Puneet Rajkumar
-
పునీత్‌కు గుడి కట్టిన వీరాభిమాని
హుబ్లీ: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నడ వెండి తెరపై విరాజిల్లడంతో పాటు తన ఎనలేని సామాజిక సేవతో రాష్ట్ర ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు. ఆ అభిమానంతోనే హావేరి జిల్లాలో ఆయన పేరిట నిలువెత్తు విగ్రహంతో కూడిన ఆలయాన్ని గురువారం ఆయన సతీమణి అశ్విని ప్రారంభించారు. హావేరి జిల్లాలోని యలగట్టి గ్రామంలో పునీత్ వీరాభిమాని నిర్మించిన ఈ ఆలయంలో గురువారం నుంచి పూజలు ప్రారంభంఅయ్యాయి. ప్రకాష్ అనే అభిమాని తన ఇంటి ఎదురుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. జనం మెచ్చిన పునీత్‌లాంటి నటులతో తమ పిల్లల నామకరణం చేయడం ఆనవాయితీ. పునీత్‌ను కన్నడిగులు అప్పు అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ క్రమంలో అభిమాని ప్రకాష్, ఆయన భార్య దీపాల బిడ్డకు అపేక్ష అనే పేరుని అశ్విని పెట్టారు. అప్పు సేవలను సహధర్మచారిణి అశ్విని ఎంతో ఆసక్తిగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తమ అభిమాని ప్రకాష్ ఆశయాన్ని కూడా నెరవేర్చారు.ఇలాంటి అభిమాని ఉండటం మా పుణ్యంఈ సందర్భంగా అశ్విని మీడియాతో మాట్లాడుతూ అభిమానులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. ప్రకాష్ అనే అభిమాని సొంత స్థలంలో అప్పు ఆలయాన్ని నిర్మించారు. ఇలాంటి అభిమాని ఉండటం తమ పుణ్యం, ఇది తనకు ఎంతో సంతోషం కలిగించిందని ఆమె భావోగ్వేగానికి గురయ్యారు. అభిమాని సొంత డబ్బులతో సుమారు రూ.10 లక్షలు వ్యయం చేసి ఆలయాన్ని నిర్మించారు. పూజల ప్రారంభం సందర్భంగా వివిధ కళా బృందాలు, కుంభమేళా తదితర విశేష కార్యక్రమాలు జరిగాయి. విశేషంగా పునీత్ అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధగా నెరవేర్చి తమ అభిమాన నటుడిని స్మరించుకున్నారు. అనంతరం స్కూల్ మైదానంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పలువురు సినీ నటులు, రాజకీయ నాయకులు, మఠాధిపతులు పాల్గొన్నారు. కాగా చివరి విశేషంగా అన్నదానం కూడా నెరవేర్చారు. -
కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షిస్తున్న సినీ గ్లామర్
-
పునీత్‌కు బసవశ్రీ అవార్డు
సాక్షి, బళ్లారి, యశవంతపుర: దివంగత పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం చిత్రదుర్గ మురుఘ మఠం 2021 ఏడాదికిగాను ప్రతిష్టాత్మక బసవశ్రీ ప్రశస్తిని ప్రకటించడం తెలిసిందే. మంగళవారం బసవ జయంతి సందర్భంగా పునీత్ సతీమణి అశ్వినికి చిత్రదుర్గంలోని మురుఘ మఠంలో ప్రశస్తిని బహూకరించారు. అవార్డుతో పాటు రూ. 5 లక్షల చెక్కును పీఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుఘ స్వామి ఆమెకు అందజేశారు. మంత్రి బీసీ పాటిల్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. (చదవండి: పునీత్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న నమ్రత) -
శిల్పకళకు 'త్రీడీ' తళుకులు
తెనాలి: కాంస్య విగ్రహాలు, ఐరన్ స్క్రాప్ విగ్రహాలతో గుర్తింపును పొందిన తెనాలి సూర్య శిల్పశాల శిల్పులు మరో అడుగు ముందుకేశారు. తమ నైపుణ్యానికి త్రీడీ టెక్నాలజీని ఆలంబనగా చేసుకుని మినీయేచర్ విగ్రహాల తయారీకి పూనుకున్నారు. ఇటీవల మృతిచెందిన కన్నడ సినిమా పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మినీయేచర్ విగ్రహాలను చేసి, శుక్రవారం విలేకరుల ముందు ప్రదర్శించారు. దేవాలయాల రూపశిల్పి అయిన తండ్రి నుంచి వారసత్వంగా శిల్పకళను అందిపుచ్చుకున్న కాటూరి వెంకటేశ్వరరావు తన పరిధిని విస్తరించారు. ఆలయాలు, రాజగోపురాల రూపకల్పనతోనే సరిపెట్టకుండా.. సిమెంటు, ఫైబర్, కాంస్యం వంటి విభిన్న పదార్థాలతో విగ్రహాలు తయారుచేస్తూ వచ్చారు. ఫైన్ఆర్ట్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన కొడుకు రవిచంద్ర కలిసిరావటంతో వారి సృజన ఎల్లలు దాటింది. ఐరన్ స్క్రాప్‌తో భారీ విగ్రహాలను తయారుచేసి అంతర్జాతీయ ఖ్యాతిని సాధించారు. తాజాగా కాటూరి వెంకటేశ్వరరావు రెండో కుమారుడు శ్రీహర్ష త్రీ–డీ టెక్నాలజీతో విగ్రహాల తయారీలో శిక్షణ పొందాడు. తమ శిల్పశాల ఆర్ట్ గ్యాలరీలో తొలిగా పునీత్ రాజ్‌కుమార్ మినీయేచర్ విగ్రహాలను చేశారు. బస్ట్ సైజు 12 అంగుళాల్లో, ఫుల్ సైజ్ 15 అంగుళాల ఎత్తులో వీటిని తయారు చేశారు. వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఇంట్లో, ఆఫీసుల్లో టేబుల్‌పై ఉంచుకోవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్తగా చేస్తున్న ఈ మినీయేచర్ విగ్రహాలతో తమ శిల్పశాల ఖ్యాతి మరింతగా ఇనుమడిస్తుందని శిల్పి శ్రీహర్ష అన్నారు. -
పునీత్ రాజ్ కుమార్ బయోపిక్ ! క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
Director Santhosh Gave Clarity On Puneet Raj Kumar Biopic: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంటే ఇప్పుడు తెలియనివారుండరు. పునీత్ మరణాంతరం ఆయన చేసిన గొప్పతనం అందరికీ తెలిసింది. అన్నిటికిమించి ఆయన చనిపోయాక సేవా కార్యక్రమాలు ఆగిపోకూడదని రూ. 8 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మహానుభావుడు పునీత్ రాజ్ కుమార్. అలాంటి వ్యక్తిపై బయోపిక్ రానుంది. ఇంతకుముందు పునీత్ రాజ్ కుమార్ బయోపిక్ రానుందని కన్నడ నాట పుకార్లు వచ్చాయి. వీటిపై దర్శకకుడు సంతోష్ ఆనంద్ రామ్ స్పందించారు. పునీత్ మరణించిన తర్వాత ఒక అభిమాని ఆయనపై బయోపిక్ నిర్మించే ఆలోచన ఉందా అని ట్వీటర్లో ప్రశ్నించగా, 'బయోపిక్ తీయడానికి నా శాయశక్తుల ప్రయత్నిస్తాను' అని దర్శకుడు సంతోష్ తెలిపారు. I’ll try my level best to bring this idea on screen 🙏 #appusirliveson https://t.co/ivcPkm7HyF — Santhosh Ananddram (@SanthoshAnand15) November 21, 2021 చదవండి: పునీత్ రాజ్ కుమార్ భార్య ఎమోషనల్ పోస్ట్.. అప్పుకు అంకితంగా చాలా మంది అభిమానులు పునీత్ బయోపిక్ రావాలనే ఆలోచనను స్వాగతించారు. ఆయన ఫ్యాన్స్ అతన్ని అప్పు అని పిలుస్తారు. ఒక అభిమాని 'అవును, నిజంగా చాలా గొప్ప ఆలోచన. దయచేసి మా ప్రియమైన అప్పు బయోపిక్‌తో రండి' అని ట్వీట్ చేశాడు. మరొకరు 'దయచేసి మా అప్పు సర్ బయోపిక్ తీయండి. ఆయన మంచితనాన్ని రేపటి తరానికి చాటుదాం. అప్పు ఈ ప్రపంచంలో మంచి గుర్తింపుతో చిరస్మణీయుడవుతాడు.' రాసుకొచ్చారు. ఈ బయోపిక్‌తో అప్పును మరోసారి బిగ్ స్క్రీన్‌పై చూసి తరిస్తాం. మీ దర్శకత్వంతో ఆయనకు ఉత్తమ నివాళి అవుతుంది.' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన యువరత్న చిత్రంతో పునీత్ రాజ్ కుమార్ చివరిసారిగా తెరపై కనిపించారు. దీనికి సంతోశ్ ఆనంద్ రామ్ దర్శకత్వం వహించారు. నాలుగేళ్ల క్రితం కూడా పునీత్ 'రాజకుమార' సినిమాను డైరెక్ట్ చేశారు సంతోష్. ఈ సినిమా కన్నడ ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాయడమే గాక రూ. 45 కోట్లు వసూలు చేసింది. అలాగే పునీత్ చివరిగా నటించిన కన్నడ చిత్రం 'జేమ్స్'. దీనికి ఒక యాక్షన్ సీక్వెన్స్, డబ్బింగ్ తప్ప మిగతా షూట్ అంతా పూర్తి చేశారు పునీత్ రాజ్ కుమార్. అయితే ఈ సినిమాను థియేటర్లలో విడదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు మూవీ మేకర్స్. చదవండి: పునీత్ రాజ్ కుమార్‌కు అరుదైన గౌరవం.. 'కర్ణాటక రత్న' అవార్డు ప్రదానం -
పునీత్ రాజ్ కుమార్‌కు అరుదైన గౌరవం.. 'కర్ణాటక రత్న' అవార్డు ప్రదానం
Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్, దివంగత పునీత్ రాజ్ కుమార్‌కు అరుదైన గౌరవం దక్కింది. అప్పు ( పునీత్ రాజ్ కుమార్) మరణాంతరం 'కర్ణాటక రత్న' అవార్డుతో సత్కరించనున్నారు. కర్ణాటక రత్న అవార్డును ప్రదానం చేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ట్విటర్ వేదికగా తెలిపారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండె పోటుతో అక్టోబర్ 29న బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో మరణించారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. "State Government has decided to honour late Sri Puneet Rajkumar with Karnataka Ratna award posthumously": Chief Minister @BSBommai. — CM of Karnataka (@CMofKarnataka) November 16, 2021 రాజ్ కుమార్ కుటుంబం నుంచి హీరోగా అరంగేట్రం చేసిన పునీత్ రాజ్ కుమార్ తనదైన శైలిలో హీరోగా ఎదిగారు. పునీత్ రాజ్ కుమార్ అంటే పేరు కాదు, ఒక బ్రాండ్ అని అందరూ ఒప్పుకునే స్థాయికి ఎదిగారు. పునీత్ రాజ్ కుమార్ బహుముఖ ప్రజ్ఞాశాలి. సినిమాల్లో నటించడమే కాదు. పాటలు పాడటం కూడా ఆయనకు ఎంతో ఇష్టం. పునీత్ ఆరేళ్ల వయసు నుంచే సినిమాల్లో పాటలు పాడటం ప్రారంభించారు. సినిమా హీరో అయ్యాక కూడా సంగీతాన్ని విడిచిపెట్టలేదు. కేవలం తన సినిమాలే కాక ఆయన అన్న శివరాజ్ కుమార్ సినిమాలు, ఇతర హీరోల సినిమాల్లో కూడా పునీత్ పాటలు పాడారు. ఇప్పటివరకూ వందకు పైగా పాటలు పాడిన పునీత్ రాజ్ కుమార్, గాయకుడిగా పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. సినిమాలే కాదు.. సామాజిక సేవ కార్యక్రమాలన్నా పునీత్‌కు మక్కువ ఎక్కువ. తన తల్లి పార్వతమ్మతో కలిసి సామాజిక కార్యక్రమాలలో పాల్గొనేవారు. మైసూరులో ఉన్న శక్తి ధర్మ ఆశ్రమం మంచి చెడ్డలు ఆయనే చూసుకునేవారు. కన్నడలో టాప్ హీరో అవడంతో ప్రచారకర్తగా కూడా పునీత్‌కు మంచి డిమాండ్ ఉండేది. తన తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ అడుగుజాడల్లో పునీత్ రాజ్‌కుమార్ కూడా ఎలాంటి పారితోషికం తీసుకోకుండానే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. పునీత్ KMF ఉత్పత్తులను ఎలాంటి ఒప్పందం లేకుండా ప్రమోట్ చేశారు. -
కొడుకు ఫొటోతో థియేటర్‌కు, కన్నీరు ఆగడం లేదు
శాండల్ వుడ్ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తాజా సినిమా 'యువరత్న' విడుదల కోసం కర్ణాటక సీఎం యాడ్యురప్ప జీవో సైతం మార్చిన సంగతి తెలిసిందే. పునీత్ తాజాగా నటించిన ‘యువరత్న’ సినిమా విడుదల కరోనా కారణంగా కొంత వివాదంలో పడింది. మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా ‘యువరత్న’ మూవీ విడుదల తేదీని వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ మూవీని విడుదలకు అనుమతించాల్సిందిగా చిత్ర యూనిట్‌తో పాటు అభిమానులు, శాండల్ వుడ్ ప్రేక్షకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై నిరసలు కూడా చేశారు. ఇక ఎన్నో వివాదాల మధ్య ఎట్టకేలకు ఈ మూవీ ఏప్రీల్ 1వ తేదీన థీయేటర్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పునీత్ ‘యువరత్న’ మూవీ చూసేందుకు ఓ వ్యక్తి తన కొడుకు ఫొటోతో థియేటర్‌కు వచ్చాడు. అది చూసి ఎంతో మంది ఆశ్చర్యపోయారు. చివరకు దాని వెనక ఉన్న కారణం తెలిసి అందరూ భావోద్వేగానికి లోనవుతున్నారు. కాగా కర్ణాటకలోని మైసూర్ కువెంపు నగరంకు చెందిన మురళీధర్ అనే వ్యక్తి కుమారుడు హరికృష్ణన్ నాలుగు నెలల కిందట మిత్రులతో కలిసి వరుణ కాలువలో ఈతకు వెళ్లి నీట మునిగి ప్రాణాలు విడిచాడు. యువరత్న సినిమా విడుదలైన రోజే మొదటి ఆట చూడాలని తండ్రిలో చెప్పేవాడు. ఈ నేపథ్యంలో యువరత్న ఆడుతున్న సినిమా థియేటర్‌కు బాలుని తల్లిదండ్రులు, అన్నయ్య వచ్చారు. తమతో పాటు బాలుని ఫోటోను తీసుకొచ్చి నాలుగు టికెట్లు తీసుకుని మూవీని చూశారు. దీనిపై అతడు మాట్లాడుతూ.. కొడుకు హరికృష్ణన్ హీరో పునీత్ రాజ్‌కుమార్‌కు వీరాభిమాని అని, ఆయన సినిమాలన్నీ విడుదలైన మొదటి రోజే చూసేవాడని చెప్పాడు. కానీ దురదృష్టవశాత్తు యువరత్న మూవీ విడుదలకు ముందే తన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ కన్నీరుమున్నీరయ్యాడు. -
తుళూ రాగం
కన్నడ ఇండస్ట్రీలో పునీత్ రాజ్‌కుమార్ స్టార్ హీరో. ఇప్పుడు తుళూ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే యాక్టర్‌గా కాదు సింగర్‌గా మాత్రమే. సింగర్‌గా తన గొంతును ‘ఉమ్లీ’ (దోమ) అనే తుళూ సినిమాలో వినిపించనున్నారు. తుళూ ఇండస్ట్రీలో రూపొందిన ఫస్ట్ గ్రాఫిక్స్ ప్రధాన చిత్రం ‘ఉమ్లీ’ కావడం విశేషం. ఈ సినిమాలో వచ్చే మాస్ సాంగ్‌నే పునీత్ రాజ్‌కుమార్ పాడారట. ఈ సాంగ్ గురించి ఉమ్లీ దర్శకుడు రంజిత్ సువర్ణ మాట్లాడుతూ – ‘‘ఈ సాంగ్ పాడమని పునీత్ సార్‌ని అప్రోచ్ అయ్యాం. ట్యూన్ నచ్చడంతో ఆయన పాడటానికి ఒప్పుకున్నారు. నాలుగు నెలలపాటు ఈ పాటను ప్రాక్టీస్ చేశారు. తుళూ పదాల ఉచ్చారణలో తప్పులు దొర్లకుండా ఉండాలని సీరియస్‌గా సాధన చేశారు. పాట చాలా అద్భుతంగా వచ్చింది’’ అని పేర్కొన్నారు. అన్నట్లు.. కన్నడంలో కూడా పునీత్ పలు పాటలు పాడారు. -
గెళెయా.. గెళెయా...
‘‘మిత్రమా.. ఈ గెలుపు ఎప్పటికైనా మనదే.. ఏమైనా సరే ఇలాగే ఎప్పుడూ కలిసుందాం...’’ అని కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్‌ని మన తెలుగు హీరో ఎన్టీఆర్ ఓ రేంజ్లో ఎంకరేజ్ చేశారు. మాటలతో కాదు.. ఏకంగా పాట రూపంలో పునీత్‌ని ప్రోత్సహించారు. కన్నడంలో స్టార్ హీరోగా దూసుకెళుతోన్న పునీత్‌కి ఎందుకు ఎంకరేజ్మెంట్ కావాల్సి వచ్చింది? ఎన్టీఆర్‌నే ఎందుకు ప్రోత్సహించమని అడిగారనే కదా మీ డౌట్. కన్నడ చిత్రం ‘చక్రవ్యూహ’లోని ‘గెళెయా గెళెయా.. గెలువే నమదయ్యా..’ పాట వినే ఉంటారు. గెళెయా అంటే మిత్రమా అని అర్థం. పునీత్ నటించిన ఈ సినిమాలో ఈ పాటను ఎన్టీఆర్ పాడారు. ‘‘మిత్రమా.. ఈ గెలుపు ఎప్పటికైనా మనదే...’’ అనే అర్థంతో సాగే ఈ పాటను పునీత్‌తో ఉన్న స్నేహం కోసం పాడారు ఎన్టీఆర్. పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా బాగా ఆడింది. ఇప్పుడీ పాట కోసం కన్నడ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ తొలి గాయకుడి జాబితాలో ఎన్టీఆర్ పేరు ఉండటం విశేషం. అఫ్కోర్స్ తెలుగులో అప్పుడప్పుడూ పాటలు పాడినప్పటికీ కన్నడంలో ఎన్టీఆర్ పాడిన తొలి పాట ఇదే కదా. నామినేషన్లో ఎన్టీఆర్ పేరు ఉన్న విషయం తెలిసిన అభిమానులు ‘గెళెయా..’ పాటను అన్వయిస్తూ ‘గెలుపు మనదే’ అంటున్నారు. -
పాక్ నటులపై నిషేధం సబబే
సమర్థించిన శాండల్‌వుడ్ నటులు బెంగళూరు : ఉరీలో భారత సైనిక శిబిరంపై పాక్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్ ఆక్రమిత ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై జరిపిన సర్జికల్ దాడులు ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొనడంతో పాకిస్తాన్ నటులను బాలీవుడ్ సినిమాల్లో నిషేధించడంతో మిశ్రమ స్పందన లభిస్తోంది. కాగా ఈ విషయంపై శాండల్‌వుడ్ నటీనటులు కూడా పాక్ నటులను నిషేధించడాన్ని సమర్థించారు. కళ కంటే దేశం గొప్పది... మొదట మనమందరం భారతీయులం ఆ తరువాతనే కళాకారులం పాకిస్థాన్ నటులను నిషేధించాలన్న డిమాండ్ సరైనదేనని కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ తెలిపారు. డెరైక్టర్ పవన్ ఒడెయార్ మాట్లాడుతూ... దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న భారత సైనికులను ప్రతి ఒక్కరు మద్దుతుగా నిలబడాలని, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న పాక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, పాక్ నటులపై నిషేధం సబబేనని అన్నారు. దేశం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. పాక్ నటులపై నిషేధించడం ద్వారా సైనికులకు మద్దతు తెలపడమే మన కర్తవ్యమని ప్రముఖ హీరోయిన్ సంజన తెలిపారు. అదేవిధంగా మరో హీరో చేతన్, నిర్మాత ఎం.ఎస్.రమేశ్ తదితరులు పాకిస్థాన్ నటులను నిషేధించడాన్ని సమర్థించారు. -
బెంగళూరులో హోమియోకేర్ అతిపెద్ద క్లినిక్
మల్లేశ్వరంలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్ హైదరాబాద్: హోమియోకేర్ ఇంటర్నేషనల్ మరో హోమియో క్లినిక్‌ను ఆదివారం బెంగళూరులోని మల్లేశ్వరంలో ఏర్పాటు చేసింది. దీన్ని కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చేతులమీదుగా ప్రారంభించారు. హోమి యో కేర్ ఇంటర్నేషనల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ శ్రీకాంత్ మోర్లవార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హోమియో క్లినిక్‌ల విషయానికొస్తే ఇది ఆసియాలోనే అతిపెద్దదని సంస్థ చెబుతోంది. -
అద్వితీయం
► ‘డాక్టర్ రాజ్‌కుమార్’ జయంతి వేడుకలు..... ► మహానటుడికి ఘనంగా నివాళులు అర్పించిన అభిమానులు ► సమాధిపై హెలికాఫ్టర్‌తో పూల వర్షం సాక్షి, బెంగళూరు: మహానటుడు, కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్‌కుమార్ జయంతి వేడుకలను ఆయన కుటుంబ సభ్యులు అత్యంత ఘనంగా నిర్వహించారు. డాక్టర్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకొని ఆయన సమాధిని పుష్పాలతో అందంగా అలంకరించారు. శుక్రవారం ఉదయమే దివంగత రాజ్‌కుమార్ సతీమణి పార్వతమ్మ రాజ్‌కుమార్, కుమారులు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ తదితరులు డాక్టర్ రాజ్‌కుమార్ సమాధి వద్దకు చేరుకుని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. నగర వ్యాప్తంగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఆయన అభిమానులు ప్రారంభించారు. అంతేకాక నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అనాధ ఆశ్రమాలు, వౄ్ధశ్రమాలు, ఆస్పత్రులలో పండ్లు, మిఠాయిలను రాజ్‌కుమార్ అభిమానులు పంచిపెట్టారు. ఇక రాజ్‌కుమార్ రక్తనిధికి వేలాది సంఖ్యలో అభిమానులు రక్తదానం చేశారు. రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా మహానటుడికి నివాళులు అర్పించేందుకు గాను వేలాది సంఖ్యలో అభిమానులు రాజ్‌కుమార్ సమాధి వద్దకు చేరుకున్నారు. ఒకానొక సందర్భంలో అభిమానులను అదుపు చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా తయారైంది. బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రాజ్‌కుమార్ విగ్రహాలు సైతం పుష్ప అలంకారాలతో విరాజిల్లాయి. హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంతో పాటు మైసూరు, రామనగర, తుమకూరు, కోలారు, మండ్య, శివమొగ్గ తదితర ప్రాంతాలన్నింటిలోనూ కర్ణాటక రక్షణా వేదిక, నవ నిర్మాణ సేన తదితర సంఘాల ఆధ్వర్యంలో రాజ్‌కుమార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హెలికాఫ్టర్‌తో పూల వర్షం.... ఇక డాక్టర్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా మహానటుడికి నివాళులు అర్పించేందుకు ఆయన కుటుంబసభ్యులు రాజ్‌కుమార్ సమాధి వద్దకు చేరుకోగానే వారిపై అభిమానులు పుష్ప వర్షాన్ని కురిపించారు. రాజ్‌కుమార్ జయంతిని విభిన్నంగా ఆచరించేందుకు గాను హెలికాఫ్టర్‌తో రాజ్‌కుమార్ సమాధి పై పూలవర్షాన్ని కురిపించినట్లు కన్నడ కదంబ యువకర సంఘ వెల్లడించింది. 50 అడుగుల ఎత్తులో వెళుతున్న హెలికాఫ్టర్ నుంచి పూల వర్షాన్ని కురిపించడంతో రాజ్‌కుమార్ సమాధి వద్దకు చేరుకున్న కుటుంబసభ్యులతో పాటు అక్కడికి చేరుకున్న అభిమానులు సైతం సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. -
ధన్యమైంది జన్మ!
శాండల్‌వుడ్ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ను పోటీపడిమరీ పొగడ్తలతో ‘ఐస్’ చేస్తున్నారు అందాల తారలు. బాలీవుడ్ భామ ఆదాశర్మ ఈ రేస్‌లో ముందుంది. ‘ఈ మధ్యే పునీత్ తన పవర్ సినిమాలో డ్యాన్స్ చూపించాడు. ఆ స్టెప్స్, మూమెంట్స్... అబ్బో అబ్బో.! నేనైతే ఫ్లాటై.. అతనికి ఫ్యాన్ అయిపోయా’ అంటూ తెగ సంబరపడుతూ ట్వీట్ చేసిందీ సుందరి. మరో భామ నీతూచంద్ర కూడా అదే బాటలో వెళుతోంది. ‘కన్నడ సూపర్‌స్టార్, పవర్ స్టార్, అద్భుతమైన నా సహనటుడి డ్యాన్స్ అద్వితీయం’ అని ‘స్వీట్’గా ట్వీట్ చేసి పునీత్‌ను పొగడ్తలతో పావనం చేసింది. -
బికినీలో త్రిష?!
త్రిషను సముద్ర కెరటంతో పోల్చొచ్చు. పడి లేవడం కెరటానికి ఎంత సహజమో, కెరీర్ పరంగా పడి లేవడం త్రిషకు సహజమై పోయింది. ‘ఈ అమ్మాయి పని అయిపోయింది’ అని అనుకునేలోపే... ఏదో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌తో మళ్లీ తన హవా చాటుతుంటారు త్రిష. గత ఏడాది జీవాతో ఆమె చేసిన ‘ఎండెండ్రుం పొన్నగై’ చిత్రం తమిళనాట పెద్ద హిట్‌గా నిలిచింది. ఆ సినిమాతో మళ్లీ త్రిష వెలుగులోకి వచ్చారు. తెలుగులో తాజాగా బాలకృష్ణ సరసన చాన్స్ కొట్టేసి అందరి దృష్టినీ ఆకర్షించేశారు. మరో వైపు కన్నడంలో ‘దూకుడు’ రీమేక్‌గా రూపొందిన ‘పవర్’ చిత్రంలో పునీత్ రాజ్‌కుమార్‌కు జోడీగా నటించారు. ఇలా దక్షిణాది మొత్తాన్ని కవర్ చేస్తున్నారు త్రిష. ఇదిలావుంటే... సమంత, తమన్నా, కాజల్ లాంటి కథానాయికల పోటీని తట్టుకోడానికో ఏమో కానీ... ‘పవర్’ చిత్రం కోసం ఎప్పుడూ చేయని సాహసం చేసేశారట త్రిష. అదే... ‘బికినీ’. ఈ సినిమాలో త్రిష బికినీలో కనిపించబోతున్నారనేది బెంగళూరు టాక్. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ప్రచార చిత్రాలు కన్నడ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయట. ఈ నెల 28న ‘పవర్’ విడుదల కానుంది. అంటే... త్రిష బికినీ సోయగాలతో కన్నడ యువతకు కనువిందు చేసే రోజు ఇంకెంతో దూరంలో లేదన్నమాట. -
ఆడియో ఆవిష్కరణ వేడుకలో చేతి వాటం
బళ్లారి అర్బన్ : బళ్లారిలో శనివారం రాత్రి పునీత్ రాజ్‌కుమార్, త్రిష నటించిన పవర్ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకకు ప్రముఖ తెలుగు సినీ నటుడు మహేష్‌బాబు హాజరు కావడంతో మున్సిపల్ మైదానం జనసందోహంతో కిటకిటలాడింది. దీన్ని దొంగలు అదునుగా తీసుకుని రూ. 43వేల నగదు, 20 మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. స్థానిక కప్పగల్ రోడ్ బీచీ నగర్లో నివాసముండే ఆలూరు వీరాస్వామి (43) కర్నూలు జిల్లా చింతకుంట గ్రామ సొసైటీ బ్యాంక్ సెక్రెటరీగా పని చేస్తున్నాడు. అతడు విధులు ముగించుకుని ఓ జేబులో రూ.43 వేలు, మరో జేబులో రూ.10 వేల నగదు పెట్టుకుని సాయంత్రం ఆడియో ఫంక్షన్‌కు వచ్చాడు. ఆడియో ఆవిష్కరణలో స్టేజ్ మీదకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా దొంగలు బ్లేడ్‌తో జేబులు కట్‌చేసి ఓ జేబులోని రూ.43 వేలు చోరీ చేశారు. ఈ ఘటనపై బాధితుడు గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ తోపులాటలో సుమారు 20కిపైగా మొబైల్ ఫోన్లు, రూ.43 వేల నగదు చోరీ గురైనట్లు చెప్పారు. బంగారం గురించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. -
అంగరంగ వైభవంగా ‘పవర్’ ఆడియో విడుదల
-
అంగరంగ వైభవంగా ‘పవర్’ ఆడియో విడుదల
సీడీని విడుదల చేసిన మహేష్‌బాబు సాక్షి, బళ్లారి : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్, హీరోయిన్ త్రిష నటించిన ‘పవర్’ సినిమా ఆడియో విడుదల శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. బళ్లారిలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో కళ్లు జిగేల్మనేలా ఏర్పాట్లు చేశారు. ఆడియో సీడీని తెలుగు ప్రముఖ హీరో ప్రిన్స్ మహేష్‌బాబు చేతుల మీదుగా విడుదల చేయించారు. తెలుగులో ప్రభంజనం సృష్టించిన దూకుడు సినిమా రీమేక్‌గా పవర్ పేరుతో కన్నడంలో తీశారు. దీంతో మహేష్‌బాబు చేతుల మీదుగా సీడీని విడుదల చేయించారు. కన్నడ స్టార్ పునీత్, తెలుగు సినీ స్టార్ మహేష్‌బాబు హాజరు కావడంతో మున్సిపల్ హైస్కూల్ మైదానం భారీ జనసందోహంతో కిక్కిరిసిపోయింది. ఆడియో రిలీజ్ అనంతరం పాటలు, డ్యాన్స్‌లతో మున్సిపల్ స్టేడియం హోరెత్తింది. అంతకు ముందు పునీత్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ బళ్లారిలో పవర్ సినిమా ఆడియో రిలీజ్ చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. బళ్లారి కళలకు పుట్టినిల్లు అని అప్పాజీ ఎప్పుడూ చెప్పేవారని గుర్తు చేశారు. ఈ చిత్రాన్ని తాము రెండు వారాల పాటు బళ్లారి పరిసరాలలోనే చిత్రీకరించామని, ప్రప్రథమంగా తాను నటించిన 14 రీల్స్ సినిమా ఇది అన్నారు. ఆడియో రిలీజ్‌ను బళ్లారిలో అందులోను తెలుగు సూపర్‌స్టార్ మహేష్‌బాబు చేతుల మీదగా విడుదల చేయడం నిజంగా ఎంతో సంతోషంగా ఉందన్నారు. హీరో మహేష్‌బాబు మాట్లాడుతూ దూకుడు సినిమా రీమేక్‌ను పవర్‌స్టార్ పునీత్ ద్వారా కన్నడంలో తీయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలుగులో దూకుడు చిత్రం సూపర్ డూపర్ హిట్ అయినట్లుగానే కన్నడంలో కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకుడు తమన్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి చిత్రం హీరోయిన్ త్రిష హాజరు కాలేదు. -
నా సినిమాలను ఎవరూ అడ్డుకోలేరు
‘‘నావైపు తప్పు ఉండదని, నేను తప్పులు చేయనని అందరికీ తెలుసు. అందుకే నాకు సహయం చేయడానికి ముందుకొస్తున్నారు. నా సినిమాలను అడ్డుకోవాలని ఎవరో అంటున్నట్లు విన్నాను. కానీ, ఎవరూ అడ్డుకోలేరు ’’ అని శుక్రవారం అంజలి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఆమె ఈ విధంగా పేర్కొనడానికి కారణం ఉంది. తమిళ దర్శకుడు కళంజియమ్ ఇటీవలి కాలంలో అంజలిపై మాటల తూటాలు విసురుతున్నారు. గత ఏడాది ఆయన దర్శకత్వంలో అంజలి ‘ఊరు సుట్రి పురాణమ్’ అనే చిత్రంలో నటించడానికి అంగీకరించారు. అయితే, ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. దానికి గల కారణాలు బయటికి రాలేదు. కానీ, అంజలి సహకరించకపోవడంవల్లే ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిందని కళంజియమ్ ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న కళంజియమ్ని ‘ఊరు సుట్రి పురాణమ్’ గురించి పాత్రికేయులు అడిగారు.. గత ఏడాది మార్చిలో 12 రోజులు షూటింగ్ చేశామని, ఆ తర్వాత అంజలి ఈ సినిమా వదిలేసిందని కళంజియమ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నటీనటుల సంఘం, నిర్మాతల మండలి, చలన చిత్ర వాణిజ్య మండలి, ఫెప్సి... ఇలా పలు సంఘాలను న్యాయం కోరి ఆశ్రయించానని, కానీ న్యాయం జరగలేదని కళంజియమ్ పేర్కొన్నారు. ఇప్పుడు అంజలి తమిళంలో ఓ సినిమా అంగీకరించినున్నారనే వార్త విని, ‘‘నా సినిమా పూర్తి చేయకుండా తను వేరే సినిమాలు చేయడానికి వీల్లేదు. అంజలి ఏ భాషలో నటించినా అక్కడి సినిమాలు విడుదల కాకుండా ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నాను’’ అంటూ కళంజియమ్ ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే అంజలి ప్రకటన విడుదల చేశారని చెప్పొచ్చు. ఈ ప్రకటనలో కళంజియమ్ పేరు చెప్పకుండా.. ‘‘ఇప్పుడు నాకెలాంటి సమస్యలూ లేవు. నా సమస్యలన్నీ పూర్తిగా తీరిపోయాయి’’ అన్నారు అంజలి. ఇంకా చెబుతూ -‘‘ప్రస్తుతం నేను నటిస్తున్న తెలుగు సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఎలాంటి ఆటంకం లేకుండా ఆ షూటింగ్ సజావుగా జరిగింది. పునీత్ రాజ్‌కుమార్ సరసన నేను నటించనున్న కన్నడ సినిమా షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. నాతో ఎవరికీ సమస్య రాదు. ఆ విషయం అందరికీ తెలుసు. నాతో ఎవరైనా సినిమాలు చేయాలనుకుంటే, నిక్షేపంగా చేయొచ్చు. సందేహించక్కర్లేదు. ఇంతకు ముందు నా పాత్రలకు నేనెలా న్యాయం చేశానో ఇప్పుడూ అలానే చేస్తాను’’ అని స్పష్టం చేశారు. -
కన్నడంలో పునీత్‌కి జోడీగా...
కన్నడ టాప్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సరసన నటించే అవకాశం అంజలికి దక్కింది. పవన్ వడయార్ దర్శకత్వంలో పునీత్ ‘రాణా విక్రమ’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తొలుత ఇందులో నాయికగా తమన్నాని అనుకున్నారు. తర్వాత శ్రుతిహాసన్ కోసం ప్రయత్నించారు. ఫైనల్‌గా ఈ అవకాశం అంజలిని వరించింది. అంజలి ఆచూకి అంత సులువుగా దొరక్క దర్శకుడు చాలా కష్టపడ్డారట. చివరకు ఓ మిత్రుడు ద్వారా అంజలిని కాంటాక్ట్ చేశారు. అంజలికి ఇది రెండో కన్నడ సినిమా. 2008లో ‘హోంగానసు’ అనే సినిమాలో నటించారామె. జూన్ నెలలో అంజలి ఈ సినిమా షూటింగ్‌లోకి ఎంటరవుతారు. ప్రస్తుతం అంజలి తెలుగులో ‘గీతాంజలి’ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నారు. -
పునీత్ రాజ్‌కుమార్ హీరోగా భారీ బడ్జెట్ సినిమా
పునీత్ రాజ్‌కుమార్ హీరోగా భారీ బడ్జెట్ సినిమా పునీత్‌తో చేయడం సంతోషంగా ఉంది: పరాన్జీ బెంగళూరు, న్యూస్‌లైన్: రాయలసీమ ఫ్యాక్షన్ దృశ్యాలను తెలుగు సినీ అభిమానులకు కళ్లకు కట్టినట్లు చూపించిన దర్శకుడు జయంత్ సి. పరాన్జీ కన్నడ సినీ రంగంలో అడుగు పెట్టారు. కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌తో ఆయన ‘నిన్నిందలే’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. గురువారం ఆయన మల్లేశ్వరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమెరికాలోని న్యూయార్క్ నేపథ్యంలో సినిమా ఉంటుందని అన్నారు. మొత్తం సినిమా షూటింగ్ అక్కడే జరిగిందని అన్నారు. ఐదు శాతం మాత్రం బెంగళూరులో చిత్రీకరిచారని చెప్పారు. అమెరికాలో స్థిరపడిన కన్నడ కుటుంబాలు, కొత్తగా అక్కడికి వెళ్లిన కన్నడ కుటుంబాల మధ్య జరిగే కథ అన్నారు. అక్కడి పరిస్థితులు నేటి యువత, పెద్దల మనస్థత్వాల నేపథ్యంలో సినిమా ఉంటుందని అన్నారు. ఈ సినిమా తప్పకుండ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని అన్నారు. మొదట రణబీర్ కపూర్ లేదా షాహిద్ కపూర్‌తో హిందీలో ఈ సినిమా చెయ్యాలని బావించానని, అనుకోకుండ పునీత్ రాజ్‌కుమార్‌కు కథ చెప్పడంతో ఒకే సిట్టింగ్‌లో ఓకే చేసి డేట్స్ ఇచ్చారని అన్నారు. తాను బెంగళూరులో పుట్టి ఇక్కడే హైస్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేశానని గుర్తు చేసుకున్నారు. చిన్నపట్టి నుంచి డాక్టర్ రాజ్‌కుమార్ సినిమాలు చూసేవాడని, కన్నడలో మొదటి సినిమా అదే కుటుంబంలోని పునిత్రాజ్కుమార్తో చెయ్యడం ఆనందంగా ఉందని అన్నారు. పునీత్ , ఎరికా ఫెర్నాండెజ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నట్లు చెప్పారు. తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ నటుడు ఈ సినిమాలో న టిస్తున్నట్లు చెప్పారు. ఆయనను స్క్రీన్ మీద చూడాల్సిందేనని జయంత్ సీ. పరాన్జీ వివరించారు. తరువాత సినిమా సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో ఉంటుందని, స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నదని తెలిపారు.