పునీత్‌కు గుడి కట్టిన వీరాభిమాని
పునీత్ ఆలయంలో పూజలకు శ్రీకారం
అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటా
పునీత్ రాజ్‌కుమార్ సతీమణి
అశ్విని భావోద్వేగం
హుబ్లీ: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నడ వెండి తెరపై విరాజిల్లడంతో పాటు తన ఎనలేని సామాజిక సేవతో రాష్ట్ర ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు. ఆ అభిమానంతోనే హావేరి జిల్లాలో ఆయన పేరిట నిలువెత్తు విగ్రహంతో కూడిన ఆలయాన్ని గురువారం ఆయన సతీమణి అశ్విని ప్రారంభించారు.
హావేరి జిల్లాలోని యలగట్టి గ్రామంలో పునీత్ వీరాభిమాని నిర్మించిన ఈ ఆలయంలో గురువారం నుంచి పూజలు ప్రారంభంఅయ్యాయి. ప్రకాష్ అనే అభిమాని తన ఇంటి ఎదురుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. జనం మెచ్చిన పునీత్‌లాంటి నటులతో తమ పిల్లల నామకరణం చేయడం ఆనవాయితీ. పునీత్‌ను కన్నడిగులు అప్పు అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ క్రమంలో అభిమాని ప్రకాష్, ఆయన భార్య దీపాల బిడ్డకు అపేక్ష అనే పేరుని అశ్విని పెట్టారు. అప్పు సేవలను సహధర్మచారిణి అశ్విని ఎంతో ఆసక్తిగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తమ అభిమాని ప్రకాష్ ఆశయాన్ని కూడా నెరవేర్చారు.
ఇలాంటి అభిమాని ఉండటం మా పుణ్యం
ఈ సందర్భంగా అశ్విని మీడియాతో మాట్లాడుతూ అభిమానులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. ప్రకాష్ అనే అభిమాని సొంత స్థలంలో అప్పు ఆలయాన్ని నిర్మించారు. ఇలాంటి అభిమాని ఉండటం తమ పుణ్యం, ఇది తనకు ఎంతో సంతోషం కలిగించిందని ఆమె భావోగ్వేగానికి గురయ్యారు. అభిమాని సొంత డబ్బులతో సుమారు రూ.10 లక్షలు వ్యయం చేసి ఆలయాన్ని నిర్మించారు. పూజల ప్రారంభం సందర్భంగా వివిధ కళా బృందాలు, కుంభమేళా తదితర విశేష కార్యక్రమాలు జరిగాయి. విశేషంగా పునీత్ అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధగా నెరవేర్చి తమ అభిమాన నటుడిని స్మరించుకున్నారు. అనంతరం స్కూల్ మైదానంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పలువురు సినీ నటులు, రాజకీయ నాయకులు, మఠాధిపతులు పాల్గొన్నారు. కాగా చివరి విశేషంగా అన్నదానం కూడా నెరవేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment