pavani reddy
-
టాలీవుడ్ సెన్సేషనల్ నటి రెండో పెళ్లి.. ఎప్పుడంటే?
టాలీవుడ్ నటి పావని రెడ్డి (Pavani Reddy) చాలాకాలంగా ప్రేమలో మునిగి తేలుతోంది. ఇప్పుడు ఆ ప్రేమను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అయింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానోచ్ అంటూ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. కొరియోగ్రాఫర్ ఆమిర్‌తో ఏప్రిల్ 20న పెళ్లి జరగనున్నట్లు వెల్లడించింది. ఈమేరకు స్పెషల్ వీడియో షేర్ చేసింది. అందులో ఒకరికొకరు తోడుంటామని సముద్రం సాక్షిగా మాటిచ్చుకున్నారు. ఈ వీడియోకు కలిసి జీవిద్దామని క్యాప్షన్ ఇచ్చింది. తెలుగు, తమిళంలో సినిమాలుకాగా పావని రెడ్డి.. తెలుగులో సీరియల్స్‌తో పాటు డబుల్ ట్రబుల్, డ్రీమ్, గౌరవం, లజ్జ చిత్రాలు చేసింది. తెలుగులో పెద్దగా గుర్తింపు లేకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. అక్కడ సినిమాలు చేస్తూనే మధ్యమధ్యలో టాలీవుడ్‌లోనూ యాక్ట్ చేసింది. అలా ప్రేమకు రెయిన్‌చెక్, మళ్లీ మొదలైంది, చారి 111 చిత్రాల్లో మెరిసింది. 2013లో తెలుగు నటుడు ప్రదీప్‌కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సడన్‌గా ఏమైందో ఏమో కానీ 2017లో ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. బిగ్‌బాస్ షోలో మొదలైన పరిచయం..భార్య మరొకరితో చనువుగా ఉన్న ఫోటో చూసే అతడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ప్రచారం జరిగింది. ఈ ఘటనతో చాలారోజులపాటు పావని పేరు మీడియాలో మార్మోగిపోయింది. ఈ విషాదం తర్వాత పావని.. నిర్మాత ఆనంద్జాయ్ను పెళ్లి చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే అది నిజం కాదని ఆనంద్ క్లారిటీ ఇచ్చాడు. తమిళ బిగ్‌బాస్ ఐదో సీజన్లో పాల్గొన్న పావని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ ఆమిర్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ కలిసే ఉంటున్నారన్న ప్రచారం కూడా జరిగింది. తాజాగా అతడితో రెండో పెళ్లికి సిద్ధమైంది. View this post on Instagram A post shared by Pavni (@pavani9_reddy)చదవండి: నా భార్య చనిపోయేవరకు వీల్‌చైర్‌లోనే.. అదే చివరిమాట.. : చిన్నా -
రెండేళ్లుగా సహజీవనం.. రెండోపెళ్లికి నటి రెడీ..
పావనిరెడ్డి.. చూడగానే క్యూట్‌గా అనిపించే ఈ బ్యూటీ మొదట్లో సీరియల్స్ చేసింది. తర్వాత తెలుగు వెండితెరపై మెరిసింది. ది ఎండ్, డబుల్ ట్రబుల్, డ్రీమ్, లజ్జ అనే చిత్రాల్లో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు లేకపోవడంతో టాలీవుడ్‌ను వదిలేసి తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ కూడా సీరియల్స్‌తోనే తన కెరీర్ మొదలుపెట్టింది. 2013లో తెలుగు నటుడు ప్రదీప్‌కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరూ బాగానే ఉంటున్నారనుకున్న తరుణంలో 2017లో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటి భర్త పోవడంతో.. నటి మరొకరితో చనువుగా ఉన్న ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టడంతోనే అతడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని వార్తలు వెలువడ్డాయి. తర్వాత ఈమె పూర్తిగా చెన్నైలోనే సెటిలైపోయింది. అక్కడ ఆనంద్ జాయ్ అనే నిర్మాతను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ కొన్నాళ్లకే అందులో నిజం లేదని తేలిపోయింది. అనంతరం తమిళ బిగ్‌బాస్ ఐదో సీజన్లో పాల్గొంది. ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్ ఆమిర్.. పావనికి ప్రపోజ్ చేశాడు. అప్పటినుంచి వీరి మధ్య లవ్ జర్నీ మొదలైంది. ఇన్నాళ్లకు పెళ్లికి రెడీ.. బీబీ జోడీ రెండో సీజన్లో జంటగా పార్టిసిపేట్ చేయడమే కాక ట్రోఫీ గెలిచారు. రెండేళ్లుగా సహజీవనం కూడా చేస్తున్నారు. ఇన్నాళ్లకు పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యారు. జంటగా ఓ తమిళ మీడియాకు ఇంటర్వ్యూ చేసిన వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. పావని పుట్టినరోజైన నవంబర్ 9న వివాహం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇకపోతే పావని ఇటీవలే చారి 111 సినిమాలో నటించింది. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాటర్స్ అనే తెలుగు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. చదవండి: మొదటి భార్యకు విడాకులు.. ఈ తాగుబోతును పదేళ్లు భరించింది -
గర్భం దాల్చా.. అంతలోనే బ్రేకప్.. సీక్రెట్‌గా పెళ్లి!: నటి
సోషల్ మీడియా వచ్చాక నెటిజన్లే సెలబ్రిటీల పెళ్లిళ్లు చేస్తున్నారు. నచ్చకపోతే నెట్టింట్లోనే విడాకులు కూడా ఇచ్చేస్తున్నారు. కాలక్షేపం కోసం లేనిపోని పుకార్లు సృష్టిస్తూ.. మరికొన్నిసార్లు సెలబ్రిటీలనే విమర్శిస్తూ పబ్బం గడుపుతున్నారు. అలా ఎంతో మంది తారల రియల్ లైఫ్‌లో పెళ్లి జరగకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎన్నోసార్లు పెళ్లి జరిపించేశారు. తాజాగా ఈ ధోరణిపై సెటైర్ వేసింది తమిళ నటి పావని. బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించింది పావని రెడ్డి. తర్వాత తమిళ బిగ్‌బాస్ 5వ సీజన్లో నటించింది. ఈ రియాలిటీ షోలో పాల్గొన్న కొరియోగ్రాఫర్ ఆమిర్.. పావనిని చూడగానే ప్రేమలో పడ్డాడు. తనకు ప్రపోజ్ కూడా చేశాడు, కానీ పావని లైట్ తీసుకుంది. ఈ విషయం పక్కన పెడితే బిగ్‌బాస్ జోడీ డ్యాన్స్ షోలో వీరిద్దరూ జంటగా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమిర్‌కు దగ్గరైంది నటి. ఈ షోలో విజేతలుగా నిలిచిన ఈ జంట రియల్ లైఫ్‌లోనూ జోడీగా ఉండబోతున్నామని ప్రకటించింది. తునివు(తెగింపు) సినిమాలో వీరు ప్రేమపక్షులుగానూ నటించారు. ప్రస్తుతం ఈ జంట చెన్నైలో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అభిమానులు పెళ్లెప్పుడు? అంటూ వీరి వెంటపడుతున్నారు. తాజాగా ఓ అభిమాని మీ ఇద్దరికీ పెళ్లైపోయింది.. కానీ ఎందుకు దాచిపెడుతున్నారు, బయటకు చెప్పొచ్చుగా అని అడిగింది. దీనికి పావని స్పందిస్తూ.. పోయిన నెలలో నేను గర్భవతి అన్నారు. ఆ తర్వాత మేము బ్రేకప్ చెప్పుకున్నామన్నారు. ఇప్పుడేమో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నామంటున్నారు. మరి నెక్స్ట్ ఏం కహానీ చెప్పబోతున్నారేంటి? అంటూ తనదైన స్టైల్లో కౌంటరిచ్చింది. -
బిగ్‌బాస్ కంటెస్టెంట్: ప్రేమించి పెళ్లాడిన భర్త ఆత్మహత్య, రెండో పెళ్లి
Bigg Boss Tamil 5 contestant Pavani Reddy: తమిళ బిగ్‌బాస్ సీజన్5 మొదలైంది. కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ బిగ్‌బాస్ షోను గ్రాండ్‌గా లాంచ్ చేశాడు. అక్టోబర్ 3న ప్రారంభమైన తమిళ బిగ్‌బాస్ ఐదో సీజన్లో మొత్తంగా 18 కంటెస్టెంట్లు పాల్గొన్నారు. అయితే వారిలో మన తెలుగమ్మాయి పావని రెడ్డి సైతం ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో మోడలింగ్ చేసిన పావని రెడ్డి తర్వాత రెట్టా వాల్ కురువి సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగు పెట్టింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. చదవండి: భార్యను మూడోసారి పెళ్లి చేసుకున్న హిందీ నటుడు తెలుగులో అగ్నిపూలు, నా పేరు మీనాక్షి వంటి హిట్ సీరియల్స్‌లో నటించిన ఆమె ఆ తర్వాత ఆమె ది ఎండ్, డబుల్ ట్రబుల్, లజ్జ, డ్రీమ్ వంటి సినిమాల్లోనూ తళుక్కున మెరిసింది. అయితే ఆశించినంత గుర్తింపు రాకపోవడంతో తిరిగి తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది.అక్కడ ఆమెకు అవకాశాలు బాగానే వచ్చాయి. చిన్న తంబి, రసంతి సీరియల్స్ ద్వారా తమిళ ప్రేక్షకులకు ఆమె మరింత దగ్గరైంది. ఇక ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే.. 2013లో నటుడు ప్రదీప్ కుమార్‌ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. అయితే అతను 2017లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరోకరితో చనువుగా ఉన్న ఫోటోను ప్రొఫైల్ ఫోటోగా పెట్టడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అప్పట్లో ఈ వ్యవహారం తెలుగునాట హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పి చెన్నైలోనే సెటిల్ అయిపోయింది. భర్త చనిపోయిన సుమారు మూడేళ్లకు 2020లో ఆనంద్ జాయ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. మొత్తానికి తమిళ బిగ్‌బాస్ హౌస్‌లో పావని రెడ్డి ప్రేక్షకులను ఏ మేర మెప్పిస్తుందో చూడాలి. చదవండి: Bigg Boss Tamil 5: బిగ్‌బాస్‌లో పాల్గొన్న 18 మంది కంటెస్టెంట్లు వీళ్లే.. -
బీజేపీలో వర్గపోరు కలకలం
సాక్షి, విజయనగరం: జిల్లా బీజేపీలో వర్గపోరు కలకలం రేపింది. పార్టీలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిని ఒకరు తిట్టుకున్నారు. అసలు విషయంలోకి వెళితే.. గత శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర కోశాధికారిగా ఉంటూ పాకలపాటి సన్యాసిరాజు పార్టీ ఫండ్ పేరిట అవినీతి పాల్పడ్డారంటూ పావని రెడ్డి వర్గం ఫిర్యాదు చేసింది. తనపై ఫిర్యాదు చేశారన్న కారణంతో సన్యాసిరాజు పదవికి రాజీనామ చేశాడు. దీంతో అప్పటినుంచి పావని రెడ్డి, సన్యాసి రాజు మధ్య వర్గపోరు మొదలైంది. జిల్లాలో వీరిద్దరి వర్గ పోరుతో బీజేపీ ద్వితీయ శ్రేణి కేడర్ నిరుత్సాహంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం బీజేపీ రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్ నరసింహారావు ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. -
ప్రదీప్‌ది ఆత్మహత్యే.. కానీ!
బుల్లితెర నటుడు ప్రదీప్‌ది ఆత్మహత్యేనని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ప్రాథమికంగా తేల్చారు. అయితే ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రదీప్ భార్య పావని ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశౄరు. ప్రదీప్ తల్లి, సోదరి ఇద్దరి వద్ద స్టేట్మెంట్లు నమోదు చేశారు. మరోవైపు ప్రదీప్ అంత్యక్రియలు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మహా ప్రస్థానంలో గురువారం ఉదయం జరిగాయి. అంతకుముందు సినీ, టీవీ పరిశ్రమలకు చెందిన పలువురు నటీనటులతో పాటు విజయవాడ, కర్నూలు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ల బంధుమిత్రులు కూడా ప్రదీప్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ప్రదీప్ భార్య వాట్సప్‌లో ప్రొఫైల్ పిక్చర్‌ను కూడా మార్చుకునేంత వరకు వెళ్లాల్సింది కాదని, అయినా అది జీవితాన్ని బలితీసుకునే వరకు వెళ్తుందని అనుకోకపోవచ్చని టీవీ పరిశ్రమకు చెందిన నటులు, దర్శకులు అంటున్నారు. ఇద్దరూ ఒకే రంగంలో పనిచేస్తున్నప్పుడు ఒకరి కంటే మరొకరికి అవకాశాలు ఎక్కువ రావడం, సంపాదనలో కూడా తేడాలు ఉండటం లాంటి కారణాల వల్ల ఇద్దరికీ కూడా మానసికంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందని, దాన్ని భాగస్వాములు గుర్తించి తగిన విధంగా మెసులుకోవాలని మానసిక వైద్యనిపుణులు సూచిస్తున్నారు. -
ప్రదీప్‌ది ఆత్మహత్యే.. కానీ!
-
ప్రదీప్ అనుమానాస్పద మృతి
-
ప్రదీప్ అనుమానాస్పద మృతి
- ఫ్యాన్‌కు ఉరేసుకొని బుల్లితెర హీరో ఆత్మహత్య! - ఇంట్లో భార్యాభర్తలతో పాటు మరో వ్యక్తి శ్రవణ్ - రాత్రి వరకు బర్త్‌డే పార్టీ - వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌పై భార్య పావనితో గొడవ - బయటకెళ్లి గంట తర్వాత రాక.. మళ్లీ వాగ్వాదం - బెడ్రూంలోకి వెళ్లి గడియపెట్టుకున్న ప్రదీప్ - గదిలో పగిలిన అద్దాలు, రక్తపు మరకలు - సప్తమాత్రిక, నేను ఆయన ఆరుగురు అత్తలు సీరియల్స్‌లో నటిస్తున్న ప్రదీప్ - కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: బుల్లితెర హీరో ప్రదీప్ కుమార్ (29) బుధవారం అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఆయన భార్య దుర్గారెడ్డి అలియాస్ పావనిరెడ్డి చెబుతున్నారు. అయితే వారింట్లో శ్రవణ్ అనే మరో వ్యక్తి ఉండటం, డైనింగ్ టేబుల్‌పై మద్యం సీసా, ఆ సమీపంలో పగిలిన అద్దాలు ఉండటంతోపాటు ప్రదీప్ నుదుటిపై గాయం కావడంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సప్తమాత్రిక, నేను ఆయన ఆరుగురు అత్తలు సీరియల్స్‌లో ప్రదీప్ నటిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమ.. సహజీవనం.. పెళ్లి.. హైదరాబాద్ నగర శివార్లలోని నెక్నాంపూర్ గ్రామ పంచాయతీ గ్రీన్ ఐకానిక్ అపార్ట్మెంట్లో భార్య పావనిరెడ్డితో ప్రదీప్ నివసిస్తున్నారు. విజయవాడలో జన్మించిన ఈయన.. తన తల్లిదండ్రులు చెన్నైలో స్థిరపడటంతో అక్కడే విద్యను అభ్యసించారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి బీఎస్సీ కంప్యూటర్స్ పట్టా పొందారు. ప్రదీప్‌కు చిన్ననాటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది. విద్యార్థి దశలోనూ కొన్ని డ్రామాల్లో నటించారు. 2006లో విడుదలైన చుక్కల్లో చంద్రుడు సినిమాలో చిన్న పాత్ర పోషించారు. అదే సినిమాలో నటించిన పావని రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారినప్పటికీ జీవితాల్లో స్థిరపడిన తర్వాత వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే 2014 నుంచి ఇరువురూ సహజీవనం చేశారు. 2016 ఆగస్టు 21న పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రదీప్ ప్రస్తుతం తమిళ సీరియల్లోనూ నటిస్తున్నారు. అగ్నిపూలు, కుటుంబ గౌరవం సీరియళ్లలో హీరోయిన్గా నటించిన పావని ప్రస్తుతం.. నేను ఆయన ఆరుగురు అత్తలు సీరియల్లో ప్రదీప్‌తో కలసి హీరోయిన్గా నటిస్తున్నారు. ఎవరీ శ్రవణ్? విశాఖపట్నానికి చెందిన డి.శ్రవణ్ ఖతార్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. పావనిరెడ్డికి స్నేహితుడైన ఇతడు తరచుగా నెక్నాంపూర్‌లోని వీరి ఇంటికి వస్తుండేవాడు. గతంలో కేవలం సెలవులు ఇచ్చినప్పుడు ఒకట్రెండు రోజులు ఉండి వెళ్లేవాడు. ఈసారి మాత్రం మూడు నెలల క్రితం ప్రదీప్ ఇంటికి వచ్చిన శ్రవణ్ ఇక్కడే ఉండిపోయాడు. మంగళవారం శ్రవణ్ పుట్టినరోజు కావడంతో పావనిరెడ్డి, బంధువులు శ్రవణ్‌కుమార్ స్నేహితులు అదే ఫ్లాట్‌లో పార్టీ చేసుకున్నారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో సీరియల్ షూటింగ్ ముగించుకొని ఇంటికి వచ్చిన ప్రదీప్ సైతం ఈ పార్టీలో పాల్గొని మద్యం సేవించారు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో అతిథులంతా ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ఆ సమయంలో ప్రదీప్, పావని, శ్రవణ్ మాత్రమే ఇంట్లో మిగిలారు. ఘర్షణ ఎవరి మధ్య జరిగింది? పావనిరెడ్డి తన వాట్సాప్ డీపీగా శ్రవణ్‌తో కలిసి ఉన్న ఫొటో పెట్టినట్లు తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ప్రదీప్ ఈ విషయంపై పావనిని నిలదీశాడని సమాచారం. దీంతో వారి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే శ్రవణ్ సైతం కలగజేసుకున్నాడని, అతడికీ ప్రదీప్‌కు ఘర్షణ జరిగినట్లు అనుమానాలున్నాయి. ఆ సమయంలో ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయిన ప్రదీప్ గంటన్నర తర్వాత వచ్చాడని, మళ్లీ వాగ్వాదానికి ఉపక్రమించాడని పావని చెబుతున్నారు. తాను బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకో వడంతో ప్రదీప్ తీవ్రస్థాయిలో మందలిం చాడని, దీంతో బయటకు వచ్చానని పోలీసులకు తెలిపారు. ఆ తర్వాత ప్రదీప్ బెడ్రూమ్ లోకెళ్లి గడియ పెట్టుకున్నాడని తన వాంగ్మూ లంలో పేర్కొన్నారు. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో బెడ్రూమ్ తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో శ్రవణ్‌తో కలిసి బలవంతగా తలుపు తెరిచానని చెబుతు న్నారు. ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించాడని, 108కు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి చనిపోయాడని ధ్రువీకరించారని చెప్పారు. విధ్వంసం, గాయాలకు కారణం? ఘటనాస్థలి, అక్కడున్న పగిలిపోయిన వస్తువులు, రక్తం మరకలు, ప్రదీప్ ఒంటిపై ఉన్న గాయాలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వాట్సాప్ డీపీ విషయంలో జరిగిన గొడవ తర్వాత ప్రదీప్–పావని–శ్రవణ్ మధ్య ఏం జరిగిందనేది కీలకంగా మారింది. డైనింగ్ టేబుల్‌పై మద్యం సీసా ఉండటాన్ని బట్టి అక్కడే ప్రదీప్, శ్రవణ్ మద్యం సేవించినట్లు తెలుస్తోంది. దానికి సమీపంలో ఉన్న అద్దం, ఇతర వస్తువులు పగిలిపోయి చిందరవందరగా పడి ఉన్నాయి. ఆ ప్రాంతం నుంచి రక్తం మరకలు బెడ్రూమ్ వరకు ఉన్నాయి. దీనికి తోడు మృతుడి తలపై ఉన్న గాయం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రదీప్ కోపంతో బెడ్రూంలోకి వెళ్లాడనుకున్నా.. వెంట భార్య పావని ఎందుకు వెళ్లలేదన్నది అంతు చిక్కట్లేదు. ఉరి వేసుకున్న ప్రదీప్‌ను తాను, శ్రవణ్ కిందికి దింపామని, ఆ ప్రయత్నాల్లోనే కింద పడటంతో అతడి తలకు గాయమైందని పావని చెబుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌టీంతో ఘటనాస్థలిలో లభించిన శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. పావని వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమికంగా ఆత్మహత్యగా భావిస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వస్తే మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుందని నార్సింగ్ ఇన్స్పెక్టర్ రామ్‌చంద్రరావు చెప్పారు. మాకు ఎలాంటి అనుమానం లేదు: మృతుడి తల్లిదండ్రులు మా కుమారుడు ప్రదీప్ కుమార్ మరణంపై మాకు ఎలాంటి అనుమానాలు లేవు. పావనిరెడ్డి మమ్మల్ని బాగానే చూసుకునేది. చిన్నపాటి గొడవకే ఇంత దారుణానికి ఒడిగడతాడని ఊహించలేదు. శ్రవణ్ నాకు అన్న అవుతాడు: పావనిరెడ్డి శ్రవణ్‌తో కలిసి ఉన్న ప్రొఫైల్ పిక్ వల్లే గొడవ జరిగిందనేది అవాస్తవం. అతను నాకు అన్నయ్య అవుతాడు. మావారితో కలసి మెలసి ఉంటాడు. అలాగే ప్రదీప్ కుటుంబ సభ్యులతోనూ నాకు ఎలాంటి విభేదాలు లేవు. బుధవారం తెల్లవారుజామున మా మధ్య పెద్దగా గొడవ ఏమీ జరగలేదు. ఇంతకుమించి ఈ సమయంలో నేను ఎక్కువగా మాట్లాడలేను. గతంలో గొడవలు జరిగినా పెద్దగా పట్టించుకోలేదు. ఇలా చేస్తాడని ఊహించలేదు. బావ అంటూ సరదాగా ఉండేవాడు: శ్రవణ్‌రెడ్డి పావనిరెడ్డి నాకు సోదరి అవుతుంది. నేను ఖతార్‌లో ఉద్యోగం చేస్తుంటా. ప్రతి ఏడాది సెలవుల సమయంలో హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ నాలుగు ఐదు రోజులు ఉండి వెళుతుంటా. ఈసారి వీసా సమస్య వల్ల ఇక్కడే ఉండిపోయా. ఈ సమయంలో న్యూట్రిషన్ ప్రోగామ్ చేద్దామని ప్లాన్ చేశా. ప్రదీప్ భాగస్వామి అవుతా అన్నాడు. బుధవారం రాత్రి బర్త్‌డే జరిగాక 12.30 గంటలకు సిగరెట్ కాల్చి వస్తాను బావా అంటూ వెళ్లి గంటసేపటి తర్వాత వచ్చాడు. ఇంతసేపు ఎటు వెళ్లావని, ఆందోళనకు గురయ్యానని పావని అడిగింది. ఈ చిన్నపాటి గొడవ తర్వాత ప్రదీప్ బెడ్రూమ్కు వెళ్లడం, ఉదయం ఉరివేసుకొని కనిపించడం జరిగింది. అన్యోన్యంగా ఉండేవాళ్లు ప్రతి ఫ్రెండ్‌కు సంబంధించిన బర్త్‌డే పార్టీలు, ఫంక్షన్లు ఏమి ఉన్నా ఇద్దరూ అన్యోన్యంగా వచ్చి ఎంజాయ్ చేసేవాళ్లు. వాళ్ల వాళ్ల బర్త్‌డేలను సర్ప్రైజ్గా ప్లాన్ చేసి బాగా చేసుకునేవారు. ఏ ఫంక్షన్ అయినా హాజరయ్యేవారు. రెడ్ ఎఫ్ఎం రెడ్ కార్పెట్ ప్రోగ్రామ్‌లో బాహుబలి–2 రెండు టికెట్లు తీసుకొని సినిమాకు కూడా వెళ్లారు. అన్యోన్యంగా ఉండటంతో పాటు ఒక రిని ఒకరు బాగా చూసుకునేవారు. – చైతూ, రేడియో జాకీ -
ప్రదీప్ మృతి: శ్రావణ్ ఎవరు?
-
ప్రదీప్ మృతి: శ్రావణ్ ఎవరు?
హైదరాబాద్: ప్రముఖ టీవీ నటుడు ప్రదీప్ మృతి నేపథ్యంలో శ్రావణ్ అనే వ్యక్తిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత రెండు నెలలుగా ప్రదీప్ ఇంట్లోనే శ్రావణ్ ఉంటున్నట్టు తెలుస్తోంది. ప్రదీప్ భార్య పావనీరెడ్డి తనతో శ్రావణ్ చనువుగా ఉన్న ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టడంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలైనట్టు చెప్తున్నారు. ప్రదీప్ కుటుంబసభ్యులు పావనీరెడ్డి తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రదీప్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అంటున్నారు. ప్రదీప్‌ది ఆత్మహత్య అయితే ఇంట్లో అద్దాలు ఎందుకు పగిలిపోయాయని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రదీప్ అనుమానాస్పద మృతి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రావణ్ ఎట్టకేలకు స్పందించాడు. గత రాత్రి తన పుట్టినరోజు కావడంతో తాము పార్టీ చేసుకున్నామని, పార్టీ మధ్యలోనే ప్రదీప్ బయటకు వెళ్లివచ్చాడని చెప్పాడు. గంటన్నర తర్వాత ప్రదీప్ తిరిగి ఇంటికి వచ్చాడని, తెల్లారిసరికి అతను గదిలో ఆత్మహత్య చేసుకొని కనిపించాడని చెప్పారు. పావనితో తనకున్నది అన్నాచెల్లెళ్ల అనుబంధమని, తనపై విమర్శలు రావడం బాధ కలిగిస్తున్నదని తెలిపాడు. మరోవైపు ప్రదీప్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అతని మృతదేహాన్ని పుప్పాలగూడలోని ఇంటికి తరలించారు. -
భార్య ప్రొఫైల్ ఫోటోపై ప్రదీప్ మనస్తాపం!
-
నా పరిస్థితిని అర్థం చేసుకోండి: ప్రదీప్ భార్య
హైదరాబాద్ : తన భర్త ప్రదీప్ కుమార్ ఆత్మహత్యపై వస్తున్న ఆరోపణలను అతని భార్య పావనీరెడ్డి ఖండించింది. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ప్రదీప్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. క్షణికావేశంలోనే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడే తప్ప, మరొకటి కాదని పేర్కొంది. గత రాత్రి తనకు, ప్రదీప్‌కు మధ్య జరిగింది చిన్న గొడవే అని, అయితే ఆత్మహత్య చేసుకునేంత గొడవలు తమ మధ్య లేవని పావనీరెడ్డి స్పష్టం చేసింది. శ్రావణ్ తన అన్నయ్య అని, గతరాత్రి అతడి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నామని అంతకుమించి ఏమీలేదని తెలిపింది. తనపై వస్తున్న వదంతులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ...తన పరిస్థితిని అర్ధం చేసుకోవాలని పావనీరెడ్డి విజ్ఞప్తి చేసింది. నిన్న రాత్రి తన అన్నయ్య బర్త్‌డే పార్టీ చేసుకున్నామని, ఆ తర్వాత తన సోదరి కుటుంబం వెళ్లిపోయిందని, అనంతరం ప్రదీప్‌కు తనకు చిన్నపాటి గొడవ జరిగిందని, దాంతో ప్రదీప్ కోపంగా అద్దం పగులగొట్టాడని, ఆ తర్వాత తన బెడ్రూమ్లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడని తెలిపింది. తాను హాల్లో డైనింగ్ టేబుల్ వద్ద ఏడ్చుకుంటూ పడుకున్నట్లు చెప్పింది. అయితే ప్రదీప్‌కు ఉదయం షూటింగ్ ఉండటంతో అయిదుగంటల సమయంలో బెడ్రూమ్ తలుపు కొట్టానని, అయితే అటునుంచి ఎలాంటి అలికిడి లేకపోవడంతో తర్వాత తన సోదరుడి సాయంతో తలుపు పగలగొట్టి చూడగా, ప్రదీప్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడని తెలిపింది. కిందకు దించి, అంబులెన్స్‌కు కాల్ చేసినట్లు పావనీరెడ్డి చెప్పింది. ఆతర్వాత తన అమ్మవాళ్లకు ఫోన్ చేసి విషయం చెప్పానని, అలాగే చెన్నైలో ఉన్న ప్రదీప్ కుటుంబానికి ఫోన్ చేయగా వాళ్లు ఆన్సర్ చేయలేదని, దాంతో అతడి సోదరుడికి ఫోన్లో సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. ప్రదీప్ కుటుంబసభ్యులతో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని, కొద్ది నెలలు పాటు అత్తగారు తమతోనే ఉన్నారన్నారు. వాళ్ల కుటుంబసభ్యులు వస్తే అంత్యక్రియలు ఎక్కడ అనేది తెలుస్తుందన్నారు. ప్రదీప్ ఆత్మహత్యపై ఎలాంటి అనుమానాలు లేవని తెలిపింది. అయితే ప్రదీప్ హైపర్ అని, చిన్న చిన్న విషయాలకే ఆవేశం చెందుతాడని పేర్కొంది. -
భార్య ప్రొఫైల్ ఫోటోపై ప్రదీప్ మనస్తాపం!
హైదరాబాద్ : బుల్లితెర నటుడు ప్రదీప్ ఆత్మహత్య కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రదీప్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అతని స్నేహితులు చెబుతున్నారు. భార్య పావనీరెడ్డి వాట్సప్ ప్రొఫైల్ ఫోటోపై భార్యభర్తల మధ్య బుధవారం తెల్లవారుజామున గొడవ జరిగిందని, తెల్లారేసరికి ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అలాగే ఇంట్లో అద్దాలు చిందరవందరగా పగిలి ఉండటంతో పాటు, భర్త ఆత్మహత్యపై అతడి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. మరోవైపు ప్రదీప్ భార్య పావనీరెడ్డి ...పోలీసులు ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు పావనీరెడ్డి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రదీప్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా గత రెండు నెలలుగా శ్రావణ్ అనే వ్యక్తి వాళ్లింట్లో ఉంటున్నాడని, అతడితో చనువుగా ఉన్న ఫోటోను పావనీ ప్రొఫైల్‌గా పెట్టడంతో ప్రదీప్ మనస్తాపం చెందినట్లు సమాచారం. ఈ విషయంపై భార్యను ప్రదీప్ నిలదీయగా, అనంతరం ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అంతేకాకుండా భార్యభర్తల మధ్య కొంతకాలంగా తీవ్ర విభేదాలు నెలకొన్నాయని తెలుస్తోంది. అయితే పావనీరెడ్డి తీరుపై ప్రదీప్ కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలోని తన నివాసంలో ప్రదీప్ ఈరోజు తెల్లవారుజామున ఉరేసుకుని అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
నా పరిస్థతిని అర్థం చేసుకోండి: ప్రదీప్ భార్య