
టాలీవుడ్ నటి పావని రెడ్డి (Pavani Reddy) చాలాకాలంగా ప్రేమలో మునిగి తేలుతోంది. ఇప్పుడు ఆ ప్రేమను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అయింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానోచ్ అంటూ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. కొరియోగ్రాఫర్ ఆమిర్‌తో ఏప్రిల్ 20న పెళ్లి జరగనున్నట్లు వెల్లడించింది. ఈమేరకు స్పెషల్ వీడియో షేర్ చేసింది. అందులో ఒకరికొకరు తోడుంటామని సముద్రం సాక్షిగా మాటిచ్చుకున్నారు. ఈ వీడియోకు కలిసి జీవిద్దామని క్యాప్షన్ ఇచ్చింది.

తెలుగు, తమిళంలో సినిమాలు
కాగా పావని రెడ్డి.. తెలుగులో సీరియల్స్‌తో పాటు డబుల్ ట్రబుల్, డ్రీమ్, గౌరవం, లజ్జ చిత్రాలు చేసింది. తెలుగులో పెద్దగా గుర్తింపు లేకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. అక్కడ సినిమాలు చేస్తూనే మధ్యమధ్యలో టాలీవుడ్‌లోనూ యాక్ట్ చేసింది. అలా ప్రేమకు రెయిన్‌చెక్, మళ్లీ మొదలైంది, చారి 111 చిత్రాల్లో మెరిసింది. 2013లో తెలుగు నటుడు ప్రదీప్‌కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సడన్‌గా ఏమైందో ఏమో కానీ 2017లో ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు.
బిగ్‌బాస్ షోలో మొదలైన పరిచయం..
భార్య మరొకరితో చనువుగా ఉన్న ఫోటో చూసే అతడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ప్రచారం జరిగింది. ఈ ఘటనతో చాలారోజులపాటు పావని పేరు మీడియాలో మార్మోగిపోయింది. ఈ విషాదం తర్వాత పావని.. నిర్మాత ఆనంద్‌జాయ్‌ను పెళ్లి చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే అది నిజం కాదని ఆనంద్ క్లారిటీ ఇచ్చాడు. తమిళ బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో పాల్గొన్న పావని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ ఆమిర్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ కలిసే ఉంటున్నారన్న ప్రచారం కూడా జరిగింది. తాజాగా అతడితో రెండో పెళ్లికి సిద్ధమైంది.
చదవండి: నా భార్య చనిపోయేవరకు వీల్‌చైర్‌లోనే.. అదే చివరిమాట.. : చిన్నా
Comments
Please login to add a commentAdd a comment