్రాంగ్‌గా ఉండి ఆడుతున్నారు. ఆదివారం పెట్టిన గేమ్స్‌లో గెలిచిన తర్వాత ఇంటి నుంచి వీళ్లకు లెటర్స్ వచ్చాయి. తమ ఇంటి సభ్యులు తమ గురించి రాయడం, వాటిని వీళ్లు చదువుతూ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ ఎమోషనల్ చేసింది. నామినేషన్స్ నుంచి సేవ్ అయినప్పుడు తేజ కూడా నాన్నని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇలా అందరినీ ఎంటర్టైన్ చేసే వీళ్లు ఎమోషనల్ కావడం డిఫరెంట్‌గా అనిపించింది. పూజా ఎలిమినేట్ దసరా ఎపిసోడ్లో హీరోయిన్లు రెబా మోనికా జాన్, పాయల్ రాజ్‌పుత్.. డ్యాన్స్ ఫెర్ఫార్మెన్సులతో అదరగొట్టారు. యంగ్ సింగర్స్ వాగ్దేవి, లాలస, శిరీష పాటలతో అలరించారు. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా అమరదీప్, అశ్విని, తేజ, గౌతమ్, ప్రశాంత్ వరసగా సేవ్ అయ్యారు. పండగ కాబట్టి ఆయా కంటెస్టెంట్స్‌కి సంబంధించిన కుటుంబ సభ్యులే వచ్చి సేవ్ అయినట్లు చెప్పుకొచ్చారు. పూజా, భోలె మిగలగా.. పూజా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. మరోవైపు ఈవారం ఓ లేడీ కంటెస్టెంట్ రీఎంట్రీ ఉంటుందన్నారు. అలా రతిక.. బిగ్‌బాస్‌లోకి తిరిగి అడుగుపెట్టింది. (ఇదీ చదవండి: చిన్నప్పటి ఫ్రెండ్ కోసం కదిలొచ్చిన చిరంజీవి.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లి!) ప్రేక్షకులు మోసపోయారా? బిగ్‌బాస్‌లో ఎలిమినేషన్ అనేది ప్రేక్షకుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని హౌస్ట్ నాగార్జున పదే పదే చెబుతుంటాడు. అలాంటిది రతిక ఆట బాగోలేదనే కదా.. ఆమెని ఎలిమినేట్ చేసి బయటకు పంపేశారు. కానీ నిర్వహకులికి మాత్రం ఆమెని తిరిగి ఇంట్లోకి తీసుకురావాలని ప్లాన్. మరీ నేరుగా తీసుకొచ్చేస్తే షో క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. కాబట్టి దామిని, శుభశ్రీ, రతికలో ఒకరిని ఛాన్స్ ఉంటుందని కలరింగ్ ఇచ్చారు. బిగ్‌బాస్ సభ్యుల ఓట్ల ఆధారంగా ఈ ప్రక్రియ ఉంటుందని చెప్పారు. తీరా చూస్తే ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్లకి కాకుండా తక్కువ ఓట్లు వచ్చినవాళ్లు రీఎంట్రీ ఇస్తారని నాగార్జున అన్నాడు. దీంతో ప్రేక్షకులకు సీన్ అర్థమైపోయింది. రతికని తీసుకురావడానికే ఇదంతా చేస్తున్నారని తెలిసిపోయింది. ఆదివారం ఎపిసోడ్ చివర్లో ఆమె రీఎంట్రీ ఇవ్వడంతో ఇది కన్ఫర్మ్ అయిపోయింది. మొత్తంగా చూస్తే రతిక రీఎంట్రీ కోసం బిగ్‌బాస్ ఆర్గనైజర్స్.. ఓట్లేసిన ప్రేక్షకుల్ని నిర్ధాక్షిణ్యంగా మోసం చేశారనిపించింది. ఈ వారం పూజాని ఎలిమినేట్ చేసేశారు. బిగ్‌బాస్ ప్రస్తుతం సీజన్లో వరసగా వెళ్లిపోయిన ఏడో లేడీ కంటెస్టెంట్ ఈమె. అయితే ఏ సీజన్లోనూ జరగనంతా విచిత్రంగా ఈసారి ఎలిమినేషన్స్ సాగుతున్నాయి. అసలు ఏం చేస్తున్నారో? ఏ లాజిక్ ప్రకారం వరసగా లేడీ కంటెస్టెంట్స్‌ని ఎలిమినేట్ చేస్తున్నారనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇలాంటి వాటి వల్ల బిగ్‌బాస్ చూస్తున్న ఆ కొద్దిమంది కూడా ఓట్లేసినందుకు నవ్వుకుంటున్నారు! (ఇదీ చదవండి: 'అల వైకుంఠపురములో' నటుడికి నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?) -
బిగ్‌బాస్ 7: మళ్లీ షాకింగ్ ఎలిమినేషన్.. ఏడోవారం కూడా అమ్మాయే?
బిగ్‌బాస్ 7 సీజన్లో మరో షాకింగ్ ఎలిమినేషన్ తప్పేలా కనిపించడం లేదు. సాధారణంగా ఆదివారం ఇంటినుంచి బయటకు పంపిస్తూ ఉంటారు. కానీ ఈసారి అది శనివారం ఉండనుందట. అలానే వరసగా ఏడో వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇది మాత్రం ఓ రకంగా ట్విస్ట్ అని చెప్పొచ్చు. బిగ్‌బాస్‌లో అసలేం జరుగుతోంది? నామినేషన్స్‌లో ఏడుగురు ఈసారి నామినేషన్స్ హోరాహోరీగా జరిగాయి. పల్లవి ప్రశాంత్, అమరదీప్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, పూజామూర్తి, అశ్విని, భోలె షావళి ఈ లిస్టులో ఉన్నారు. వీళ్లలో ఓటింగ్ పరంగా చూసుకుంటే పల్లవి ప్రశాంత్, అమరదీప్ టాప్‌లో ఉన్నారు. మిగిలిన ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారా అనేది బుధవారం నుంచి చాలా సస్పెన్స్‌గా అనిపించింది. (ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'భగవంత్ కేసరి' డైరెక్టర్) భోలె ఓటింగ్ ట్విస్ట్ ఇక ఈ వారం నామినేషన్స్ సందర్భంగా బూతులు, ఆడపిల్లలపై కామెంట్స్ చేసి ఇరిటేషన్ తెప్పించి భోలె.. ఈసారి ఎలిమినేట్ అయిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ తర్వాత అతడు ఓటు బ్యాంక్ పెంచుకుని ఏకంగా మూడో స్థానానికి వచ్చేశాడు. గౌతమ్ మాత్రం మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయాడు. నాలుగులో తేజ ఉన్నట్లు తెలుస్తోంది. మళ్లీ అమ్మాయేనా? ఇక చివరి రెండు స్థానాల్లో అశ్విని, పూజామూర్తి ఉన్నారు. వీళ్లలో ఓటింగ్ పరంగా చూసుకుంటే పూజాకే తక్కువ శాతం ఉంది. దీంతో ఈసారి ఆమెనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు గట్టిగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరసగా ఆరువారాలపాటు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. మళ్లీ ఇప్పుడు అమ్మాయి అని టాక్ వినిపిస్తుండటం విచిత్రంగా అనిపిస్తుంది. చూడాలి మరి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది? (ఇదీ చదవండి: రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు) -
పాటబిడ్డ కుండ పగిలింది.. నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?
నయని పావని ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో 13 మంది మిగిలారు. ఇప్పటివరకు పాత కంటెస్టెంట్లను ఆటగాళ్లుగా కొత్తగా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను పోటుగాళ్లుగా విభజించిన సంగతి తెలిసిందే! నేటితో ఆ బేధాలు చెరిపేసి అందరూ సమానమే అని ప్రకటించాడు బిగ్‌బాస్. ఈ వారం కంటెస్టెంట్ల ఎదుట ఉన్న కుండను పగలగొట్టి నామినేషన్ చేయాలని తెలిపాడు. ప్రశాంత్.. సందీప్ మాస్టర్, అమర్‌దీప్‌లను నామినేట్ చేశాడు. ఇక అమర్.. అశ్వినిని నామినేట్ చేశాడు. ఈ క్రమంలో అశ్విని మాట్లాడుతూ అమర్‌కు బదులుగా ప్రశాంత్.. ప్రశాంత్.. అని రైతుబిడ్డ పేరు జపించింది. అనంతరం పాటబిడ్డ భోలెను నామినేట్ చేశాడు అమర్. ఇది చూసి నవ్వుకున్న భోలె.. పదేళ్ల పిల్లాడిలా కనపడుతున్నావ్ అన్నాడు. పూజా మూర్తి.. అశ్విని, భోలె షావళిని నామినేట్ చేసింది. ప్రోమో చూస్తుంటే ఎక్కువ ఓట్లు అశ్విని, భోలె షావళికి పడ్డట్లు కనిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ వారం అర్జున్, గౌతమ్, అమర్, భోలె, అశ్విని, తేజ, పూజ, శోభ, ప్రశాంత్ నామినేషన్లో ఉన్నారట! వీరిలో ఒకరిద్దరి పేర్లు అటుఇటుగా మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. శివాజీ హెల్త్ చెకప్, ట్రీట్మెంట్కు వెళ్లి తిరిగి హౌస్‌లోకి రానున్నాడు. -
బిగ్‌బాస్ ఎలిమినేషన్: వరుసగా ఆరో వారమూ అమ్మాయేనా?
బిగ్‌బాస్ హౌస్‌కు గ్లామర్ టచ్ కావాలంటే అమ్మాయిలుండాల్సిందే! అందుకే షో ప్రారంభంలో 14 మంది కంటెస్టెంట్లను తీసుకువస్తే అందులో ఏడుగురు అమ్మాయిలే ఉన్నారు. కానీ ఏం లాభం? వరుసపెట్టి అమ్మాయిలనే హౌస్ నుంచి పంపించేస్తూ వస్తున్నారు. అలా ఇప్పటివరకు ఐదుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. మొదట కిరణ్ రాథోడ్.. తనకు తెలుగు రావడం లేదని పంపించేశారు. షకీల.. కంటెంట్ కోసం అతి చేయకుండా హుందాగా వ్యవహరించింది. ఇలా ఒద్దికగా, పద్ధతిగా ఉంటే మాకెందుకు అనుకున్నారో ఏమో.. తననూ పంపించేశారు. అలా ఒక్కొక్కరూ వెళ్లిపోయారు దామిని.. సింగర్‌గా తన టాలెంట్ చూపించే ఈ బ్యూటీ కిచెన్‌లో వండి వార్చడానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. ఈ వంటలక్క మాకొద్దని తనను పంపించేశారు. రతిక రోజ్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నారంతా! పోయి పోయి పల్లవి ప్రశాంత్‌తో పెట్టుకుంది. అతడితోనే లవ్ ట్రాక్ నడిపి, వర్కవుట్ కాకపోవడంతో ప్లేటు తిప్పేసింది. అదే ఆమెను దెబ్బ కొట్టింది, ఆ దెబ్బకు బిగ్‌బాస్ హౌస్ బయటకు వచ్చి పడింది. శుభశ్రీ.. ఈ అందాల సుందాంగి గేమ్ ఆడటం మొదలుపెట్టింది. కానీ ఇంత ఆలస్యంగా గేమ్ స్టార్ట్ చేసి మా మనోభావాలు దెబ్బతీశావంటూ తనను కూడా ఎలిమినేట్ చేసేశారు. తేజ లేక హౌస్ డల్.. కాబట్టి అతడికి నో! నెక్స్ట్ ఎవరు? అన్నది అసలైన ప్రశ్న. ఈవారం నామినేషన్లో ఏడుగురు ఉన్నారు. అమర్దీప్, ప్రిన్స్ యావర్, తేజ, శోభా శెట్టి, నయని పావని, అశ్విని శ్రీ, పూజా మూర్తి.. వీరంతా నామినేషన్లో ఉన్నారు. ఇందులో అమర్దీప్, ప్రిన్స్ ఇప్పుడప్పుడే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్లు కానే కాదు. తేజ లేకపోతే హౌస్‌లో ఎంటర్టైన్మెంట్ అనేదే ఉండదు. కాబట్టి మరికొన్నాళ్లు అతడిని హౌస్‌లో ఉంచే ఛాన్స్ ఉంది. మిగిలిందల్లా నయని పావని, శోభ, అశ్విని, పూజా మూర్తి.. నలుగురూ ఆడపిల్లలే! వీరిలో శోభ ముందు నుంచీ ఉన్న కంటెస్టెంట్ కాబట్టి ఫాలోయింగ్ దండిగా ఉంటుంది, గండం గట్టెక్కుతుందనుకుంటున్నారేమో.. సోషల్ మీడియా నడుస్తున్న ప్రచారం ప్రకారం ఈ వారం మోనితనే ఎలిమినేట్ కానుందట! చేజేతులా ఎలిమినేషన్ కొనితెచ్చుకుంటున్న మోనిత తన తిక్కకు లెక్క లేదన్నట్లుగా ప్రవర్తిస్తోంది శోభా శెట్టి. గేమ్‌లో సవ్యంగా ఆడటానికి బదులు అడ్డదిడ్డంగా ఆడుతోంది. తనే తోపు అన్నట్లుగా మాట్లాడుతోంది. ప్రేక్షకులకు ఇదంతా చిరాకు తెప్పిస్తోంది. తనను పంపించేస్తే అప్పుడు తన గ్రూపులో ఉన్న మిగతా వాళ్లు కూడా సరైన దారిలోకి వస్తారని అభిప్రాయపడుతున్నారు. అయినా అశ్విని, పూజా, నయని ఉండగా శోభకు తక్కువ ఓట్లు రావడమేంటో అర్థం కావడం లేదని మరికొందరు తల గోక్కుంటున్నారు. ఏదేమైనా ఈ వారం కూడా అమ్మాయే ఎలిమినేట్ అయ్యేట్లు కనిపిస్తోంది. మరి బయటకు వెళ్లేది మోనితనా? లేదంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లా? అన్నది తెలియాల్సి ఉంది. చదవండి: శోభా ఓవరాక్షన్.. ఆటలో మరీ ఇంతలా దిగజారాలా? -
శోభా శెట్టి చిల్లర గేమ్.. అంతా అయ్యాక ఏడుపొకటి!
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ ప్రస్తుతం ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లుగా మారింది. మొదట్లో తమ ప్రతాపం చూపించిన పోటుగాళ్లు నెమ్మదిగా వెనకబడ్డారు. ఆరంభంలో ఓటమిపాలవుతూ వచ్చిన ఆటగాళ్లు తర్వాత వరుసగా విజయాలు అందుకుంటూ వచ్చారు. చివరకు ఇరు టీములు చెరి మూడు పాయింట్లతో సమానంగా నిలబడ్డారు. అదెలాగో తాజా(అక్టోబర్ 12) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం.. ఓటమి నుంచి పాఠాలు పల్లవి ప్రశాంత్ కెప్టెన్ అయ్యాడే కానీ ఆ నాయకుడి లక్షణాలైతే లేవు. ఇతడు అవతలి వారికి పని చెప్పడానికి బదులు అవతలి వారు ఏదైనా పని చెప్తుంటే చేసేస్తున్నాడు. అన్నింటినీ ఓ కంట గమనిస్తూనే ఉన్న బిగ్‌బాస్ ప్రశాంత్ దగ్గరున్న కెప్టెన్సీ బ్యాడ్జ్ తీసుకుని ఏడిపించిన సంగతి తెలిసిందే కదా! అయితే అది కేవలం వార్నింగ్ మాత్రమేనంటూ తిరిగి కెప్టెన్సీ బ్యాడ్జ్ వెనక్కు ఇచ్చేశాడు. ఇక అమర్.. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటున్నాడు. ఏదేమైనా ఆడాలి.. ఇచ్చిపడేయాలి.. అని తనలో తానే మాట్లాడుకున్నాడు. మేకప్ కోసం ప్రాణం పోతోంది మరోవైపు శోభా శెట్టి మేకప్ లేక ముఖం మాడ్చుకుని కూర్చుంది. ఇలా కూర్చుంటే అయ్యే పని కాదని పోటుగాళ్ల దగ్గర కాసింత మేకప్ అడిగి మరీ ముఖాన కొట్టుకుంది. అబ్బే, బిగ్‌బాస్ ఒప్పుకోలేదు, పనిష్మెంట్ ఇవ్వాల్సిందేనన్నాడు. దీంతో అర్జున్.. తేజ మూడు రోజులుగా వాడుతున్న టీషర్ట్‌ను వేసుకోవాలని చెప్పాడు. అది కంపు కొడుతున్నా చేసేదేం లేక ముక్కు మూసుకుని దాన్ని ధరించింది శోభా. ఎవరు స్మార్ట్? తర్వాత ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లలో ఎవరు స్మార్ట్ అనేది తేల్చేందుకు హూ ఈజ్ స్మార్ట్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో సినిమాలు, పాటలు, డైలాగులకు సంబంధించి రకరకాల ప్రశ్నలడిగాడు. ఇందులో ఆటగాళ్లే గెలిచారు. అయితే శోభా కాస్త ఓవర్ చేసింది. బిగ్‌బాస్ అడిగే ప్రశ్నకు ఏది కరెక్ట్ సమాధానం అనుకుంటారో దాన్ని మాత్రమే తీసుకుని బోర్డుపై పెట్టాలి. కానీ శోభ ఎందుకైనా మంచిది అన్నట్లుగా రెండు బోర్డులను పట్టుకుని నేనివ్వను అంటూ చిల్లరగా ప్రవర్తించింది. ఏడ్చేసిన శోభా శెట్టి అయితే రెండు బోర్డులు తీసుకున్నా సరైన సమాధానం చెప్పలేదులే అంటూ శోభా పరువు తీశాడు బిగ్‌బాస్. అలా రెండు బోర్డులు పట్టుకోకూడదని వార్నింగ్ ఇచ్చాడు. పూజా మూర్తితోనూ గొడవకు దిగింది శోభ. తను చెప్తే నీతులు, ఎదుటివాళ్లు చెప్తే బూతులా.. అని పూజా ఆగ్రహించింది. అయితే తన గురించి అలా సామెత చెప్పడం నచ్చలేదంటూ ఏడ్చేసింది మోనిత పాప.అనంతరం ఎవరు ఫోకస్ అనే టాస్క్ జరగ్గా ఇందులోనూ ఆటగాళ్లే గెలిచారు. దీంతో ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లు గేమ్ చెరి మూడు పాయింట్లతో టై అయింది. మరి నెక్స్ట్ బిగ్‌బాస్ ఏ గేమ్ ఇస్తాడు? ఎవరు గెలుస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: ముంబైకి షిఫ్ట్ అయిన మంచు లక్ష్మి.. ఆడిషన్స్‌కు కూడా రెడీ అంటూ.. పల్లవి ప్రశాంత్ గురించి ఆశ్చర్యపోయే విషయాలు చెప్పిన సోహైల్ -
బాడీ షేమింగ్ వల్ల గదిలో గుక్కపెట్టి ఏడ్చాను: నటి
గుండమ్మ కథ సీరియల్‌తో జనాలకు దగ్గరైంది పూజా మూర్తి. ఈమె కన్నడ అమ్మాయి. కానీ తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు లావుగా ఉన్నావంటూ చాలాసార్లు రిజెక్ట్ చేశారు. అలాంటి దెబ్బలు ఎదురైన ప్రతిసారి గదిలో కూర్చుని ఏడ్చేది. కానీ టాలెంట్‌ను ఎవరూ తొక్కేయలేరు. అందుకే తెలుగులో అవకాశాలు వచ్చాయి. తనేంటో నిరూపించుకుంది. బొద్దుగా ముద్దుగా కనిపించే ఈ బ్యూటీ బిగ్‌బాస్ 7 ప్రారంభమైన రోజే హౌస్‌లో అడుగుపెట్టాల్సింది. కానీ సరిగ్గా షో ప్రారంభమయ్యే కొద్ది రోజుల ముందు ఆమె ఇంట విషాదం నెలకొంది. తండ్రి కన్నుమూయడంతో ఆమె రియాలిటీ షోలో ఎంట్రీ ఇవ్వలేకపోయింది. తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది. ఎంట్రీ బాగుంది, మరి ఆట ఎలా ఉంటుందో చూడాలి!