family problems
-
రెండో పెళ్లితో ‘చిక్కుల్లో’ ఐపీఎస్.. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా..
జైపూర్ : రెండో వివాహం ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని చిక్కుల్లో పడేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి సీనియర్ ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఓ ఐపీఎస్ అధికారి హోదా తగ్గించింది. ఈ నిర్ణయంతో సీనియర్ ఐపీఎస్ అధికారిగా హోదాతో పాటు తీసుకునే పేస్కేలు సైతం తగ్గింది. కొత్తగా విధుల్లో చేరిన ఐపీఎస్ ఎంత వేతనం తీసుకుంటారో.. అంతే వేతనం సదరు సీనియర్ ఐపీఎస్ అధికారికి అందుతుంది.పలు నివేదికల ప్రకారం.. రాజస్థాన్ కేడర్ ఐపీఎస్ అధికారి పంకజ్ కుమార్ చౌదరి జైపూర్‌లో కమ్యూనిటీ పోలీసింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పని చేస్తున్నారు. అయితే పంకజ్ కుమార్ మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకుండా రెండో వివాహం చేసుకున్నారు. ఈ వివాదంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ పంకజ్ కుటుంబ సభ్యులు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టుకు చేరింది. విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని పంకజ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.ఈ తరుణంలో ఐపీఎస్ అధికారి పంకజ్ కుమార్ వివాహంపై రాజస్థాన్ రాష్ట్ర ఉన్నాతాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో పంకజ్ కుమార్ దోషిగా తేల్చారు. విచారణ అనంతరం మూడు సంవత్సరాల పాటు ప్రస్తుతం ఉన్న తన డిజిగ్నేషన్‌ను తగ్గించారు. లెవల్ 11 సీనియర్ పే స్కేల్ నుండి లెవల్ 10 జూనియర్ పే స్కేల్‌కు కుదించారు. ఈ పేస్కేల్ కొత్తగా విధుల్లోకి చేరిన ఐపీఎస్‌లకు కేటాయిస్తారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా, 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పంకజ్ చౌదరి. ప్రస్తుతం,జైపూర్‌లో కమ్యూనిటీ పోలీసింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పని చేస్తున్నారు. హోదా తగ్గించడంతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (లెవల్ 10)గా కొనసాగనున్నారు. -
మంచు ఫ్యామిలీ మెంబర్స్ పై 3 కేసులు : సీపీ సుధీర్ బాబు
-
మా నాన్నను విష్ణు ట్రాప్ చేసాడు
-
ఉదయ్ పూర్ ప్యాలెస్ 'మహారాజు కు నో ఎంట్రీ..
-
ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలవన్మరణం.. కారణం ఇదే..!
గద్వాల క్రైం: కుటుంబ సమస్యలతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన గద్వాల మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని న్యూ హౌసింగ్‌బోర్డులో నివాసం ఉంటున్న విజయ్‌మోహన్‌రెడ్డి(53) మోమిన్మొహల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా ఇంట్లో సమస్యలు తీవ్రం కావడంతో బుధవారం ఇంట్లోంచి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి మండలంలోని పూడురూ గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో చెట్టుకు చీరతో ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం స్థానిక రైతులు గమనించి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ఆనంద్ చేరుకుని పరిశీలించగా మృతుడి గుర్తింపుకార్డు గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి భార్య కొన్నేళ్ల క్రితమే రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్ఐ వివరించారు. రెండో భార్య స్వాతికి 6ఏళ్ల కూతురు ఉంది. కుమారుడు హేమంత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి మరికల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయలైన ఘటన గురువారం ఎలిగండ్ల వంతెన వంద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధన్వాడ మండలం గున్ముక్లకు చెందిన మంగలి శివశంకర్(42) మరికల్లో ఓ హేర్కంటింగ్ షాప్‌లో పని చేస్తున్నాడు. పనులు ముగించుకుఇన సాయంత్రం 7 గంటలకు గున్ముక్లకు స్కూటీపై తిరుగు ప్రయాణం అవుతుండగా మరికల్ చౌరస్తాలో ఎమ్మోనోనిపల్లికి చెందిన నవీన్ లిప్ట్ అడిగి స్కూటీ ఎక్కాడు. ఎలిగండ్ల స్టేజీ సమీపంలోని జాతీయ రహదారి వంతెన మలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కంటెయినర్ స్కూటీని ఢీకొనడంతో శివశంకర్ అక్కడిక్కడే మృతి చెందాడు. నవీన్‌కు తీవ్రగాయలు కావడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. -
అమ్మా.. ఎందుకిలా చేశావు?, నాన్నా.. నేనేం పాపం చేశాను?
పరిష్కారం లేని సమస్య ఏదీ ఉండదన్న విషయాన్ని ఓ తల్లి, ఓ తండ్రి మరిచిపోయారు. తమ సమస్యల పరిష్కారానికి చావే మార్గమని భావించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వారితోపాటు ఎంతో భవిష్యత్ ఉన్న పిల్లల ప్రాణాలను సైతం బలితీసుకుంది. భార్య ప్రవర్తన, బంధువుల చేష్టలతో విసిగివేసారిన నెల్లూరులోని అంబాపురం గ్రామానికి చెందిన తండ్రి తన కొడుకుతో కలిసి బావిలో దూకాడు. తాళి కట్టి జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భర్త వేధింపులను తట్టుకోలేకో ఏమో.. ఓ మహిళ అభంశుభం తెలియని ఇద్దరు బిడ్డలతో సహా మృత్యువుని చేరిన ఘటన వింజమూరులోని జైభీమ్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఈ హృదయ విదారకర ఘటనలు బాధిత కుటుంబాల్లో పెను విషాదం నింపగా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సంచలనం రేపాయి. అమ్మా.. ఎందుకిలా చేశావు? అమ్మా.. పేగును పంచావు.. ప్రేమగా పెంచావు.. మమ్మల్నే సర్వస్వం అనుకున్నావు.. మేమే జీవితమని పొంగిపోయావు.. ఏమైందో ఏమో.. క్షణికావేశంలో నీ ప్రాణాన్ని తీసుకోవాలనుకున్నావో ఏమో.. నీవు లేని మా జీవితాలు మోడువారుతాయని తలిచావో ఏమో.. మమ్మల్ని ఉరితాడుకు బిగించి.. నువ్వూ ఉరేసుకుని తనువు చాలించావు.. ఆవేశంలో నీ కంటిపాపలమని మరిచావా అమ్మా? వింజమూరు: స్థానిక జైభీమ్ నగర్లో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసకుంది. ఈ ఘటన వింజమూరులో సంచలనం సృష్టించింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. జైభీమ్ నగర్‌కు సాదం వెంకట్రావు స్థానిక గ్యాస్ ఏజెన్సీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఆయనకు ఆత్మకూరు మండలం నాగులపాడుకు చెందిన గీత (31)తో 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి కుమారుడు వెంకట్ (10), కుమార్తె చరిష్మ (5) ఉన్నారు. వెంకట్ గండిపాళెం గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. కుమార్తె స్థానిక పాఠశాలలో చదువుతోంది. గీత తండ్రి మరణించాడు. తల్లి, ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. కుటుంబసభ్యులు ప్రస్తుతం నెల్లూరులో స్థిరపడ్డారు. గీత గతంలో వింజమూరు పెట్రోలు బంకులో పనిచేసింది. ప్రస్తుతం రెడీమేడ్ దుస్తుల దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడు ఉంది. వెంకట్రావు గురువారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేసరికి భార్య, ఇద్దరు పిల్లలు వరండాలో వేలాడుతుండడాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కలిగిరి సీఐ సాంబశివరావు, ఎస్సై జంపానికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. గీత ముందుగా కుమారుడు, కుమార్తెకు ఉరేసి తర్వాత తాను ఉరేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న గీత తల్లి డోలా సరస్వతమ్మ ఘటనా స్థలానికి చేరుకుని కుమార్తె, ఆమె బిడ్డల మృతదేహాలను చూసి బోరున విలపించింది. అనంతరం వింజమూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని అల్లుడి వేధింపుల వల్లే తన కుమార్తె బిడ్డలతో సహా ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదు చేసింది. నాన్నా.. నేనేం పాపం చేశాను? నాన్నా.. మా బంగారు భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నావు.. నేను, తమ్ముడూ బాగా చదువుకోవాలనుకున్నావు.. మేమిద్దరం నువ్వే మా లోకమని జీవిస్తున్నాం.. చేయిపట్టి నడిపించాల్సిన నువ్వే నీ చేతులకు, నా చేతులకు తాడు కట్టి బావిలోకి దూకించావు.. నేనేం పాపం చేశాను.. నీ బిడ్డ ప్రాణం కూడా పోతుందని ఒక్క నిమిషం ఆలోచించలేకపోయావా నాన్నా? నెల్లూరు(క్రైమ్): భార్య ప్రవర్తన, బంధువుల వేధింపులే చావుకి కారణమని స్నేహితుడికి వాయిస్ మెసేజ్ పంపి ఓ తండ్రి తన కుమారుడితో కలిసి నేలబావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన నెల్లూరు రూరల్ మండలం అంబాపురం గ్రామ పొలాల్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అంబాపురం ఎల్బీఎస్ నగర్‌కు చెందిన కృష్ణస్వామి రంగస్వామి (45), విజయలక్ష్మి దంపతులకు సంజయ్‌కుమార్ (14), ప్రేమ్‌కుమార్ పిల్లలున్నారు. సంజయ్ 9వ తరగతి చదువుతున్నాడు. రంగస్వామికి అతని భార్యకు మధ్య కొంతకాలంగా తీవ్ర గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఆమె ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. భర్త ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టాడు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో రంగస్వామి, పెద్ద కుమారుడు సంజయ్‌కుమార్ వెనుక చేతులు కట్టుకుని ఊరికి సమీప పొల్లాలోని నేలబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక వీఆర్వో బాలసర్వేశ్వరరావు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ కె.నరసింహారావు తన సిబ్బందితో కలిసి స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాలను వెలికితీయించారు. చనిపోయే ముందు రంగస్వామి ఆడియో మెసేజ్ రికార్డు చేసి తన స్నేహితుడు సెల్వమణికి పంపాడు. చావుకి కారణం తన వదిన, బావ, వాళ్లమ్మ కారణమని, వారి వల్లే కుటుంబంలో వివాదాలు తలెత్తాయని, భార్య తనను వదిలిపోయిందని అందులో పేర్కొన్నాడు. ఆడియో మెసేజ్ ఆధారంగా ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
18 ఏళ్లకు పెళ్లి.. 20 ఏళ్లకు ఆత్మహత్య
సాక్షి,కొత్తూరు(శ్రీకాకుళం): రెండు పదుల వయసులోనే ఓ యువకుడి ఆయుష్షు ముగిసిపోయింది. బాల్య వివాహం ఏ మేరకు జీవితాలను ధ్వంసం చేస్తుందనడానికి ఉదాహరణగా నిలిచిపోతూ అతడి బతుకు అర్ధంతరంగా ఆగిపోయింది. 18 ఏళ్లకే వివాహం.. ఆపై భార్యతో ఎడబాటు.. అది తట్టుకోలేక 20 ఏళ్లకే ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్తూరు మండలం నేతాజీనగర్ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నేతాజీనగర్ కాలనీకి చెందిన సిందియా సింహాద్రికి రెండేళ్ల కిందట విశాఖపట్నంకు చెందిన శివానీ అనే అమ్మాయితో వివాహం జరిగింది. అయితే పెళ్లయ్యాక ఒక్క రోజు మాత్రమే భర్తతో ఉన్న శివానీ ఆ తర్వాత కన్నవారింటికి వెళ్లిపోయింది. రెండేళ్ల నుంచి కాపురానికి రావడం లేదు. భర్త సింహాద్రి, మా మయ్య రాంబాబులు చాలాసార్లు పిలిచినా ఆమె రాలేదు. దీంతో మనస్తాపం చెందిన సింహాద్రి సోమవారం రాత్రి ఇంటిలో ఎవరూ లేని సమయం చూసి దూలానికి ఉరి వేసుకున్నాడు. సింహాద్రి కుటుంబ సభ్యులు బొమ్మల వ్యాపారం చేస్తుంటారు. భామిని మండలం లివిరిలో జరుగుతున్న యాత్రలో ప్రస్తుతం బొమ్మల షాపు నిర్వహిస్తున్నారు. కుటుంబమంతా అక్కడకు వెళ్లిపోవడంతో సింహాద్రి ఒక్కడే ఇంటిలో ఉండి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యాత్రలో ఉన్న తండ్రి రాంబాబు కుమారుడికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆ యన మంగళవారం ఉదయం పక్క ఇంటిలో ఉన్న వారికి ఫోన్ చేశారు. సింహాద్రి తన ఫోన్ లిఫ్ట్ చే యడం లేదని చెబితే.. వారు వెళ్లి చూడగా దూ లానికి ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో వెంటనే ఈ విషయాన్ని వారు రాంబాబుతో చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులంతా హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. తండ్రి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అడిగర్లు చంద్రకళ తెలిపారు. సంఘటన స్థలం వద్దకు సీఐ ఎస్.సూర్యచంద్ర మౌళి, ఎస్ఐ చంద్రకళతో పాటు సిబ్బంది చేరుకొని సంఘటనపై వివరాలు సేకరించారు. -
కుటుంబ కలహాలు: బావ తలపగులగొడుతావా..? అంటూ అన్నపై..
సాక్షి,పరిగి(వికారాబాద్): కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన అన్నపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని గడిసింగాపూర్లో బుధవారం చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లక్ష్మయ్య(38) అదే గ్రామానికి చెందిన తన చెల్లెలు భర్త వెంకటయ్యతో మంగళవారం రాత్రి గొడవపడ్డాడు. ఈక్రమంలో లక్ష్మయ్య తన బావ వెంకటయ్య తలపగులగొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న వెంకటయ్య కుమారుడు నవీన్ లక్ష్మయ్యపై దాడి చేశాడు. బుధవారం ఉదయం లక్ష్మయ్య తమ్ముడు అనంతయ్య.. బావ తలపగులగొడుతావా..? అంటూ ఆగ్రహంతో లక్ష్మయ్యపై రాళ్లు, కర్రలతో దాడి చేశాడు. ఈ ఘటనలో లక్ష్మయ్యకు తీవ్రగాయాలయ్యాయి. అలాగే ఇంట్లోకి వెళ్లి పడుకున్న లక్ష్మయ్య దెబ్బలకు తాళలేక మృతి చెందాడు. మధ్యాహ్నం అయినా ఆయన ఇంట్లోంచి రాకపోవడంతో గమనించిన చుట్టుపక్కల వారు లోపలికి వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. లక్ష్మయ్యపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనంతయ్య పరారీలో ఉన్నాడు. ఈమేరకు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. లక్ష్మయ్య ఆయన భార్య గతంలోనే విడిపోయింది. ఆయనకు 7 సంవత్సరాల కూతురు ఉంది. తండ్రి మృతి చెందడంతో చిన్నారి అనాథగా మారింది. చదవండి: ‘అమ్మా.. నేను చనిపోతున్నా’ కూతురు ఫోన్.. అంతలోనే.. -
భార్య కాపురానికి రాలేదని యువకుడు..
శృంగవరప్పాడు (కైకలూరు): వివాదాల కారణంగా పుట్టింటికి వెళ్లిన భార్య, తాను బతిమలాడినా తిరిగి రాలేదనే మనస్థాపంతో ఓ యువకుడు ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన కైకలూరు మండలం శృంగవరప్పాడు గ్రామంలో జరిగింది. ఈ ఘటనపై సోమవారం కేసు నమోదైంది. రూరల్ పోలీసుల కథనం మేరకు.. శృంగవరప్పాడు గ్రామానికి చెందిన బలే పోతురాజు (35)కు ఇదే మండలం చటాకాయి గ్రామానికి చెందిన యువతితో 15 సంవత్సరాలు క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం. పోతురాజు కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. కొంత కాలంగా దంపతుల మధ్య వివాదాలు తలెత్తాయి. కొద్ది రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నెల 15న పోతురాజు భార్య వద్దకు వెళ్లి తిరిగి కాపురానికి రావాలని బతిమలాడాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో తిరిగిన ఇంటికి వచ్చిన పోతురాజు అదే రోజు రాత్రి ఉరి వేసుకుని మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ చల్లా కృష్ణ అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అమ్మ, పాప కోనేటిలో దూకుతున్నారు..రా తాతా..!
సాక్షి, చిత్తూరు: కుటుంబ కలహాలతో బిడ్డతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఊటబావులపల్లెలో చోటుచేసుంది. స్థానికుల కథనం.. ఊటబావులపల్లెకు చెందిన సురేష్(32), కృష్ణవేణి(24) భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు వరుణ్‌తేజ్(6), హర్షిత(3) ఉన్నారు. కూలిపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు పరిపాటి అయ్యాయి. దీంతో శుక్రవారం సాయంత్రం మనస్తాపం చెందిన కృష్ణవేణి ఇద్దరి పిల్లలను వెంటతీసుకుని గ్రామానికి అరకిలోమీటరు దూరంలోని దేవళంగుట్టపైకి వెళ్లింది. ఇద్దరి పిల్లలను చీరకొంగుకు చుట్టుకుని కోనేటిలో దూకేందుకు యత్నించింది. అయితే వరుణ్‌తేజ్ విడిపించుకుని గుట్టపై నుంచి కేకలు వేస్తూ తన తాత మునిరత్నం వద్దకు వచ్చాడు. ‘అమ్మా పాప కోనేటిలో దూకుతున్నారు..రా తాతా..’ అంటూ బిగ్గరగా ఏడ్చాడు. స్థానికులను, మనవడిని వెంటబెట్టుకొని పరుగున ఆ వృద్ధుడు కోనేటి వద్దకు వెళ్లేసరికి అప్పటికే కృష్ణవేణి తన కుమార్తెతో సహా విగతజీవురాలై ఉండటం చూసి గుండెలవిసేలా రోదించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. (పెళ్లయిన 9 నెలలకే..) -
అభాగ్యుడిని ఆదుకోరూ !
సాక్షి, తుర్కపల్లి (ఆలేరు) : తుర్కపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన హన్మంత్ తొలుత వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. దిగుబడులు ఆశాజనకంగా లేకపోవడంతో కుటుంబ పోషణ నిమిత్తం 2004లో ఆటో కొని మండల కేంద్రం నుంచి స్వగ్రామానికి కిరాయికి నడుపుకునేవాడు. కాలక్రమంలో వ్యవసాయం పూర్తిగా కుంటు పడడంతో ఆటోనే జీవనధారంగా చే సుకుని బతుకుబండిని ముందుకు సాగించాడు. జీవనం సంతోషంగా సాగుతున్న తరుణంలో.. హన్మంత్ ఆటో నడుపుకుంటూ కుటుంబంతో సంతోషంగా సాగిపోతున్న తరుణంలో అనుకోని ఉపద్రవం వచ్చిపడింది. అప్పటి వరకు ఎటువంటి శారీరక ఇబ్బందులు లేని హన్మంత్‌కు 2017లో హఠాత్తుగా తీవ్రమైన వెన్నునొప్పి వచ్చి కుప్పకూలిపోవడంతో జీవితం అంధకారమయమైంది. ఆరునెలల పాటు వైద్యం హన్మంత్ రెండు కాళ్లు కదపలేని స్థితి, నడుము కింది భాగం పూర్తిగా స్పర్శ కోల్పోయాడు. దీంతో పాటు వెన్నుకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తడంతో హైదరాబాద్‌లోని ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రిల్లో వైద్యం అందించాల్సిన పరిస్థితి. చేతిలో ఉన్న డబ్బుతో వైద్యం అందించినా ఫలితం లేదు. పనిచేయని రెండు కాళ్లు నడుం పై భాగం నుంచి కాళ్లు పూర్తిగా స్పర్శ కోల్పోవడంతో మల, మూత్ర విసర్జన కూడా మంచంవద్దే చేయాల్సిన పరిస్థితి. చేతిలో డబ్బులు లేకపోవడంతో ఎక్కడ ఈ వ్యాధికి ఉచితంగా వైద్యం చేస్తారంటే అక్కడికి తన భర్త హన్మంత్‌ను తీసుకువెళ్లి వైద్యం చేయిస్తుంది. పిల్లల చదువులకు తీవ్ర ఇబ్బందులు హన్మంత్ కుమారుడు మేడ్చల్ జిల్లా కీసరలో చదువుతున్నాడు ,ప్రస్తుతం కూతురు మనోజ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబ ఇంటి పెద్ద మంచానికే పరిమితమవడంతో ఆర్థిక పరిస్థితులు ఛిన్నాభిన్నమై పిల్లల చదువులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అనిత భర్తకు సపర్యలు చేసుకుంటు గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ బతుకుపోరాటం సాగిస్తోంది. ఎకరం పొలం విక్రయించి.. భర్త ఉన్నట్టుండి మంచానికే పరిమితంకావడంతో హన్మంత్ భార్య అనిత తట్టుకోలేకపోయింది. ఉన్న ఎకరం భూమిని విక్రయించి సుమారు రూ. 10లక్షలకు పైగా భర్తకు వైద్యానికి ఖర్చుచేసింది. అయినా భర్త కోలుకోకపోవడంతో కుమిలిపోతోంది. ఇంకా ఖరీదైన వైద్యం చేయాలని డాక్టర్లు సూచించడంతో బంధువుల వద్ద అప్పు చేసింది. అయినా పరిస్థితిలో మార్పు లేదు. ఖరీదైన వైద్యం చేస్తే తప్ప ఏమీ చేయలేయని డాక్టర్లు సూచిస్తుండడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. -
పద్నాలుగేళ్ల పోరాటం.. బతికేందుకు ఆరాటం
పాండవులు పన్నెండేళ్లు వనవాసం చేస్తే... ఓ తల్లి కష్టాలతో పద్నాలుగేళ్లుగా సహవాసం చేస్తోంది. బిడ్డ, అల్లుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందగా.. అనారోగ్యంతో 14 సంవత్సరాల మనవడు అచేతనంగా మారాడు. అయినా గుండెదిటువు చేసుకుని ముందుకే సాగింది. కానీ పగబట్టిన మృత్యువు ఆమె కోడలిని కబలించగా.. ఆసరాగా నిలిచిన కుమారుడు మంచం పట్టాడు. అప్పటికీ దయ చూపని దేవుడు... ఆమెను కేన్సర్ జబ్బుబారిన పడేశాడు. గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ వైద్యసేవ ఆదుకోకపోవడంతో శక్తికి మించి అప్పులు చేసి చికిత్స చేయించుకుంది. అయినా ఫలితం దక్కలేదు. సర్వమూ కోల్పోయిన ఆమె... సాయం చేసే ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. సాక్షి,ఉరవకొండ(అనంతపురం) : ఉరవకొండ పట్టణానికి చెందిన సుంకన్న, సుజాతమ్మ దంపతులకు కుమారుడు బాలరాజు, కుమార్తెలు శ్రీలత, కవిత సంతానం. పాల విక్రయంతో జీవనం సాగించే సుజాతమ్మ ఉన్నంతలో కుటుంబాన్ని గుట్టుగా నెట్టుకొచ్చేది. పెద్ద కుమార్తె శ్రీలతకు పదేళ్ల క్రితం కూడేరు మండలం జల్లిపల్లి గ్రామానికి చెందిన ఎర్రిస్వామి కుమారుడు విశ్వనాథ్కిచ్చి పెళ్లి చేసింది. కూతురుకు తొలికాన్పులోనే కొడుకు పుట్టగా సంబరపడిపోయింది. పవన్ అని పేరుపెట్టుకుని అపురూపంగా చూసుకుంది. కానీ ఆ చిన్నారికి తలలో ఉమ్మునీరు చేరి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. దీంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ వైద్యం చేయిస్తూ వచ్చింది. కూతురు అల్లుడుని కబలించిన రోడ్డు ప్రమాదం 2013 డిసెంబర్లో ద్విచక్రవాహనంపై అనంతపురానికి బయలుదేరిన సుజాతమ్మ కూతురు శ్రీలత, అల్లుడు విశ్వనాథ్ మార్గమధ్యలో ట్రాక్టర్ ఢీకొని దుర్మరణం చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారి కుమారుడు పవన్ పోషణ భారం ఆమెపై పడింది. అయితే ధైర్యం కోల్పోని సుజాతమ్మ తన సంపాదనలో కొంత పవన్‌కు వైద్యం చేయించేందుకు ఖర్చుపెడుతూ వస్తోంది. హైదరాబాద్, కర్నూలు ఆస్పత్రుల చుట్టూ తిరిగి దాదాపు రూ. లక్షల్లో ఖర్చు చేసింది. ఆపరేషన్ వికటించి అంధుడిగా మారిన పవన్ ఓ రోజు పవన్ పరిస్థితి విషమించడంతో సుజాతమ్మ కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లింది. పరీక్షించిన వైద్యులు పవన్‌కు ఆపరేషన్ చేయాలని రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో కుటుంబానికి జీవనాధారంగా ఉన్న మూడు ఎనుములను అమ్మి మనవడు పవన్‌కు 2016లో ఆపరేషన్ చేయించింది. ఆపరేషన్ అయిన మూడు నెలలకే పవన్ కాళ్లు, చేతులు వంకర పోయి, మూర్చ వ్యాధి వచ్చింది. కళ్లు కూడా కన్పించకపోవడంతో మళ్లీ కర్నూలులోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ వికటించి పవన్ పూర్తిగా కంటి చూపు కోల్పోయినట్లు ధ్రువీకరించారు. తిరిగి వైద్యం చేయాలని అందుకు బాగా ఖర్చవుతుందని తెలిపారు. సుజాతమ్మపై కేన్సర్ పిడుగు మనవడిని బతికించుకునేందుకు ఉన్నదంతా అమ్మి రూ.7 లక్షల వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయిన సుజాతమ్మపై విధి మరోసారి కేన్సర్ రూపంలో పంజా విసిరింది. ఓ రోజు ఛాతిలో నొప్పిగా ఉండటంతో సుజాతమ్మ స్థానిక వైద్యులకు చూపించింది. వారు కేన్సర్ అన్న అనుమానంతో అనంతపురం వెళ్లాలని సూచించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు రొమ్ము కేన్సర్ అని ధ్రువీకరించారు. వ్యాధి సోకి చాలా ఏళ్లు అయ్యిందని, వెంటనే ఆపరేషన్ చేసుకోకపోతే ప్రాణానికే ప్రమాదమని హెచ్చరించారు. దీంతో ఆమె అప్పట్లో ఎన్టీఆర్ వైద్యసేవకు దరఖాస్తు చేసుకుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఆస్పత్రులకు డబ్బులు చెల్లించకపోవడంతో ఎన్టీఆర్ వైద్యసేవ కింద ఆపరేషన్ చేసేందుకు వైద్యులు నిరాకరించారు. ఏం చేయాలో తెలియని సుజాతమ్మ... రూ 2 లక్షలకు ఇంటిని తాకట్టు పెట్టి ఆపరేషన్ చేయించుకుంది. అయినా సుజాతమ్మ ఆరోగ్యం కుదట పడలేదు. ప్రాణాపాయస్థితిలో ఉన్న మనవడిని కాపాడుకోలేక, తన ఆరోగ్యాన్ని సంరక్షించుకోలేక నరకయాతన అనుభవిస్తోంది. కోడలు మృతి... మంచం పట్టిన కుమారుడు ఓవైపు తీవ్ర అనారోగ్యం... మరోవైపు అచేతనంగా మారిన మనవడు... ఇంకోవైపు రుణదాతల ఒత్తిళ్లతో సుజాతమ్మ సతమతమవుతోంది. ఇలాంటి తరుణంలోనే సుజాతమ్మ కుమారుడు బాలరాజు భార్య శ్రీదేవి హృద్రోగంతో కన్ను మూసింది. రూ.2 లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించినా ఆమె ప్రాణాలు దక్కలేదు. భార్య మృతితో బాలరాజు మనోవేదనతో మంచం పట్టాడు. ఈ పరిస్థితుల్లో 70 ఏళ్ల వృద్ధుడైన సుజాతమ్మ భర్త సుంకన్న శక్తిలేకపోయినా కుటుంబాన్ని పోషించేందుకు కూలి పనులకు వెళ్తున్నాడు. రూ. 20 లక్షల అప్పులు సుజాతమ్మ తన కేన్సర్ చికిత్స, మనవడి, కోడలి వైద్యం కోసం శక్తికి మించి ఖర్చు చేసింది. అంతా కలిపితే రూ.20 లక్షలకు చేరింది. ఇంటిపై చేసిన అప్పులు వడ్డీతో సహా రూ.4 లక్షలకు పైగా చేరింది. బయట వ్యక్తుల వద్ద చేసిన అప్పులు మరో రూ.6 లక్షలు ఉన్నాయి. సుజాతమ్మ బతికుండగానే ఉన్న ఇంటిని ఇలాగైనా రాయించుకోవాలని రుణదాతలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. -
‘చచ్చిపో కానీ ఇల్లు వదిలేయ్’
ఘజియాబాద్: వయసు పైబడ్డ తల్లిదండ్రలను కన్నవాళ్లు నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి వెళ్లగొడుతున్న ఘటనలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. రక్తం పంచుకు పుట్టిన కొడుకే.. ‘మీరు చచ్చినా సరే, కానీ ఇంటి నుంచి వెళ్లిపోండంటూ’ వేధిస్తున్నాడని ఓ వృద్ధ జంట సోషల్ మీడియాలో గోడు వెళ్లబోసుకుంది. ‘అయినవాళ్లే మమ్మల్ని కాదనుకుంటే ఎవరు దిక్కు. మాకు ఆత్మహత్యే శరణ్యం’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు దంపతులు. వివరాల్లోకి వెళితే.. ఎంఎం రోడ్డులోని అంకుర్ విహార్‌లో ఉంటున్న ఇంద్రజిత్, పుష్ప గ్రోవర్ దంపతులకు కొడుకు, కుమార్తె ఉన్నారు. కూతురు ఆస్ట్రేలియాలో నివసిస్తోంది. ఇంద్రజిత్ దంపతులు కొడుకు కోడలు దగ్గరే నివాసముంటున్నారు. ఆయన హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా భార్య కీళ్ల వ్యాధితో సతమతమవుతోంది. ఈ సమయంలో అండగా నిలవాల్సిన కొడుకు అభిషేక్, తన భార్యతో కలిసి తల్లిదండ్రులను ఇల్లు విడిచి వెళ్లాలంటూ నిత్యం నరకం చూపిస్తున్నాడు. చేసేది లేక తన బాధను సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ వీడియో ద్వారా వేడుకున్నాడు. ఈ వీడియో కొద్ది గంటల్లోనే వైరల్ కావడంతో జిల్లా యంత్రాంగం స్పందించింది. ఆదివారం ఉదయం 8 గంటలకు జిల్లా మేజిస్ట్రేట్ స్వయంగా ఇంద్రజిత్ ఇంటికి చేరుకుని చర్చలు జరిపారు. ఇంద్రజిత్ ఇంటిపై కుమారుడికి ఎటువంటి హక్కు లేదని అధికారులు స్పష్టం చేశారు. చేసేదేం లేక అభిషేక్, తన భార్యతో సహా బయటకు వెళ్లడానికే నిశ్చయించుకున్నాడు. తండ్రి కోరిక మేరకు మరో పది రోజుల్లో తన కుటుంబంతో సహా ఇల్లు వదిలి వెళ్లిపోతానంటూ లిఖితపూర్వకంగా తెలిపాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిపిన చర్చలు సఫలమయ్యాయని జిల్లా మెజిస్ట్రేట్ అధికారి ట్వీట్ చేశారు. -
రెలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్–కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ల మధ్య గల క్రాస్‌లైన్‌లో ట్రైయిన్ వాషింగ్ సైడ్ వద్ద శుక్రవారం ఒక వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాజీపేట జీఆర్పీ ఎస్ఐ జితేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట విష్ణుపురికి చెందిన సుమారు 32 ఏళ్ల వయస్సు గల వన్నాల రాజు హన్మకొండలోని ఒక హోటల్లో వేటర్‌గా పని చేస్తున్నాడు. గత కొంత కాలంగా రాజు మద్యానికి అలవాటుపడి తరచుగా ఇంట్లో గొడవ పడుతుండేవాడు. 20 రోజుల క్రితం గొంతు కోసుకొని ఆత్మహత్యయత్నాకి పాల్పడి ప్రాణాలతో బయటపడ్డాడు. భార్య ఓటు వేయడానికి వెళ్లగా రాజు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీ ఎం ఆసుపత్రి మార్చురికి తరలించి కేసు ద ర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ఎవరితో పంచుకోకూడని 6 విషయాలు
సాక్షి, హైదరాబాద్: మహిళలు వారి భర్తలతో కంటే ఆప్త మిత్రులతోనే అన్నీ విషయాలు పంచుకుంటారని తాజాగా చేసిన ఓ సర్వేలో తేలింది. ఇద్దరు మహిళలు మిత్రులైతే గొడవల నుంచి ముద్దుల వరకు వారి వ్యక్తిగత విషయాలన్నింటినీ షేర్ చేసుకుంటారని ఆ సర్వే వెల్లడించింది. తమ స్నేహితురాళ్లు చెప్పిన విషయాలను అబ్బాయిలు కూడా పాటిస్తారని తెలిసింది. అయితే అతిగా షేర్ చేసుకోవడం మంచిది కాదని, ఈసారి మీ వ్యక్తిగత విషయాలను మిత్రులతో పంచుకునేటపుడు కింది విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. 1. భాగస్వామితో జరిగిన గొడవలు.. రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తితోగానీ, భాగస్వామితో జరిగిన ప్రతీ గొడవను, మనస్పర్థను మిత్రులతో పంచుకోకూడదు. అలా చెబితే వారు అతన్ని లేదా అమెను చులకన భావంతో చూసే అవకాశం ఉంది. గొడవ తర్వాత ఇద్దరూ కలసిపోయినా, అవి విన్న వారు మాత్రం ఆ విషయాన్ని మరచిపోకుండా భవిష్యత్తులో మీపై రుద్దే అవకాశం ఉంది. అత్యవసరమైనవి మాత్రమే పంచుకోవాలి. 2. బాధపడిన ప్రతీసారీ... ఏదైనా విషయంలో మీరు బాధపడిన ప్రతీసారీ మీ మిత్రులతో పంచుకోవాల్సిన అవసరం లేదు. అలా చెప్పడానికి అలవాటు పడితే వారు దగ్గర లేని సమయంలో ఇబ్బంది వస్తే మరింత ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. ఒంటరిగానే సమస్యను ఎదుర్కొనేలా మారాలని నిపుణులు సూచిస్తున్నారు. 3. కుటుంబ సమస్యలు... ప్రపంచంలోని ఏ కుటుంబానికి కూడా ఇబ్బందులు లేకుండా ఉండవు. కాబట్టి మీ కుటుంబంలో జరిగే మనస్పర్థలను, కలహాలను మిత్రులతో పంచుకోకపోవడమే మంచిది. కుటుంబంలో కనీసం ఒక్కరు కూడా వినే పరిస్థితిలో లేరు అనే సందర్భంలో మాత్రమే ఇతరులతో పంచుకోవాలి. అనుకోని పరిస్థితి ఎదురై మీ స్నేహితులు శత్రువులైతే కుటుంబ వ్యవహారాలు గుట్టురట్టయ్యే ప్రమాదం ఉంది. 4. చేసిన మంచి పనులు... మనం ఇతరుల పట్ల చూపిన జాలి, సహాయం అందరికి చెప్పుకుంటూ ఉంటే అది దాని లక్ష్యాన్ని చేరుకోలేదు. మన గొప్పదనాన్ని మనం చెప్పుకునే కంటే మన క్రియలే దాన్ని రూఢిపరిస్తే అది మరింత గౌరవాన్ని అందిస్తుంది. కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలీకూడదు అన్న సామెతను మరచిపోకూడదు. 5. లైంగిక జీవితం... లైంగిక జీవితంలో ఎదురయ్యే అనుభూతులు, సమస్యలను ఎవరితోనూ పంచుకోకూడదు. సమస్యలేమైనా ఉంటే సంబంధిత వైద్యులను కలవాలి తప్ప ఇతరుల సలహా అడగకపోవడమే మంచిది. అలా పంచుకోవడం వల్ల వేధింపులకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు. వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుకోవడమే ఉత్తమం. 6. మిత్రుల విషయాలను.. మీ మిత్రుల గురించి ఏమైనా చెడుగా వింటే, వారితోనే చర్చించి తెలుసుకోండి. అవునో కాదో అని మధ్యవర్తులను ఆశ్రయించడం ఆ విషయాన్ని మరింతగా ప్రచారం చేయడమే అనే తెలుసుకోవాలి. మీరు తమ గురించి వాకబు చేస్తున్నారన్న విషయాన్ని వేరే వారి ద్వారా మీ మిత్రులు తెలుసుకుంటే మీ మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోవచ్చు. అలాగే మీ మిత్రులు మిమ్మల్ని నమ్మి పంచుకున్న రహస్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టవద్దు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయన్న చందాన మీ మిత్రులు కూడా ఏదో ఒకరోజు శత్రువులైతే మీరు పంచుకున్న రహస్యాలే వారికి బ్రహ్మాస్త్రాలవుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే పలు సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
మళ్లీ వీధికెక్కిన హీరో కుటుంబం
యశవంతపుర : కన్నడ హీరో దునియా విజయ్ మొదటి భార్య నాగరత్న ఉంటున్న కత్రిగుప్పె ఇంటి వద్ద ఆదివారం హైడ్రామా చోటు చేసుకొంది. సెప్టెంబర్ 23న దునియా రెండో భార్య కీర్తిగౌడపై దాడి చేసిన వీడియోను దునియా, కీర్తిగౌడ మాధ్యమాలకు విడుదల చేశారు. విషయం తెలుసుకున్న తక్షణమే గిరినగర పోలీసులు నాగరత్న, మోనికపై కేసు నమోదు చేశారు. విచారణకు పోలీసులు వస్తున్న విషయం తెలుసుకున్న నాగరత్న, మోనికలు ఇంటికి తాళం వేసుకుని పోలీసులను అడ్డుకున్నారు. కిటికీలో నుండి పోలీసులతో మాట్లాడిన మోనిక తన తల్లి ఇంటిలో లేదని చెప్పి పంపారు. తమను అరెస్టు చేయటానికి వారెంట్ ఏమైనా తెచ్చారా అంటూ మోనిక ప్రశ్నించారు. గిరినగర పోలీసులు మధ్యాహ్నం వరకు నాగరత్న కోసం వేచి ఉండి వెళ్లిపోయారు. అంతలోనే నాగరత్న తరపున లాయర్ ఆదివారం మధ్యాహ్నం నేరుగా స్టేషన్‌కు వెళ్లి నాగరత్న మారణాయుధాలతో దాడి చేయలేదని, చేతితో కొట్టడం వల్లే గాయమైందని, ఆమెకు స్టేషన్ బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసి వెళ్లిపోయారు. మోనికను అదుపులోకి తీసుకున్న పోలీసులు కీర్తిగౌడపై దాడి చేసినందుకు నాగరత్న ఇంటిలో లేక పోవటంతో దునియా కూతురు మోనికను గిరినగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న దునియా విజయ్ రెండో భార్య కీర్తిగౌడతో కలిసి గిరినగర పోలీసుస్టేషన్ వద్దకు చేరుకున్నారు. కూతురును పోలీసులు అదుపులోకి తీసుకోవటంపై దునియా కన్నీరు పెట్టారు. అమ్మ చేసిన తప్పునకు కూతురుకు శిక్షవేయటం మంచిది కాదని, తమను కొట్టేంత ద్వేషం పెచ్చుకోవటం పద్దతికాదన్నారు. ఇంత జరిగినా పిల్లల భవిష్యత్ గురించి నాగరత్న పట్టించుకోవటంలేదని విజయ్ తరపు న్యాయవాది శివకుమార్ పేర్కొన్నారు. పిల్లలను అడ్డు పెట్టుకుని నాగరత్న నాటకాలు తనపై లేనిపోని అరోపణలు చేస్తున్న నాగరత్న పిల్లలను అడ్డం పెట్టుకుని తనను వేధిస్తున్నట్లు దు నియా విజయ్ అరోపించారు. ఇకనైనా బుద్ధిగా పి ల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పోలీసుల ముందుకు రావాలన్నారు. అయన ఆదివారం బెం గళూరులో విలేకర్లతో మాట్లాడారు. కీర్తిగౌడపై దా డి వీడియోను విడుదల చేసిన తక్షణం ఆమె ఇంటి నుండి పారిపోయారు. కూతురు మోనికను పోలీ సులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. మోనికను ఇలా స్టేష న్కు తీసుకురావటాన్ని తాను చూడలేకపోతున్నా ... చట్టం అందరికీ సమానం అనే విషయంను నా గరత్న మరిచారు. కూతురికి 18 ఏళ్ల నిండుతున్నా యి. ఇలాంటి వాతావరణంలో పిల్లలు ఉండటం చెడు ప్రభావానికి దారితీస్తుందని మీడియా ముం దు కన్నీరుమున్నీరయ్యారు. కూతురిపై ఆరోపణలు రావటంవల్ల మీరు రాజీఅవుతరా...అంటూ విలేకర్ల ప్రశ్నించగా అన్నింటికి పిల్లలను ముందుపెట్టి నాటకాలుచేయడం మంచిది కాదన్నారు. అరెస్ట్‌కు అదేశం కీర్తిగౌడపై దాడికి సంబంధించి నాగరత్నను అరెస్ట్ చేయటానికి గిరినగర పోలీసులు సిద్ధంగా ఉన్నారు. సెప్టెంబర్ 23న దునియాతో కలిసి ఉంటున్న ఇంటి వద్దకు వచ్చి అసభ్యంగా నిందించటంతో పాటు తనను చెప్పుతో కొట్టినట్లు కీర్తిగౌడ గిరినగర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమెను అరెస్ట్ చేస్తామని డీసీపీ అణ్ణామలై విలేకర్లకు తెలిపారు. -
కల్లోల కడలి
వాకాడు : కడలిపై పది రోజులుగా కల్లోల వాతావరణ నెలకొంది. సముద్రంపై పోరుగాలి వీస్తుండడంతో వేటకు వెళ్లిన బోట్లు తిరగబడుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లలేని పరిస్థితితో వాతావరణం అనుకూలించే సమయం కోసం తీరంలోనే కుటుంబాలతో సహా పడిగాపులు పడుతున్నారు. 61 రోజుల వేట విరామం తర్వాత జూన్ 15వ తేదీ నుంచి వేటకు మత్స్యకారులు సిద్ధమయ్యారు. సాధారణంగా వేట విరామం తర్వాత మత్స్య సంపద విరివిగా దొరుకుతుంది. సముద్రంపై పోరు గాలి, పెరిగిన అలల ఉధృతి కారణంగా పడవలు ఒక్క చోట నిలవక మత్స్యకారులు వేట చేయలేకపోతున్నారు. పోరు గాలితో మత్స్య సంపద చెల్లాచెదురై పొద్దస్తమానం సముద్రంలో వలేసి గాలించినా ఒక్క చేప కూడా దొరకడం లేదు. శ్రమతోపాటు, డీజిల్ ఖర్చులు పెరిగి మత్స్యకారులు నిరాశతో వెనుతిరిగి వచ్చేస్తున్నారు. వేట తప్ప మరే పని తెలియని మత్స్యకారులు పది రోజులుగా సముద్రంపై కుస్తీ పడుతున్నారు. అటు వేట లేక, పూట గడవక గంగపుత్రులు ఆకలితో అలమటిస్తున్నారు. వేటే జీవనాధారంగా చేసుకుని తెల్లవారు జామునే వల భుజాన వేసుకుని సముద్రాన్ని గాలించి మంచి మత్స్యసంపదతో సంతోషంగా కనిపించే సాగర పుత్రులు ప్రతికూల వాతావరణంతో దిగాలు చెందుతున్నారు. అలల ఉధృతిని సైతం లెక్క చేయకుండా ఎదురొడ్డి వేట చేసే మత్స్యకారులు సైతం ప్రస్తుతం భయపడుతున్నారు. ఇటీవల పోరుగాలి, అలల ఉధృతి కారణంగా పలుచోట్ల బోట్లు తిరగబడి మత్స్యకారులు గల్లంతైన ఘటనలు దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు వేట మానేసి బోట్లు ఒడ్డున లంగర్ వేశారు. జిల్లాలోని కావలి నుంచి తడ వరకు 12 మండలాల పరిధిలోని తీర ప్రాంతంలో ఇదే పరిస్థితి నెలకొంది. పోరుగాలితో వేట సాగడం లేదు పది రోజులుగా సముద్రంపై ప్రతికూల వాతావరణం నెలకొంది. పోరుగాలికి వేట చేయలేకున్నాము. తెల్లవారు జామున సముద్రంపై వేటకు వెళ్లినప్పటికీ బోట్లు ఒక్కచోట నిలవక, చేప దొరక్క నిరాశతో వెనుతిరిగి రావాల్సి వస్తుంది. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అందట్లేదు. రెండేళ్లుగా వేట నిషేధిత పరిహారం రాకపోవడంతో జీవనం కష్టంగా ఉంది. – సోమయ్య, మత్స్యకారుడు, తూపిలిపాళెం రెండేళ్లుగా వేట విరామం నగదు రావడం లేదు రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుంచి మత్స్యకారులకు అందాల్సిన వేట విరామం నగదు అందడం లేదు. తిరిగి తిరిగి కాళ్లు అరిగిపోతున్నాయే తప్ప డబ్బులు మాత్రం రావడంలేదు. వేట లేక, పూట గడవక, పస్తులుంటున్న సంగతి సంబంధిత అధికారులకు తెలిసినా తమను ఎవరూ పట్టించుకోవడం లేదు. – ఎం.పోలయ్య, మత్స్యకారుడు కొండూరుపాళెం -
అమ్మ వచ్చింది.. ఆకలి తీర్చింది!
ఇల్లెందు: బందీగా మారిన ఆ తల్లికి విముక్తి లభించింది. అమ్మ స్పర్శ కరువై, ఆమె ఒడిలోని వెచ్చదనం దూరమై, తల్లి పాల అమృతం అందక రెండు రోజులుగా అల్లాడుతున్న ఆ పసికందును అక్కున చేర్చుకుంది. ఆకలి తీర్చింది. ‘‘బిడ్డా.. ఇంకెప్పటికీ నీ వెంటే ఉంట.. నిన్నొదిలి ఉండ..’’ అంటూ, ఆ పసివాడిపై ముద్దులు కురిపించింది. ఇల్లెందు మండలం రొంపేడు పంచాయతీ మిట్టపల్లి తండాకు చెందిన బి.రజిత, గార్ల మండలం ముల్కనూరుకు చెందిన బళ్లెం కళ్యాణ్ ప్రేమించుకున్నారు. ఏడాది క్రితం గార్ల శివాలయంలో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ పెళ్లికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. హైదరాబాద్‌లో కాపురం పెట్టిన ఈ దంపతులకు మూడు నెలల క్రితం బాబు జన్మించాడు. ఈ దంపతులు, తమ చిన్నారితో కలిసి ఇటీవల ఇల్లెందు వచ్చారు. రజితను ఆమె తల్లిదండ్రులు నమ్మించి, మిట్టపల్లిలోని తమ ఇంటికి శుక్రవారం రప్పించారు. సాయంత్రం వరకు వస్తానని చెప్పి, మూడు నెలల 11 రోజుల వయసున్న తన బిడ్డను ఇల్లెందులో తన భర్త కళ్యాణ్ వద్ద వదిలి వెళ్లింది. అక్కడ ఆమెను తల్లిదండ్రులు గృహ నిర్బంధంలో ఉంచారు. పసిబిడ్డ కోసం అక్కడ ఆ తల్లి వేదన. తల్లి కోసం ఇక్కడ ఈ పసిబిడ్డ రోదన. ఈ పరిస్థితిలో, పోలీసులను కళ్యాణ్ ఆశ్రయించాడు. వారు అంతగా స్పందించకపోవడంతో ‘సాక్షి’కి సమాచారమిచ్చాడు. దీనిపై, ఆదివారం రోజున ‘సాక్షి’లో ‘బందీగా తల్లి.. ఆకలితో పసికూన..’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనంతో పోలీసులు కదిలారు. మిట్టపల్లిలోని రజిత పుట్టింటికి ఆదివారం ఉదయం ఎస్ఐ రాజు వెళ్లారు. రజితను, ఆమె పుట్టింటి వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అప్పటికే పోలీస్ స్టేషన్లో పసికూనతో కళ్యాణ్ ఎదురుచూస్తున్నాడు. బిడ్డను చూడగానే రజిత పరుగెత్తుకుంటూ వచ్చింది. వాడిని చేతుల్లోకి తీసుకుని తనవితీరా ముద్దాడింది. కన్నీటిపర్యంతమైంది. పాలు పట్టింది. ఆకలి తీర్చింది. ఆ తరువాత రజితను, కళ్యాణ్‌ను, రజిత కుటుంబీకులను ఎస్ఐ రాజు విచారించారు. తన కోసం భర్త కళ్యాణ్, పసిబిడ్డ ఎదురుచూస్తున్నారని, వెళతానని బయల్దేరిన తనను పుట్టింటోళ్లు ఇంటిలో బంధించారని ఎస్ఐతో రజిత చెప్పింది. తనకు భర్త కళ్యాణ్, బిడ్డ కావాలని స్పష్టంగా చెప్పింది. ఎస్ఐ అడగడంతో ఇదే విషయాన్ని రాసిచ్చింది. ఆమె కుటుంబీకులు, భర్త కళ్యాణ్ నుంచి కూడా రాయించుకున్నారు. రజితను ఆమె భర్త కళ్యాణ్‌తో పంపించారు. కళ్యాణ్, రజిత, బాబు, కళ్యాణ్ తల్లి సువార్త కలిసి ఇల్లెందు పోలీస్ స్టేషన్ నుంచి గార్ల ముల్కనూరులోని తమ ఇంటికి వెళ్లారు. చివరికి, కథ సుఖాంతమైంది. -
బందీగా అమ్మ... ఆకలితో పసికూన
మూడు నెలల పదకొండు రోజుల వయసున్న ఈ పసికూనకు మాట్లాడే శక్తే ఉంటే.. తన తల్లిని ఇలాగే వేడుకునేవాడేమో...!!! ఆ తల్లి ఎవరు..? ఎక్కడికెళ్లింది...? పసికూనకు ఎందుకు దూరమైంది,...? వీటికి సమాధానమే ఈ కథనం... ఇల్లెందు : ఇదొక ప్రేమికుడి వేదన. ఇదొక ప్రియురాలి యాతన. ఇదొక పసికూన రోదన. ఇల్లెందు మండలం రొంపేడు పంచాయతీ మిట్టపల్లి తండాకు చెందిన ఆమె పేరు బి.రజిత, గార్ల మండలం ముల్కనూరుకు చెందిన అతడి పేరు బళ్లెం కళ్యాణ్. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. గార్ల శివాలయంలో ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ–పెళ్లికి రజిత తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. వారి నుంచి తామిద్దరికీ ప్రాణ భయం ఉందంటూ గార్ల పోలీసులను ఆ ప్రేమ జంట ఆశ్రయించింది. వారిని ఇల్లెందు పోలీస్ స్టేషన్‌కు గార్ల పోలీసులు పంపించారు. రజిత తల్లిదండ్రులను ఇల్లెందు పోలీసులు పిలిపించారు. కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆ తరువాత, రజిత– కళ్యాణ్ జంట హైదరాబాద్ వెళ్లింది. అక్కడే ఉంటున్నారు. రజిత గర్భవతయింది. ప్రసవం కోసం భర్తతో కలిసి ముల్కనూరుకు వచ్చింది. కొన్ని రోజులు గడిచాయి. రజితతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబీకులు ఫోన్లో మాట్లాడసాగారు. యోగ క్షేమాలు తెలుసుకోసాగారు. మార్చి 19న పండంటి బాబుకు రజిత జన్మనిచ్చింది. బాబును, రజితను చూసేందుకు తల్లిదండ్రులు పలుమార్లు ముల్కనూరు వచ్చారు. రజిత–కళ్యాణ్ కుటుంబాల మధ్య సుహృద్బావ వాతావరణం ఏర్పడింది. వారం రోజుల కిందట రజిత అస్వస్థురాలైంది. ఆమె కుటుంబీకులకు తెలిసింది. ఇల్లెందులోని ఆస్పత్రిలో వైద్యం చేయిస్తామన్నారు. కళ్యాణ్–రజిత దంపతులు తమ పసికూనతో ఇల్లెందు చేరుకున్నారు. ప్రైవేటు వైద్యశాలలో రజితకు ఆమె కుటుంబీకులు వైద్యం చేయించారు. ఆ దంపతులు ఆ రోజు సాయంత్రం ముల్కనూరు చేరుకున్నారు. ఇంటికి రావాలంటూ రెండు రోజుల కిందట రజిత కుటుంబీకుల నుంచి పిలుపొచ్చింది. బాబును తీసుకుని కళ్యాణ్–రజిత ఇల్లెందు వచ్చారు. ఆమెను మిట్టపల్లిలోని పుట్టింటికి పంపించాడు. ఆ పసికూనకు ఆరోగ్యం బాగోలేదు. సాయంత్రానికి రావాలని, అప్పటివరకు బాబును తన వద్దనే ఉంచుకుంటానని అన్నాడు. ఆమె సరేనంది. తన పుట్టింటికి వెళ్లింది. సాయంత్రం వరకు కళ్యాణ్‌తో రజిత ఫోన్లో మాట్లాడింది. మరో గంటలో బయల్దేరుతానని చెప్పింది. సాయంత్రమైంది. ఆమె రాలేదు. బాబు ఏడుస్తున్నాడు. రజితకు ఫోన్ చేశాడు. ఆమె కుటుంబీకులు మాట్లాడారు. ‘‘రజిత రాదు. నీ దిక్కున్న చోట చెప్పుకోపో...’’ – అటు నుంచి వచ్చిన సమాధానమిది. ఈ హఠాత్పరిణామంతో కళ్యాణ్‌కు నోట మాట రాలేదు. శనివారం సాయంత్రమైంది. ఆ పసికూనకు ఒకటిన్నర రోజుపాటు తల్లి పాలు లేవు. పాపం.. ఆకలవుతుందేమో..! గుక్కపట్టి ఏడుస్తున్నాడు. కళ్యాణ్‌కు ఎటూ పాలుపోలేదు. పసికూనను ఎత్తుకుని, తన తల్లి సువార్తతో కలిసి ఇల్లెందు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. జరిగినదంతా చెప్పాడు (ఫిర్యాదు చేశాడు). పోలీసులు స్పందించడం లేదని కళ్యాణ్ అంటున్నాడు. తనకు, తమ బిడ్డకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. ఎస్సై ఏమంటున్నారంటే.... దీనిపై ఇల్లెందు ఎస్ఐ బి.రాజును ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘తన భార్య రజితను మిట్టపల్లిలోని ఆమె పుట్టింటి వాళ్లు బంధించారంటూ పోలీస్ స్టేషన్‌కు కళ్యాణ్ వచ్చి ఫిర్యాదు చేశాడు. ఆదివారం ఉదయం మిట్టపల్లి నుంచి రజితను, తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి విచారిస్తాం. ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోసం ఖమ్మానికి రిఫర్ చేస్తాం. తనను బంధించినట్టుగా రజిత చెప్పలేదు. ఆమెను బంధించినట్టుగా ఆ గ్రామానికి చెందిన ఎవ్వరూ కూడా చెప్పలేదు. ఎవరైనా చెబితే... ఆ కుటుంబంపై చర్యలు తీసుకుంటాం. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఉండవచ్చు. అలాంటప్పుడు ఆమెను బంధించినట్టు ఎలా అవుతుంది...? బంధించారని కళ్యాణ్ చెబితే సరిపోదు’’ అని, ఎస్సై అన్నారు. పాపం.. పసికూన.. ‘‘తల్లి నులివెచ్చని స్పర్శకు, పాలకు దూరమైన ఆ పసికందు పరిస్థితేమిటి..? తల్లిపాలకు దూరమై నిన్నటి రాత్రికి ఒకటిన్నర రోజు. ఎస్సై చెప్పినట్టుగా... కౌన్సిలింగ్ జరిపించి, తల్లి వద్దకు బిడ్డను పంపించేసరికి ఎన్ని గంటలు.. ఎన్ని రోజులు పడుతుందో...? అప్పటివరకు ఆ పసికందు ఆకలిదప్పులు, ఆరోగ్యం పట్టించుకునేదెవరు..? (పసిపిల్లల సంరక్షణ.. తండ్రికన్నా తల్లితోనే సాధ్యం కదా..!)’’ ఈ జంట–పసికూన వ్యవహారం తెలిసిన–చూసిన వారందరి ఆవేదన ఇది -
కుటుంబ కలహాలతో ఆత్మహత్య
ఖమ్మం వైరా : కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సై తాండ్ర నరేష్ తెలిపిన వివరాలు... స్థానిక బీసీ కాలనీకి చెందిన చందా సైదారావు(36), ఆయన భార్య వరలక్ష్మి మధ్య కొన్నాళ్లుగా ఘర్షణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఆమె సోదరుడైన రామారావు, శుక్రవారం సైదారావు ఇంటికి వచ్చి బెదిరించాడు, దాడి చేశాడు. అదే రోజు రాత్రి, ఎస్బీఐ సమీపంలో తనకు చెందిన టీ స్టాల్ వద్ద సైదారావు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. వరలక్ష్మి ఫిర్యాదుతో రామారావుపై కేసు నమోదు చేశారు దర్యాప్తు జరుపుతున్నారు. -
నడిరోడ్డుపై కన్నతండ్రిని హతమార్చారు!
సాక్షి, నల్గొండ : నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే కుమారులు కన్నతండ్రిపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేసి హత్య చేశారు. అనుముల మండలం హాలియలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదాలే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. అనుముల మండలం హాలియ గ్రామానికి చెందిన చందారెడ్డి గోవిందరెడ్డి తన అల్లుడు కూనిరెడ్డి సైదురెడ్డితో కలిసి ఏదో పని మీద బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా గోవింద రెడ్డి కుమారులు అంజిరెడ్డి, రమణారెడ్డిలు ఒక్కసారిగా తండ్రి, బావ సైదురెడ్డిలపై దాడికి పాల్పడ్డారు. కర్రలు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తండ్రి గోవిందరెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, వీరి బావ సైదురెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడిఉన్న గోవింద రెడ్డి మృతదేహం పక్కన ఆంధ్రా బ్యాంకు పాస్‌బుక్ ఉందని పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ సైదురెడ్డిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆస్తి గొడవలే హత్యకు దారితీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
అనుమానం పెనుభూతమై..
ఆనందపురం(భీమిలి): కలకాలం తోడు ఉండాల్సిన భర్త అనుమానం పెంచుకున్నాడు. దీనికి అతని కుటుంబ సభ్యులు కూడా వంత పాడడంతో కాలయముడుగా మారా డు. విచక్షణా జ్ఞానం కోల్పోయి కట్టుకున్న భార్యనే ఇంట్లోనే గొంతు నులిమి నిర్ధాక్షిణ్యంగా కడతేర్చాడు. ఈ విషాదకర సంఘటన మండలంలోని గిడిజాల పంచాయతీ వేమగొట్టిపాలెంలో ఆది వారం రాత్రి జరగగా.. సోమవారం ఉదయం వెలుగు చూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. వేమగొట్టిపాలేనికి చెందిన ముది లి పెంటమ్మ, యర్రయ్య దంపతులకు కోటేశ్వరరావు, రమణ, సత్యారావు అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్దవాడైన కోటేశ్వరరావు లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు 13 ఏళ్ల కిందట మండలంలోని ముచ్చర్ల గ్రామానికి చెందిన ఈశ్వరమ్మతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. ఇదిలా ఉండగా మొదటి నుంచి భార్య ఈశ్వరమ్మ ప్రవర్తనపై కోటేశ్వరరావుకు అనుమా నం. దీంతో ఆమెను నిత్యం వేధించడంతో గొడవలు జరిగేవి. కోటేశ్వరరావును మందలించాల్సిన అతని తల్లిదండ్రులు వంత పాడారు. ఎప్పటిౖMðనా ‘నిన్ను హతమార్చుతానంటూ’భార్యను హెచ్చరించే వాడని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కోటేశ్వరరావు ఇంట్లో పెద్దగా కేకలు వినిపించడంతో చుట్టు పక్కల వారు పరుగున వెళ్లి చూడగా.. ఈశ్వరమ్మ(30) విగతజీవిగా పడి ఉంది. కోటేశ్వరరావుతో పాటు ఈయన తల్లిదండ్రులు పెంటమ్మ, యర్రయ్యలు కనిపించకుండా పోవడంతో స్థానికలు పోలీసులకు సమాచారం అందించారు. గొంతు నులిమి చంపేశారు? మృతురాలు ఈశ్వరమ్మ తలపై స్వల్ప గాయాలు ఉండి రక్తం స్రావమైంది. గొంతు నులిమి చంపేసినట్టు మెడపై ఆనవాళ్లుతో పాటు, గోళ్లు రక్కులు ఉన్నాయి. ఒంటిపై ఆభరణాలు కింద పడి ఉండడంతో పెనుగులాట జరిగి నట్టు తెలుస్తోంది. ఏ ఆయుధం లేకుండా ఒక వ్యక్తి హతమార్చలేడని.. కోటేశ్వరరావుకు కుటుంబ సభ్యులు కూడా సహకరించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు సంఘటన స్థలంలో పూర్తి స్థాయి విచారణ జరిపారు. అందరూ ఉండి అనాథలైన పిల్లలు కోటేశ్వరరావు, ఈశ్వరమ్మలకు మహేష్(12), రాజేష్(10) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మహేష్ గిడిజాల హైస్కూల్లో 7వ తరగతి, రాజేష్ స్థానిక ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నారు. చిన్న వయస్సులోనే వారు తల్లిని పోగొట్టుకోవడంతో అందరూ ఉండి అనాథులుగా మిగి లారు. సంఘటన విషయమై పోలీసులు, గ్రామస్తులు హడావుడి చేయడంతో వారు బిత్తర చూపులు చూడడంతో పలువురు హృదయాలను కలచి వేసింది. ఈశ్వరమ్మ తల్లి బంగారమ్మ, సోదరుడు అప్పలరాజులు సంఘటన స్థలం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసు ఉన్నతాధికారుల విచారణ సంఘటన విషయం తెలుసుకున్న ఏసీపీ నాగేశ్వరరావు, డీసీసీ ఫకీరప్ప, స్థానిక సీఐ ఆర్.గోవిందరావులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. కూŠల్స్ టీంను కూడా రప్పించారు. భార్యాభర్తలు కుటుంబ సభ్యులు మధ్య జరిగిన వివాదాల గురించి స్థానికులను విచారించారు. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం హత్యగానే నిర్ధారించారు. ఆ మేరకు మృతురాలు సోదరుడైన అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోటేశ్వరరావుతో పాటు పెంటమ్మ, యర్రయ్యలపై కేసు నమోదు చేశారు. కోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మొదట భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్పష్టమైన నివేదిక కోసం కేజీహెచ్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. -
భార్య కాపురానికి రావడంలేదని..
సాక్షి, కడప: వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టరేట్లో కలకలం రేగింది. కలెక్టరేట్ వద్ద పులివెందులకు చెందిన ఓ వ్యక్తి. కొడుకుతో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. గమనించిన సిబ్బంది తండ్రీకొడుకుని రిమ్స్‌కు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. కాగా గత కొంతకాలంగా తన భార్య కాపురానికి రావడంలేదని సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు తన సమస్యను పట్టించకోలేదని.. అందుకే ఆత్మహత్యకు యత్నించినట్టు అతను అరోపిస్తున్నాడు. -
తాంత్రిక పూజల పేరుతో రూ. 20లక్షల టోకరా
చేబ్రోలు: తాంత్రిక పూజలు నిర్వహించి కుటుంబ సమస్యలు లేకుండా చేస్తానని, అనారోగ్య సమస్యలు తీర్చుతానిని చెప్పి గురుస్వామి రూ.20లక్షల వరకు మోసగించినట్లు బాధితుడు గుంటూరు అర్బన్ ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. అర్బన్ ఎస్పీ ఆదేశాల మేరకు చేబ్రోలు ఎస్ఐ వి.బాబురావు శుక్రవారం చేబ్రోలు మండలం శేకూరు గ్రామానికి చెందిన గురుస్వామి గుంటుపల్లి శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన కంకణాల హరిబాబు బెంగుళూరులో హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. దైవచింతన, భక్తిభావం కలిగిన హరిబాబు చేబ్రోలు మండలం శేకూరు గ్రామానికి చెందిన గురుస్వామి గుంటుపల్లి శ్రీనివాసరావుకి భక్తుడు. బెంగుళూరులోని హరిబాబు ఇంటి వద్దకు తీసుకువెళ్లి కుటుంబ సమస్యలు, ఆర్థిక చింతలు తొలగించటం కోసం తాంత్రిక పూజలు కొన్ని నెలలుగా నిర్వహించాడు. అయినా అనారోగ్య సమస్యలు తీరకపోవటంతో పాటు, ఆర్థికంగా నష్టపరిచినట్లు గుర్తించాడు. దీంతో రూ.20లక్షల వరకు వివిధ రకాల ఖర్చుల కోసం డబ్బులు తీసుకొని మోసగించినట్లు బాధితుడు హరిబాబు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ వి.బాబురావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్యా యత్నం
పొన్నూరు: భార్యాభర్తల మధ్య ఏర్పడిన వివాదం తల్లీ పిల్లల ఆత్మహత్యా యత్నానికి దారితీసింది. ఈ ఘటనలో ఆరేళ్ల కుమార్తె మృతిచెందగా మరో కుమార్తె, తల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చల తాడిపర్రు గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ సుభానికి ఎనిమిదేళ్ల క్రితం యడ్లపాడుకు చెందిన మౌలాబీతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పర్వీన్‌కు ఏడేళ్లు కాగా, చిన్న కుమార్తె హాసియాకు ఆరేళ్లు. భార్యాభర్తల మధ్య శనివారం ఉదయం ఘర్షణ జరిగింది. అనంతరం మౌలాబీ తన ఇద్దరు కుమార్తెలపై పెట్రోలు పోసి నిప్పంటించి ఆ తర్వాత తనూ అంటించుకుంది. మంటలు తట్టుకోలేక చిన్నారులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. అనంతరం వారిని గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. చికిత్స పొందుతూ రెండో కుమార్తె హాసియా మృతి చెందింది. మరో కుమార్తె పర్వీన్ కోలుకుంటుండగా, తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్టు సుభానీ తరచూ అనుమానించే వాడని, ఈ కారణంతో ఇరువురి మధ్య గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని బాపట్ల డీఎస్పీ డి.గంగాధరం సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. -
నందమూరి కాలనీలో ఏమైందో... ఏమో?
ఆయనో రిక్షా కార్మికుడు. భార్య చనిపోయినా... కన్నకొడుకును చక్కగా పెంచాడు. శక్తిమేరకు చదివించాడు. కొడుకు అందివచ్చాక ఓ ప్రైవేటు దుకాణంలో పనిచేసుకుంటున్నాడు. ఇద్దరి సంపాదనతో ఎలాంటి అరమరికలు లేకుండా హాయిగా కాలం గడిపేస్తున్నారు. మద్యానికి బానిసైన తండ్రి వైఖరి కొడుక్కు నచ్చలేదు. ఎలాగైనా వ్యసనం మాన్పించాలని కొడుకు శతవిధాలా ప్రయత్నించాడు. వినకపోవడంతో విభేదించాడు. చివరకు ఏమైందో ఏమోగానీ... అనుమానాస్పదంగా ఇద్దరూ కన్నుమూశారు. విషాదం నింపిన ఈ సంఘటన పార్వతీపురం నందమూరి కాలనీలో శుక్రవారం చోటు చేసుకుంది. పార్వతీపురం: పార్వతీపురం పట్టణంలోని కొత్తవలస నందమూరి కాలనీలో శుక్రవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో తండ్రి, కొడుకులు తెల్లవారేసరికి విగత జీవులై పడివుండడాన్ని చూసిన స్థానికులు, ఇరుగు పొరుగు వారు ఆందోళన చెందారు. ఏం జరిగిందో ఏమోగానీ... తండ్రి ముగడ శ్రీను(45) ఇంట్లోనే మరణించగా... కుమారుడు రాము(19) అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన చుట్టుపక్కలవారు 108కు సమాచారం అందించారు. వారు వచ్చి పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా కన్నుమూశాడు. కుటుంబ కలహాలే కారణమా... రిక్షా కార్మికుడైన శ్రీను కుమారుడితో కలసి 1987 నుంచి నందమూరి కాలనీలోనే నివాసం ఉంటున్నారు. రాముకు ఏడేళ్ల వయసులోనే తల్లి రూప చనిపోగా.. అన్నీ తానై శ్రీను చక్కగా పెంచాడు. ప్రస్తుతం రాము పార్వతీపురం పట్టణంలోని పాలకొండ రోడ్డులో ఉన్న శివసాయి ఆటో కన్సల్టెంట్లో పనిచేస్తున్నాడు. శ్రీను తరచూ మద్యం సేవించి ఇంటికి వస్తుండడంతో కొడుకు అభ్యంతరం చెప్పాడు. కష్టపడి పనిచేసి తాను వస్తుంటే ఆయన మందుతాగి బాధ్యతను మరచి ప్రవర్తిస్తున్నాండూ కుమారుడు తండ్రిని మందలించేవాడని కాలనీ వాసులు చెబుతున్నారు. గడచిన నెలరోజులుగా ఈ వ్యవహారంపై తండ్రీ కొడుకులు మాట్లాడుకోలేదని చెబుతున్నారు. తండ్రి ఇంట్లో ఉంటే కుమారుడు బయట పడుకోవడం, కుమారుడు ఇంట్లో ఉంటే తండ్రి బయట పడుకోవడం చేస్తున్నారని ఇరుగు పొరుగు వారు చెబుతున్నారు. వారం రోజులుగా శ్రీను ఎక్కడికి వెళ్లాడో తెలియదని, రాము ఒక్కడే ఇంటికి వస్తున్నాడని కాలనీవాసులు తెలిపారు. గురువారం రాత్రి తం డ్రి, కొడుకులు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారని, వంటకూడా శ్రీను చేశాడని స్థానికులు చె బుతున్నారు. వండిన వంటను తినకుండా అలానే వదిలేశారని ఏం జరిగిందో తెలి యదని తెల్లవారి లేచి చూసేసరికి ఇలాంటి ఘోరం జరిగిపోయిందని చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ విషయం తెలుసుకున్న పార్వతీపురం ఏఎస్పీ అమిత్ బర్దార్ శుక్రవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తండ్రి, కొడుకుల మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇరుగు, పొరుగు వారిని విచారించారు. సంఘటన స్థలంలో మృతికి గల ఆనవాళ్లు ఏమైనా లభిస్తాయేమోనని శోధించారు. వారు నిద్రిస్తున్న మంచంపై పరచిన బొంతలు, దుప్పట్లను పరిశీలించారు. మృతుల నోటినుంచి నురగ వచ్చిందని స్థానికులు చెప్పడంతో వాటి ఆనవాళ్లకోసం కూడా పరిశీలించారు. చివరిగా మృతదేహాలను పోస్టుమార్టం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలనుంచి కొన్ని శరీర భాగాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. విష పదార్థం తీసుకున్నందునే మృతిచెంది ఉండవచ్చని భావిస్తున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.రాంబాబు తెలిపారు. పూర్తి ఆధారాలు లభిస్తేగాని, తండ్రి కొడుకుల మృతికి కారణం ఏమిటనేది స్పష్టం కాదు. -
భార్యను చంపి భర్త ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని మలక్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను హతమార్చాడో భర్త. అనంతరం ఉరి వేసుకొని అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ముసారాంబాగ్‌లో బుధవారం వెలుగు చూసింది. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ కు చెందిన శుభాష్ రెడ్డి(42) నగరంలోని ఓ హోటల్ లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య శోభ(35) గృహిణి. వీరి మధ్య గతకొంతకాలంగా కలహాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో బుధవారం శుభాష్ భార్యను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు విషయం తెలుసుకున్న పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
భార్యపై దాడికి దిగి.. చివరికి తానే!
సాక్షి, వరంగల్ రూరల్ : భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న వివాదం చివరకు భర్త ప్రాణాలు తీసింది. చేతిలో ఉన్న అద్దంతో భార్యపై దాడి చేయడానికి యత్నించిన భర్త.. ప్రమాదవశాత్తూ అదే అద్దం బారిన పడి మృతిచెందాడు. ఈ విషాదం వరంగల్ రూరల్ జిల్లాలోని పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామంలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన జంగాల యాకన్న(45) శుక్రవారం రాత్రి భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న అద్దం ముక్కతో ఆమెపై దాడి చేయడానికి యత్నించాడు. ప్రమాదవశాత్తు ఆ అద్దం యాకన్న చేతికి గుచ్చుకోవడంతో పెద్ద గాయం అయి భారీగా రక్తస్రావం జరిగింది. దీంతో అతన్ని వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే భారీగా రక్తస్రావం జరగడంతో యాకన్న మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ విషాదంపై గ్రామస్తులు విదస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
కూతురితోసహా ఆత్మహత్యాయత్నం
- చికిత్స పొందుతూ తల్లి మృతి - కోలుకుంటున్న చిన్నారి కొలిమిగుండ్ల: కుటుంబ కలహాలు తాళలేక ఓ మహిళ తన మూడేళ్ల చిన్నారితో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మూడు నెలల క్రితమే జన్మించిన పసిబాలుడిని సైతం కాదని అఘాయిత్యానికి పాల్పడింది. చివరకు చికిత్స పొందుతూ తల్లి మరణించగా కూతురు కోలుకుంటోంది. ఈ ఘటన మండల పరిధిలోని చింతలాయపల్లెలో మంగళవారం చోటు చేసుకుంది. బంధువులు, పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వడ్డె హరికృష్ణకు అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఇల్లూరుకు చెందిన అనిత(24)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కూతురు వైష్ణవి ఉంది. మూడు నెలల క్రితమే రెండవ కాన్పులో మగబిడ్డ పుట్టాడు. పురుడు పోసుకునేందుకు పుట్టినింటికి వెళ్లిన అనిత కొడుకుకు మూడు నెలలు పడటంతో నాలుగు రోజుల క్రితమే అత్తారింటికి వచ్చింది. మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్న భర్త హరికృష్ణ రెండు రోజుల క్రితం గొడవ పడింది. దీంతో మనస్థాపం చెందిన అనిత తన మూడేళ్ల కూతురు వైష్ణవికి వాస్మోల్ తాపి తాను సేవించింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న తల్లికూతుళ్లను చికిత్స నిమిత్తం తాడిపత్రికి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ అనిత మృతిచెందింది. వైష్ణవిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. ఎస్ఐ బీటీ వెంకటసుబ్బయ్య తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
చెన్నేకొత్తపల్లి : మండలంలోని యర్రంపల్లిలో కుటుంబకలహాతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. మండలంలోని సోమందేపల్లికి చెందిన విజయలక్ష్మి(28)కి చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దెల గ్రామానికి చెందిన నాగేంద్రతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో 8 తులాల బంగారు. రూ. 2 లక్షల నగదు ఇచ్చామని మృతురాలి తల్లిదండ్రులు శ్రీలక్ష్మి, గంగాప్రసాద్‌లు తెలిపారు. అయితే తరచూ తమ కుమార్తెను భర్తతో పాటు అత్తమామలు వేధింపులకు గురిచేసే వారన్నారు. తమ కుమార్తెను వారే చంపి ఉరివేసి ఉంటారని వారు ఆరోపించారు. తమకుమార్తె చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. యర్రంపల్లిలో మరొకరు.. మండలంలోని యర్రంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, చిన్నవెంకట్రాముడు దంపతుల కుమార్తె నాగమణి( 22)ని ఇదే మండలంలోని ముష్టికోవెలకు చెందిన ఈశ్వరయ్యతో ఏడాది క్రితం వివాహం చేశారు. వారు సోమందేపల్లి మండలంలో మగ్గం పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే కొన్ని నెలలుగా భర్త వేధింపులు అధికం అయ్యాయని పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఇంటి ఎవరూ లేని సమయంలో లుంగీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణీ అని వారు తెలిపారు. తమ కుమార్తె మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఎస్ఐ మహమ్మద్‌రఫీ సంఘటనా స్థలాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఆయన తెలిపారు. -
నాన్నా.. మాకెందుకీ శిక్ష?
- మనస్పర్థలతో వేర్వేరుగా ఉంటున్న దంపతులు - తమను చదివించాలని తండ్రిని కోరిన పిల్లలు - తండ్రి ఇంటి ముందు బిడ్డల బైఠాయింపు - రాత్రంతా చలిలో... ఇంటి ముందే నిద్రించిన వైనం - పోలీసుల జోక్యంతో నిరసన విరమించిన పిల్లలు నాన్నా.. మేమేం పాపం చేశాం. మమ్మల్ని కనమని అడిగామా..లేదే. మరి మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్లిపోయావ్? మా ఈడు పిల్లల్లాగే మాకూ చదువుకోవాలని ఉంది. బోలెడన్ని కబుర్లు నీతో చెప్పాలని ఉంది. ఇంకా వస్తావని ఎదురు చూశాం. నువ్వేమో వచ్చేలా లేవు. కనీసం మా భవిష్యత్తు గురించైనా ఆలోచించే ఓపిక నీకు లేనట్టుంది. మా గురించి నువ్వే పట్టించుకోకపోతే.. ఇక ఎవరు పట్టించుకుంటారు నాన్నా.. మాకు చదివిస్తానని మాటిచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ ఓ ఇద్దరు చిన్నారులు తండ్రి ఇంటి ముందు రాత్రంతా చలిలో దీక్షకు కూర్చోవడం సంచలనం సృష్టించింది. చివరకు పోలీసుల జోక్యంతో వారు దీక్ష విరమించారు. - అనంతపురం సెంట్రల్ అనంతపురం భైరవనగర్ మొదటి క్రాస్‌లో నివాసముంటున్న మిలటరీ ఉద్యోగి(డిఫెన్స్) రామాంజనేయరెడ్డి ఇంటి ముందు ఆయన కుమార్తె సుకృత(13), పవన్‌కుమార్‌రెడ్డి(10) గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు నిరసనకు దిగారు. తమకు చదివించాలని, తమ భవిష్యత్తుకు దారి చూపాలని ఆ చిన్నారులిద్దరూ ఇలా రాత్రంతా చలిలో ఒణకుతూ ఆందోళన కొనసాగించడం అందరికీ కన్నీళ్లు తెప్పించింది. ఎందుకీ పరిస్థితి వచ్చిందంటే.. రామాంజనేయరెడ్డి దంపతుల మధ్య రెండేళ్ల కిందట మనస్పర్ధలు తలెత్తాయి. అప్పటి నుంచి దంపతులు విడిపోయి ఎవరికి వారు వేర్వేరుగా బతుకుతున్నారు. పిల్లలిద్దరూ తల్లి వద్దే ఉంటున్నారు. పాపా తొమ్మిదో తరగతి, బాబు ఏడో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ ఓ ప్రైవేటు పాఠశాలలో చదివేవారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారమైన నేపథ్యంలో ఫీజు చెల్లించలేక పాఠశాల మానుకున్నారు. కనీసం టీసీ ఇమ్మని అడిగినా పాఠశాల యాజమాన్యం అంగీకరించడం లేదని తెలిపారు. ఫీజు బకాయిలు కట్టేంత వరకు టీసీలు ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ చిన్నారులిద్దరూ తమ చదువుకు సహకరించాల్సిందిగా కోరేందుకు గురువారం తండ్రి ఇంటి వద్దకు వెళ్లారు. అయితే అతను ఇంట్లోకి రానివ్వకపోవడంతో చిన్నారులిద్దరూ తండ్రి ఇంటి ముందే బైఠాయించారు. రాత్రి పొద్దుపోయేంత వరకూ కూడా వారి సమస్య తెగలేదు. దీంతో ఆ పిల్లలు అక్కడే నిద్రపోయారు. ఒకవైపు తుంపర పడుతుండగా, మరోవైపు చలిలోనే వారు నరకయాతన అనుభవించారు. ఆ చిన్నారులు పడుతున్న కష్టాన్ని చూసిన ఇరుగు పొరుగు ప్రజలు శుక్రవారం ఉదయాన్నే వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే పోలీసులు రామాంజనేయరెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆందోళన కొనసాగిస్తున్న అతని పిల్లలిద్దరితో మాట్లాడారు. వారి సమస్య అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు వస్తే మాట్లాడుదామంటూ నచ్చజెప్పి పిల్చుకెళ్లారు. ఆస్తిపాస్తులున్నా పిల్లలను చదివించుకోలేని పరిస్థితి ఏర్పడిందని తల్లి వాపోయారు. కాగా దంపతుల మధ్య తలెత్తిన విభేదాలకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో నడుస్తున్నందున తామేమీ జోక్యం చేసుకోలేమని పోలీసులు చెప్పారు. కొసమెరుపు: కుటుంబంలో దంపతుల మధ్య తలెత్తిన విభేదాలు ఏ పాపం ఎరుగని వారి చిన్నారులపై ఎలాంటి ప్రభావం చూపుతోందో ఈ ఉదంతం ఈ ఉదంతం తెలుపుతోంది. అమ్మా.. నాన్నా.. ఇకనైనా ఆలోచించండి. పంతాలు, పట్టింపులకు వెళ్లి మీ పిల్లల జీవితాలతో చెలగాటమాడొద్దండి. -
వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం
వరంగల్ అర్బన్: వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యతో పాటు కన్నబిడ్డలపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ సంఘటన జిల్లాలోని తిమ్మాపురంలో సోమవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య భవానితో పాటు కూతుళ్లు వర్షిణి, అమృతల పై కిరోసిన్ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో భార్య భవాని, కూతురు వర్షిణి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో కూతురు అమృతకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రదీప్‌ది ఆత్మహత్యే.. కానీ!
బుల్లితెర నటుడు ప్రదీప్‌ది ఆత్మహత్యేనని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ప్రాథమికంగా తేల్చారు. అయితే ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రదీప్ భార్య పావని ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశౄరు. ప్రదీప్ తల్లి, సోదరి ఇద్దరి వద్ద స్టేట్మెంట్లు నమోదు చేశారు. మరోవైపు ప్రదీప్ అంత్యక్రియలు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మహా ప్రస్థానంలో గురువారం ఉదయం జరిగాయి. అంతకుముందు సినీ, టీవీ పరిశ్రమలకు చెందిన పలువురు నటీనటులతో పాటు విజయవాడ, కర్నూలు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ల బంధుమిత్రులు కూడా ప్రదీప్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ప్రదీప్ భార్య వాట్సప్‌లో ప్రొఫైల్ పిక్చర్‌ను కూడా మార్చుకునేంత వరకు వెళ్లాల్సింది కాదని, అయినా అది జీవితాన్ని బలితీసుకునే వరకు వెళ్తుందని అనుకోకపోవచ్చని టీవీ పరిశ్రమకు చెందిన నటులు, దర్శకులు అంటున్నారు. ఇద్దరూ ఒకే రంగంలో పనిచేస్తున్నప్పుడు ఒకరి కంటే మరొకరికి అవకాశాలు ఎక్కువ రావడం, సంపాదనలో కూడా తేడాలు ఉండటం లాంటి కారణాల వల్ల ఇద్దరికీ కూడా మానసికంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందని, దాన్ని భాగస్వాములు గుర్తించి తగిన విధంగా మెసులుకోవాలని మానసిక వైద్యనిపుణులు సూచిస్తున్నారు. -
ప్రదీప్‌ది ఆత్మహత్యే.. కానీ!
-
భార్య ప్రొఫైల్ ఫోటోపై ప్రదీప్ మనస్తాపం!
-
నా పరిస్థితిని అర్థం చేసుకోండి: ప్రదీప్ భార్య
హైదరాబాద్ : తన భర్త ప్రదీప్ కుమార్ ఆత్మహత్యపై వస్తున్న ఆరోపణలను అతని భార్య పావనీరెడ్డి ఖండించింది. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ప్రదీప్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. క్షణికావేశంలోనే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడే తప్ప, మరొకటి కాదని పేర్కొంది. గత రాత్రి తనకు, ప్రదీప్‌కు మధ్య జరిగింది చిన్న గొడవే అని, అయితే ఆత్మహత్య చేసుకునేంత గొడవలు తమ మధ్య లేవని పావనీరెడ్డి స్పష్టం చేసింది. శ్రావణ్ తన అన్నయ్య అని, గతరాత్రి అతడి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నామని అంతకుమించి ఏమీలేదని తెలిపింది. తనపై వస్తున్న వదంతులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ...తన పరిస్థితిని అర్ధం చేసుకోవాలని పావనీరెడ్డి విజ్ఞప్తి చేసింది. నిన్న రాత్రి తన అన్నయ్య బర్త్‌డే పార్టీ చేసుకున్నామని, ఆ తర్వాత తన సోదరి కుటుంబం వెళ్లిపోయిందని, అనంతరం ప్రదీప్‌కు తనకు చిన్నపాటి గొడవ జరిగిందని, దాంతో ప్రదీప్ కోపంగా అద్దం పగులగొట్టాడని, ఆ తర్వాత తన బెడ్రూమ్లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడని తెలిపింది. తాను హాల్లో డైనింగ్ టేబుల్ వద్ద ఏడ్చుకుంటూ పడుకున్నట్లు చెప్పింది. అయితే ప్రదీప్‌కు ఉదయం షూటింగ్ ఉండటంతో అయిదుగంటల సమయంలో బెడ్రూమ్ తలుపు కొట్టానని, అయితే అటునుంచి ఎలాంటి అలికిడి లేకపోవడంతో తర్వాత తన సోదరుడి సాయంతో తలుపు పగలగొట్టి చూడగా, ప్రదీప్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడని తెలిపింది. కిందకు దించి, అంబులెన్స్‌కు కాల్ చేసినట్లు పావనీరెడ్డి చెప్పింది. ఆతర్వాత తన అమ్మవాళ్లకు ఫోన్ చేసి విషయం చెప్పానని, అలాగే చెన్నైలో ఉన్న ప్రదీప్ కుటుంబానికి ఫోన్ చేయగా వాళ్లు ఆన్సర్ చేయలేదని, దాంతో అతడి సోదరుడికి ఫోన్లో సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. ప్రదీప్ కుటుంబసభ్యులతో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని, కొద్ది నెలలు పాటు అత్తగారు తమతోనే ఉన్నారన్నారు. వాళ్ల కుటుంబసభ్యులు వస్తే అంత్యక్రియలు ఎక్కడ అనేది తెలుస్తుందన్నారు. ప్రదీప్ ఆత్మహత్యపై ఎలాంటి అనుమానాలు లేవని తెలిపింది. అయితే ప్రదీప్ హైపర్ అని, చిన్న చిన్న విషయాలకే ఆవేశం చెందుతాడని పేర్కొంది. -
భార్య ప్రొఫైల్ ఫోటోపై ప్రదీప్ మనస్తాపం!
హైదరాబాద్ : బుల్లితెర నటుడు ప్రదీప్ ఆత్మహత్య కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రదీప్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అతని స్నేహితులు చెబుతున్నారు. భార్య పావనీరెడ్డి వాట్సప్ ప్రొఫైల్ ఫోటోపై భార్యభర్తల మధ్య బుధవారం తెల్లవారుజామున గొడవ జరిగిందని, తెల్లారేసరికి ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అలాగే ఇంట్లో అద్దాలు చిందరవందరగా పగిలి ఉండటంతో పాటు, భర్త ఆత్మహత్యపై అతడి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. మరోవైపు ప్రదీప్ భార్య పావనీరెడ్డి ...పోలీసులు ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు పావనీరెడ్డి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రదీప్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా గత రెండు నెలలుగా శ్రావణ్ అనే వ్యక్తి వాళ్లింట్లో ఉంటున్నాడని, అతడితో చనువుగా ఉన్న ఫోటోను పావనీ ప్రొఫైల్‌గా పెట్టడంతో ప్రదీప్ మనస్తాపం చెందినట్లు సమాచారం. ఈ విషయంపై భార్యను ప్రదీప్ నిలదీయగా, అనంతరం ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అంతేకాకుండా భార్యభర్తల మధ్య కొంతకాలంగా తీవ్ర విభేదాలు నెలకొన్నాయని తెలుస్తోంది. అయితే పావనీరెడ్డి తీరుపై ప్రదీప్ కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలోని తన నివాసంలో ప్రదీప్ ఈరోజు తెల్లవారుజామున ఉరేసుకుని అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
నా పరిస్థతిని అర్థం చేసుకోండి: ప్రదీప్ భార్య
-
నటుడు ప్రదీప్ ఆత్మహత్య
హైదరాబాద్: ప్రముఖ టీవీ నటుడు ప్రదీప్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలోని తన నివాసంలో ఉరేసుకుని అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక గ్రీన్‌హోమ్స్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న ప్రదీప్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రదీప్ భార్య కూడా సీరియల్స్‌లో నటిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ప్రదీప్ సప్త మాత్రిక, ఆరుగురు పతివ్రతలు తదితర సీరియల్స్‌తో పాటు పలు చిత్రాలలో కూడా నటించాడు. కుటుంబ కలహాలతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రదీప్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో పగిలి అద్దాలు చిందవవందరగా పడి ఉన్నాయి. మంగళవారం రాత్రి ప్రదీప్ ఓ బర్త్ డే పార్టీ కి హాజరైనట్టు తెలుస్తోంది. ప్రదీప్ భార్య పావనీ రెడ్డి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కూతురుతో తండ్రి ఆత్మహత్యాయత్నం
వాల్మీకిపురం: కుమార్తెకు పురుగుల మందు తాగించి ఆపై తండ్రి కూడా తాగి ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డాడు. చిత్తూరుజిల్లా, గుర్రంకొండ మండలం, నల్లగుట్టవారిపల్లెకు చెందిన శ్రీనివాసులు(40)కు పెద్దమండ్యం మండలం తురకపల్లెకు చెందిన భూదేవితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా భూదేవి పిల్లలను భర్త వద్దే వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రావాలని పలుమార్లు కోరినా ఆమె రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన శ్రీనివాసులు కుమార్తె హేమలత(10)కు పురుగుల మందు తాగించి తానూ తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వారిని 108లో వాల్మీకిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుర్రంకొండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన కలహాలు
శివ్వంపేట: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ వీరయ్య, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దొంతి గ్రామానికి చెందిన మామిళ్ళ నర్సింలు(26) సోమవారం తెల్లవారుజామున గ్రామ శివారులోని ఓ కుంటవద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన సమీప రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. నర్సింలుకు గత ఏడాది డిసెంబర్లో మూగ యువతితో వివాహం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపం చెందిన నర్సింహులు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
కుటుంబ సమస్యలతో మరొకరు
కుందుర్పి : కుటుంబ సమస్యలు తాళలేక మండలంలోని బండమీదపల్లి గ్రామంలో గురువారం బలిజ తిప్పేస్వామి(45) అనే వ్యక్తి ఇంట్లో ఉన్న పైకప్పుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి నారాయణప్ప, పోలీసులు తెలిపిన మేరకు.. తిప్పేస్వామికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య భాగ్యమ్మ 20 ఏళ్ల క్రితమే వదిలి వెళ్లగా రెండోభార్య పార్వతమ్మ వద్ద ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం పార్వతమ్మకు జబ్బు చేసింది. పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేదు. జబ్బు నయం కాకపోగా వైద్యానికి బయట అప్పు ఇచ్చే నాథులు కరువయ్యారు. దీంతో తాగుడుకు బానిసైన తిప్పేస్వామి గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఇద్దరు భార్యలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుందుర్పి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అన్న తిట్టాడని.. చెల్లెలు ఆత్మహత్య
మంగళగిరి: కుటుంబ కలహాల నేపథ్యంలో అన్న తిట్టాడని.. ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవ్వులూరులో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన జాతి సమాధానం(21) అనే యువతి కుటుంబంలో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి అన్నయ్య తిట్టడంతో మనస్తాపానికి గురై కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మేనకోడలిపై గొడ్డలితో దాడి..
నెల్లిమర్ల: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి సొంత మేన కోడలిపై కిరాతకంగా దాడి చేశాడు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వారిద్దరిని ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరి పరస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని సెగిడి వీధిలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న లచ్చన్న(60)కు మేనకోడలు పట్నాల రామలక్ష్మి(35)కి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇంటి ముందు పని చేసుకుంటున్న రామలక్ష్మిపై మేనమామ లచ్చన్న గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటి ముందు ముగ్గు వేయలేదని..
వేములపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా వేములపల్లిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న యాదగిరి, భాగ్యలక్ష్మి(28) దంపతులు వ్యవసాయ కూలీలుగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య తగాదాలు నడుస్తున్నాయి. శుక్రవారం ఉదయం యాదగిరి ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేయలేదని భార్యతో వాదన పెట్టుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ కాస్త ముదిరింది. దీంతో మనస్తాపానికి గురైన భాగ్యలక్ష్మి వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యం చేస్తున్న వైద్యులు 90 శాతం కాలడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. -
కుటుంబ తగాదాలతో ఆత్మహత్య
అన్నవరం : అన్నవరం దేవస్థానం కేశ ఖండనశాలలో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణుడు పెండ్యాల అప్పారావు(33) శనివారం పంపా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి భార్య, పాప, బాబు ఉన్నారు. కుటుంబ తగాదాలే ఆత్మహత్యకు కారణమని తమ ప్రాథమిక విచారణలో తేలిందని అన్నవరం ఎస్ఐ కె.పార్థసారథి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. అప్పారావు మద్యానికి బానిస కావడం, ఇతర కుటుంబ కారణాలతో అతడి భార్య రెండు వారాల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంటికి రావాల్సిందిగా రెండు రోజుల క్రితం అప్పారావు వెళ్లి, తన భార్యను కోరగా ఆమె తిరస్కరించింది. ఈ క్రమంలో అప్పారావు శుక్రవారం సాయంత్రం అన్నవరం రైల్వేస్టేçÙ¯ŒS సమీపంలో రైల్వేట్రాక్‌పై రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. దీనిని గమనించిన రైతులు అతడిని అడ్డుకుని, అప్పారావు తండ్రి పెండ్యాల చక్రరావుకు అప్పగించారు. కుటుంబ తగాదాలు పరిష్కరించుకుందామని, ఆత్మహత్య వంటి ప్రయత్నాలు చేయవద్దని తన కుమారుడికి చక్రరావు నచ్చజెప్పాడు. కాగా శనివారం ఉదయం దేవస్థానంలోని కేశఖండన శాలకు అప్పారావు విధులకు హాజరయ్యాడు. కొండమీద నుంచి కిందకు వచ్చి, మధ్యాహ్నం 12 గంటల సమయంలో పంపా బ్యారేజీ గేట్ల వద్ద నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సంఘటన స్థలానికి కొద్దిదూరంలో అతడి మృతదేహం తేలింది. మృతదేహాన్ని అప్పారావు కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పోలీసులు ప్రత్తిపాడు ఆస్పత్రికి తరలించారు. తండ్రి చక్రరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
భార్యను చంపిన భర్త
లావేరు: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను గడ్డపారతో అతి కిరాతకంగా కొట్టి చంపాడో భర్త. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కలిసెట్టిగూడెంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కలిసెట్టి సత్యం, సత్తమ్మ(45) దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో కోపోద్రిక్తుడైన సత్యం పక్కనే ఉన్న గడ్డపారతో ఆమె తలపైన బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
రాయపర్తి: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం తిర్మలాయపెల్లి గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన అబ్దుల్ పాషా(35) గత కొంతకాలంగా కుటుంబ కలహాలతో సతమతమవుతూ.. మద్యానికి బానిసై గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మనస్తాపంతో యువకుని ఆత్మహత్య
ఏలూరు అర్బన్ : కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుమందు తాగి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని మేనమామ కథనం ప్రకారం.. నల్లజర్ల మండలం, తెలికిచర్ల గ్రామానికి చెందిన మిద్దే గంగరాజు (25) భార్య దుర్గతో కలిసి కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం భార్యా, భర్తలిద్దరూ గొడవ పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గంగరాజు ఇంటిలో ఉన్న పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అపస్మారక స్థితికి చేరుకున్న గంగరాజును కుటుంబసభ్యులు తాడేపల్లిగూడెం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని ఏలూరు తరలించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తూండగా గంగరాజు మరణించాడు. -
'భార్య చెప్పిన మాట వినడం లేదని..'
బూర్గంపాడు: భార్య చెప్పిన మాట వినడం లేదని మనస్తాపానికి గురైన భర్త గోదారిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానిక సారపాక వద్ద గల గోదావరి బ్రిడ్జి పై నుంచి దూకి బలవర్మణానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న గజ ఈతగాళ్లు అతన్ని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక వద్ద గురువారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న బండి రమేష్(28) కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తుంటాడు. గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో సతమతమవుతున్నాడు. భార్య వేరొకరితో చనువుగా ఉంటోందని అనుమానిస్తూ.. ఆమెను తన తీరు మార్చుకోవాలని అనేక సార్లు చెప్పినట్టు సమాచారం. అయినా ఆమె తన పద్థతి మార్చుకోకపోవడంతో మనస్తాపానికి గురై సూసైడ్ నోట్ రాసి సారపాక బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడ ఉన్న స్థానికలు గుర్తించి అతన్ని కాపాడి ఒడ్డుకు చేర్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం
భార్య మృతి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త పసలపూడిలో ఘోరం కుటుంబ తగాదాలే కారణమా? పసలపూడి(రాయవరం) : మండలంలోని పసలపూడిలో భార్యాభర్తలు గురువారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో భార్య మృతి చెందగా, భర్త ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తలెత్తిన వివాదమే ఆత్మహత్యలకు కారణంగా స్థానికులు భావిస్తున్నారు. గ్రామానికి చెందిన కోనాల ఈశ్వరరెడ్డికి అనపర్తి మండలం కుతుకులూరుకు చెందిన సత్యతో వివాహమైంది. వీరికి ఎనిమిది, ఆరు సంవత్సరాల వయస్సున్న ఇద్దరు కుమార్తెలున్నారు. పేద కుటుంబానికి చెందిన ఈశ్వరరెడ్డి చిన్న చిన్న చిల్లర వ్యాపారాలు చేసేవాడని తెలిసింది. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య ఆర్ధిక కారణాల నేపథ్యంలో కుతుకులూరులో నివాసం ఉంటున్నారు. మూడు రోజుల క్రితం పసలపూడి వచ్చిన భార్యాభర్తల మధ్య ఏమి జరిగిందో తెలియదు ... గురువారం మధ్యాహ్నం భార్య సత్య ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందగా భార్య మరణించిన విషయం తెలుసుకున్న భర్త ఈశ్వరరెడ్డి సాయంత్రం నాలుగు గంటలకు ఎలుకల మందు తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు బిక్కవోలు మండలం పందలపాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈశ్వరరెడ్డి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఏఎస్సై కె.వి.వి.సత్యనారాయణను వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య
హన్మకొండ: భర్త తీరుతో ఆవేదన చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకుంది. హన్మకొండ మిలీనియం కాలనీలో శనివారం ఈ విషాదం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన శోభన్‌బాబు, ఉమ దంపతులకు సోని(12), కౌశిక్(8) అనే ఇద్దరు పిల్లలున్నారు. ఉమ కుట్టుపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుండగా శోభన్‌బాబు జులాయిగా తిరుగుతుంటాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల క్రితం భార్య, పిల్లలపై చేయిచేసుకున్న శోభన్‌బాబు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తను తిరిగి వచ్చేసరికి ఇంట్లోనే ఉంటే చంపుతానని ఉమను బెదిరించాడు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్న ఉమ శనివారం వేకువజామున ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను తాగి మరణించింది. ఉదయమైనా ఎంతకీ తలుపు తీయకపోయేసరికి చుట్టుపక్కల వారు వచ్చి చూడగా ముగ్గురూ మృతి చెంది ఉన్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. -
మాజీ సర్పంచ్ ఆత్మహత్య
పిఠాపురం టౌన్ : కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం కారణాలతో తీవ్ర మనస్తాపం చెందిన మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన మాజీ సర్పంచ్ సిద్దా కృష్ణమూర్తి(60) మూడు దశాబ్దాలుగా తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక చిట్టోడితోటలోని రజక వీధిలో నివసిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి తనఇంట్లో నైలాన్‌తాడుతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పిఠాపురం సీఐ ఎండీ ఉమర్, ఎస్సై కోటేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కృష్ణమూర్తి కుమారుడు కాశీవిశ్వనాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వరంగల్‌లో దారుణం : భర్తను నరికి చంపిన భార్య
వరంగల్ : వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. భర్తను గొడ్డలితో అత్యంత దారుణంగా భార్య నరికి చంపిన ఘటన భూపాలపల్లి మండలం జంగేడు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. అనంతరం భర్త మృతదేహాన్ని ఇంట్లో ఉంచి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబకలహాల కారణంగానే ఆమె ఈ దారుణానికి పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. -
ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
బిర్కూర్: నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండలం దుర్తి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది. కుటుంబకలహాలతో మనస్థాపం చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. దుర్తికి చెందిన నాగమణి(35)కి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఈమెకు రెండేళ్ల జేతశ్రీతో పాటు మూడు నెలల చిన్న పాప ఉంది. కుటుంబకలహాల నేపథ్యంలో మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన ఇరుగుపొరుగువారు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. తల్లీబిడ్డలు ముగ్గురు మంటలకు ఆహుతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆమె భర్త వ్యవసాయ కూలి. అతను పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘కుటుంబ సమస్యలతో చనిపోతున్నా’
సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న కేదారిలంక వీఆర్ఓ కపిలేశ్వరపురంలోని తన ఇంటిలోనే ప్రాణాలు తీసుకున్న వైనం దుర్వాసన వస్తుండడంతో తలుపులు తెరిచిన స్థానికులు కపిలేశ్వరపురం : మండలంలోని కేదారిలంకలో వీఆర్ఏగా పనిచేస్తున్న కపిలేశ్వరపురానికి చెందిన మాతా రాంబాబు (30) తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర దుర్వాసన రావడంతో మంగళవారం కుటుంబ సభ్యులు, స్థానికులు తలుపులు తెరిచి చూడగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ‘‘కుటుంబ సమస్యల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టడంతో దీనిని ఆత్మహత్యగా అంగర ఎస్సై కె.దుర్గాప్రసాద్ కేసును నమోదు చేశారు. ఎస్సై దుర్గాప్రసాద్, కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం... రాంబాబు కపిలేశ్వరపురంలోని చిన్న వంతెన వద్దగల తన ఇంటిలో నివాసం ఉంటూ విధి నిర్వహణ కోసం కేదారిలంకకు వెళ్లి వస్తున్నాడు. భార్య దీపిక తన అమ్మగారి ఊరైన బిక్కవోలు మండలం కాపవరంలోనే తన ఇద్దరి కుమారులతో ఉంటూ అంగన్వాడీగా పనిచేస్తోంది. ఇదిలా ఉండగా ఈ నెల 14న కపిలేశ్వరపురంలోని తన గదిలో రాంబాబు ఉరి వేసుకున్నాడు. రాంబాబుతో మనస్పర్థలు రావడంతో సోదరులు అతడిని కొంతకాలంగా పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆత్మహత్య విషయాన్ని ఎవరూ గమనించలేకపోయారు. మంగళవారం గది నుంచి తీవ్ర దుర్గంధం రావడంతో బంధువులు, స్థానికులు తలుపులు తెరిచి చూడగా.. రాంబాబు శరీరం ఉబ్బి వేలాడుతూ కనిపించింది. స్థానికులు గ్రామ వీఆర్వో టి.సత్యనారాయణకు తెలియపర్చగా అతను అంగర ఎస్సై కె.దుర్గాప్రసాద్‌కు సమాచారమిచ్చారు. శవపంచనామా నిర్వహించారు. తాను కుటుంబ సమస్యలు కారణంగా జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటునాన్నంటూ రాసి ఉన్న లెటర్‌ను ఎస్సై స్వాధీనపర్చుకున్నారు. దాని ఆధారంగా ఆత్మహత్యగా కేసును నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ‘‘నన్ను, పిల్లల్ని అనాథలను చేసి వెళ్లిపోయావా! అంటూ భార్య దీపిక రోధిస్తున్న తీరు చూపరులను కంట తడిపెట్టించింది. -
భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య
మేడిపెల్లి: భార్య కాపురానికి రావడం లేదని కలతచెందిన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడిపెల్లి మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన శివరాత్రి శేఖర్(23)కు రెండేళ్ల క్రితం రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన శైలజతో వివాహమైంది. కొన్నాళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిన శైలజ తిరిగి కాపురానికి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నట్లు ఏఎస్సై సత్తయ్య తెలిపారు. శేఖర్ తండ్రి దుర్గయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు. -
కుటుంబ వివాదంతో గోదారిలో దూకిన వివాహిత
నదిలో గల్లంతు గాలింపు చర్యలు రాజోలు : భార్య, భర్తల మధ్య వివాదం తలెత్తడంతో రాజోలు మండలం ములికిపల్లి గ్రామానికి చెందిన 19 ఏళ్ల వివాహిత వాసంశెట్టి ప్రియాంక శుక్రవారం చించినాడ వంతెనపై నుంచి గోదావరిలో దూకేసింది. దాంతో ఆమె కోసం బంధువులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రియాంక దూకిన వంతెన ప్రదేశం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి పోలీసు స్టేషన్ పరిధిలోకి రావడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంధువులు, ములికిపల్లి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రాజోలు మండలం ములికిపల్లి గ్రామానికి చెందిన ప్రియాంక, అదే గ్రామానికి చెందిన వాసంశెట్టి మణికంఠకుమార్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వారి వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. దాంతో రెండు నెలల క్రితం ఎవరికీ తెలియకుండా ఇద్దరూ వివాహం చేసుకుని హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. మణికంఠకుమార్ హైదరాబాద్‌లో ల్యాబ్ టెక్నిషియన్‌గా పని చేస్తున్నాడు. ఆ క్రమంలో మణికంఠకుమార్ కుటుంబ సభ్యులు వీరిని వరలక్ష్మీ పూజ చేసుకునేందుకు ములికిపల్లి రావాలని ఆహ్వానించారు. రెండు రోజుల క్రితం గ్రామం వచ్చిన ప్రియాంక, మణికంఠకుమార్ మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చాయి. వరలక్ష్మీ వ్రతం చేసుకున్న తర్వాత ప్రియాంక మోటార్ సైకిల్ వేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె కోసం వెతుకుతున్న సమయంలో చించినాడ వంతెనపై మోటార్ సైకిల్, ప్రియాంక చెప్పులను బంధువులు గుర్తించారు. ఆమె గోదావరిలో దూకేసిందనే అనుమానంతో గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యలమంచిలి పోలీసులు వివాహిత అదృశ్యమైనట్టు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. -
మనస్తాపంతో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
కందుకూరు: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ డిగ్రీ విద్యార్థి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేదునూరుకు చెందిన కంచెర్ల వెంకటయ్య చిన్న కుమారుడు ప్రభాకర్, అలియాస్ పవన్(20) హైదరాబాద్ సిటీ కళాశాలలో బీకాం చివరి సంవత్సరం చదువుతున్నాడు. పొరుగింట్లో ఉండే బాబాయ్ కుటుంబంతో కలహాలు తలెత్తడంతో మనస్తాపానికి గురైన అతడు మంగళవారం సాయంత్రం పురుగులమందు తాగి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. పోలీసులు ప్రభాకర్‌ను చికిత్స నిమిత్తం 108వాహనంలో ఉస్మానియా ఆస్సత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో అతడు మృతి చెందాడు. ఈమేరకు సీఐ విజయ్‌కుమార్ బుధవారం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. -
ఏ ఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యా యత్నం
పులివెందుల : కుటుంబ కలహాలతో ఏఆర్ కానిస్టేబుల్ పవన్‌కుమార్(29) ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కడపకు చెందిన ఆయన 2009 నుంచి ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి లింగాల మండలం గుణకణపల్లెకు చెందిన ఫ్యాక్షన్ నాయకుడు కష్ణారెడ్డికి గన్‌మెన్‌గా ప్రభుత్వం పవన్‌కుమార్‌ను నియమించింది. అప్పటి నుంచి పని చేస్తున్న ఆయన కుటుంబ కలహాలతో కలత చెంది ఆదివారం సాయంత్రం రెండు సీసాల దగ్గు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడిని 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించి, ఎలాంటి ప్రమాదం లేదన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వేధింపులు తాళలేక హత్య
కుటుంబ వివాదాలే కారణం ముద్దాయి అరెస్టు వీరాస్వామి హత్యకేసు ఛేదించిన పోలీసులు ఐ.పోలవరం: కుటుంబ కలహాల్లో చిన్నాన్న వేధింపులను తాళలేక ఆయననే హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఐ. పోలవరం పంచాయతీ బాణాపురానికి చెందిన రాయపురెడ్డి వీరాస్వామి (74)ను చంపింది ఆయన అన్న సుబ్బారావు కుమారుడు బాణేశ్వరరావే అని పోలీసులు జరిపిన దర్యాప్తులో తేలింది. పాతయింజరం పోలీస్ స్టేషన్లో సీఐ కేటీవీవీ రమణరావు గురువారం విలేకరుల సమావేశంలో ఆవివరాలను వెల్లడించారు. వీరాస్వామి తన ఇంటి వెనుక ఉన్న బాణేశ్వరరావు స్థలాన్ని వాస్తురీత్యా ప్రహరీ నిర్మించుకొనేందుకు ఇవ్వమని కోరాడు. దానికి ప్రతిఫలంగా తన ఇంటికి ఆగ్నేయ మూల ఉన్న 4 కొబ్బరి చెట్లను ఇస్తానని చెప్పాడు. ఆమేరకు 15 ఏళ్ల క్రితం కుదిరిన ఒప్పందం మేరకు బాణేశ్వరరావు రెండు సెంట్ల భూమిని వీరాస్వామికి ఇవ్వగా ప్రహరీ నిర్మించుకొన్నాడు. వీరాస్వామికి చెందిన నాలుగు చెట్ల కొబ్బరికాయలను బాణేశ్వరరావు తీసుకుంటున్నాడు. అయితే వీరాస్వామికి ఇష్టం లేని పనులు (వీరాస్వామి కొడుకు అనారోగ్యంతో ఉండగా బాణేశ్వరరావు సాయం చేయడం) చేస్తున్నాడని ఏడాది కాలంగా వీరాస్వామి తరచూ బాణేశ్వరరావుతో గొడవలకు దిగేవాడు. అంతేకాకుండా ఏడాది కాలంగా కొబ్బరికాయలను తీయనీయలేదు. ఇదిలా ఉండగా ఈనెల 13వ తేదీన బాణేశ్వరరావు తన ఇంటికి ఆనుకొని ఉన్న కొబ్బరితోట దుక్కు దున్నుతుండగా వీరాస్వామి పనివాళ్లతో గొడవపడ్డాడు. అంతేకాకుండా బాణేశ్వరరావును గాయపరచాడు. దాంతో తనను తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడని వీరాస్వామిపై బాణేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. కక్ష పెట్టుకొన్న బాణేశ్వరరావు ఈనెల 14వ తేదీన వీరాస్వామి కిరాణా షాపుకు వెళ్తున్నాడని తెలుసుకొని సంచిలో కత్తి పెట్టుకొని మోటారుసైకిల్‌పై పోలవరం ఊరిలోకి వెళ్లాడు. S విజయాబ్యాంక్ సమీపంలో వీరాస్వామి తారసపడటంతో మోటారు సైకిల్ పక్కన పాడేసి కత్తి తీసి అతి దారుణంగా వీరాస్వామిని ఇష్టమొచ్చినట్టు నరికి చంపాడు. నిందితుడు రాయపురెడ్డి బాణేశ్వరరావును బుధవారం సాయంత్రం అతని ఇంటి వద్ద పోలీసులు అరెస్టు చేసి, నేరం చేయడానికి ఉపయోగించిన కత్తిని, మోటారు సైకిల్‌ను స్వాధీన పరుచుకున్నారు. ముద్దాయిని గురువారం ముమ్మిడివరం కోర్టులో హాజరు పరుస్తున్నట్టు సీఐ తెలిపారు. డీఎస్పీ ఎల్.అంకయ్య పర్యవేక్షణలో సీఐ కేటీవీవీ రమణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన వెంట స్థానిక ఎస్సై టి.క్రాంతి కుమార్, సిబ్బంది ఉన్నారు. -
వృద్ధ దంపతుల ఆత్మహత్య
కారంపూడి: కుటుంబ సమస్యలకు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో యువ దంపతులు ఉరిపోసుకుని బలవన్మరణం పొందారు. వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. గుంటూరు జిల్లా కారంపూడిలో ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం స్థానిక ఆంధ్రా బ్యాంకు వీధిలో కట్టమూరి ప్రసన్నాంజనేయులు (38), సావిత్రి (30) దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. గురువారం తెల్లవారుజామున భార్యాభర్తలు గొడవపడ్డారు. తర్వాత ప్రసన్నాంజనేయులు టీ తాగడానికి సెంటర్‌కు వెళ్లాడు. భార్య ఇంటిముందు ముగ్గు పెట్టి ఇంట్లోకి వెళ్లి పిల్లలను లేపి బ్రష్ చేసుకోవాలని కిందకు పంపింది. తర్వాత భర్తను ఉద్దేశించి లేఖ రాసి ఇంటిలోని సందులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బయటనుంచి వచ్చిన ఆంజనేయులు భార్య ఉరిపోసుకుని మృతి చెందడాన్ని గమనించి మేనమామకు ఫోన్ చేసి చెప్పాడు. తర్వాత అతడు కూడా ఫ్యానుకు చీరతో ఉరివేసుకున్నాడు. కిందనుంచి మేడ మీదకు వచ్చిన పిల్లలు శేషు, లోకేష్ తల్లిదండ్రులు వేలాడడాన్ని చూచి ఏడవసాగారు. ఇంతలో వాటర్ క్యాను వేయడానికి వచ్చిన వ్యక్తి వీరిని గమనించి చుట్టుపక్కలవారికి తెలిపాడు ప్రసన్నాంజనేయులు గ్రామంలో టీడీపీ రాజకీయాలలో చురుకుగా పాల్గొనడంతో పాటు, బియ్యం, ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తుంటాడు. ఎస్.ఐ. పెదనారాయణస్వామి సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. అప్పుల బాధతో అల్లుడు, కుమార్తె ఆత్మహత్యకు పాల్పడ్డారని సావిత్రి తండ్రి బచ్చు కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గురజాలకు తరలించారు. అనాథలైన చిన్నారులు ప్రసన్నాంజనేయులు అక్కయ్య శేషమ్మ కుమార్తె సావిత్రిని పదేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. వారికి శేషు (7), లోకేష్ (5) ఇద్దరు కుమారులు. తల్లిదండ్రులను కోల్పోయి ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. కుటుంబమంతా షిరిడీ వెళ్లి బుధవారమే ఇంటికి తిరిగివచ్చారు. మరుసటి రోజే ఈ సంఘటన జరిగింది. ఆత్మహత్యకు ముందు భర్తను ఉద్దేశించి సావిత్రి వేదనతో ‘బావా మళ్లీ పెళ్లి చేసుకోవద్దు. పిల్లలు జాగ్రత్త’ అంటూ లేఖ రాసింది. -
గీతకార్మికుని ఆత్మహత్య
ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేటలో గీతకార్మికుని ఆత్మహత్య ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. చేతికందిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు, ఆరునెలల కిందట వివాహామైన భార్య రోదనలు మిన్నంటాయి.« ఎల్లారెడ్డిపేటకు చెందిన నాగుల విజయ–పర్శరాములు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. ఏడాదిక్రితం పెద్ద కొడుకు శ్రీకాంత్ కుటుంబ కలహాలతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం రెండో కొడుకు శ్రీనివాస్ కూడా ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరునెలల క్రితమే గంభీరావుపేటకు చెందిన లతతో శ్రీనివాస్‌కు వివాహం జరిగింది. గీతకార్మికునిగా పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. తల్లి విజయ, భార్య లతను ఉదయం వ్యవసాయ పనులకోసం గ్రామశివారులో వాహనంపై దించి వచ్చిన శ్రీనివాస్ సాయంత్రం వరకూ శవంగా మారడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా తాను అప్పుల పాలయ్యానని, తన చావుకు ఎవ్వరూ కారణం కాదనీ, తల్లిదండ్రులతో పాటు భార్యకు అన్యాయం చేసి వెళ్తున్నానని లేఖలో పేర్కొన్నాడు. మృతుని తండ్రి పర్శరాములు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు. -
నా కన్నా రెండు నెలలు పెద్దది...
జీవన గమనం నేను బీటెక్ ఫైనలియర్ చదువున్నాను. నా జూనియర్ మీద నాకు చాలా ఇష్టం పెరిగింది. తనని ప్రేమిస్తున్నానేమో అనిపిస్తోంది. కానీ తనకి చెప్పలేదు. ఎందుకంటే చదువులో జూనియర్ అయినా ఆమె నాకంటే రెండు నెలలు పెద్దది. పైగా వేరే క్యాస్ట్. అయితే మా రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల నాకు వాళ్ల ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధం ఉంది. నా ప్రేమ విషయం తెలిస్తే ఆ అనుబంధం పాడవుతుందేమోనని భయంగా ఉంది. నిజానికి నాకు లవ్ అన్నా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అన్నా పెద్దగా ఇష్టం లేదు. వాటి వల్ల పెద్దల్ని బాధపెట్టినట్టు అవుతుందని భయం. కానీ అనుకోకుండా తనపైన ప్రేమ పెరిగింది. ఇప్పుడు నేనేం చేయాలి? తనతో నా ప్రేమని చెప్పాలా? లేదంటే మా కుటుంబాల స్నేహం కోసం మనసు మార్చుకోవాలా? సలహా ఇవ్వండి. - సందీప్, ఊరు రాయలేదు రెండు కుటుంబాలు విడిపోకుండా ఉండటం కోసం మీ త్యాగం... ఒక మంచి బాక్సాఫీస్ చిత్రానికి సరిపోయేలా ఉంది. ‘అక్కడ లేని నల్ల పిల్లిని చీకట్లో వెతకటం’ అన్న సామెత బహుశా ఇక్కడి నుంచే పుట్టి ఉంటుంది. అంచెలంచెలుగా మీ సమస్యను విశ్లేషించుకుంటూ వెళ్దాం. ఒకవైపు ప్రేమ అంటే ఇష్టం లేదని అంటూనే, మరోైవైపు ’ప్రేమిస్తున్నానేమో అ..ని..పి..స్తుం..ది’ అన్నారు. ముందు మీది ప్రేమా? ఆకర్షణా? అన్న విషయం తేల్చుకోండి. వ్యక్తిని ప్రేమించటం ప్రేమ. ప్రేమ భావాన్ని ప్రేమించటం ఆకర్షణ. ప్రేమలో ఆలోచన, అవగాహన, స్పష్టత, భద్రతభావం ఉంటాయి. ఆకర్షణలో ఆవేశం, ఉద్వేగం, అస్పష్టత, అయోమయం ఉంటాయి. ప్రేమ అనుభూతి కోసం, ఆకర్షణ అనుభవం కోసం..! భవిష్యత్ తెలియటం ప్రేమ. కాలం తెలియకపోవటం ఆకర్షణ. ప్రేమలో రోజు రోజుకి ఎదుటి వారి గురించి ఆలోచన, నమ్మకం పెరుగుతుంది. ఆకర్షణలో రోజురోజుకీ అనుమానం పెరుగుతుంది. మిమ్మల్ని మీరు ఈ విధంగా విశ్లేషించుకున్న తర్వాత, ఆ అమ్మాయిని తన అభిప్రాయం అడగండి. ఆమె, ‘‘అసలు నాకా భావమే లేదు. నువ్వు నా కన్నా చిన్నవాడివి’’ అంటే అసలు గొడవే లేదు. మీకు కూడా వర్ణాంతర వివాహాలు ఇష్టం లేవు కదా. ఒకవేళ ఆ అమ్మాయి యస్సంటే, ఇరువైపుల పెద్దల్ని సంప్రదించండి. వారు కూడా యస్ అంటే సమస్యే లేదు. కాదంటే, పెద్దవారిని ఎదిరించి వెళ్లిపోయి వివాహం చేసుకునేటంత తీవ్రమైనదా, పెద్దల్ని బాధ పెట్టి చేసుకోవడం అవసరమా (ఈ విషయం కూడా మీరే రాశారు) అనేది ఆలోచించుకోండి. మనసులోని అస్పష్టతతో బాధ పడటం కంటే, ఏదో ఒకటి తేల్చేసుకోవటమే మంచిది కదా. పరీక్షలు దగ్గర్లోనే ఉన్నాయి కాబట్టి ముందు చదువు మీద ఏకాగ్రత నిలపండి. పరీక్షలు ఫెయిలయ్యే కుర్రాళ్లని, కాస్త ముందు చూపున్న ఏ అమ్మాయీ ప్రేమించదు. నా వయసు 21. ఎంసీఏ చేస్తున్నాను. నిజానికి నాకు మీడియా రంగంలోకి వెళ్లాలని ఉంది. కానీ కుటుంబ సమస్యల కారణంగా, త్వరగా సెటిలైతే మంచిదని అందరూ బలవంతపెట్టడంతో ఎంసీఏలో చేరాను. కానీ చదువు ఎక్కడం లేదు. ఆసక్తి కలగడం లేదు. మానేయాలని ఉంది. కానీ మరో మంచి రంగంలో సెటిలైతేనే.. ఇది మానేసినా మావాళ్లు ఏమీ అనరు. పీజీ చేస్తే మీడియాలో సెటిలయ్యే మార్గం ఉంటే చెప్పండి. - రాజేశ్, విజయనగరం ఇష్టం లేని చదువుకన్నా నరకం ఇంకొకటి ఉండదు. కానీ మీ వాళ్లు చెప్పింది కూడా నిజమే కదా. మీడియా రంగంలో ఒక స్థాయి వచ్చేవరకూ ఆర్థికంగా నిలదొక్కుకోవటం కష్టం. అన్నిటికన్నా ముందు కొన్ని విషయాల్లో ఒక కచ్చితమైన నిర్ధారణకు రండి. 1. మీరు ఏ మీడియాలో స్థిరపడాలనుకుంటున్నారు? పత్రికా రంగమా? టీవీ ఛానెల్సా? 2. పత్రికా రంగం అయితే తెలుగా? ఇంగ్లీషా? 3. ఆ రచనా రంగంలో మీకు భాషాప్రవేశం ఉందా? లేక కేవలం ఉత్సాహమేనా? 4. టీవీ ఛానెల్స్‌లో అయితే, కెమెరా ముందు ఉండాలనుకుంటున్నారా? రిపోర్టింగ్ సైడా? మీ అభిరుచి కెమెరా ముందైతే... ఉచ్చారణ, అందం అవసరం. మీ కోరిక రిపోర్టింగ్ అయితే... భాష, అవగాహన అవసరం. ఏ వృత్తిలో రాణించాలన్న, కేవలం ఇష్టమే కాదు. అర్హత, కృషి, నైపుణ్యమూ కావాలి. మొదట అభిరుచిగా ప్రారంభించి వృత్తిగా మార్చుకోండి. తమ వృత్తి చేసుకుంటూ సైడుగా పత్రికా రిపోర్టింగ్ చేస్తున్న ఎల్ఐసీ ఏజెంట్లు, ఉపాధ్యాయులు కోకొల్లలు. ఆ విధంగా ముందు ఆర్థికంగా నిలదొక్కుకోండి. మీడియాలో పని చేస్తూనే ప్రైవేటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యవచ్చు కదా. లేదా జర్నలిజం కోర్సులో జాయినవ్వండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
మధిర: ఖమ్మం జిల్లా మధిర మండలం జిలుగువోడు గ్రామంలో కుటుంబ కలహాలతో షేక్ అబ్బాస్ అలీ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు రోజులుగా ఇంటి తలుపులు మూసివేసి ఉండటం, ఇంటి నుంచి వాసవ వస్తుండటం గమనించిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల ఇంటి తలుపులు పగులగొట్టి చూడటంతో అబ్బాస్ ఫ్యాన్ కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. బాగా కుళ్లిపోయిన మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. కొద్ది రోజులుగా కుటుంబ కలహాలతో ఇబ్బందులు పడుతున్న అబ్బాస్ ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
భార్య కేసు పెట్టిందని..సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్: చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం ఈ సమాజంలో తరచూ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కళ్లు చెదిరే వేతనాలు, విలాసవంతమైన జీవితం ఉంటుందనే కోటి ఆశలతో సాఫ్ట్వేర్ రంగంలో అడుగుపెడుతున్న యువత ఆ రంగంలో ఉండే ఒత్తిడి, కుంగుబాటును తట్టుకొని నిలబడలేకపోతుందనే వాదన వినిపిస్తోంది. ఇక నిన్నటికి నిన్న యాప్ రూపొందించాలన్న తన కల సక్సెస్ కాకపోవడంతో హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడగా.. తాజాగా మరో టెక్కీ చిన్న కారణానికే ప్రాణాలు తీసుకున్నాడు. భార్య వేధింపుల కేసు పెట్టిందని మనస్థాపానికి లోనైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ పట్టణానికి చెందిన విజయ్‌కుమార్ (30) ఉప్పల్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఏడాదిక్రితం అదే పట్టణానికి చెందిన దివ్యతో వివాహం జరిగింది. కాగా వారు నాలుగు రోజులు మాత్రమే కలిసి ఉన్నారు. ఇద్దరి మద్య మనస్పర్థలు రావటంతో దివ్య పుట్టింట్లో ఉంటోంది. విజయకుమార్ కర్మన్‌ఘాట్ క్రాంతినగర్‌లో ఒంటరిగా ఉంటున్నాడు. ఇటీవల దివ్య అతనిపై వరంగల్ స్టేషన్లో 498ఏ కేసు పెట్టినట్లు నాలుగు రోజుల క్రితం అతని తండ్రి విద్యాసాగర్ ఫోన్ చేశాడు. గురువారం ఉదయం తండ్రి ఫోన్ చేయగా విజయ్‌కుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో ఇబ్రహీంపట్నంలో ఇంజీనీరింగ్ చదువుతున్న తమ్ముడి కుమారుడు మహేష్‌కు సమాచారం అందింయాడు. అతను విజయ్‌కుమార్ ఇంటికి వెళ్లి పిలిచినా తలుపులు తీయకపోవటంతో తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా విజయ్‌కుమార్ లుంగీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేశారు. భార్య కేసు పెట్టిందన్న భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. -
హుస్సేన్‌సాగర్‌లోకి దూకి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో శ్వేత అనే మహిళ హుస్సేన్‌సాగర్‌లోకి దూకింది. గమనించిన లేక్ పోలీసులు ఆమెను రక్షించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సెల్ టవరెక్కి ఆందోళన
ఆదిలాబాద్: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి శుక్రవారం ఉట్నూర్‌లో సెల్ టవర్ ఎక్కి ఆందోళన నిర్వహించాడు. స్థానికుల కథనం ప్రకారం... ఉట్నూర్ మండలంలోని హస్నాపూర్‌కు చెందిన ఇమ్రాన్‌ఖాన్ కొన్నేళ్లుగా మండల కేంద్రంలోని గంగన్నపేట్‌లో నివాసముంటున్నాడు. కొద్ది నెలల క్రితం అతడి భార్య షేక్ షీమాతో విడాకులు తీసుకున్నారు. ఆమె పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. దీంతో మనస్తాపం చెందిన ఇమ్రాన్‌ఖాన్ తనకు న్యాయం చెయ్యూలంటూ సెల్ టవర్ ఎక్కాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అతడిని కిందకు దించే ప్రయత్నం చేశారు. అతడి తల్లి కుర్షీద్ ఉన్నిసాతో సెల్లో మాట్లాడించినా దిగిరాలేదు. రాత్రి వరకు కూడా ఇమ్రాన్‌ఖాన్ కిందకు దిగలేదు. -
భార్య తిట్టిందని..
దొరవారిసత్రం: భార్య తిట్టిందని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం మీజూరు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి దాటాక చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మునిరామయ్య(35) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన మునిరామయ్యను మద్యం మానేయమని భార్య పలుమార్లు చెప్పింది. బుధవారం రాత్రి మద్యం సేవించి రావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న మునిరామయ్య ఒంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటిచుకోవడంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లాలో ఘటన ధర్పల్లి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే అదనపు కట్నం కోసం వేధించడంతో ప్రేమికుల దినోత్సవం రోజే ఇద్దరు పిల్లలను హతమార్చి తనూ ఆత్మహత్య చేసుకుందో ఇల్లాలు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వెంగల్పాడ్ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంగల్పాడ్ తండాలో బదావత్ శ్రీనివాస్, డొంకల్ గ్రామ పరిధిలోని దేవునితండాకు చెందిన అరుణ (26)లు 2009లో ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి కొడుకు శ్రీకర్(4), కూతురు సుచిత్ర (8 నెలలు) ఉన్నారు. కొంతకాలంగా శ్రీనివాస్ అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్నాడు. మరో పెళ్లి చేసుకునేం దుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన అరుణ ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇద్దరు చిన్నారులను ఫ్యాన్‌కు ఉరి వేసి, తనూ దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
నర్సంపేట: వరంగల్ జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. నర్సంపేటలోని ఫాఖాల్ రోడ్లో సుజాత అనే మహిళ నివాసం ఉంటోంది. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఆమె ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్న క్రమంలో సుజాత ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
మెదక్ జిల్లాలో దారుణం
మెదక్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. సిద్ధిపేట మార్కెట్ వద్ద ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యాయత్నానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. లక్సెట్టిపేట మండలం చందారం గ్రామానికి చెందిన ఆకుల సరిత కుటుంబంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం సాయంత్రం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో మృతిచెందింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు. -
కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య
ఎల్లారెడ్డి: నిజామాబాద్ జిల్లాలో కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కాంతి రమేష్(26) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా కుటుంబ సభ్యులతో గొడవపడి ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
కుటుంబ కలహాలతో ఆత్మహత్య
కోవూరు (నెల్లూరు) : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఎన్ఎస్ఆర్ కాలనీలో గురువారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... కాలనీకి చెందిన కొత్తూరు నరేంద్ర(39) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా గత కొన్నిరోజులుగా కుటుంబ కలహాలు ఎక్కువవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకే కుటుంబంలో ఇద్దరి ఆత్మహత్యాయత్నం
నందిగామ: శ్రీకాకుళం జిల్లాలో కుటుంబకలహాలతో ఒకే కుటుంబంలోని ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారు. వివరాలు..జిల్లాలోని నందిగామ మండలంలోని హరిదాసుపురానికి చెందిన కవిటి ఆనందరావు(55),వెంకమ్మ(70) అనే ఇద్దరు మంగళవారం ఉదయం కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చుట్టుపక్కల వారు అప్రమత్తమై వారిని టెక్కిలి ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే వారు ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. -
చికిత్స పొందుతూ అత్తాకోడళ్లు మృతి
కర్నూలు(వెల్దుర్తి): కుటంబ కలహాలతో కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్న అత్తా కోడళ్లు మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని నర్సాపురం గ్రామనికి చెందిన అత్తా, కోడళ్లు ఇంట్లో తరచూ గొడవ పడుతుండేవారు. అయితే గురువారం కూడా ఇద్దరి మద్య వాగ్వివాదం జరిగింది. దీంతో కోడలు కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి యత్నించింది. అయితే చికిత్స పొందుతూ కోడలు మహతి మృతి చెందగా, ఈ రోజు అదే తరహాలో అత్త సుబ్బలమ్మ చికిత్స పొందతూ ప్రాణాలొదిలింది. -
కుటుంబకలహాలతో వ్యక్తి ఆత్మహత్య
రావులపాలెం (తూర్పుగోదావరి) : కుటుంబకలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో ఆదివారం ఉదయం జరిగింది. వివరాల ప్రకారం.. పొడగట్లపల్లి గ్రామానికి చెందిన పెంటయ్య(42) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా గత కొన్ని రోజులుగా కుటుంబసభ్యులతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన పెంటయ్య ఆదివారం ఉదయం పురుగుల మందు తాగాడు. ఆ తర్వాత మద్యం సేవించడం కోసం మద్యం దుకాణానికి వెళ్లి అక్కడే పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
కర్నూలు: కుటుంబకలహాలతో ఒక మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గురువారం సాయంత్రం కర్నూలు జిల్లా గోస్పాడు మండలం రామవరం గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన నీతమ్మ(30) కుటుంబంలో గత కొంతకాలంగా కుటుంబకలహాలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలోనే నిత్యం గొడవలతో విసుగు చెందిన నీతమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. నీతమ్మ భర్త ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టం కోసం నంద్యాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యాయత్నం
చివ్వెంల (నల్లగొండ) : కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపం చెందిన ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం గాయంవారిగూడెంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. వివరాల ప్రకారం... గాయంవారిగూడెం గ్రామానికి చెందిన రెమడాల లింగమ్మ(35) ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు ఆర్పి, కాపాడేందుకు యత్నించిన మరో ముగ్గురు కుటుంబసభ్యులకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.