H Vinoth
-
మరో ఛాన్స్ ఇస్తానని దర్శకుడు మాటిచ్చాడు: మంజు వారియర్
మలయాళ భామ మంజు వారియర్‌కు కోలీవుడ్‌లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయనే చెప్పాలి. మాతృభాషలో అగ్ర కథానాయకిగా రాణిస్తున్న ఈ బ్యూటీ ధనుష్ భార్యగా అసురన్ చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది ఆ తర్వాత అజిత్ సరసన తుణివు (తెగింపు) చిత్రంలో యాక్షన్ హీరోయిన్గా నటించారు. అది మంచి విజయాన్ని సాధించింది. తాజాగా రజనీకాంత్ సరసన వేట్టైయాన్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. కాగా ఇందులో రజనీకాంత్‌తో కలిసి 'మనసిలాయో' అనే కలర్ ఫుల్ సాంగ్‌లో అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ క్రమంలో తాజాగా నటుడు విజయ్ సరసన నటించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో అవుతోంది. రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్ చివరిగా తన 69వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కెవిఎన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. అక్టోబర్ నెలలో ఈ చిత్రం సెట్ పైకి వెళ్లనుంది. ఇది నటుడు విజయ్ రాజకీయ భవిష్యత్తుకు దోహదపడే విధంగా ఎంటర్టైన్మెంట్ అంశాలతో పాటు రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇకపోతే ఇందులో నటించే హీరోయిన్ ఎవరన్న విషయంలో పెద్ద చర్చే జరుగుతోంది. నటీమణుల లిస్ట్ పెరుగుతోంది. ముఖ్యంగా నటి సమంత, శ్రీలీల, సిమ్రాన్, పూజా హెగ్డే పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా నటి మంజు వారియర్ పేరు వెలుగులోకి వచ్చింది. తుణివు చిత్రంలో నటిస్తున్నప్పుడే దర్శకుడు హెచ్ వినోద్ తనకు మరో చిత్రంలో అవకాశం కల్పిస్తానని చెప్పినట్లు నటి మంజు వారియర్ ఇటీవల ఓ భేటీలో పేర్కొన్నారు. దీంతో ఆమె విజయ్ సరసన నటించటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాల్సిందే. -
రాజకీయాలకు ఉపయోగపడేలా విజయ్ చివరి సినిమా
తమిళ స్టార్ హీరో విజయ్ చివరి సినిమా ఖరారైపోయింది. పలు సినిమాలు తీసిన దర్శకుడు హెచ్.వినోద్‌కి ఈ మూవీ తీసే అవకాశం దక్కింది. రాక్ స్టార్ అనిరుధ్ సంగీత దర్శకుడు. కన్నడలో బోలెడన్ని మూవీస్ తీసిన కేవీఎన్ ప్రొడక్షన్స్.. దీన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించబోతుంది. వచ్చే ఏడాది అక్టోబరులో రిలీజ్ ఉంటుందని ప్రకటించారు.(ఇదీ చదవండి: చావు బతుకుల్లో ఉన్న వీరాభిమానికి ఎన్టీఆర్ వీడియో కాల్)ఇప్పటివరకు ఎక్కువగా కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూ వచ్చిన విజయ్.. తన చివరి చిత్రాన్ని మాత్రం పూర్తిగా తన రాజకీయ జీవితానికి పనికొచ్చేలా తీయబోతున్నాడు. అధికారికంగా ప్రకటించిన పోస్టర్ బట్టి చూస్తే.. అగ్నితో వెలుగుతున్న కాగడ పట్టుకుని ఓ చేయి, పైన 'ద టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ' అనే వాక్యం కనిపించింది.2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. 2025 అక్టోబరులో ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించారు. అంటే విజయ్ పొలిటికల్ కెరీర్‌కి ఈ సినిమా ఎంతో కొంత ఉపయోగపడటం గ్యారంటీ. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఏంటనేది తెలియాలంటే మాత్రం మరికొన్నాళ్లు వెయిటింగ్ తప్పదు!(ఇదీ చదవండి: హీరో రజనీకాంత్ షూటింగ్ లో అగ్ని ప్రమాదం)We are beyond proud & excited to announce that our first Tamil film is #Thalapathy69, directed by the visionary #HVinoth, with music by the sensational Rockstar @anirudhofficial 🔥Super happy to collaborate with the one and only #Thalapathy @actorvijay ♥️The torch bearer of… pic.twitter.com/Q2lEq7Lhfa— KVN Productions (@KvnProductions) September 14, 2024 -
విజయ్ చివరి సినిమాపై బిగ్ అనౌన్స్మెంట్కు అంతా రెడీ
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజాగా నటించిన సినిమా ది గోట్ థియేటర్స్‌లో సందడి చేస్తుంది. ఈ క్రమంలో తన 69వ సినిమాపై సెప్టెంబర్ 13న కీలక సమాచారం రానుంది. ఈ చిత్రం అనంతరం సినిమాలకు ఆయన గుడ్‌బై చెప్పనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ బిగ్ ప్రాజెక్ట్ఫై అభిమానుల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ చివరి సినిమాకు తానే దర్శకత్వం వహిస్తున్నట్లు అధికారికంగా డైరెక్టర్ హెచ్.వినోద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘దళపతి 69’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఒక పోస్టర్‌ను కూడా ఆయన పంచుకున్నారు.ఈ ఏడాది ప్రారంభంలో 'తమిళగ వెట్రి కళగం' అనే రాజకీయ పార్టీని విజయ్ ప్రారంభించారు. ఎన్నికల కమిషన్ నుంచి కూడా పార్టీకి గుర్తింపు దక్కింది. 2026 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. దీంతో సినిమాలకు ఆయన గుడ్‌బై చెప్పనున్నారు. తాను రాజకీయ పార్టీని ప్రారంభించినందున ఇకపై సినిమాల్లో నటించనని, ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న సినిమాలను ముగించి ఫుల్ టైమ్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు విజయ్ ప్రకటించిన విషయం తెలసిందే. దీంతో ఆయన చివరి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఇదీ చదవండి: ఓటీటీలో అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్సెప్టెంబర్ 13 సాయింత్రం 5గంటలకు మీడియా సమావేశంతో పాటు విజయ్ 69వ సినిమా పూజా కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. అక్టోబర్ నుంచి షూటింగ్ పనులను వేగవంతం చేయనున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో పాటు విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నట్లు తెలుస్తోంది. అలాగే సమంత, మమితా బైజు హీరోయిన్లుగా కనిపించనున్నారని సమాచారం. విజయ్ చివరి సినిమా కోసం అనిరుధ్ సంగీతం అందించనున్నారు. -
విజయ్‌కి జోడిగా సమంత.. నాలుగో సారి!
‘కత్తి’ (2014), ‘తేరీ’ (2016), ‘మెర్సల్’ (2017) చిత్రాల తర్వాత హీరో విజయ్–హీరోయిన్ సమంత మళ్లీ జోడీగా కనిపించే అవకాశం ఉందని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం విదితమే. ఈ సినిమాలో హీరోయిన్గా ఇప్పటికే మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే వంటి తారల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా సమంత పేరు వినిపిస్తోంది. ఇటీవల సమంతకు హెచ్. వినోద్ ఈ సినిమా స్టోరీ లైన్ చెప్పారట. కథ, ఇందులోని పాత్ర నచ్చడంతో సమంత ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నారు. సో.. విజయ్ నటించే చివరి సినిమా ఇదే అవుతుంది. ఆల్రెడీ విజయ్‌తో మూడు సినిమాలు చేసిన సమంత ఆయన చివరి సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తారా? విజయ్– సమంతల జోడీ నాలుగోసారి రిపీట్ అవుతుందా అనే ప్రశ్నకు సమాధానం కొన్ని రోజుల్లో తెలిసి పోతుంది. -
ఆ ఇద్దరిలో మణిరత్నం వైపే ఆసక్తి చూపిన కమల్‌హాసన్
కమల్‌హాసన్ హీరోగా తన 233వ చిత్రాన్ని హెచ్ వినోద్ దర్శకత్వంలో చేస్తున్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తన రాజమ్మ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై కమలహాసన్ నిర్మించడానికి సన్నాహాలు చేశారు. హెచ్. వినోద్ కథను కూడా సిద్ధం చేశారు. ఇది వ్యవసాయం నేపథ్యంలో సాగే చక్కని సందేశాత్మక కథా చిత్రంగా ఉంటుందని తెలిసింది. ఈ చిత్ర కథపై కమలహాసన్ హెచ్ వినోద్ చాలాకాలం పని చేశారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరిగినట్లు సమాచారం. దీని తరువాత కమలహాసన్ తన 234వ చిత్రాన్ని మణిరత్నం దర్శకత్వం చేయనున్నట్లు ప్రచారం జరిగింది. కాగా హెచ్. వినోద్ దర్శకత్వంలో కమల్ నటించే చిత్రం విషయంలో ఏం జరిగిందో తెలియదు గానీ, ప్రస్తుతం కమల్‌హాసన్ మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ చిత్రాన్ని చేయడానికి సిద్ధం అవుతున్నారు. దీంతో ఈయన వినోద్ దర్శకత్వంలో నటించే చిత్రం డ్రాప్ అయిందనే ప్రచారం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంపై కమల్హాసన్గానీ దర్శకుడు వినోద్ గానీ స్పందించలేదు. కాగా వీరి కాంబినేషన్లో తెరకెక్కనున్నట్లు చిత్రం తాజా సమాచారం. దీంతో వినోద్ ప్రస్తుతం నటుడు యోగిబాబు, ధనుష్‌తో చిత్రాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఖాకీ, తెగింపు, వలిమై చిత్రాలతో హెచ్ వినోద్‌కు మంచి గుర్తింపు ఉంది. -
కార్తీ, కమల్ ప్రాజెక్ట్‌లను కాదని కమెడియన్‌తో సినిమా తీస్తున్న స్టార్ డైరెక్టర్
హిట్ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన దర్శకుడు హెచ్.వినోద్. అజిత్‌తో వలిమై,తెగింపు చిత్రాలతో పాటు బాలీవుడ్ హిట్ సినిమా అయిన పింక్ చిత్రాన్ని కూడా తమిళ్లో వినోద్ డైరెక్ట్ చేశాడు. కార్తీతో ఖాకీ చిత్రాన్ని తీసి టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన తదుపరి ప్రాజెక్ట్ కమలహాసన్ కథానాయకుడిగా రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఓ చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. దీనికి సంబంధించిన కథా చర్చలు జరిగాయి. ఇది వ్యవసాయ నేపథ్యంలో రూపొందనుందనే ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఈ చిత్రం తెరకెక్కించడానికి మరింత సమయం పట్టనుందనే టాక్ వినిపిస్తోంది. కాగా ఇంతకు ముందు నటుడు కార్తీతో ఖాకీ చిత్రానికి సీక్వెల్ చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. కానీ ఆ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో నటుడు కార్తీ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. కమలహాసన్ హీరోగా చేసే చిత్రం కూడా వాయిదా పడడంతో హెచ్.వినోద్ మధ్యలో ఓ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఇందులో నటుడు యోగిబాబు హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇది రాజకీయ వ్యంగ్యాస్త్రాలతో వినోద భరిత కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
కమలహాసన్ 233వ చిత్రం టైటిల్ అదేనా?
తమిళసినిమా: విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన తన 233వ చిత్రాలు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. విక్రమ్ అంటే సంచలన విజయం సాధించిన చిత్రం తర్వాత ఆ చిత్ర కథానాయకుడు, నిర్మాత కమలహాసన్ చాలా బిజీగా మారిపోయారు. వరుసగా చిత్రాలు కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈయన శంకర్ నటిస్తున్న ఇండియన్ – 2 చిత్రాన్ని పూర్తి చేసి తెలుగులో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న కల్కి చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఈయన చాలా ప్రధాన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో బిగ్‌బాస్ రియాల్టీ షో సీజన్ 7 కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఆయన తన 233, 234 చిత్రాలకు కమిట్ అయ్యారు. కమలహాసన్ నటించిన 233వ చిత్రానికి హెచ్ .వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. 234 చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించరున్నారు. కాగా హెచ్.వినోద్ దర్శకత్వంలో నటించే చిత్రానికి కమలహాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. కాగా ఈ చిత్ర టైటిల్ గురించే ఇప్పుడు ఆసక్తికరమైన ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. కమల్ హాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మర్మయోగి చిత్ర టైటిల్‌ను ఈ చిత్రానికి పెట్టాలని దర్శకుడు హెచ్.వినోద్ భావిస్తున్నట్లు సమాచారం. కమలహాసన్ 2002లోనే మర్మయోగి పేరుతో ప్రతిష్టాత్మక కథా చిత్రాన్ని ప్రారంభించి కొంత భాగాన్ని చిత్రీకరించారు కూడా. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం పూర్తి కాలేదు. అదే టైటిల్ హెచ్ వినోద్ తాజాగా కమలహాసన్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రానికి పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి కమలహాసన్ అంగీకరిస్తారా..? లేదా..? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. -
KH233: కమల్ కొత్త సినిమా.. విక్రమ్‌కు మించేలా?
తమిళసినిమా: కొందరి నటులను చూస్తుంటే మనసు ఉరకలేస్తుంటే వయస్సుతో పనేముంది అని అనకుండా ఉండలేం. నటుడు కమలహాసన్, రజనీకాంత్ వంటి వారు ఈ కోవకే చెందుతారు. విశ్వనటుడు కమలహాసన్ ఇటీవల విక్రమ్ చిత్రంతో సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అదేవిధంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజాగా జైలర్ చిత్రంతో రికార్డులను బద్దలు కొట్టారు. వీరిద్దరూ తమ చిత్రాల్లో గన్లు చేతపట్టి శత్రువుల గుండెల్లో గుండ్ల వర్షం కురిపించారు. తాజాగా నటుడు కమలహాసన్ తన 233 చిత్రానికి సిద్ధమయ్యారు. ఆయన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కుమార్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు చతురంగం, ధీరన్ అధికారం ఒండ్రు, తుణివు బంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. కమలహాసన్ చేస్తున్న చిత్రం గురించి ఈయన చాలా పకడ్బందీగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను చేసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా కమలహాసన్‌తో కలిసి రైతుల గురించి వారి జీవన విధానం గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇది రైతుల ఇతివృత్తంతో కూడిన రాజకీయ కథాచిత్రంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వీడియోను గురువారం విడుదల చేశారు. అందులో ఒకపక్క భారీ బుల్లెట్ల దృశ్యం, వివిధ రకాల గన్లు, కమలహాసన్ తుపాకీ చేతబట్టి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఇది చూస్తుంటే కమలహాసన్ ఇంతకుముందు నటించిన విక్రమ్ చిత్రాన్ని మించే విధంగా ఈ తాజా చిత్రం ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీన్ని రూ.125 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు టాక్. కాగా ఇందులో నటించే ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలను ఇంకా వెల్లడించలేదు. అయితే ఇందులో మరోసారి విలన్‌గా విజయ్‌సేతుపతిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కథాచిత్రం సెట్‌పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. -
దర్శకుడికి కమల్ ఖరీదైన కానుక
నటుడు కమలహాసన్‌ను సినిమా సైక్లోపీడియా అంటారు. చిత్రంలో 24 క్రాప్ట్స్కు చెందిన ఏ అంశాన్ని అయినా తడమాడకుండా చెప్పే నటుడు ఈయన. ఇటీవల విక్రమ్ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కమలహాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఇండియన్–2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్ర విజయంపై ప్రేక్షకుల్లో ఎలాంటి సందేహాలు ఉండవని చెప్పవచ్చు. కాగా విక్రమ్ చిత్రం తరువాత కమలహాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై వరుసగా చిత్రాలను నిర్మించనున్నారు. ఆయన నటించే చిత్రాలతో పాటు ఇతర హీరోలతోనూ చిత్రాలు నిర్మించనున్నారు. కాగా ఇండియన్–2 చిత్రం తరువాత కమలహాసన్ దర్శకుడు హెచ్ వినోద్‌తో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. హెచ్ వినోద్ దర్శకత్వంలో ఇటీవల అజిత్ కథానాయకుడిగా తెరకెక్కించిన తుణివు చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈయన చెప్పిన కథ కమలహాసన్‌కు బాగా నచ్చిందని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. తాజాగా జరుగుతున్న ప్రచారం ఏమిటంటే కమలహాసన్ దర్శకుడు వినోద్‌కు చిత్రం ప్రారంభానికి ముందే అడ్వాన్సుగా ఒక ఖరీదైన కారును కానుకగా ఇచ్చారని సమాచారం. సాధారణంగా చిత్రం సక్సెస్ అయితే ఆ చిత్ర నిర్మాత దర్శకడికి ఏదో ఒక ఖరీదైన కానుకను ఇవ్వడం జరుగుతుంటుంది. అలాంటిది కమలహాసన్ చిత్రం ప్రారంభం కాకుండానే కారును కానుకగా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.