శోభా శెట్టి చిల్లర గేమ్‌.. అంతా అయ్యాక ఏడుపొకటి! | Bigg Boss 7 Telugu Day 39 Episode Highlights: Shobha Shetty Worst Behavior In Who Is Smart Task - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Day 39 Highlights: శోభా ఓవరాక్షన్‌.. ఆటలో మరీ ఇంతలా దిగజారాలా?

Published Fri, Oct 13 2023 8:54 AM | Last Updated on Fri, Oct 13 2023 10:02 AM

Bigg Boss 7 Telugu: Shobha Shetty Worst Behavior in who is Smart Task - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ ప్రస్తుతం ఆటగాళ్లు వర్సెస్‌ పోటుగాళ్లుగా మారింది. మొదట్లో తమ ప్రతాపం చూపించిన పోటుగాళ్లు నెమ్మదిగా వెనకబడ్డారు. ఆరంభంలో ఓటమిపాలవుతూ వచ్చిన ఆటగాళ్లు తర్వాత వరుసగా విజయాలు అందుకుంటూ వచ్చారు. చివరకు ఇరు టీములు చెరి మూడు పాయింట్లతో సమానంగా నిలబడ్డారు. అదెలాగో తాజా(అక్టోబర్‌ 12) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం..

ఓటమి నుంచి పాఠాలు
పల్లవి ప్రశాంత్‌ కెప్టెన్‌ అయ్యాడే కానీ ఆ నాయకుడి లక్షణాలైతే లేవు. ఇతడు అవతలి వారికి పని చెప్పడానికి బదులు అవతలి వారు ఏదైనా పని చెప్తుంటే చేసేస్తున్నాడు. అన్నింటినీ ఓ కంట గమనిస్తూనే ఉన్న బిగ్‌బాస్‌ ప్రశాంత్‌ దగ్గరున్న కెప్టెన్సీ బ్యాడ్జ్‌ తీసుకుని ఏడిపించిన సంగతి తెలిసిందే కదా! అయితే అది కేవలం వార్నింగ్‌ మాత్రమేనంటూ తిరిగి కెప్టెన్సీ బ్యాడ్జ్‌ వెనక్కు ఇచ్చేశాడు. ఇక అమర్‌.. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటున్నాడు. ఏదేమైనా ఆడాలి.. ఇచ్చిపడేయాలి.. అని తనలో తానే మాట్లాడుకున్నాడు.

మేకప్‌ కోసం ప్రాణం పోతోంది
మరోవైపు శోభా శెట్టి మేకప్‌ లేక ముఖం మాడ్చుకుని కూర్చుంది. ఇలా కూర్చుంటే అయ్యే పని కాదని పోటుగాళ్ల దగ్గర కాసింత మేకప్‌ అడిగి మరీ ముఖాన కొట్టుకుంది. అబ్బే, బిగ్‌బాస్‌ ఒప్పుకోలేదు, పనిష్మెంట్‌ ఇవ్వాల్సిందేనన్నాడు. దీంతో అర్జున్‌.. తేజ మూడు రోజులుగా వాడుతున్న టీషర్ట్‌ను వేసుకోవాలని చెప్పాడు. అది కంపు కొడుతున్నా చేసేదేం లేక ముక్కు మూసుకుని దాన్ని ధరించింది శోభా.

ఎవరు స్మార్ట్‌?
తర్వాత ఆటగాళ్లు వర్సెస్‌ పోటుగాళ్లలో ఎవరు స్మార్ట్‌ అనేది తేల్చేందుకు హూ ఈజ్‌ స్మార్ట్‌ అనే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో సినిమాలు, పాటలు, డైలాగులకు సంబంధించి రకరకాల ప్రశ్నలడిగాడు. ఇందులో ఆటగాళ్లే గెలిచారు. అయితే శోభా కాస్త ఓవర్‌ చేసింది. బిగ్‌బాస్‌ అడిగే ప్రశ్నకు ఏది కరెక్ట్‌ సమాధానం అనుకుంటారో దాన్ని మాత్రమే తీసుకుని బోర్డుపై పెట్టాలి. కానీ శోభ ఎందుకైనా మంచిది అన్నట్లుగా రెండు బోర్డులను పట్టుకుని నేనివ్వను అంటూ చిల్లరగా ప్రవర్తించింది.

ఏడ్చేసిన శోభా శెట్టి
అయితే రెండు బోర్డులు తీసుకున్నా సరైన సమాధానం చెప్పలేదులే అంటూ శోభా పరువు తీశాడు బిగ్‌బాస్‌. అలా రెండు బోర్డులు పట్టుకోకూడదని వార్నింగ్‌ ఇచ్చాడు. పూజా మూర్తితోనూ గొడవకు దిగింది శోభ. తను చెప్తే నీతులు, ఎదుటివాళ్లు చెప్తే బూతులా.. అని పూజా ఆగ్రహించింది. అయితే తన గురించి అలా సామెత చెప్పడం నచ్చలేదంటూ ఏడ్చేసింది మోనిత పాప.అనంతరం ఎవరు ఫోకస్‌ అనే టాస్క్‌ జరగ్గా ఇందులోనూ ఆటగాళ్లే గెలిచారు. దీంతో ఆటగాళ్లు వర్సెస్‌ పోటుగాళ్లు గేమ్‌ చెరి మూడు పాయింట్లతో టై అయింది. మరి నెక్స్ట్‌ బిగ్‌బాస్‌ ఏ గేమ్‌ ఇస్తాడు? ఎవరు గెలుస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.

చదవండి: ముంబైకి షిఫ్ట్‌ అయిన మంచు లక్ష్మి.. ఆడిషన్స్‌కు కూడా రెడీ అంటూ..
పల్లవి ప్రశాంత్‌ గురించి ఆశ్చర్యపోయే విషయాలు చెప్పిన సోహైల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement