
దునియా విజయ్ నాగరత్న (ఫైల్)
ఫ్యామిలీ కోర్టులో విడాకుల అర్జీ పెట్టుకున్నట్లు సమాచారం.
యశవంతపుర: మొదటిభార్య నాగరత్న నుంచి విడాకులు తీసుకోవాలని వివాదాస్పద హీరో దునియా విజయ్ సిద్ధమవుతున్నాడు. నాగరత్న, ఆమె పిల్లలు– దునియా విజయ్, అతని రెండ వభార్య కీర్తి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడం, పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తుండడం తెలిసిందే. రోజూ తన కుటుంబ గొడవలు వీధినపడడం మంచిది కాదు, నాగరత్నతో తెగతెంపులు చేసుకోవాలని భావించిన దునియా విజయ్ బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో విడాకుల అర్జీ పెట్టుకున్నట్లు సమాచారం.
నెల రోజుల నుండి నాగరత్న, పిల్లలతో గలాటాలు జరుగుతుండడంతో విడాకులకు ఇదే అదను అని విజయ్ అనుకున్నాడు. గత రెండేళ్ల క్రితం ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించి విడాకులకు కోర్టుకెళ్లినా, మళ్లీ రాజీకి వచ్చారు. తాజా గొడవలతో విజయ్ మళ్లీ విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై నాగరత్న స్పందన తెలియాల్సి ఉంది.