
నటుడు కమలహాసన్‌ను సినిమా సైక్లోపీడియా అంటారు. చిత్రంలో 24 క్రాప్ట్స్‌కు చెందిన ఏ అంశాన్ని అయినా తడమాడకుండా చెప్పే నటుడు ఈయన. ఇటీవల విక్రమ్ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కమలహాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఇండియన్–2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్ర విజయంపై ప్రేక్షకుల్లో ఎలాంటి సందేహాలు ఉండవని చెప్పవచ్చు.
కాగా విక్రమ్ చిత్రం తరువాత కమలహాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై వరుసగా చిత్రాలను నిర్మించనున్నారు. ఆయన నటించే చిత్రాలతో పాటు ఇతర హీరోలతోనూ చిత్రాలు నిర్మించనున్నారు. కాగా ఇండియన్–2 చిత్రం తరువాత కమలహాసన్ దర్శకుడు హెచ్ వినోద్‌తో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
హెచ్ వినోద్ దర్శకత్వంలో ఇటీవల అజిత్ కథానాయకుడిగా తెరకెక్కించిన తుణివు చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈయన చెప్పిన కథ కమలహాసన్‌కు బాగా నచ్చిందని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
తాజాగా జరుగుతున్న ప్రచారం ఏమిటంటే కమలహాసన్ దర్శకుడు వినోద్‌కు చిత్రం ప్రారంభానికి ముందే అడ్వాన్సుగా ఒక ఖరీదైన కారును కానుకగా ఇచ్చారని సమాచారం. సాధారణంగా చిత్రం సక్సెస్ అయితే ఆ చిత్ర నిర్మాత దర్శకడికి ఏదో ఒక ఖరీదైన కానుకను ఇవ్వడం జరుగుతుంటుంది. అలాంటిది కమలహాసన్ చిత్రం ప్రారంభం కాకుండానే కారును కానుకగా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment