Vikram Movie
-
ఎల్‌సీయూపై లోకేశ్ కనగరాజ్ ప్రకటన
కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు కూడా అభిమానులు ఉన్నారు. త్వరలో రజనీకాంత్ 'కూలీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటి వరకు ఆయన డైరెక్ట్ చేసిన ఖైదీ, విక్రమ్, లియో తదితర సినిమాలు టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. సరికొత్త కథలకు గత చిత్రాల్లోని పాత్రలను ముడిపెడుతూ 'సినిమాటిక్ యూనివర్స్' (LCU) అనే కాన్సెప్ట్‌తో విజయాలను అందుకున్నారు.కూలీ సినిమా గురించి లోకేశ్ కనగరాజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ చిత్రం సినిమాటిక్ యూనివర్స్ (ఎల్సీయూ)లో భాగం కాదన్నారు. కానీ, కూలీ సినిమా తర్వాత అదిరిపోయే ప్రాజెక్ట్ రానుందని ఆయన ప్రకటించారు. సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగమైన స్టార్ హీరోలందరితో ఒక భారీ ప్రాజెక్ట్ ఉంటుందని రివీల్ చేశారు.ప్రస్తుతం కూలీ సినిమా షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చామని లోకేశ్ చెప్పారు. రజనీకాంత్‌కు ఇటీవల సర్జరీ జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 16 నుంచి తలైవా సెట్స్‌లో ఎంట్రీ ఇస్తారని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు తాను తీసిన సినిమాలన్నీ కూడా కేవలం ఆరు నెలల్లోనే పూర్తిచేశానని, ఇప్పుడు కూలీ చిత్రాన్ని ఈ సమయంలోపే ముగిస్తానని ఆయన పేర్కొన్నారు.సినిమాటిక్ యూనివర్స్ (LCU) ప్లాన్ ఇదేలోకేశ్ కనగరాజ్ రాబోయే సినిమాల గురించి కూడా మాట్లాడారు. రాబోయే ఐదేళ్లపాటు తన సినిమాల్లో బ్లడ్,గన్స్,డ్రగ్స్ ఉంటాయని చెప్పారు. ఆ తర్వాతే మరో భిన్నమైన సినిమాలు తీస్తానన్నారు. ఈ క్రమంలోనే ఖైదీ, విక్రమ్, లియోతో సినిమాటిక్ యూనివర్స్ కథ ప్రారంభమైందన్నారు. విక్రమ్ సినిమాలో రోలెక్స్ అనే కీలకమైన పాత్ర ఉందని రివీల్ చేశారు. దానిని దృష్టిలో ఉంచుకునే ఈ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. రజనీతో కూలీ సినిమా పూర్తి చేసిన వెంటనే LCUలో భాగమైన హీరోలందరితో ఈ భారీ ప్రాజెక్ట్ ప్రారంభమౌతుంది. అంటే ఖైదీ, విక్రమ్, లియో ఈ మూడు సినిమాలను లింక్ చేస్తూ ఈ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఉండనుంది. అయితే, 'లియో2' కోసం విజయ్ ఒప్పుకుంటే 'పార్తిబన్' పేరుతో తెరకెక్కిస్తానని లోకేశ్ కనగరాజ్ చెప్పారు. -
బిగ్ బాస్: బాత్రూంలో లేడీ కంటెస్టెట్స్ రచ్చ.. పురుషులు నచ్చరంటూ..
కోలీవుడ్‌లో బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయింది. ఇప్పటికే సుమారు 40 రోజులు దాటింది. అక్కడ కమల్ హాసన్ హోస్ట్‌గా ఉన్నారు. ఈ సీజన్లో కమల్ విక్రమ్ సినిమాలో సౌండ్ బోట్ బ్యూటీగా గుర్తింపు పొందిన మాయ కూడా కంటెస్టెంట్‌గా ఉంది. హౌస్‌లో ఆమె ఆటతీరుపై పలు విమర్శలు వచ్చినా గేమ్స్‌లలో బలంగా పోటీపడుతుంది. తాజాగా మాయపై సింగర్ సుచిత్ర వైరల్ కామెంట్ చేసింది. మాయ ఒక లెస్బియన్ అని పేర్కొంది. దీనికి ప్రధాన కారణం బిగ్ బాస్ హౌస్‌లో మహిళా కంటెస్టెంట్‌తో కలిసి అదే బాత్రూంలోకి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. ఈ వారం బిగ్‌బాస్ హౌస్ కెప్టెన్‌గా ఉన్న మాయ మరో కంటెస్టెంట్ అయిన ఐషుతో కలిసి బాత్రూంలోకి వెళ్లింది. ఆ సన్నివేశాలు విడుదలయ్యాయి. బిగ్ బాస్ నిబంధనల ప్రకారం చర్చ సమయంలో పోటీదారులు తప్పనిసరిగా మైక్ ఆన్‌లో ఉంచాలి. మీరు బాత్రూమ్కి వెళ్లినప్పుడు మాత్రమే మైక్ తీయగలరు. దీనిని వారు అడ్వాంటేజ్ తీసుకున్నారు. మైక్ తీసి ఒకే బాత్రూంలోకి వెళ్లి ఏదో మాట్లాడుకోవడానికి దీన్ని ఉపయోగించినట్లు కనిపిస్తోంది. కానీ బాత్రూమ్లోకి ఒకరు మాత్రమే వెళ్లాలి అనే రూల్ కూడా ఉంది. 'ఆమెకు పురుషులు అంటే ఇష్టం ఉండదు' ఇదే విషయం గురించి తమిళ నటుడు రంగనాథన్ సాకింగ్ సమాచారం ఇచ్చాడు.. హౌస్‌లో మాయ మాత్రమే కాదు, తమిళ సినిమాలో చాలా మంది లెస్బియన్స్ ఉన్నారని ఆయన కామెంట్ చేశారు. బిగ్ బాస్ హౌస్‌లో మాయ, పూర్ణిమ మరింత దగ్గరవుతున్నారని ఆయన తెలిపారు. ఆమె పూర్ణిమపై ప్రేమను కలిగి ఉన్నట్లు సందేహాలు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. ఆమె (మాయ) ఒక లెస్బియన్ అని ఇద్దరు ముగ్గురు నటీమణులు నాకు చెప్పారు. మాయ ట్రాన్స్‌జెండర్ కాకపోవడంతో ట్రాన్స్‌జెండర్ లిస్ట్‌లోనే ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించింది. అందుకే ఆమెను ఎంపిక చేశారు. హౌస్‌లో మాయ చేస్తున్న పనులు, అలవాట్లున్నీ లెస్బియన్ మాదిరే ఉంటున్నాయి. వారు పురుషులను అస్సలు ఇష్టపడరు. సినిమాల్లో కూడా చాలా మంది లెస్బియన్స్ ఉన్నారు. కానీ, ఈ విషయం బయటకి తెలిస్తే పరువు పోతుందని దాస్తున్నారు. అని ఆయన పేర్కొన్నారు. నాతో రిలేషన్ పెట్టుకుంది: అనన్య మాయా కృష్ణన్ తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకి పాల్పడినట్లు కోలివుడ్ నటి అనన్య రామ్ ప్రసాద్ గతంలో ఆరోపించింది. ''నటి మాయ కృష్ణన్ నా జీవితాన్ని సర్వ నాశనం చేసింది. ఆమె కారణంగా నా కుటుంబానికి, స్నేహితులకి దూరమయ్యాను. ఆమె వలన లైంగిక వేధింపులు ఎదుర్కోవడంతో మానసికంగా కృంగిపోయాను. నన్ను వేధించింది ఒక మగాడు అయి ఉంటే ఈ విషయం చెప్పడానికి ఇంతగా ఇబ్బంది పడేదాన్ని కాదు. కానీ ఓ మహిళ కారణంగా చేదు అనుభవాలు ఎదుర్కొన్నాను. 2016 లో నాకు మాయ కృష్ణన్ తో పరిచయం ఏర్పడింది. నాకు 18 ఏళ్ల వయసున్నప్పుడు ఆమెకి 25.. ఆ సమయంలో నన్ను లొంగదీసుకొని నాతో శారీరక సంబంధం పెట్టుకుంది. ఈ ఆరోపణపై మాయ కూడా అప్పట్లో రియాక్ట్ అయింది. అనన్య చెబుతున్న దాంట్లో నిజం లేదని .. కావాలనే తనపై కక్షగట్టి ఇలాంటి ఆరోపణలు చేస్తుందని పేర్కొంది. Dear @ikamalhaasan FY kind attn.#Maya & #Aishu removed their mic and spoke some secret in the toilet. That’s a serious violation. #BiggBossTamil7 #BiggBossTamil pic.twitter.com/V2xVUh8iN5 — Raja 🖤 (@whynotraja) November 10, 2023 -
Kamal Haasan Rare Photos: కమల్ హాసన్ మీరు ఎప్పుడు చూడని ఫోటోలు..
-
రెండేళ్ల తర్వాతే సినిమా ప్రారంభం
-
బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సౌండ్ బోట్ బ్యూటీ
కోలీవుడ్‌లో బిగ్ బాస్ ఏడవ సీజన్ తాజగా ప్రారంభమైంది. తెలుగులో నాగార్జున హోస్ట్ చేస్తుండగా తమిళ్లో గ్లోబల్ హీరో కమల్ హాసన్ లీడ్ చేస్తున్నారు. బిగ్‌బాస్‌లోకి 'మాయా కృష్ణన్' 12వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. విక్రమ్ సినిమాలో తన సౌండ్ బోట్‌తో అభిమానులను ఉర్రూతలూగించిన నటి మాయ కృష్ణన్. దీంతో ఆమె ఇండియా మెత్తం పాపులర్ అయింది. వనవిల్ జీవన్, రజనీకాంత్ 2.ఓ, మకళిర్ గహను, సైరిగి, విక్రమ్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో ఆమె నటించింది. విక్రమ్ సినిమాలో కాల్ గర్ల్ క్యారెక్టర్ చేసిన తర్వాత ఆ...హమ్‌తో క్రేజీ గుర్తింపు తెచ్చుకుంది. స్టేజీపైన హీరో కమల్ హాసన్‌ను చూడగానే ఆమె ఒక్కసారిగా కౌగిలించుకుంది. తన స్వస్థలం మధురై. చిన్నప్పటి నుంచి సినిమాల్లో ఛాన్స్‌లు సంపాదించాలనే తపనతో చెన్నైలో స్థిరపడినట్లు తెలిపింది. కానీ చాలా రోజుల వరకు తనకు ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో కనీసం ఉద్యోగం అయినా చేద్దామని ఎన్నో ఆఫీసుల చుట్టు తిరిగానని చెప్పుకొచ్చింది. విక్రమ్ సినిమాతో మంచి గుర్తింపు వచ్చాక ఇప్పుడు భారీగానే సినిమా అవకాశాలు వస్తున్నాయని ఆమె తెలిపింది. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఈ సౌండ్ బ్యూటీకి కమల్ సాయం చేశాడని టాక్ ఉంది. ఆయన సూచన మేరకే మాయా కృష్ణన్‌కు ఛాన్స్ వచ్చిందని ప్రచారం ఉంది. బిగ్‌బాస్‌లోకి వచ్చినందుకుగాను ఆమె ఒక వారానికి రూ.2.5 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ సినిమా సమయంలో కమల్ హాసన్‌తో పెద్దగా మాట్లాడే అవకాశం రాలేదని ఈ షో ద్వారా ఆయనతో ప్రతివారం మాట్లాడే అవకాశం ఉంటుందని మాయా తెలిపింది. బిగ్‌బాస్‌లో గట్టిపోటి ఇవ్వాలని ఆమెకు కమల్ సూచించాడు. (ఇదీ చదవండి: Rathika Bigg Boss 7: బయటకెళ్లిపోతేనేం.. 'బిగ్‌బాస్'తో బాగానే సంపాదించింది!) -
తమిళ్ సైమా విజేతలు వీరే.. బెస్ట్ హీరో, హీరోయిన్ ఎవరంటే?
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2023 తమిళం, మలయాళ సినిమాలలో తమ సత్తా చాటిన నటీనటులకు సెప్టెంబర్ 16న అవార్డులు ప్రదానం చేశారు. ఇప్పటికే తెలుగు,కన్నడ సినిమాలకు చెందిన అవార్డులు కార్యక్రమం పూర్తి అయిన విషయం తెలిసిందే. దీంతో సైమా అవార్డ్స్ 2023 వేడుక ముగిసింది. తమిళ్ నుంచి విక్రమ్ సినిమాకు గాను కమల్ హాసన్‌కు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఈ సారి త్రిష,అనిరుధ్, కీర్తి సురేష్, మణిరత్నం,మాధవన్ వంటి సూపర్ స్టార్స్‌కు అవార్డ్స్ దక్కాయి. తమిళ చిత్ర సీమలో సైమా విజేతలు.. వారి వివరాలు * ఉత్తమ చిత్రం (తమిళం): (పొన్నియిన్ సెల్వన్ - 1) * ఉత్తమ దర్శకుడు (తమిళం): లోకేష్ కనగరాజ్ (విక్రమ్) * ఉత్తమ నటుడు (తమిళం): కమల్ హాసన్ (విక్రమ్) * ఉత్తమ నటి (తమిళం): త్రిష కృష్ణన్ (పొన్నియిన్ సెల్వన్ -1) * ఉత్తమ నటుడు (క్రిటిక్స్): ఆర్ మాధవన్ (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్) * ఉత్తమ నటి (క్రిటిక్స్): కీర్తి సురేష్ (సాని కాయిదం) తెలుగులో చిన్ని * ఉత్తమ సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ (విక్రమ్) * ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్-1) * ఉత్తమ సహాయ నటి : వాసంతి (విక్రమ్) ఏజెంట్ టీనా * ఉత్తమ సహాయ నటుడు (తమిళం): కాళీ వెంకట్ (గార్గి) * ఉత్తమ విలన్: ఎస్.జె.సూర్య (డాన్) * ఉత్తమ హాస్యనటుడు: యోగి బాబు (లవ్ టుడే) * ఉత్తమ గాయకుడు : కమల్ హాసన్ (విక్రమ్) పాతాళ పాతాల * ఉత్తమ గేయ రచయిత: ఇళంగో కృష్ణన్ (పొన్నియిన్ సెల్వన్ - 1) * ఉత్తమ నూతన నిర్మాత : గౌతం రామచంద్రన్ (గార్గి) * ఉత్తమ నూతన దర్శకుడు: ఆర్ మాధవన్ (రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్) * ఉత్తమ నూతన నటుడు: ప్రదీప్ రంగనాథన్ (లవ్ టుడే) * ఉత్తమ నూతన నటి: అదితి శంకర్ (విరుమాన్) * ఎక్స్ట్రార్డినరీ అచీవ్మెంట్ అవార్డు : మణిరత్నం * ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ : తోట తరణి (పొన్నియిన్ సెల్వన్ - 1) (ఇదీ చదవండి: శ్రావణ భార్గవికి రెండో పెళ్లి.. హల్దీ ఫంక్షన్ ఫోటోలు వైరల్) -
KH233: కమల్ కొత్త సినిమా.. విక్రమ్‌కు మించేలా?
తమిళసినిమా: కొందరి నటులను చూస్తుంటే మనసు ఉరకలేస్తుంటే వయస్సుతో పనేముంది అని అనకుండా ఉండలేం. నటుడు కమలహాసన్, రజనీకాంత్ వంటి వారు ఈ కోవకే చెందుతారు. విశ్వనటుడు కమలహాసన్ ఇటీవల విక్రమ్ చిత్రంతో సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అదేవిధంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజాగా జైలర్ చిత్రంతో రికార్డులను బద్దలు కొట్టారు. వీరిద్దరూ తమ చిత్రాల్లో గన్లు చేతపట్టి శత్రువుల గుండెల్లో గుండ్ల వర్షం కురిపించారు. తాజాగా నటుడు కమలహాసన్ తన 233 చిత్రానికి సిద్ధమయ్యారు. ఆయన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కుమార్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు చతురంగం, ధీరన్ అధికారం ఒండ్రు, తుణివు బంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. కమలహాసన్ చేస్తున్న చిత్రం గురించి ఈయన చాలా పకడ్బందీగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను చేసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా కమలహాసన్‌తో కలిసి రైతుల గురించి వారి జీవన విధానం గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇది రైతుల ఇతివృత్తంతో కూడిన రాజకీయ కథాచిత్రంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వీడియోను గురువారం విడుదల చేశారు. అందులో ఒకపక్క భారీ బుల్లెట్ల దృశ్యం, వివిధ రకాల గన్లు, కమలహాసన్ తుపాకీ చేతబట్టి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఇది చూస్తుంటే కమలహాసన్ ఇంతకుముందు నటించిన విక్రమ్ చిత్రాన్ని మించే విధంగా ఈ తాజా చిత్రం ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీన్ని రూ.125 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు టాక్. కాగా ఇందులో నటించే ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలను ఇంకా వెల్లడించలేదు. అయితే ఇందులో మరోసారి విలన్‌గా విజయ్‌సేతుపతిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కథాచిత్రం సెట్‌పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. -
ప్రియురాలిని పరిచయం చేసిన ' జైలర్' ఫేమ్ జాఫర్ సాదిఖ్.. ఆమె ఎవరంటే
కోలీవుడ్ నటుడు జాఫర్ సాదిఖ్ పేరు జైలర్ సినిమాతో మరోసారి ట్రెండింగ్ అవుతుంది. లోకేష్ కనగరాజ్- కమల్ హాసస్ కాంబోలో వచ్చిన విక్రమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ రెండు సినిమాల్లో మరగుజ్జుగా ఆయన నటించిన తీరు అందరనీ ఆకట్టుకుంటుంది. తాజాగ ఆయన ప్రియురాలు 'సిద్ధికా షెరిన్'ను ఓ ఇంటర్వ్యూ ద్వారా తన అభిమానులకు పరిచయం చేశాడు. ఎక్కడ పరిచయం కోలీవుడ్‌లో విజయ్ టీవీలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ రియాలిటీ షోలలో జాఫర్ సాదిఖ్ పాల్గొనేవాడు. అదే టీవీలో ఆమె కింగ్స్ ఆఫ్ డ్యాన్స్, జోడి నంబర్ 1, ఉంజాలిల్ యార్ ప్రభుదేవా-2 వంటి డ్యాన్స్ షోలలో సిద్ధిక పోటీదారురాలిగా కనిపించింది. మొదట ప్రకాశ్‌రాజ్-సాయిపల్లవి కాంబినేషన్లో వచ్చిన పావ కథైగల్ అనే వెబ్ సీరిస్తో జాఫర్ సాదిఖ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీరిస్ నెట్‌ఫ్లిక్స్‌లో పలు విభాగాలుగా విడుదలైంది. అది చూసి లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాలో ఓ పాత్ర ఇచ్చి సినీ రంగానికి పరిచయం చేశారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి గ్యాంగ్‌లో ఒకరిగా జాఫర్ మాస్‌గా నటించాడు. విక్రమ్ సినిమా క్లైమాక్స్ సీన్లో కమల్ కాలు కోసే ప్రయత్నంలో జాఫర్ సాదిఖ్ కనిపిస్తాడు. ఈ సన్నివేశమే ఆతన్ని పాపులర్ చేసింది. మరోవైపు అతను కొరియోగ్రాఫర్‌గా కూడా బిజీగా ఉన్నాడు. అతను తన స్వంత డ్యాన్స్ స్టూడియోను కూడా నడుపుతున్నాడు. విక్రమ్ సినిమా తర్వాత అతనికి శింబుతో సినిమా ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత జైలర్ ఇలా వరుసగా ఆయనకు ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో కూడా జాఫర్ కొన్ని ప్రాజెక్ట్స్‌కు సైన్ చేశాడు. ఇలా సినిమాలతో బిజీగా ఉన్న జాఫర్ తన ప్రియురాలిని అభిమానులకు పరిచయం చేశాడు. జాఫర్ యొక్క ప్రత్యేక లక్షణం అతని పొట్టి పొట్టితనమే. కానీ అతని స్నేహితురాలు జాఫర్ కంటే పెద్దది, అందమైనది కూడా. వీరిద్దరూ స్టైలిష్‌గా పోజులిచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాఫర్ ప్రియురాలి పేరు సిద్ధిక అని వెల్లడించారు. ఆమె కోలీవుడ్‌లో మంచి డ్యాన్సర్‌గా రానిస్తుంది. పలు ప్రైవేట్ ఆల్బమ్స్లకు కొరియోగ్రాఫర్‌గా ఆమె వర్క్ చేస్తుంది. (ఇదీ చదవండి; ఆ పార్టీలో నాపై చెయి వేశాడు.. నిలదీస్తే బోరున ఏడ్చాడు: కస్తూరి) జాఫర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు మూడు మాత్రమే కానీ అతనికి అభిమానుల నుంచి మరింత మద్ధతు అందుతున్నందున మరెన్నో సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఆ ఆనందంలో తన ప్రియురాలు సిద్ధికను కూడా అభిమానులకు పరిచయం చేశాడు. ఈ వార్త చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నా తాజాగ ఆయన ప్రకటించాడు. ఇదిలా ఉంటే వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అనే సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by sidhiqa sherin (@sidhiqasherink) -
'జైలర్' కలెక్షన్స్.. రజనీ దెబ్బకు 'విక్రమ్' రికార్డ్ బ్రేక్
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ రావడం చూసి చాలా ఏళ్లయిపోయింది. 'రోబో' తర్వాత సినిమాలు చేస్తున్నారు. డబ్బులు ఓ మాదిరిగా వస్తున్నాయి. తాజాగా రిలీజైన 'జైలర్' మాత్రం ఇంతకు ముందెన్నడూ లేనంతగా బాక్సాఫీస్ దగ్గర రచ్చ రంభోలా చేస్తోంది. రజనీ దెబ్బకు ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నీ గల్లంతవుతున్నాయి. అన్ని కోట్ల వసూళ్లు ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన జైలర్ సినిమాకు తొలిరోజు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ.. రెండోరోజు నుంచి మాత్రం తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో హిట్ టాక్ వినిపించింది. మరోవైపు 'భోళా శంకర్' అంతగా ఆకట్టుకోలేకపోవడం రజనీ మూవీకి ఓ రేంజులో కలిసొచ్చింది. ఫలితంగా ఇప్పటివరకు అంటే ఆరు రోజుల్లో రూ.416 కోట్ల మేర గ్రాస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.40 కోట్ల వరకు వచ్చాయట. (ఇదీ చదవండి: 'జైలర్' కోడలు.. సినిమాలో పద్ధతిగా బయట మాత్రం!) 'విక్రమ్' రికార్డ్ బ్రేక్ అయితే గతేడాది కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమాకు లాంగ్ రన్ లో మొత్తంగా రూ.410 కోట్లు వచ్చాయి. కానీ రజనీ 'జైలర్' మాత్రం ఆ మార్క్ ని ఆరు రోజుల్లోనే దాటేయడం విశేషం. ఇప్పటివరకు తమిళ సినిమాలు సెట్ చేసిన రికార్ట్స్ బ్రేక్ చేసిన 'జైలర్'.. లాంగ్ రన్ లో ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తుందనేది చూడాలి. 'జైలర్'కి అదే ప్లస్ రజనీకాంత్ నటించిన 'జైలర్' స్టోరీ కొత్తదేం కాదు. అయినాసరే రజనీ స్వాగ్, స్టైల్ తోపాటు అనిరుధ్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. ఈ వీకెండ్ లో మరో పెద్ద మూవీ ఏదీ థియేటర్లలో లేకపోవడం.. ఇలా అన్ని అంశాలు 'జైలర్'కు కలిసొచ్చాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేచిపోతోంది. (ఇదీ చదవండి: Chiranjeevi : సర్జరీ @ ఢిల్లీ, వచ్చే వారం హైదరాబాద్ కు చిరంజీవి) -
సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. క్రేజీ రోల్ చిత్రంపై క్లారిటీ!
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సూర్య ఒకరు. గతంలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ చిత్రంలో కమల్ హాసన్ రోలెక్స్ పాత్రలో అభిమానులను మెప్పించిన సంగతి తెలిసిందే. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన విక్రమ్‌లో నెగెటివ్ షేడ్స్ ఉన్న లుక్‌లో కమల్ హాసన్ కనిపించారు. డ్రగ్ మాఫియాను శాసించే రోలెక్స్ పాత్రలో సినిమా చూడాలని సూర్య ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే తాజాగా ఫ్యాన్స్ మీట్లో పాల్గొన్న సూర్య.. రాబోయే ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. (ఇది చదవండి : పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ యంగ్ హీరో.. పోస్ట్ వైరల్!) సూర్య మాట్లాడుతూ..' ప్రస్తుతం నేను కంగువా సినిమాతో బిజీగా ఉన్నా. మేము అనుకున్న దానికంటే వందరెట్లు బాగా వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్‌లో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నా. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తా. దర్శకుడు వెట్రిమారన్ విడుదలై -2 చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత మా ఇద్దరి కాంబోలో వాడి వసల్ మొదలవుతుంది. ఇకపోతే లోకేశ్ కనగరాజ్ రోలెక్స్‌పై కథ చెప్పారు. అది చాలా బాగా నచ్చింది. అది కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. ఆ తర్వాత ఇరుంభుకై మాయావి చేస్తామని.' అన్నారు. ఈ వార్త విన్న సూర్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. మరోవైపు లోకేశ్ ప్రస్తుతం.. విజయ్‌తో లియో మూవీ చేస్తున్నారు. కాగా.. సూర్య ప్రస్తుతం నటిస్తోన్న కంగువ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో దిశా పటానీ కథానాయికగా నటిస్తోంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని పది భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. (ఇది చదవండి : చనిపోయిన అభిమానుల కుటుంబాలకు అండగా సూర్య, వీడియో కాల్ చేసి..) -
హిట్ చిత్రాల దర్శకుడితో కమల్ మూవీ?
విక్రమ్ చిత్రం అందించిన విజయోత్సవంతో నటుడు కమలహాసన్ వరుస చిత్రాల్లో నటించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరో పక్క బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోకు హోస్ట్‌గా వ్యహరిస్తూ బిజీగా ఉన్నారు. కాగా ఇండియన్ 2 చిత్రాలు పూర్తి చేసిన తర్వాత మలయాళ దర్శకుడు మహేష్ నారాయణన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నారు. కాగా ఆ తర్వాత చేసే చిత్రానికి కూడా కమల్‌హాసన్ పచ్చజెండా ఊపినట్లు తాజా సమాచారం. అజిత్ కథానాయకుడిగా నేర్కొండ పార్వై, వలిమై వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు హెచ్ వినోద్ ప్రస్తుతం అదే అజిత్ హీరోగా తుణివు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తదుపరి ఈయన కమల్‌హాసన్‌ను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర కథను దర్శకుడు హెచ్.వినోద్ ఇటీవల కమల్‌హాసన్‌కు వినిపించారని, ఆయన నటించడానికి సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఒక యాక్షన్ గేమ్ నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని కోలీవుడ్ వర్గాల టాక్. కాగా తుణివు చిత్రం విడుదల తర్వాత కమలహాసన్ హీరోగా నటించే చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. -
‘నాకు ఆ పాత్ర చేయడం ఇష్టం లేదు, ఆయన కోసమే ఒప్పుకున్నా’
ఇటీవల జరిగిన సైమా అవార్డు ఫంక్షన్లో హీరో సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విక్రమంలో సినిమాలో తాను చేసిన రోలెక్స్ పాత్ర చేయడం ఇష్టం లేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు. కాగా ఈ ఏడాది వచ్చిన ‘లోకనాయకుడు’ కమల్ హాసన్ విక్రమ్ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన ఈ మూవీ తమిళం, తెలుగులో విశేష ఆదరణ అందుకుంది. దాదాపు రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్ అందించింది. చదవండి: ఈ వారం థియేటర్ ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే అయితే ఈ చిత్రంలో సూర్య రోలెక్స్ అనే మాఫీయా గ్యాంగ్ లీడర్‌గా కనిపించాడు. కనిపించింది కొద్ది నిమిషాలే అయినా ఆ పాత్రను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేకపోతున్నారు. సూర్య ఎంట్రీకి ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవల్. విలనిజానికి కేరాఫ్‌గా అడ్రస్‌గా సూర్య ఇందులో కనిపించాడు. చివరి 5 నిముషాలో రోలెక్స్ పాత్రను పరిచం చేశాడు డైరెక్టర్. కనిపించిన 5 నిమిషాలు సూర్య తన కళ్లలో చూపించిన క్రూరత్వం, నవ్వుతూనే భయపెట్టిన ఆయన నటనకు ప్రతిఒక్కరు ఫిదా అయ్యారు. అలా విక్రమ్‌లో ప్రేక్షకులను రోలెక్స్‌గా భయపెట్టిన సూర్యకు ఈ పాత్ర చేయాలంటే మొదట భయం వేసిందట. చదవండి: ‘గాడ్‌ఫాదర్’పై సూపర్ స్టార్ రజనీ రివ్యూ.. ఏమన్నారంటే ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సైమా అవార్డు ఫంక్షన్లో తెలిపాడు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. ‘విక్రమ్‌లో రోలెక్స్ పాత్ర చేయాలంటే మొదట భయంగా అనిపించింది. డైరెక్టర్ లోకేశ్ కనకరాజుకు చేయనని చెబుదామని అనుకున్న. కానీ అదే సమయంలో కమల్ సార్ ఫోన్ చేసి అవకాశం ఉందని చెప్పారు. దీంతో చివరి నిమిషంలో మనసు మార్చుకుని ఓకే చెప్పాను. అది కేవలం ఓ వ్యక్తి కోసమే. ఆయనే లోకనాయకుడు కమల్ హాసన్’ అని చెప్పుకొచ్చాడు. కాగా కమల్ హాసన్ హీరోగా నటించి ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. I did it for one man "ulaganayagan" #kamalhassan #Rolex#southfilmfare #filmfareawards2022 @ikamalhaasan @suru #bengaluru pic.twitter.com/yK07292uRm — Civic Ranter (@deerajpnrao) October 9, 2022 -
వరుసగా మూడు సీక్వెల్స్... కమల్ స్పీడు మామూలుగా లేదు
పార్ట్ వన్ హిట్... హిట్ వన్ సాధించిన జోష్‌తో హిట్ టూ మీద టార్గెట్ ఉండటం కామన్. ఇప్పుడు కమల్‌హాసన్ ‘హిట్ 2’ మీద టార్గెట్ పెట్టారు. అంటే... హిట్ అయిన పార్ట్ వన్‌కి కొనసాగింపుగా పార్ట్ 2లో నటించనున్నారు. వరుసగా మూడు సీక్వెల్స్ చేయనున్నారు కమల్. ఆ విశేషాల్లోకి వెళదాం. కమల్‌హాసన్ మంచి జోష్‌లో ఉన్నారు. దానికి ఒక కారణం ‘విక్రమ్’ ఘనవిజయం సాధించడం. విజయాలు కమల్‌కి కొత్త కాకపోయినా ఈ కరోనా పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి సంశయిస్తున్న తరుణంలో హిట్ సాధించడం అంటే చిన్న విషయం కాదు. అది కూడా దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘విక్రమ్’ సుమారు రూ. 500 కోట్లు వసూలు చేయడం అంటే చిన్న విషయం కానే కాదు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కూడా నటించారు. గత జూన్‌లో విడుదలైన ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించనున్నారు. అయితే ఈ సీక్వెల్ ఆరంభం కావడానికి కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే కమల్ ప్రస్తుతం ‘ఇండియన్’ (భారతీయుడు) సీక్వెల్ మీద దృష్టి సారించారు. 22నుంచి ‘ఇండియన్ 2’ సెట్లోకి... సేనాధిపతి (ఇండియన్)గా, చంద్రబోస్ (చంద్రు)గా కమల్‌హాసన్ రెండు పాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఇండియన్’ (1996). దేశం కోసం ప్రాణాలర్పించడానికి సైతం వెనకాడని స్వాతంత్య్ర సమర యోధుడు సేనాధిపతి దేశానికి పట్టిన చీడపురుగులాంటి కన్న కొడుకుని మట్టుబెట్టే కథతో శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ నిర్మాణంలో ఉంది. కరోనా లాక్డౌన్, ఈ సినిమా చిత్రీకరణలో జరిగిన ప్రమాదం, చిత్రనిర్మాణ సంస్థ లైకాతో శంకర్‌కి ఏర్పడిన వివాదం (రామ్‌చరణ్ హీరోగా శంకర్ పాన్ ఇండియా సినిమా కమిట్ అయ్యారు. అయితే ‘ఇండియన్ 2’ని పూర్తి చేయకుండా శంకర్ మరో ప్రాజెక్ట్ చేయకూడదంటూ లైకా సంస్థ కోర్టుకి వెళ్లింది).. ఇలా పలు కారణాల వల్ల ఈ చిత్రానికి బ్రేక్ పడింది. ఈ నెల 22న తిరిగి చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నారట. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. 120 పేజీల కథతో ‘రాఘవన్ 2’ రెడీ కమల్‌హాసన్ నటించిన హిట్ చిత్రాల్లో ‘వేట్టయాడు విలైయాడు’ (రాఘవన్) ఒకటి. 2008లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి సీక్వెల్ రానుంది. ఈ సీక్వెల్‌కి కథ కూడా రెడీ అయిందట. 120 పేజీల బౌండ్ స్క్రిప్ట్‌ని తయారు చేశారు గౌతమ్. రైట్ టైమ్‌లో షూటింగ్ ఆరంభిస్తామని కూడా పేర్కొన్నారు. పార్ట్ వన్‌లో జ్యోతిక, కమలినీ ముఖర్జీ కథానాయికలుగా నటించారు. సీక్వెల్లో ఓ నాయికగా కీర్తీ సురేష్‌ని ఎంపిక చేసినట్లు సమాచారం. ‘ఇండియన్ 2’ తర్వాత కమల్ ‘రాఘవన్’ సీక్వెల్ సెట్స్‌లోనే ఎంటరవుతారని చెన్నై టాక్. ఆ తర్వాత ‘విక్రమ్ 2’ ఆరంభమయ్యే అవకాశం ఉంది. శభాష్ నాయుడు కూడా... ఇలా బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్ ప్లాన్ చేసుకోవడంతో పాటు కమల్ ‘శభాష్ నాయుడు’ చిత్రం కూడా చేయనున్నారు. దాదాపు మూడేళ్ల క్రితం ఈ చిత్రం ఆరంభమైంది. అయితే ఈ సినిమా షూటింగ్ అప్పుడే కమల్ ఇంట్లో జారిపడటంతో పెద్ద గాయమే అయింది. దాంతో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కరోనా ఎఫెక్ట్ వల్ల షూటింగ్ ఆగింది. బ్రహ్మానందం, శ్రుతీహాసన్ కీలక పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్‌ని కూడా మళ్లీ ఆరంభించాలనుకుంటున్నారు. -
ఫ్యాన్స్‌కి షాక్.. సోషల్ మీడియాకు ‘విక్రమ్’ డైరెక్టర్ బ్రేక్..
మాస్టర్, విక్రమ్ వంటి చిత్రాలతో కోలీవుడ్‌కు బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలను అందించిన డైరెక్టర్ లోకేశ్ కనకరాజు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తాను సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు తాజాగా ప్రకటించాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. ఆయన తదుపరి సినిమా ఎప్పుడేప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆయన తాజా నిర్ణయంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. చదవండి: నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని ఆగస్టు, విషాదాలన్నీ ఈ నెలలోనే.. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘హే గాయ్స్.. నేను అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ నుంచి చిన్న విరామం తీసుకుంటున్నాను. నేను నా నెక్ట్స్ సినిమా ప్రకటనతో తిరిగి వస్తాను. అప్పటి వరకు అందరు జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నా. లవ్ యూ’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా దాదాపు నాలుగేళ్లుగా సక్సెస్ లేని కమల్ హాసన్‌కు ఈ యంగ్ డైరెక్టర్ విక్రమ్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ అందించాడు. ఈ మూవీ దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళు చేసి సంచలన రికార్డు క్రియేట్ చేసింది. లోకేశ్ ‘విక్రమ్’ తెరకెక్కించిన తీరుకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో తెలుగు, తమిళంలో ఆయన పేరు మారిమ్రోగిపోతుంది. చదవండి: అప్పుడే ఓటీటీకి ‘థ్యాంక్యూ’?, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే! ఆయన నేరుగా తెలుగు హీరోతో ఓ సినిమా చేస్తే బాగుండు అని టాలీవుడ్ ప్రేక్షకులు కోరుకుంటుంటే.. విజయ్‌తో చేసే ఆయన నెక్ట్ మూవీ అప్డేట్ ఎప్పుడేప్పుడా కోలీవుడ్ ఆడియన్స్ వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియాక షార్ట్ బ్రేక్ తీసుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకు ఆయన సడెన్ నిర్ణయం తీసుకున్నారని, అంటే ఇప్పుట్లో విజయ్ సినిమా రానట్టేనా? అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కాగా విజయ్‌తో తన తదుపరి ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ఇటీవల లోకేశ్ కనకరాజ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. Hey guys ✨ I'm taking a small break from all social media platforms... I'll be back soon with my next film's announcement 🔥 Till then do take care all of you.. With love Lokesh Kanagaraj 🤜🏼🤛🏼 — Lokesh Kanagaraj (@Dir_Lokesh) August 1, 2022 -
నాగార్జునతో 'విక్రమ్' లాంటి సినిమా చేయాలని ఉంది: డైరెక్టర్
Chandoo Mondeti About Karthikeya 2 Movie: 2014లో వచ్చిన 'కార్తికేయ' సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన చందూ మొండేటికి మంచి పేరు తెచ్చిపెట్టింది. తర్వాత ప్రేమమ్, సవ్యసాచి, బ్లడీ మేరీ సినిమాలతో తనదైన శైలీలో పలకరించాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇప్పుడు తాజాగా 'కార్తికేయ'కు సీక్వెల్‌గా 'కార్తికేయ 2' వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో యంగ్ హీరో నిఖిల్, బ్యూటీఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పోస్టర్స్‌కు మంచి స్పందన లభించింది. అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో వినూత్నంగా కాంటెస్ట్ పేరుతో ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు డైరెక్టర్ చందూ మొండేటి, హీరో నిఖిల్. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది చిత్రబృందం. చదవండి: బికినీలో గ్లామర్ ఒలకబోస్తున్న హీరోయిన్ వేదిక.. నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన ''నాకు కింగ్ నాగార్జున అంటే చాలం ఇష్టం. ఆయనతో ఓ పోలీస్ కథపై చర్చలు జరుగుతుంటాయి. ఒకవేళ ఇప్పుడు ఈ మూవీ సక్సెస్ అయితే నాగార్జునతో 'విక్రమ్' లాంటి సినిమా చేయాలని ఉంది'' అని చందూ మొండేటి తెలిపారు. అలాగే హోస్ట్ అడిగిన 'నువ్వొక చిన్న సైజు విజయ్ మాల్య అట కదా' అనే ప్రశ్నకు 'ఏంటీ స్కాములా.. దొంగతనం కూడా చేశామంటారు' అని చందూ జవాబివ్వగా.. 'అదంతా ఒకప్పుడు' అని నిఖిల్ అన్నాడు. 'కార్తికేయ 2'లో చాలా పాములుంటాయని, 'భార్యలకు అబద్ధాలు చెప్పకపోతే, ఇన్నికాపురాలు ఉంటాయా' అంటూ చందూ చెప్పుకొచ్చాడు. ' అంటే కొన్నిసార్లు చిరాగ్గా ఉన్న సమయంలో కూడా డు యు లవ్ మీ' అని అంటారని నిఖిల్ చెప్పడంతో ఇంటర్వ్యూ ప్రోమో ముగిసింది. -
ఈ ఏడాది దుమ్మురేపిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
IMDB Top 10 Most Popular Indian Movies And Web Series 2022: ఓటీటీలు వచ్చాక సినీ ప్రియుల నుంచి ప్రేక్షకుల దాకా అభిరుచి మారింది. రొటీన్, రొడ్డకొట్టుడు సినిమాలకు స్వస్తి పలుకుతూ కొత్త తరహా కథాంశాలతో వచ్చిన చిత్రాలకు సై కొడుతున్నారు. సినిమాలో ఎంత పెద్ద తారాగణం ఉన్నప్పటికీ కథలో దమ్ము, కథనంలో బలం లేకుంటా చూసేదే లే అంటున్నారు. ఇక ప్రస్తుతం విభిన్నమైన స్టోరీస్‌తో వచ్చే సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లను కూడా మూవీ లవర్స్ హిట్టు బాట పట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే 2022లో అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల కాగా ప్రేక్షకులు కొన్నింటిని ఆదరిస్తే.. మరికొన్నింటిని తిరస్కరించారు. ప్రేక్షకుల ఆదరణను బట్టి తాజాగా ఐఎమ్‌డీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) టాప్ 10 మోస్ట్ పాపులర్ మూవీస్, వెబ్ సిరీస్‌ల జాబితాను విడుదల చేసింది. ఇండియాలోని ఐఎమ్‌డీబీ (IMDB)ఆడియెన్స్ పేజీ వీక్షణ ఆధారంగా ఈ రేటింగ్లను కేటాయిస్తారనే విషయం తెలిసిందే. 2022 జనవరి 1 నుంచి జులై 5 వరకు ఇటు థియేటర్స్, అటు ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ఈ రేటింగ్స్‌ను ఇచ్చింది. మరి ఆ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఆ రేటింగ్స్ ఏంటో ఓ లుక్కేయండి. మోస్ట్ పాపులర్ ఇండియన్ చిత్రాలు.. 1. విక్రమ్- 8.8 2. కేజీఎఫ్ 2- 8.5 3. ది కశ్మీర్ ఫైల్స్- 8.3 4. హృదయం- 8.1 5. ఆర్ఆర్ఆర్- 8.0 6. ఏ థర్స్ డే- 7.8 7. ఝుండ్- 7.4 8. రన్‌వే-34- 7.2 9. సామ్రాట్ పృథ్వీరాజ్- 7.2 10. గంగూబాయి కతియావాడి- 7.0 View this post on Instagram A post shared by IMDb (@imdb) మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్‌లు.. 1. క్యాంపస్ డైరీస్ (ఎమ్ఎక్స్ ప్లేయర్)- 9.0 2. రాకెట్ బాయ్స్ (సోనీ లివ్)- 8.9 3. పంచాయత్ 2 (అమెజాన్ ప్రైమ్ వీడియో)- 8.9 4. అపహరణ్ (వూట్/ఆల్ట్ బాలాజీ)- 8.4 5. హ్యూమన్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)- 8.0 6. ఎస్కేప్ లైవ్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)- 7.7 7. ది గ్రేట్ ఇండియన్ మర్డర్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)- 7.3 8. మాయి (నెట్‌ఫ్లిక్స్)- 7.2 9. యే కాళీ కాళీ ఆంఖే (నెట్‌ఫ్లిక్స్)- 7.0 10. ది ఫేమ్ గేమ్ (నెట్‌ఫ్లిక్స్)- 7.0 View this post on Instagram A post shared by IMDb (@imdb) -
ఓటీటీలోనూ 'విక్రమ్' సరికొత్త రికార్డు..
Kamal Haasan Vikram New Record In OTT: ఉలగ నాయగన్ కమల్ హాసన్ సుమారు నాలుగేళ్ల తర్వాత 'విక్రమ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి పవర్ఫుల్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో అలరించారు. జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కమల్ హాసన్ కెరీర్లోనే సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇక ఇందులో కమల్ హాసన్ చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. తాజాగా ఈ మూవీ ఓటీటీలోనూ దుమ్ములేపుతోంది. జులై 8న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజైన 'విక్రమ్' రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో 'బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్' సాధించిందని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నిర్వాహకులు ప్రకటించారు. ఇప్పటివరకు ఉన్న 'ఓపెనింగ్ వ్యూస్' రికార్డును ఈ మూవీ తిరగరాసిందని తెలిపారు. ఇంకా హైయెస్ట్ స్ట్రీమింగ్‌తో (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో) ఈ సినిమా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఈ విజయం పట్ల కమల్ హాసన్ కూడా స్పందించారు. ''డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ద్వారా 'విక్రమ్' ప్రతీ ఇంటికి చేరడం ఆనందంగా ఉంది. ఇంతటి విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. విక్రమ్ బృందానికి శుభాకాంక్షలు'' అని తెలిపారు. చదవండి: ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. నితిన్ పాటకు మహేశ్ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్ ఆ పుకార్లు నిజమే.. తేల్చి చెప్పేసిన రష్మిక మందన్నా.. Consider this your sign to watch #VikramOnHostar now! pic.twitter.com/Me6UamDUhn — Disney+ Hotstar (@DisneyPlusHS) July 12, 2022 Thank you for all your love. You can now enjoy Vikram on @DisneyPlusHS . https://t.co/5HSjLWiBHO@Dir_Lokesh @RKFI @turmericmediaTM @DisneyPlusHS @disneyplusHSTam @DisneyPlusHSTel @DisneyplusHSMal — Kamal Haasan (@ikamalhaasan) July 7, 2022 -
2022లో మోస్ట్ పాపులర్ 10 సినిమాలివే..
కరోనా వల్ల సగటు ప్రేక్షకుడు మళ్లీ థియేటర్‌కు వస్తాడా? లేదా? అన్న అనుమానాలను పటాపంచలు చేశాయి ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 చిత్రాలు.. ఇవే కాకుండా ఇంకెన్నో సినిమాలు ఈ ఏడాది సూపర్ డూపర్ హిట్ అందుకున్నాయి. కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఆదరిస్తారని నిరూపించాయి. మరీ ముఖ్యంగా ఈసారి సౌత్ సినిమాలు బాలీవుడ్‌ను రఫ్ఫాడించాయి. హిందీలోనూ వసూళ్లలో దూసుకుపోతూ విశ్లేషకులను సైతం ఆశ్చ్యపరిచాయి. తాజాగా ఐఎమ్‌డీబీ(ఇంటర్నెట్ మూవీ డాటాబేస్) ఈ ఏడాది టాప్ టెన్ మూవీస్ అండ్ టీవీ షోల జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో 8.8 రేటింగ్‌తో విక్రమ్ మొదటి స్థానంలో నిలిచింది. మరి తర్వాతి స్థానంలో నిలిచిన సినిమాలేంటో కింద చూసేయండి.. 1. విక్రమ్: 8.8/10 2. కేజీఎఫ్ చాప్టర్ 2: 8.5/10 3. ద కశ్మీర్ ఫైల్స్ : 8.3/10 4. హృదయం: 8.1/10 5.ఆర్ఆర్ఆర్ : 8/10 6. ఎ థర్స్డే: 7.8/10 7. ఝండ్: 7.4/10 8. సామ్రాట్ పృథ్వీరాజ్: 7.2/10 9. రన్‌వే 34: 7.2/10 10. గంగూబాయి కథియావాడి: 7/10 View this post on Instagram A post shared by IMDb (@imdb) టాప్ 10 ఇండియన్ వెబ్ సిరీస్ 1. క్యాంపస్ డైరీస్: 9/10 2. రాకెట్ బాయ్స్: 8.9/10 3. పంచాయత్: 8.9/10 4. అపహరణ్: 8.4/10 5. హ్యూమన్ : 8/10 6. ఎస్కేప్ లైవ్: 7.7/10 7. ద గ్రేట్ ఇండియన్ మర్డర్: 7.3/10 8. మై: 7.2/10 9. ద ఫేమ్ గేమ్: 7/10 10: యే కాలి కాలి అంఖేన్: 7/10 View this post on Instagram A post shared by IMDb (@imdb) చదవండి: నితిన్ పాటకు మహేశ్ బాబు డ్యాన్స్ !.. 'వావ్' అని హీరో కామెంట్ రన్నింగ్ సీన్లో హీరోకు గాయాలు, అయినా పరుగు ఆపని బాలీవుడ్ స్టార్ -
36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. ఈ హీరోలకు కమ్‌బ్యాక్ హిట్.. యాదృచ్ఛికమా!
వారిద్దరూ స్టార్ హీరోలే. ఒకరు యాక్షన్ హీరో అయితే.. మరొకరు యూనివర్సల్ హీరో. రియల్ స్టంట్స్ చేస్తూ యాక్షన్ సీన్లలో అదరగొట్టేది ఒకరైతే.. నటనలో విశ్వరూపం చూపిస్తూ మెస్మరైజ్ చేసేది ఇంకొకరు. ఈ ఇద్దరు ఆరు పదుల వయసువారే. ఒకరికి 60 అయితే మరొకరికి 67. ఈ వయస్సులో కూడా పోరాట సన్నివేశాలు చేస్తూ, నటనలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఐ ఫీస్ట్ చేస్తారు. వారిద్దరికీ ప్రేక్షకులు, అభిమానుల్లో విపరీతమైన క్రేజ్. వీరి సినిమాలు ఎప్పుడెప్పుడూ వస్తాయా అని అభిమానులు పడిగాపులు పడుతుంటారు. వచ్చే వరకు ఆరాదిస్తూనే ఉంటారు. ఇలా ఒక సూపర్ హిట్ కోసం అటు ఆ హీరోలు.. ఇటు వారి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణంలోనే ఇద్దరు తమ సినిమాలను ఒకే ఏడాది రిలీజ్ చేసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. అందులోనూ సుమారు 36 ఏళ్ల క్రితం చిత్రాలను సీక్వెల్‌గా తెరకెక్కించి ఈ ఏడాదిలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలుగా రికార్డు సైతం క్రియేట్ చేశారు. మరీ ఆ స్టార్ హీరోలెవరో తెలుసుకుందామా. 'విక్రమ్: ది హిట్ లిస్ట్' సినిమా 2022 జూన్ 3న విడుదలై ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుమారు నాలుగేళ్ల తర్వాత ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్‌కు మాసీవ్ కమ్‌బ్యాక్ హిట్ ఇచ్చింది ఈ మూవీ. అయితే ఈ సినిమాను డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ మల్టీవర్స్ తరహాలో (LCU-లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) తెరకెక్కించారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కార్తీ 'ఖైదీ' సినిమా సీన్లను చూపించడం, తర్వాత 'ఖైదీ 2'లో కూడా కమల్ హాసన్ విక్రమ్‌గా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా 'విక్రమ్ 3'లో కూడా నటించేందుకు ఆసక్తిగా ఉన్నానని కమల్ హాసన్ ఒక ప్రెస్మీట్లో చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కమల్ హాసన్ 'విక్రమ్ 3' అని ఎందుకు అన్నారు ? అంటే ఇప్పటికే 'విక్రమ్ 2' వచ్చిందా ? అని అడిగితే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిజానికి 'విక్రమ్: ది హిట్ లిస్ట్' కన్నా ముందు 1986లో 'విక్రమ్' సినిమా వచ్చింది. ఇదే 'రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్'లో 'ఏజెంట్ విక్రమ్ 007' రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ పాత్ర కొనసాగింపుగా తాజాగా 'విక్రమ్: ది హిట్ లిస్ట్'ను రూపొందించారు లోకేష్ కనకరాజ్. అంటే ఈ 'విక్రమ్: ది హిట్ లిస్ట్ (విక్రమ్ 2)', 1986లో వచ్చిన 'ఏజెంట్ విక్రమ్ 007' చిత్రాల కథా నేపథ్యం ఒకే లైన్‌పై ఆధారపడింది. దీన్ని బట్టి చూస్తే 'ఏజెంట్ విక్రమ్ 007'కు 'విక్రమ్ 2' సీక్వెల్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా 1986లో కమల్ హాసన్‌కు ఒక క్రేజ్ తీసుకొచ్చింది. కెరీర్ ప్రారంభంలో తడబడుతున్న కమల్ హాసన్‌కు ఒక బ్లాక్ బస్టర్‌గా నిలిచి.. ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. రూ. కోటి బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ 'ఏజెంట్ విక్రమ్ 007' బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 8 కోట్లను కొల్లగొట్టాడు. అంతేకాకుండా ఈ మూవీలోని టైటిల్ ట్రాక్‌లో (విక్రమ్ టైటిల్ సాంగ్) మొట్ట మొదటిసారిగా కంప్యూటర్ బేస్డ్ వాయిస్ (రోబోటిక్ వాయిస్‌లా)ను ఉపయోగించారు సంగీతం దర్శకుడు ఇళయరాజా. ఈ వాయిస్ ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అయితే ఈ వాయిస్‌ను 'విక్రమ్: ది హిట్ లిస్ట్' టైటిల్ ట్రాక్‌లో కూడా కొనసాగించారు కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్. ఈ సినిమాలో అనిరుధ్ ఇచ్చిన ఒక్కో బీజీఎం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. 'విక్రమ్: ది హిట్ లిస్ట్' మూవీ సుమారు రూ. 120-150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి దాదాపు రూ. 442.45 కోట్లు రాబట్టింది. కాగా సరైన హిట్ లేకుండా సతమవుతున్న కమల్ హాసన్‌కు.. 36 ఏళ్ల క్రితం వచ్చిన మూవీ కథ నేపథ్యంగా తెరకెక్కిన ఈ 'విక్రమ్ 2' సెన్సేషనల్ హిట్‌గా నిలవడం విశేషం. 1986లో 32 ఏళ్ల వయసులో కమల్ ఎలాంటి నటనతో అలరించాడో 67 ఏళ్ల వయసులో కూడా అంతకుమించిన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక కమల్ హాసన్‌లానే కెరీర్ ప్రారంభంలో స్ట్రగులై అదే 1986లో హిట్ కొట్టిన మరో స్టార్ హీరో టామ్ క్రూజ్. ఈ హాలీవుడ్ యాక్షన్ హీరో రియల్ స్టంట్స్, ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హీరోకు కూడా కెరీర్ ఆరంభంలో సూపర్ క్రేజ్ తీసుకొచ్చిన మూవీ 'టాప్ గన్'. 1986 మే 16న విడుదలైన 'టాప్ గన్' అప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. రూ. 1.5 కోట్ల (యూఎస్ డాలర్స్) బడ్జెట్ తెరకెక్కిన ఈ చిత్రం రూ. 35.73 కోట్లు (యూఎస్ డాలర్స్) రాబట్టింది. తర్వాత అనేక యాక్షన్ మూవీస్‌తో అదరగొట్టిన టామ్ క్రూజ్‌కు ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. అయితే సుమారు 36 ఏళ్ల తర్వాత 'టాప్ గన్'కు సీక్వెల్‌గా 'టాప్ గన్: మావెరిక్' వచ్చి టామ్ క్రూజ్‌కు సాలిడ్ సక్సెస్ ఇచ్చింది. 'టాప్ గన్'లో 24 ఏళ్ల వసయసులో బాడీ లాంగ్వేజ్, ఫిట్నెస్, యాక్టింగ్, రొమాన్స్‌తో టామ్ క్రూజ్ ఎలా అయితే ఆకట్టుకున్నాడో 59 ఏళ్ల (సినిమా చిత్రీకరణ సమయంలో) వయసులోనూ అదే జోష్‌తో మెస్మరైజ్ చేశాడు. ఇప్పటికీ సిక్స్ ప్యాక్ బాడీతో రియల్ స్టంట్స్ చేస్తూ అదరగొడుతున్నాడు. ఇక 2022 మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'టాప్ గన్: మావెరిక్' సుమారు 170 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కి.. బాక్సాఫీస్ వద్ద సుమారు 1. 131 బిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. ఇక ఆరు పదుల వయసులోనూ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న కమల్ హాసన్, టామ్ క్రూజ్.. యాక్టింగ్, యాక్షన్ స్టంట్స్‌లో 'ఇద్దరూ.. ఇద్దరే' అనిపించుకుంటున్నారు. కాగా 36 ఏళ్ల క్రితం సినిమాలను సీక్వెల్‌గా తెరకెక్కించి, హిట్ లేని సమయంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కమల్, టామ్లది ఎంతటి యాదృచ్ఛికం. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
‘విక్రమ్’ మేకింగ్ వీడియో చూశారా?.. డైరెక్టర్ ఫోకస్‌కు నెటిజన్లు ఫిదా!
ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్ సుమారు నాలుగేళ్ల తర్వాత విక్రమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో అలరించారు. జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రూ. 350 కోట్లకు పైగా వసూళు సాధించి కమల్ హాసన్ కెరీర్లోనే సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇక ఇందులో కమల్ హాసన్ చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. చదవండి: కానిస్టెబుల్‌గా విశాల్.. ఏడేళ్ల పిల్లాడికి తండ్రిగా హీరో రోల్ ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ సంబంధించిన మేకింగ్ వీడియోను తాజాగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ విడుదల చేసింది. 6 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో దాదాపు యాక్షన్ సీన్స్‌కు సంబంధించిన మేకింగ్ సన్నివేశాలను చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో దూసుకెళుతోంది. ఫహద్ ఫాజిల్ సీన్‌తో మొదలైన ఈ మేకింగ్ వీడియోలో విజయ్ సేతుపతి, కమల్‌కు సంబంధిచిన పలు భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు మూవీలో హైలేట్‌గా నిలిచి ఫైట్ సన్నివేశాలను చిత్రీకరించిన తీరును చూపించారు. చదవండి: ‘ధాకడ్’ మూవీ ఫ్లాప్.. షాకింగ్ కామెంట్స్ చేసిన కంగనా ఇందులో దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌ను చూస్తుంటే ప్రతి సీన్లో కోసం ఆయన ఎంతటి జాగ్రత్త తీసుకున్నారో అర్థమవుతుంది. మేకింగ్‌తో పాటు హీరో, విలన్ లుక్స్‌లోనూ స్పెషల్ కేర్ తీసుకున్నాడు. కొన్ని చోట్ల ఫైట్ సీన్స్ కోసం లోకేశ్.. కమల్ లుక్కు స్వయంగా మెరుగులు దిద్దుతూ కనిపించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు దర్శకుడి మేకింగ్‌కు ఫిదా అవుతున్నారు. దీంతో ఆయనపై నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘విక్రమ్ మేకింగ్, ప్రతి ఫ్రేమ్‌లో విషయంలో మీరు పెట్టిన ఫోకస్ కనిపిస్తుంది’,‘ఈ సినిమా కోసం మీరు పెట్టిన ఎఫర్టే విక్రమ్ సక్సెస్’ అంటూ లోకేశ్ కనకరాజ్‌ను కొనియాడుతున్నారు. -
కొత్త సినిమాలతో కళకళలాడుతున్న ఓటీటీ వరల్డ్
ఓటీటీ వరల్డ్ ఒక్కసారిగా కొత్త సినిమాలతో కళకళలాడుతోంది. ఇప్పటికే మేజర్, విరాటపర్వం మూవీస్ నెటిజన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ వారం ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రం, కమల్ హాసన్ కమ్ బ్యాక్ మూవీ ‘విక్రమ్’ ఓటీటీలోకి రానుంది. జులై 8 నుంచి హాట్ స్టార్ లో తెలుగు,తమిళం సహా ఇతర భాషల్లో స్ట్రీమ్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర 400 కోట్లకు పైగా కొల్లగొట్టిన విక్రమ్ థియేటర్స్ లోకి వచ్చిన 35 రోజుల్లో ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. (చదవండి: 1200 మందితో రామ్‌చరణ్ రిస్కీ ఫైట్!) విక్రమ్ తో పాటు నాని నటించిన లేటెస్ట్ ఫిల్మ్ అంటే సుందరానికి ఓటీటీ లోకి వచ్చేస్తోంది. జులై 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. థియేటర్స్ లోకి వచ్చిన నెల రోజులకు ఓటీటీలోకి వస్తున్నాడు సుందరం. మరోవైపు సమ్మర్ సోగాళ్లు కూడా ఓటీటీలోకి వచ్చేస్తున్నారు. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా ఎఫ్3 జులై మూడో వారంలో సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు మోడర్న్ లవ్ పేరుతో ఆంథాలజీ సిరీస్‌ని తీసుకొస్తోంది అమెజాన్ ప్రైమ్. హైదరాబాద్ నేపథ్యంలో 6 కథలను ఇందులో చూపించనుంది. ఆదిపిని శెట్టి, నిత్యామీనన్, రీతువర్మ, సుహాసిని, రేవతి, నరేష్ , మాళవిక నాయర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ ఆరు కథలను నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక తెరకెక్కించారు. జులై 8 నుంచే ఈ ఆంథాలజీ ప్రైమ్ లో అందుబాటులో ఉండనుంది. -
అందుకు నాకు అర్హత లేదు: మహేశ్ బాబు
ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్ సూపర్ హిట్ కమ్‌బ్యాక్ ఇచ్చిన చిత్రం 'విక్రమ్'. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌గా మారింది. జూన్ 3న విడుదలై సక్సెస్ సాధించడమే కాకుండా జులై 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉంది. రూ. 400 కోట్లకుపైగా వసూళ్లు కొల్లగొట్టిన 'విక్రమ్' సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఈ మూవీపై టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు పొగడ్తల వర్షం కురిపించాడు. ఇప్పటి సినిమాల్లో న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్ మూవీగా అభివర్ణించాడు. 'విక్రమ్ బ్లాక్‌బస్టర్ సినిమా. ఒక న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్ చిత్రం. లోకేశ్ కనకరాజ్.. నేను మిమ్మల్ని కలిసి విక్రమ్ మూవీ ప్రారంభం నుంచి చివరి వరకు షూటింగ్ ఎలా జరిగిందో తెలుసుకోవాలని ఉంది. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ తమ అద్భుతమైన నటనతో మెరిపించేశారు. అనిరుధ్ బెస్ట్ మ్యూజిక్ అందించాడు. చాలాకాలం తర్వాత నా ప్లే లిస్ట్ టాప్‌లో విక్రమ్ ఉంది. ఇక చివరిగా లెజెండ్ కమల్ హాసన్ నటన గురించి చెప్పేందుకు నాకు అర్హత లేదు. ఒక అభిమానిగా చాలా గర్వంగా ఉంది. మీకు, మీ అద్భుతమైన బృందానికి శుభాకాంక్షలు.' అని మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: ఫ్రెండ్‌తో బెడ్ షేర్.. అబార్షన్.. ఎలాంటి పశ్చాత్తాపం లేదు: నటి 3 సార్లు పెళ్లి వరకు.. దేవుడు దయతో బయటపడ్డ: స్టార్ హీరోయిన్ And finally about the legend @ikamalhaasan... not qualified enough to comment about the acting 😊 All I can say is.. as your biggest fan, it was one of my proudest moments!! Congrats to you Sir and your wonderful team. 👍👍👏👏👏@RKFI @Udhaystalin — Mahesh Babu (@urstrulyMahesh) July 2, 2022 -
ఓటీటీలో కమల్ హాసన్ 'విక్రమ్'.. ఎప్పుడు ? ఎక్కడంటే ?
Kamal Haasan Vikram Movie OTT Release Date Announced: ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్ సూపర్ హిట్ కమ్‌బ్యాక్ ఇచ్చిన చిత్రం 'విక్రమ్'. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌గా మారింది. ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, సూర్య కీలక పాత్రల్లో నటించడంతో చిత్రంపై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం జూన్ 3న విడుదలై అంచనాలకు మించిన సక్సెస్ సాధించింది. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా 'పద చూస్కుందాం' అంటూ రూ. 400 కోట్లకుపైగా వసూళ్లు కొల్లగొట్టింది. రోబో 2.0 తర్వాత ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లు వసూలు చేసిన రెండో తమిళ చిత్రంగా విక్రమ్ రికార్డు సృష్టించింది. 'విక్రమ్' వేట థియేటర్లలో పూర్తి కాగా ఇప్పుడు ఓటీటీల్లో కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జులై 8 నుంచి 'విక్రమ్' స్ట్రీమింగ్ కానున్నాడు. చదవండి: 'విక్రమ్' సక్సెస్ డిన్నర్ పార్టీ.. విందులోని వంటకాలు ఇవే.. ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్ హాసన్ A super hit addition to your watchlist coming soon! 😍 Vikram: Hitlist streaming from July 8 in Hindi, Tamil, Telugu, Malayalam and Kannada. #VikramOnDisneyPlusHotstar 🔥😎 pic.twitter.com/bCO3KfVcOK — Disney+ Hotstar (@DisneyPlusHS) June 29, 2022 -
2.0 తర్వాత ఆ రికార్డు అందుకున్న ఏకైక చిత్రం 'విక్రమ్'
కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘విక్రమ్’. కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని తెలుగులో హీరో నితిన్, నిర్మాత సుధాకర్ రెడ్డి విక్రమ్: హిట్ లిస్ట్ పేరుతో రిలీజ్ చేశారు. జూన్ 3న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి జనం బ్రహ్మరథం పట్టారు. ఉలగనాయన్(లోక నాయకుడు) ఈజ్ బ్యాక్ అంటూ నెట్టింట తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఈ సినిమా రిలీజైన నెల రోజుల్లోపే రూ.400 కోట్ల వసూళ్లు సాధించింది. రోబో 2.0 తర్వాత ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లు వసూలు చేసిన రెండో తమిళ చిత్రంగా విక్రమ్ రికార్డు సృష్టించింది. కాగా ఈ సినిమా సక్సెస్ సాధించిన సంతోషంలో చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వారికి, థియేటర్ యజమానులకు ఇటీవల స్పెషల్ పార్టీ ఇచ్చింది మూవీ యూనిట్. ఇక కమల్ హాసన్ అయితే ఏకంగా 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు బైకులు, రోలెక్స్ పాత్రలో నటించిన సూర్యకు ఖరీదైన రోలెక్స్ వాచ్, డైరెక్టర్ శోకేశ్ కగనరాజుకు కోటి విలువ చేసే లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే! #Vikram - 400 CR total WW gross done 🔥👌👏 as it approaches the 25 days mark in theaters tomorrow. Just WOW! "Once upon a time" kinda success this is! #400CRVikram Naanooru Kodi dawwww! #KamalHaasan𓃵 — Kaushik LM (@LMKMovieManiac) June 26, 2022 చదవండి: ప్రేమ వివాహానికి రెడీ అవుతున్న హీరో రామ్, త్వరలో ప్రకటన?! నాలుక కొరికేసుకో.. బండ్ల గణేశ్‌కు పూరీ జగన్నాథ్ వార్నింగ్?! -
‘విక్రమ్’ మూవీలో విలన్స్‌తో ఫైట్ చేసిన ఈ పని మనిషి ఎవరో తెలుసా?
‘లోక నాయకుడు’ కమల్ హాసన్ విక్రమ్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాలుగేళ్లుగా ఒక్క హిట్ లేని కమల్‌కు ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందించింది. విడుదలైన రెండు వారాల్లోనే ఈ మూవీ రూ. 300 కోట్లు వసూళు చేసింది. ప్రస్తుతం మూవీ టీం విక్రమ్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఆస్వాధిస్తోంది. లోకేశ్ కనగరాజు దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళం స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్, కోలీవుడ్ స్టార్స్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించగా.. సూర్యలు కీ రోల్లో కనిపించాడు. చదవండి: లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్.. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ పని మనిషిగా కనిపించిన ఎజెంట్ టీనా పాత్ర ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇందులో ఆమె విలన్ గ్యాంగ్పైకి శివంగిలా విరుచుకుపడి వారికి చెమటలు పట్టించింది. దీంతో సినిమా అనంతరం చాలామంది పని మనిషి ఎజెంట్ టీనా గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకి ఆమె ఎవరా? అని అందరు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఇంతకి ఎజెంట్ టీనా అసలు పేరు ఎంటంటే వాసంతి. కోలీవుడ్ ప్రముఖ డాన్స్ కోరియోగ్రాఫర్లో ఆమె ఒకరు. తమిళంలో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు ఆమె కోరియోగ్రఫి అందించింది. ఈ క్రమంలో విక్రమ్ మూవీతో ఆమె నటిగా వెండితెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే ఆమెకు మంచి గుర్తింపు రావడంతో మురిసిపోతూ డైరెక్టర్ లోకేశ్ కనగరాజుకు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ..‘విక్రమ్ వంటి ప్రాజెక్ట్‌లో తాను భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజు గారికి కృతజ్ఞతలు. నా అసలు పేరు వాసంతి. కానీ అందరూ నన్ను ఎజెంట్ టీనా అని పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులంత నన్ను టీనాగా గుర్తిస్తున్నారు’ అంటూ రాసుకొచ్చింది. కాగా విక్రమ్ మూవీలో హీరో మీద పగతో ఆయన తనయుడిని విలన్లు చంపేస్తారు. చదవండి: 16 రోజుల్లో రూ. 300 కోట్లు.. బాహుబలి 2 రికార్డు బద్దలు.. దీంతో విక్రమ్ కోడలు ఆయనని ద్వేషిస్తూ కొడుకుతో ఒంటరిగా ఉంటుంది. అయితే కోడలికి, మనవడికి తోడుగా ఒక పనిమనిషి ఉంటుంది. విక్రమ్ ఫ్యామిలీపై పగతీర్చుకోవడానికిగాను వారిపై విలన్ అనుచరులు దాడికి యత్నిస్తారు. అయితే పని మనిషి విక్రమ్ సార్‌కి కాల్ చేయమని ఎంతగా చెప్పినా ఆయనపై సరైన అభిప్రాయం లేని కారణంగా కోడలు ఆ మాటలు పట్టించుకోదు. అప్పుడు విలన్ గ్యాంగ్పైకి ఆ పని మనిషి ఒక్కసారిగా విరుచుకుపడుతుంది. అయితే చివరిలో ఆమె 'ఏజెంట్ టీనా' అనీ.. కోడలు, మనవడికి రక్షణ ఆమెను హీరో ఆ ఇంటికి పనిమనిషిగా పింపించాడనే విషయాన్ని దర్శకుడు రివీల్ చేస్తాడు. సస్పెన్స్‌తో ముడిపడిన ఈ సీన్ సినిమాలోని యాక్షన్ సీన్స్‌లో ఒకటిగా నిలిచింది. Am proud be a part of #Vikram thanks #LokeshKanakaraj sir given me a opportunity for Vikram and my name is vasanthi but create new name agent Tina every one wishing me as Tina. Am so happy.Audience recognize me Tina. pic.twitter.com/MI0pPPUSoH — Agent_Tina vasanthi (@Agent_Tena) June 19, 2022