
తమిళసినిమా: కొందరి నటులను చూస్తుంటే మనసు ఉరకలేస్తుంటే వయస్సుతో పనేముంది అని అనకుండా ఉండలేం. నటుడు కమలహాసన్, రజనీకాంత్ వంటి వారు ఈ కోవకే చెందుతారు. విశ్వనటుడు కమలహాసన్ ఇటీవల విక్రమ్ చిత్రంతో సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అదేవిధంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజాగా జైలర్ చిత్రంతో రికార్డులను బద్దలు కొట్టారు. వీరిద్దరూ తమ చిత్రాల్లో గన్లు చేతపట్టి శత్రువుల గుండెల్లో గుండ్ల వర్షం కురిపించారు. తాజాగా నటుడు కమలహాసన్ తన 233 చిత్రానికి సిద్ధమయ్యారు. ఆయన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కుమార్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈయన ఇంతకుముందు చతురంగం, ధీరన్ అధికారం ఒండ్రు, తుణివు బంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. కమలహాసన్ చేస్తున్న చిత్రం గురించి ఈయన చాలా పకడ్బందీగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను చేసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా కమలహాసన్‌తో కలిసి రైతుల గురించి వారి జీవన విధానం గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇది రైతుల ఇతివృత్తంతో కూడిన రాజకీయ కథాచిత్రంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వీడియోను గురువారం విడుదల చేశారు.
అందులో ఒకపక్క భారీ బుల్లెట్ల దృశ్యం, వివిధ రకాల గన్లు, కమలహాసన్ తుపాకీ చేతబట్టి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఇది చూస్తుంటే కమలహాసన్ ఇంతకుముందు నటించిన విక్రమ్ చిత్రాన్ని మించే విధంగా ఈ తాజా చిత్రం ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీన్ని రూ.125 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు టాక్.
కాగా ఇందులో నటించే ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలను ఇంకా వెల్లడించలేదు. అయితే ఇందులో మరోసారి విలన్‌గా విజయ్‌సేతుపతిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథాచిత్రం సెట్‌పైకి వెళ్లనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment