కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు, కథకుడు ఇలా.. పలు ముఖాలు కలిగిన నటుడు ధనుష్. అంతేకాదు బహుభాషా నటుడు. బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రేక్షకులకు సుపరిచితుడే. ప్రస్తుతం ఏక కాలంలో కథానాయకుడిగా మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. హిందీలో ఒకటి ద్విభాషా చిత్రం కుబేర. రెండోది ఇడ్లీ కడై. ఈ చిత్రానికి ధనుష్ దర్శకుడు కూడా. ఇక మూడో చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. గోపురం ఫిలిమ్స్ పతాకంపై అన్బు చెళియన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమరన్ చిత్రం ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు.
వీర సైనికుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్రతో ఈయన అమరన్ చిత్రాన్ని తెరకెక్కించిన ఘనత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ధనుష్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం గురించి ఆయన ఒక భేటీలో పేర్కొంటూ ఇది కూడా రియల్ హీరో కథా చిత్రంగానే ఉంటుందని తెలిపారు. సమాజంలో ఎందరో రియల్ లైఫ్ వీరులు, హీరోలు ఉన్నారన్నారు. వారిలో ఒకరి కథగా తమ చిత్రం ఉంటుందని చెప్పారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గురించి అప్‌డేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో నటి శృతిహాసన్ నాయకిగా నటించనున్నారన్నదే ఆ అప్‌డేట్.
ఇంతకు ముందే ధనుష్, శృతిహాసన్ 3 అనే చిత్రంలో నటించారు. దీంతో మరో సారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుందన్న మాట. ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న కూలీ చిత్రంలో నటిస్తున్న శృతిహాసన్ తదుపరి ధనుష్ తో జత కట్టనున్నారన్న మాట. కాగా రాయన్ చిత్రం తర్వాత ధనుష్ దర్శకత్వం వహించిన చిత్రం నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో తెరపైకి తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment