
గుండమ్మ కథ సీరియల్‌తో జనాలకు దగ్గరైంది పూజా మూర్తి. ఈమె కన్నడ అమ్మాయి. కానీ తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు లావుగా ఉన్నావంటూ చాలాసార్లు రిజెక్ట్ చేశారు. అలాంటి దెబ్బలు ఎదురైన ప్రతిసారి గదిలో కూర్చుని ఏడ్చేది. కానీ టాలెంట్‌ను ఎవరూ తొక్కేయలేరు. అందుకే తెలుగులో అవకాశాలు వచ్చాయి. తనేంటో నిరూపించుకుంది.
బొద్దుగా ముద్దుగా కనిపించే ఈ బ్యూటీ బిగ్‌బాస్ 7 ప్రారంభమైన రోజే హౌస్‌లో అడుగుపెట్టాల్సింది. కానీ సరిగ్గా షో ప్రారంభమయ్యే కొద్ది రోజుల ముందు ఆమె ఇంట విషాదం నెలకొంది. తండ్రి కన్నుమూయడంతో ఆమె రియాలిటీ షోలో ఎంట్రీ ఇవ్వలేకపోయింది. తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది. ఎంట్రీ బాగుంది, మరి ఆట ఎలా ఉంటుందో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment