![Bigg Boss Latest Promo Touches Hearts With Family Members Letters - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/6/BIGG-BOSS-7-TELUGU-PROMO.jpg.webp?itok=qdeB2JdK)
ఈ ఏడాది బిగ్‌బాస్ చూస్తున్న వారు ఎప్పుడు కంటెస్టెంట్స్ మధ్య ఏదో గొడవ జరగడం తప్ప ఏముంది అని ఫీలవుతుంటారు. ఎందుకంటే మొదటి వారం నుంచే నామినేషన్స్, ఎలిమినేషన్స్‌తో హీటెక్కించారు. నాలుగు వారాలుగా హాట్‌హాట్‌గా సాగిన బిగ్‌బాస్.. ఐదో వారంలో మాత్రం ఎమోషనల్ టచ్ ఇచ్చారు. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే హౌస్‌లోని కంటెస్టెంట్స్‌కి.. తమ కుటుంబ సభ్యుల పట్ల భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది.
(ఇది చదవండి: త్యాగం చేసిన ఆ ఇద్దరు.. ఆటలోనే లేకుండా పోయిన మరో ఇద్దరు!)
తాజాగా ప్రోమో విడుదల కాగా.. అందులోని సీన్స్ ఆడియన్స్‌ను సైతం కంటతడి పెట్టించేలా ఉన్నాయి. అయితే బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు వారి ఇంటి సభ్యులు పంపించిన ఉత్తరాలు చేతికందించారు. కానీ కెప్టెన్సీ టాస్కులో భాగంగా ఇంట్లో ఉన్నవారంతా జోడీ కట్టిన సంగతి తెలిసిందే కదా! అలా ఈ జోడీలో ఒకరు త్యాగం చేస్తే.. మరొకరికి మాత్రమే ఉత్తరం చదువుకునే అవకాశం ఉంది. అంటే ఎవరో ఒకరు తమ ఉత్తరాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. దీంతో కంటెస్టెంట్ల మధ్య ఫుల్ ఎమోషనల్ సీన్స్ కనిపించాయి.
అయితే ఈ ప్రోమోలో అమర్‌దీప్ తన భార్యను తలుచుకుని కంటతడిపెట్టాడు. అమర్‌దీప్ మాట్లాడుతూ.. ఇంతవరకు తేజును బాగా చూసుకున్నానో లేదో కూడా నాకు తెలియదు. ఇక్కడ ఉన్నప్పుడు నాకు కొన్ని విలువలు తెలిసొచ్చాయి. కన్నాను చూడగానే అదే పిలిచినట్లు అనిపించింది. తేజు ఐ యామ్ సో సారీ. నీ విలువ తెలిసింది నాకు అంటూ బోరున ఏడ్చేశారు. ఆట సందీప్ కోసం తన భార్య పంపిన లెటర్‌ను అమర్ త్యాగం చేశాడని తెలుస్తోంది.
(ఇది చదవండి: చిన్నపిల్లాడిలా ఏడ్చిన తేజ, అమ్మ అనారోగ్యంతో ఉందంటూ సందీప్..)
ఇక శివాజీ, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మధ్య ఎమోషన్స్‌తో హౌస్ నిండిపోయింది. శివాజీ మాట్లాడుతూ..'ఎక్కడో ఊరి నుంచి వచ్చావు.. అన్న అంటూ హగ్ చేసుకున్నావ్.. నేను నా లెటర్‌ను గివ్ అప్ చేస్తున్నా. నా భార్య నన్ను బాగా అర్థం చేసుకుంటది. తనను నేను ఎంత బాగా చూసుకున్నానో నాకు తెలవదు కానీ.. నన్ను మాత్రం చాలా బాగా చూసుకుంటుంది. నువ్వు నా మాట విను అంటూ' పల్లవి ప్రశాంత్ కోసం తన భార్య పంపిన లెటర్‌ను శివాజీ త్యాగం చేసినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఈ ప్రోమో చూస్తేనే కంటెస్టెంట్స్ మధ్య భావోద్వేగాలు ఆడియన్స్‌ను సైతం ఫుల్ ఎమోషనల్‌గా టచ్ చేశాయి. ఇంకా ఈ రోజు ఎపిసోడ్‌లో ఎవరెవరు లెటర్స్‌ను త్యాగం చేశారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment