నువ్వసలు ఆడటానికే వచ్చావా? అన్న గీతూ.. దండం పెట్టేసిన పూజా | Bigg Boss 7 Telugu Buzz: Geetu Royal Interview with Pooja Murthy | Sakshi
Sakshi News home page

Pooja Murthy: వారిని ఎలిమినేట్‌ చేయాల్సిందంటూ రైతు బిడ్డ ఫోటో చింపేసిన పూజా

Published Mon, Oct 23 2023 1:00 PM | Last Updated on Tue, Oct 24 2023 7:38 PM

Bigg Boss 7 Telugu Buzz: Geetu Royal Interview with Pooja Murthy - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ పేరుకు తగ్గట్లే అంతా ఉల్టాపుల్టాగా సాగుతోంది. ప్రేక్షకులు మాకొద్దు బాబోయ్‌ అని దండం పెట్టేసిన కంటెస్టెంట్‌ రతిక రోజ్‌ను తిరిగి హౌస్‌లోకి తీసుకురావడం.. షో మొదలైన నెల రోజులకు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో కొత్తగా ఐదుగురు హౌస్‌లో ఎంట్రీ ఇవ్వడం.. ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. నిన్నటి సండే ఎపిసోడ్‌లో నిజాయితీగా గేమ్‌ ఆడిన పూజా మూర్తిని బయటకు పంపించేసి నెగెటివిటీ పోగు చేసుకున్న రతికాను హౌస్‌లోకి పంపించారు.

అప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది
హౌస్‌లో అడుగుపెట్టిన రెండు వారాలకే ఎలిమినేట్‌ అయిన పూజా మూర్తి తాజాగా బిగ్‌బాస్‌ బజ్‌లో పాల్గొంది. ఇంటర్వ్యూలో తన ఫ్రస్టేషన్‌ను బయటపెట్టింది. తనను తుప్పాస్‌ కారణాలతో నామినేట్‌ చేశాడంటూ తేజ ఫోటోను ముక్కలు ముక్కలుగా చించేసింది. తనకు బదులుగా అశ్విని, భోలె షావళిలలో ఎవరైనా ఒకరిని పంపించేయాల్సిందని అభిప్రాయపడింది. ఒక మనిషిని కింది నుంచి పైదాకా చూసి హా.. నువ్వు ఫిజికల్లీ స్ట్రాంగ్‌లే అన్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది.. అశ్విని అలా చేసినప్పుడు తనకు పట్టరానంత కోపం వచ్చిందని పేర్కొంది. తర్వాత రైతుబిడ్డ ఫోటోను చింపేసింది.

గైడ్‌ చేయడం కూడా ఒక గేమ్‌..
లోపల ఉన్నవాళ్లలో కొందరు ఆడకుండానే హౌస్‌లో ఎలాగోలా నెగ్గుకొస్తున్నారంది. ఇంతలో గీతూ.. నువ్వు హౌస్‌మేట్స్‌తో కలిసి ఆడటానికి వచ్చారా? వారిని ఎంకరేజ్‌ చేయడానికి వచ్చారా? అని సూటిగా ప్రశ్నించింది. తాను గైడ్‌ చేశానని, అది కూడా గేమే అని ఒప్పేసుకుంది పూజా. అయితే అంతిమ విజయం ఆటగాడిదే, కానీ కోచ్‌ది కాదని కౌంటరిచ్చింది గీతూ రాయల్‌. దీంతో ఆమె ప్రశ్నలకు దండం పెట్టేసింది పూజా మూర్తి. అయితే గీతూ చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఉందంటున్నారు నెటిజన్లు. ప్లేయర్‌ గెలుస్తాడు, కానీ కోచ్‌ కాదన్నది శివాజీకి కూడా వర్తిస్తుందని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: బిగ్‌బాస్‌.. పూజా మూర్తి రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement