మరో ఛాన్స్‌ ఇస్తానని దర్శకుడు మాటిచ్చాడు: మంజు వారియర్‌ | Manju Warrier Movie Chance With Vijay | Sakshi
Sakshi News home page

మరో ఛాన్స్‌ ఇస్తానని దర్శకుడు మాటిచ్చాడు: మంజు వారియర్‌

Published Mon, Sep 30 2024 3:14 PM | Last Updated on Mon, Sep 30 2024 3:26 PM

Manju Warrier Movie Chance With Vijay
  • విజయ్‌ చివరి సినిమాలో మంజు వారియర్‌కు ఛాన్స్‌

మలయాళ భామ మంజు వారియర్‌కు కోలీవుడ్‌లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయనే చెప్పాలి. మాతృభాషలో అగ్ర కథానాయకిగా రాణిస్తున్న ఈ బ్యూటీ   ధనుష్‌ భార్యగా అసురన్‌ చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది ఆ తర్వాత అజిత్‌ సరసన తుణివు (తెగింపు) చిత్రంలో యాక్షన్‌ హీరోయిన్‌గా నటించారు. అది మంచి విజయాన్ని సాధించింది. తాజాగా రజనీకాంత్‌ సరసన వేట్టైయాన్‌ చిత్రంలో నటించారు. ఈ చిత్రం అక్టోబర్‌ 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. కాగా ఇందులో రజనీకాంత్‌తో కలిసి 'మనసిలాయో' అనే  కలర్‌ ఫుల్‌ సాంగ్‌లో అదిరిపోయే స్టెప్పులు వేశారు. 

ఈ క్రమంలో  తాజాగా నటుడు విజయ్‌ సరసన నటించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో అవుతోంది. రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్‌ చివరిగా తన 69వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కెవిఎన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. అక్టోబర్‌ నెలలో ఈ చిత్రం సెట్‌ పైకి వెళ్లనుంది. ఇది నటుడు విజయ్‌ రాజకీయ భవిష్యత్తుకు దోహదపడే విధంగా ఎంటర్‌టైన్మెంట్‌ అంశాలతో పాటు రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. 

ఇకపోతే ఇందులో నటించే హీరోయిన్‌ ఎవరన్న విషయంలో పెద్ద చర్చే జరుగుతోంది. నటీమణుల లిస్ట్‌ పెరుగుతోంది. ముఖ్యంగా నటి సమంత, శ్రీలీల, సిమ్రాన్, పూజా హెగ్డే పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా నటి మంజు వారియర్‌ పేరు వెలుగులోకి వచ్చింది. తుణివు చిత్రంలో నటిస్తున్నప్పుడే దర్శకుడు హెచ్‌ వినోద్‌ తనకు మరో చిత్రంలో అవకాశం కల్పిస్తానని చెప్పినట్లు నటి మంజు వారియర్‌ ఇటీవల ఓ భేటీలో పేర్కొన్నారు. దీంతో ఆమె విజయ్‌ సరసన నటించటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాల్సిందే.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement