
Kamal Haasan Gift a Lexus Car to Director Lokesh Kanagaraj: లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘విక్రమ్’. తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో వచ్చిన కమల్ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. విడుదలైన తొలి రోజే రూ. 45 కోట్లకు పైగా రాబట్టిన విక్రమ్ నిన్నటితో(జూన్ 6న) రూ.150 కోట్ల మార్క్‌ను దాటేసింది.
చదవండి: ఇండియన్ రెస్టారెంట్‌లో జానీ డెప్ పార్టీ, రూ. 49 లక్షల బిల్లుతో షాకిచ్చాడు
వీకెండ్‌ను బాగా క్యాష్ చేసుకున్న ఈ మూవీ కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 పైగా కోట్లు అందుకుంది. వీకెండ్‌లో (జూన్ 3 నుంచి 5 వరకు) అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో విక్రమ్ మూడో స్థానంలో నిలవడం విశేషం. ఇక నేటితో ఈమూవీ సుమారుగా రూ. 200 కోట్లకు చేరువ కానుందని సినీ విశ్లేషకులు అంచన వేస్తున్నారు. ఇదిలా విక్రమ్ మూవీ భారీ విజయం అందుకోవడంతో కమల్ హాసన్ డైరెక్టర్‌కు సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఖరీదైన లెక్సాస్ లగ్జరీ కారును డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్‌కు, కమల్ బహుమతిగా అందించాడు.
చదవండి: ‘ఒక్కడు’లో మహేశ్ చెల్లెలు ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుంది?
కమల్ హాసన్ కారు కీని డైరెక్టర్‌కు అందిస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ కారు ధర సుమారు రూ. 59.50 లక్షల నుంచి రూ. కోటీకి పైగా ఉంటుందని అంచన. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని’రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో 'విక్రమ్: హిట్ లిస్ట్' పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ విడుదల చేశారు. ఇందులో కమల్ 67 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీగా యాక్షన్ సీన్స్ చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment