కన్నీరు పెడుతున్న కీర్తిగౌడ, మోనికా మీడియాతో మాట్లాడుతున్న దునియా
యశవంతపుర : కన్నడ హీరో దునియా విజయ్ మొదటి భార్య నాగరత్న ఉంటున్న కత్రిగుప్పె ఇంటి వద్ద ఆదివారం హైడ్రామా చోటు చేసుకొంది. సెప్టెంబర్ 23న దునియా రెండో భార్య కీర్తిగౌడపై దాడి చేసిన వీడియోను దునియా, కీర్తిగౌడ మాధ్యమాలకు విడుదల చేశారు. విషయం తెలుసుకున్న తక్షణమే గిరినగర పోలీసులు నాగరత్న, మోనికపై కేసు నమోదు చేశారు. విచారణకు పోలీసులు వస్తున్న విషయం తెలుసుకున్న నాగరత్న, మోనికలు ఇంటికి తాళం వేసుకుని పోలీసులను అడ్డుకున్నారు. కిటికీలో నుండి పోలీసులతో మాట్లాడిన మోనిక తన తల్లి ఇంటిలో లేదని చెప్పి పంపారు. తమను అరెస్టు చేయటానికి వారెంట్ ఏమైనా తెచ్చారా అంటూ మోనిక ప్రశ్నించారు. గిరినగర పోలీసులు మధ్యాహ్నం వరకు నాగరత్న కోసం వేచి ఉండి వెళ్లిపోయారు. అంతలోనే నాగరత్న తరపున లాయర్ ఆదివారం మధ్యాహ్నం నేరుగా స్టేషన్‌కు వెళ్లి నాగరత్న మారణాయుధాలతో దాడి చేయలేదని, చేతితో కొట్టడం వల్లే గాయమైందని, ఆమెకు స్టేషన్ బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసి వెళ్లిపోయారు.
మోనికను అదుపులోకి తీసుకున్న పోలీసులు
కీర్తిగౌడపై దాడి చేసినందుకు నాగరత్న ఇంటిలో లేక పోవటంతో దునియా కూతురు మోనికను గిరినగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న దునియా విజయ్ రెండో భార్య కీర్తిగౌడతో కలిసి గిరినగర పోలీసుస్టేషన్ వద్దకు చేరుకున్నారు. కూతురును పోలీసులు అదుపులోకి తీసుకోవటంపై దునియా కన్నీరు పెట్టారు. అమ్మ చేసిన తప్పునకు కూతురుకు శిక్షవేయటం మంచిది కాదని, తమను కొట్టేంత ద్వేషం పెచ్చుకోవటం పద్దతికాదన్నారు. ఇంత జరిగినా పిల్లల భవిష్యత్ గురించి నాగరత్న పట్టించుకోవటంలేదని విజయ్ తరపు న్యాయవాది శివకుమార్ పేర్కొన్నారు.
పిల్లలను అడ్డు పెట్టుకుని నాగరత్న నాటకాలు
తనపై లేనిపోని అరోపణలు చేస్తున్న నాగరత్న పిల్లలను అడ్డం పెట్టుకుని తనను వేధిస్తున్నట్లు దు నియా విజయ్ అరోపించారు. ఇకనైనా బుద్ధిగా పి ల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పోలీసుల ముందుకు రావాలన్నారు. అయన ఆదివారం బెం గళూరులో విలేకర్లతో మాట్లాడారు. కీర్తిగౌడపై దా డి వీడియోను విడుదల చేసిన తక్షణం ఆమె ఇంటి నుండి పారిపోయారు. కూతురు మోనికను పోలీ సులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. మోనికను ఇలా స్టేష న్‌కు తీసుకురావటాన్ని తాను చూడలేకపోతున్నా ... చట్టం అందరికీ సమానం అనే విషయంను నా గరత్న మరిచారు. కూతురికి 18 ఏళ్ల నిండుతున్నా యి. ఇలాంటి వాతావరణంలో పిల్లలు ఉండటం చెడు ప్రభావానికి దారితీస్తుందని మీడియా ముం దు కన్నీరుమున్నీరయ్యారు. కూతురిపై ఆరోపణలు రావటంవల్ల మీరు రాజీఅవుతరా...అంటూ విలేకర్ల ప్రశ్నించగా అన్నింటికి పిల్లలను ముందుపెట్టి నాటకాలుచేయడం మంచిది కాదన్నారు.
అరెస్ట్‌కు అదేశం
కీర్తిగౌడపై దాడికి సంబంధించి నాగరత్నను అరెస్ట్ చేయటానికి గిరినగర పోలీసులు సిద్ధంగా ఉన్నారు. సెప్టెంబర్ 23న దునియాతో కలిసి ఉంటున్న ఇంటి వద్దకు వచ్చి అసభ్యంగా నిందించటంతో పాటు తనను చెప్పుతో కొట్టినట్లు కీర్తిగౌడ గిరినగర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమెను అరెస్ట్ చేస్తామని డీసీపీ అణ్ణామలై విలేకర్లకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment