బిగ్ బాస్ 7వ సీజన్‌లో ఇప్పటి వరకు ఏడు వారాలు పూర్తి అయ్యాయి. కానీ బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ జరగని రీతిలో ఏడో వారంలో కూడా అమ్మాయినే (పూజా మూర్తి) ఎలిమినేట్ అయింది. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన పూజా మూర్తి కేవలం రెండు వారాలు మాత్రమే హౌజ్‌లో నిలబడింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన పూజా ఎక్కడా కూడా గేమ్‌లో అదుపు తప్పలేదు. ఓట్ల కోసం ట్రెండ్‌లో ఉన్న కంటెస్టెంట్ల వెంట తిరగలేదు.
(ఇదీ చదవండి: ప్రభాస్ టార్గెట్ రూ. 5వేల కోట్లు.. పెళ్లి రూమర్స్‌పై ఏమన్నారు?)
తనకు నచ్చిన విధంగానే ఉంటూ తన ఆటన కొనసాగించింది. ఎలాంటి వివాదాలకు ఛాన్స్ ఇవ్వకుండా గేమ్ ఆడింది.కానీ ఆమె ఆట తీరు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదనే చెప్పవచ్చు. గొడవలు పెట్టుకున్నా పర్వాలేదు కానీ కంటెంట్ ఎవరైతే ఇస్తారో వారికే ఎక్కువగా ఓట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకు పూజా కూల్ గేమ్ పెద్దగా ఆడియన్స్‌కు రీచ్ కాలేదని చెప్పవచ్చు.
పూజా పలు సీరియల్స్‌లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ఆమె మొదటగానే అందరితో పాటు బిగ్ బాస్ హౌజ్‌లోకి రావాల్సి ఉంది. కానీ ఆమె తండ్రి హఠాత్తుగా మరణించడంతో వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చింది. అలా హౌస్‌లో రెండు వారాలు కొనసాగిన పూజా రెమ్యునరేషన్‌గా రూ. 4 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఒక వారానికి రూ.2 లక్షలు. బిగ్ బాస్‌లో యాంగ్రీమెన్‌గా కొనసాగుతున్న ప్రిన్స్ యావర్ అందరి కంటే తక్కువగా ఒక వారానికి లక్ష రూపాయలు తీసుకుంటున్నాడని టాక్.
Comments
Please login to add a commentAdd a comment