హీరోయిన్‌గా పదిహేనేళ్ల విజయవంతమైన కెరీర్‌ని పూర్తి చేసుకుంటూ, ఇంకా అగ్రశ్రేణి హీరోయిన్ల జాబితాలో ఒకరిగా రాణిస్తుండటం అంటే అంత సులభమైన విషయం కాదు. ఈ లిస్ట్‌లో చాలా తక్కువమంది హీరోయిన్లు ఉంటారు. తాజాగా శ్రుతీహాసన్ పేరు ఈ లిస్ట్‌లో చేరింది. తండ్రి కమల్‌హాసన్ నటించిన ద్విభాషా (తమిళం, హిందీ) చిత్రం ‘హే రామ్’ (2000)లో చైల్డ్ ఆర్టిస్టుగా తొలిసారి స్క్రీన్‌పై కనిపించారు శ్రుతీహాసన్. చైల్డ్ ఆర్టిస్టుగా మరో సినిమా చేయలేదు కానీ.. ‘హే రామ్’ రిలీజైన తొమ్మిదేళ్లకు హిందీ చిత్రం ‘లక్’ (2009)తో కథానాయికగా కెరీర్‌ను ఆరంభించారు శ్రుతి.
ఆ తర్వాత సూర్య ‘సెవెన్త్ సెన్స్’, ధనుష్ ‘త్రీ’, రామ్‌చరణ్ ‘ఎవడు’, అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ రవితేజ ‘క్రాక్’ .. ఇటీవల చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, ప్రభాస్ ‘సలార్: సీజ్‌ఫైర్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు శ్రుతి. నటిగా–గాయనిగా–సంగీత దర్శకురాలిగా... ఇలా మల్టీ టాలెంట్‌తో దూసుకెళుతున్నారు శ్రుతీహాసన్. కథానాయికగా పదిహేనేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రుతీహాసన్ స్పందిస్తూ – ‘‘అప్పుడే పదిహేనేళ్లు పూర్తయ్యాయంటే నమ్మశక్యంగా లేదు.
నేను పెరిగిన మ్యాజికల్ ఇండస్ట్రీలోనే ఇంతకాలం నేను ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా మిగతా జీవితాన్ని కూడా ఇండస్ట్రీతోనే ముడివేస్తాను. ఇండస్ట్రీలో నాకు అందమైన పాఠాలు నేర్పినవారందరికీ ధన్యవాదాలు. అలాగే నన్ను ఆదరించిన ప్రేక్షకులు, నా అభిమానులకు థ్యాంక్స్. వీళ్లే లేకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదు’’ అన్నారు. రజనీకాంత్ ‘కూలీ’, ప్రభాస్ ‘సలార్: శౌర్యంగాపర్వం’, అడవి శేష్ ‘డెకాయిట్’ చిత్రాల్లో నటిస్తున్నారు శ్రుతీహాసన్.
Comments
Please login to add a commentAdd a comment