బుల్లితెర నటుడు ప్రదీప్‌ది ఆత్మహత్యేనని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ప్రాథమికంగా తేల్చారు. అయితే ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రదీప్ భార్య పావని ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశౄరు. ప్రదీప్ తల్లి, సోదరి ఇద్దరి వద్ద స్టేట్‌మెంట్లు నమోదు చేశారు.