పునీత్‌ రాజ్‌ కుమార్‌ బయోపిక్‌ ! క్లారిటీ ఇచ్చిన దర్శకుడు | Director Santhosh Gave Clarity On Puneet Raj Kumar Biopic | Sakshi
Sakshi News home page

Puneet Raj Kumar Biopic: పునీత్‌ రాజ్‌ కుమార్‌ బయోపిక్‌ ! క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Published Tue, Nov 23 2021 3:39 PM | Last Updated on Tue, Nov 23 2021 6:40 PM

Director Santhosh Gave Clarity On Puneet Raj Kumar Biopic - Sakshi

Director Santhosh Gave Clarity On Puneet Raj Kumar Biopic: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్  రాజ్‌ కుమార్‌ అంటే ఇప్పుడు తెలియనివారుండరు. పునీత్‌ మరణాంతరం ఆయన చేసిన గొప్పతనం అందరికీ తెలిసింది. అన్నిటికిమించి ఆయన చనిపోయాక సేవా కార్యక్రమాలు ఆగిపోకూడదని రూ. 8 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసిన మహానుభావుడు పునీత్‌ రాజ్‌ కుమార్‌. అలాంటి వ్యక్తిపై బయోపిక్‌ రానుంది. ఇంతకుముందు పునీత్ రాజ్ కుమార్‌ బయోపిక్‌ రానుందని కన్నడ నాట పుకార్లు వచ్చాయి. వీటిపై దర్శకకుడు సంతోష్ ఆనంద్‌ రామ్‌ స్పందించారు. పునీత్‌ మరణించిన తర్వాత ఒక అభిమాని ఆయనపై బయోపిక్ నిర్మించే ఆలోచన ఉందా అని ట‍్వీటర్‌లో ప్రశ్నించగా, 'బయోపిక్‌ తీయడానికి నా శాయశక్తుల ప్రయత్నిస్తాను' అని దర్శకుడు సంతోష్‌ తెలిపారు. 

చదవండి: పునీత్‌ రాజ్‌ కుమార్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌.. అప్పుకు అంకితంగా

చాలా మంది అభిమానులు పునీత్‌ బయోపిక్‌ రావాలనే ఆలోచనను స్వాగతించారు. ఆయన ఫ‍్యాన్స్‌ అతన్ని అప్పు అని పిలుస్తారు. ఒక అభిమాని 'అవును, నిజంగా చాలా గొప్ప ఆలోచన. దయచేసి మా ప్రియమైన అప్పు బయోపిక్‌తో రండి' అని ట‍్వీట్‌ చేశాడు. మరొకరు 'దయచేసి మా అప్పు సర్‌ బయోపిక్‌ తీయండి. ఆయన మంచితనాన్ని రేపటి తరానికి చాటుదాం. అప్పు ఈ ప్రపంచంలో మంచి గుర్తింపుతో చిరస్మణీయుడవుతాడు.' రాసుకొచ్చారు. ఈ బయోపిక్‌తో అప్పును మరోసారి బిగ్‌ స్క్రీన్‌పై చూసి తరిస్తాం. మీ దర్శకత్వంతో ఆయనకు ఉత్తమ నివాళి అవుతుంది.' అని ఇంకొకరు ట‍్వీట్‌ చేశారు. 

గతేడాది విడుదలై బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించిన యువరత్న చిత్రంతో పునీత్‌ రాజ్‌ కుమార్‌ చివరిసారిగా తెరపై కనిపించారు. దీనికి సంతోశ్‌ ఆనంద్‌ రామ్‌ దర్శకత్వం వహించారు. నాలుగేళ్ల క్రితం కూడా పునీత్‌ 'రాజకుమార' సినిమాను డైరెక్ట్‌ చేశారు సంతోష్‌. ఈ సినిమా కన‍్నడ ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాయడమే గాక రూ. 45 కోట్లు వసూలు చేసింది. అలాగే పునీత్ చివరిగా నటించిన కన్నడ చిత్రం 'జేమ్స్‌'. దీనికి ఒక యాక్షన్‌ సీక్వెన్స్‌, డబ్బింగ్‌ తప్ప మిగతా షూట్‌ అంతా పూర్తి చేశారు పునీత్‌ రాజ్‌ కుమార్‌. అయితే ఈ సినిమాను థియేటర్లలో విడదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు మూవీ మేకర్స్‌. 

చదవండి: పునీత్‌ రాజ్‌ కుమార్‌కు అరుదైన గౌరవం.. 'కర్ణాటక రత్న' అవార్డు ప్రదానం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement