
బిగ్‌బాస్ సీజన్-7 విన్నర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌కు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. ఆదివారం షో ముగిసిన తర్వాత పలువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ కార్లపై జరిగిన దాడులపై పోలీసులు సీరియస్ అయ్యారు. అమర్‌దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్లతో పాటు పలు ఆర్టీసీ బస్సులపై సైతం ఫ్యాన్స్ దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడులను సుమోటోగా స్వీకరించిన పోలీసులు పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని అభిమానులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే...
ఫినాలే ముగిసిన తర్వాత అమర్ తన కారులో ఇంటికి వెళ్లిపోతుంటే.. అతడి కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారు. వెనకవైపు అద్దం ధ్వంసం చేశారు. అలానే మరో కంటెస్టెంట్ అశ్విని, వీళ్లందరినీ ఇంటర్వ్యూలు చేసిన గీతూ రాయల్ కారుని కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. దీంతో గీతూ.. పోలీస్ కేసు పెట్టింది. ఇది కాదన్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ బయట ప్రశాంత్, అమర్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment