విజయ్‌ చివరి సినిమాపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ | Vijay 69th Movie Announcement | Sakshi
Sakshi News home page

విజయ్‌ చివరి సినిమాపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ

Published Fri, Sep 13 2024 2:44 PM | Last Updated on Fri, Sep 13 2024 3:49 PM

Vijay 69th Movie Announcement

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ తాజాగా నటించిన సినిమా ది గోట్‌ థియేటర్స్‌లో సందడి చేస్తుంది. ఈ క్రమంలో తన  69వ సినిమాపై  సెప్టెంబర్‌ 13న కీలక సమాచారం రానుంది. ఈ చిత్రం అనంతరం సినిమాలకు ఆయన గుడ్‌బై చెప్పనున్న విషయం తెలిసిందే. దీంతో  ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌ఫై అభిమానుల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్‌ చివరి సినిమాకు తానే దర్శకత్వం వహిస్తున్నట్లు అధికారికంగా డైరెక్టర్‌ హెచ్‌.వినోద్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘దళపతి 69’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఒక పోస్టర్‌ను కూడా ఆయన పంచుకున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో  'తమిళగ వెట్రి కళగం' అనే రాజకీయ పార్టీని విజయ్‌ ప్రారంభించారు. ఎన్నికల కమిషన్‌ నుంచి కూడా పార్టీకి గుర్తింపు దక్కింది. 2026 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. దీంతో సినిమాలకు ఆయన గుడ్‌బై చెప్పనున్నారు. తాను రాజకీయ పార్టీని ప్రారంభించినందున ఇకపై సినిమాల్లో నటించనని, ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న సినిమాలను ముగించి ఫుల్ టైమ్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు విజయ్‌ ప్రకటించిన విషయం తెలసిందే. దీంతో ఆయన చివరి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇదీ చదవండి:   ఓటీటీలో అడ్వెంచర్ థ్రిల్లర్‌ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌

సెప్టెంబర్‌ 13 సాయింత్రం 5గంటలకు మీడియా సమావేశంతో పాటు విజయ్‌ 69వ సినిమా పూజా కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. అక్టోబర్‌ నుంచి షూటింగ్‌ పనులను వేగవంతం చేయనున్నారు. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌తో పాటు విజయ్‌ సేతుపతి ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నట్లు తెలుస్తోంది. అలాగే సమంత, మమితా బైజు హీరోయిన్లుగా కనిపించనున్నారని సమాచారం. విజయ్‌ చివరి సినిమా కోసం అనిరుధ్‌ సంగీతం అందించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement