కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) కొత్త సినిమా టైటిల్‌ను తాజాగా మేకర్స్ రివీల్ చేశారు. 'దళపతి 69' అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి జన నాయగన్ (జన నాయకుడు) టైటిల్ ఫిక్స్ చేశారు. ఈమేరకు ఒక పోస్టర్‌ను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ మూవీని హెచ్.వినోద్ దర్శకత్వం వహించనున్నారు. సంగీత దర్శకుడిగా అనిరుధ్(Anirudh Ravichander) వ్యవహరించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్‌పై ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించారు.
దళపతి విజయ్ చేస్తున్న చివరి సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. జన నాయగన్(Jana Nayagan) అనే టైటిల్ ప్రకటించడంతో విజయ్ అభిమానులు సంతోషిస్తున్నారు. ఆయన రాజకీయ భవిష్యత్‌కు ఉపయోగపడేలా చిత్రం రానున్నడంతో అందరూ సంతోషిస్తున్నారు. టైటిల్ పోస్టర్‌లో విజయ్ ఎంతో స్మార్ట్‌గా కనిపిస్తున్నారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ పోస్టర్‌లోని సెల్ఫీకి, ఆ టైటిల్‌కి న్యాయం చేసినట్టుగా కనిపిప్తోంది. ఈ చిత్రంతోనే ఆయన సినీ జర్నీ ముగుస్తుంది. దీంతో అభిమానులు ఈ సినిమాను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకునేలా ఉండనుంది.
ఇక ఈ మూవీ టైటిల్ అర్థం అందరికీ తెలిసిందే. జన నాయకుడు.. పీపుల్స్ లీడర్.. ప్రజా నాయకుడు అని అర్థం వస్తుంది. ఇన్నేళ్లలో విజయ్ చేసిన సేవా కార్యక్రమాలు, సినీ పరిశ్రమలో సాధించిన విజయాలకు చిహ్నంగా ఈ టైటిల్ ఉంది. ఈ చిత్రంతో అనిరుధ్ మరోసారి తన సంగీతంతో విజయ్ అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకు సిద్దంగా ఉన్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు.
విజయ్ గత కొంతకాలంగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 'తమిళగ వెట్రి కళగం' అనే పార్టీని ఆయన స్థాపించారు. ఈ క్రమంలోనే ఆయన సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ది టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీగా విజయ్ రాజకీయ జీవితం ఉంటుందని అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ ఉంటుందని దర్శకుడు ఇప్పటికే చెప్పారు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment