![Shruti Haasan Upcoming Movie With Big Star](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/shruti-haasan.jpg.webp?itok=84NfafqR)
డేరింగ్ హీరోయిన్ శ్రుతి హాసన్‌కు కోలీవుడ్‌లో మరో క్రేజీ అవకాశం వచ్చి నట్లు తాజా సమాచారం. సలార్ తరువాత ఈ భామ నటించిన మరో చిత్రం తెరపైకి రాలేదు. అయితే ప్రస్తుతం ఈమె ఆ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ది ఐ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ చిత్రంలో శృతిహాసన్ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు.
తాజాగా నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న ఆయన 69వ చిత్రం జననాయకన్ లో నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే నటి పూజాహెగ్డే కథానాయకిగా నటిస్తున్న ఇందులో మలయాళ బ్యూటీ మమిత బైజూ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబి డియోల్, దర్శకుడు గౌతమ్ మీనన్, నటి ప్రియమణి ,ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి హెచ్ వినోద్ కుమార్, అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎం పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/1_445.jpg)
ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో శృతిహాసన్ నటించబోతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదే గనుక నిజమైతే జననాయకన్ చిత్రానికి మరింత హైప్ వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కాగా నటి శృతిహాసన్ విజయ్‌కి జంటగా ఇంతకుముందు పులి చిత్రంలో నటించారన్నది తెలిసిందే. కాగా తాజాగా మరోసారి విజయ్‌తో కలిసి జననాయకన్ చిత్రంలో నటించే విషయంపై అధికార పూర్వక ప్రకటన వెలువడ లేదన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment