Lexus
-
ప్రపంచంలోని బెస్ట్ ఆఫ్-రోడింగ్ కార్లు (ఫోటోలు)
-
ధర రూ.2 కోట్లు.. అన్నీ బుక్ అయిపోయాయ్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జపనీస్ బ్రాండ్ వాహనాలలో ఒకటైన లెక్సస్ తన 'ఎల్ఎమ్ 350హెచ్' (Lexus LM 350h) బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది. 2024 మార్చిలో లాంచ్ అయిన ఈ లగ్జరీ ఎంపీవీ బుకింగ్స్ 2023 ఆగష్టులో ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటికే కంపెనీ ఈ కారు కోసం 100 బుకింగ్స్ పొందింది.కంపెనీ వంద బుకింగ్స్ పొందింది, కాబట్టి వీటిని డెలివరీ చేసిన తరువాత మళ్ళీ బుకింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కంపెనీ ఈ బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే మళ్ళీ ఎప్పుడు బుకింగ్స్ మొదలవుతాయనేది తెలియాల్సిన విషయం.లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్విశాలమైన క్యాబిన్ కలిగిన ఈ ఎంపీవీ.. పెద్ద ఫ్రంట్ గ్రిల్, హెడ్‌ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్ వంటివి పొందుతుంది. బ్లాక్, సోలిస్ అనే రెండు రంగులలో లభించే ఈ కారు 14 ఇంచెస్ టచ్‌స్క్రీన్ పొందుతుంది. ఇది యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. 23 స్పీకర్ ఆడియో సిస్టం, ఫోల్డ్ అవుట్ టేబుల్, హీటెడ్ ఆర్మ్‌రెస్ట్, రిఫ్రిజిరేటర్ మొదలైనవన్నీ ఇందులో లభిస్తాయి.ఇదీ చదవండి: 4.49 లక్షల వాహనాలు వెనక్కి.. అమెరికన్ కంపెనీ కీలక ప్రకటనఈ లగ్జరీ ఎంపీవీ 2.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 190 Bhp, 240 Nm టార్క్ అందిస్తుంది. ఏడు సీట్ల లెక్సస్ ఎల్ఎమ్350 హెచ్ ధర రూ. 2 కోట్లు. అయితే ఇదే మోడల్ 4 సీటర్ ధర రూ. 2.5 కోట్లు. ఈ కారు టయోటా వెల్ఫైర్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
భారత్‌లో జపనీస్ బ్రాండ్ కారు లాంచ్: ధర రూ. 69.70 లక్షలు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ లెక్సస్ ఇండియా.. భారతీయ మార్కెట్లో 'ఈఎస్ లగ్జరీ ప్లస్ ఎడిషన్' లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ. 69.70 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ పొందుతుంది.లెక్సస్ ఈఎస్ లగ్జరీ ప్లస్ ఎడిషన్ కొత్త సిల్వర్ గ్రిల్, రియర్ ల్యాంప్ క్రోమ్ గార్నిష్, ఎల్ఈడీ లైట్ లెక్సస్ లోగోతో కూడిన ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్, లోగో ల్యాంప్, రియర్ సీట్ పిల్లో వంటి ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు మీద 8 సంవత్సరాలు / 160000 కిమీ వారంటీ అందిస్తుంది. కస్టమర్లు 5 సంవత్సరాల వరకు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కూడా పొందవచ్చు.లెక్సస్ కొత్త కారు లాంచ్ చేసిన సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తన్మయ్ భట్టాచార్య మాట్లాడుతూ.. రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త ఎడిషన్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ఇది లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. పనితీరు కూడా చాలా ఉత్తమంగా ఉంటుందని ఆయన అన్నారు.2024 ప్రథమార్థంలో, జపనీస్ కార్ల తయారీ కంపెనీ లెక్సస్ భారతదేశంలో 55 శాతం ఈఎస్ కార్లను విక్రయించింది. ఇప్పుడు ఇందులో లగ్జరీ ప్లస్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది కూడా మనషి మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నారు. -
ఉన్న కార్లు అమ్మేసి కొత్త కారు కొన్న దళపతి విజయ్
సామాన్యుడు కాస్త ఆలోచిస్తాడేమో గానీ సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు కొత్త కార్లు కొంటున్నట్లే ఉంటారు. సోషల్ మీడియాలో అలాంటి వీడియో లేదా పోస్టులు కనిపిస్తుంటాయి. ఇప్పుడు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా అలాంటి ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. కానీ అంతకు ముందే తన దగ్గరున్న మరో రెండు కార్లని అమ్మేశాడట. ఇంతకీ ఏంటి సంగతి?తమిళ హీరోల్లో విజయ్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం 'ద గోట్' అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత మరో సినిమా చేసి, రాజకీయాలకు అంకితమైపోతాడు. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా కొన్నాళ్ల క్రితం క్లారిటీ ఇచ్చేశాడు. 'తమిళగ వెట్రి కళగం' పేరుతో రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు.(ఇదీ చదవండి: మ్యూజిక్ డైరెక్టర్ లేని సినిమా.. అంతా కోడి అరుపుతోనే)కార్లు అంటే విజయ్‌కి చాలా ఆసక్తి. అలా 2012లోనే రోల్స్ రాయిస్ కారుని విదేశాల నుంచి తెప్పించాడు. అయితే దీనికి ట్యాక్స్ కట్టకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. రీసెంట్గా దీన్ని అమ్మకానికి పెట్టినట్లు వార్తలొచ్చాయి. అయితే దీనితో పాటు వోల్వో కారుని కూడా అమ్మేశాడట. బదులుగా లెక్సెస్ ఎల్ ఎమ్ కారు కొన్నాడు.తాజాగా విజయ్ ఇంటి నుంచి లెక్సెస్ కారు బయటకొస్తున్న వీడియోలు వైరల్ కావడంతో కొత్త కారు కొనడం నిజమని తేలిపోయింది. ఇకపోతే దీని ఖరీదు.. కోటిన్నర నుంచి రూ.2 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. కొత్త కారు కొనడం వరకు ఓకే గానీ పాత కార్లు ఇప్పుడు అంత అర్జెంట్‌గా ఎందుకు అమ్మేశాడనేది సందేహంగా మారింది!(ఇదీ చదవండి: సెన్సార్ బోర్డ్‌లో బ్యాన్.. నేరుగా ఓటీటీలోకి తెలుగు సినిమా) -
నార్త్ కొరియా: వరద సహాయక చర్యల్లో కిమ్
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఖరీదైన బ్లాక్ లెక్సస్ కారులో వెళ్లి వరద పరిస్థితిని అంచనా వేశారు. దేశంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, పోటెత్తిన వరదల పరిస్థితిని అంచనావేసేందుకు కిమ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. గడిచిన కొన్నిరోజులుగా ఉత్తరకొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి వరదలు వచ్చి వేల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఉత్తరకొరియాలో చైనాకు సరిహద్దులో ఉన్న సినాయ్జూ, యిజు అనే పట్టణాలు వరదలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరిస్థితి తీవ్రతను అంచనా వేయడానికి కిమ్ ఆ ప్రాంతాల పర్యటనకు వెళ్లినపుడు నడములోతు నీటిలో ఉన్న బ్లాక్ లెక్సస్ కారు, అందులోని కిమ్ చిత్రాలను స్థానిక మీడియా ప్రచురించింది. అధ్యక్షుడే దిగివచ్చి నేరుగా వరద సహాయక చర్యల్లో భాగస్వామి అయ్యారని ఆ కథనాల సారాంశం. విమానాలు, హెలికాప్టర్లు ఉండగా కిమ్ కారులోనే ఎందుకు వెళ్లారన్న అంశం చర్చనీయాంశమవుతోంది. తాజాగా విరుచుకుపడ్డ వరదలు ఉత్తరకొరియాలో ఆహార సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తాయని నిపుణులు భయపడుతున్నారు. ఇక్కడ నీటి పారుదల వ్యవస్థ దారుణంగా ఉండటంతో నష్టం తీవ్రంగానే ఉంటుందని అంచనా. -
2035 నాటికి అన్నీ ఎలక్ట్రిక్ కార్లే.. నవీన్ సోనీ
సాక్షి, అమరావతి:స్థానిక సంప్రదాయాలు, కళలతో మమేకం అవడం ద్వారా భారతీయ మార్కెట్లో వేగంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జపాన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ ప్రకటించింది. ఇందుకోసం కారు కొనుగోలుదారులను అతిథులుగా గౌరవిస్తూ స్థానిక కళలకు ప్రాచుర్యం కల్పించే విధంగా విశాలమైన ప్రాంగణాలను మెరాకీ పేరుతో ఏర్పాటు చేస్తోంది. దేశంలో అయిదో లెక్సస్ మెరాకీని విజయవాడ సమీపంలో మంగళగిరి వద్ద ఏర్పాటు చేసింది. దేశీయ లగ్జరీ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని, ఇప్పటి వరకు ఈ రంగంలో ఆధిపత్యం ఉన్న జర్మనీ బ్రాండ్లకు జపాన్ బ్రాండ్ గట్టి పోటీనివ్వనుందని లెక్సస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ సోనీ తెలిపారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన మాటామంతీ.. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే దేశీయంగా లగ్జరీ కార్ల అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి? దేశవ్యాప్తంగా ఏటా జరుగుతున్న కార్ల అమ్మకాల్లో కేవలం ఒక శాతం మాత్రమే లగ్జరీ కార్లు ఉంటున్నాయి. ఏటా సుమారుగా 40 లక్షలకు పైగా కార్లు అమ్ముడవుంతుంటే అన్ని లగ్జరీ బ్రాండ్లు కలిసి ఏటా 40,000 కార్లను విక్రయిస్తున్నాయి. అదే చైనాలో మొత్తం కార్ల అమ్మకాల్లో 15 నుంచి 16 శాతం, యూరప్‌లో 17 శాతం, అమెరికాలో 14 నుంచి 15 శాతం, జపాన్‌లో 3 నుంచి 5 శాతం అమ్మకాలు జరుగుతున్నాయి. దీని ప్రకారం చూస్తే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌లో లగ్జరీ కార్ల అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 3 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని 5 ట్రిలియన్ డాలర్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది జరిగితే తలసరి ఆదాయం ప్రస్తుత స్థాయి నుంచి 6 రెట్లు పెరుగుతుంది. ఇదే దేశీయ లగ్జరీ కార్ల మార్కెట్‌ను శాసించే ప్రధానాంశం. కోవిడ్ తర్వాత పడిపోయిన లగ్జరీ కార్ల అమ్మకాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? లాక్‌డౌన్‌కు ముందు ఏటా 40 నుంచి 42 వేల లగ్జరీ కార్లు అమ్ముడవుతుంటే అది కోవిడ్ సమయంలో 18,000 యూనిట్లకు పడిపోయింది. ఆ తర్వాత సాధారణ కార్ల అమ్మకాలు పెరిగినంత వేగంగా లగ్జరీ కార్ల అమ్మకాలు పెరగలేదు. 2021లో 26,000కు, 2022లో 36,000కు చేరిన లగ్జరీ కార్ల అమ్మకాలు ఈఏడాది 43,000 మార్కును దాటుతాయని అంచనా వేస్తున్నాం. ఇక ఇక్కడ నుంచి ఈ రంగం కూడా వేగంగా వృద్ధి చెందే అవకాశాలున్నాయి. దేశీయ లగ్జరీ కార్ల మార్కెట్లోకి ఆలస్యంగా ప్రవేశించిన లెక్సస్ మార్కెట్ అమ్మకాలను పెంచుకోవడానికి ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళుతోంది? రెండేళ్ల క్రితం కేవలం 4 నగరాల్లో ఉన్న లెక్సస్‌కు ఇప్పుడు 19 నగరాల్లో 26 షోరూమ్‌లు ఉన్నాయి. అమ్మకాల సంఖ్యను చెప్పలేను కానీ, దేశీయ మార్కెట్లో లెక్సస్ వేగంగా విస్తరిస్తోందని మాత్రం చెప్పగలను. కేవలం కొనుగోలుదారులుగా కాకుండా వారిని అతిథులుగా గౌరవిస్తూ దానికి అనుగుణంగా కార్ల డిజైన్లను రూపొందించి విక్రయించనున్నాం. ఇందుకోసం వేగంగా విస్తరించడం కంటే వినియోగదారు, షోరూమ్ భాగస్వాములు ప్రయోజనం పొందే విధంగా అడుగులు వేస్తున్నాం. గతంలో హైదరాబాద్‌కు పరిమితమైన లెక్సస్ ఇప్పుడు విజయవాడలో అడుగుపెడుతోంది. రానున్న కాలంలో విశాఖ, నెల్లూరు వంటి నగరాలకు విస్తరణ అవకాశాలను పరిశీలిస్తాం. వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల రంగంలో లెక్సస్ భవిష్యత్తు ప్రణాళికలేంటి? ప్రస్తుతం హైబ్రీడ్ మోడల్స్‌లో ఎలక్ట్రిక్ కార్లను అందిస్తున్నాం. ఇప్పటికే సింగిల్ చార్జీతో 1000 కి.మీ ప్రయాణించే విధంగా కాన్సెప్ట్ కారును విడుదల చేశాం. వాణిజ్యపరంగా ఈ కారును 2026 నాటికి విడుదల చేయనున్నాం. 2035 నాటికి లెక్సన్‌ను పూర్తి ఎలక్ట్రిక్ కార్ల బ్రాండ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. -
భారత్ మీదే ఆశలన్నీ.. జర్మన్, జపనీస్ కంపెనీల తీరిది!
భారతదేశంలో పండుగ సీజన్ ఇప్పటికే ప్రారంభమైపోయింది. ఈ సందర్భంగా చాలా మంది కొత్త కార్లను లేదా బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీంతో మార్కెట్లో ఆటోమొబైల్ విక్రయాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. లగ్జరీ వాహన తయారీ సంస్థలు ఈ సమయం కోసం వేచి చూస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్ బెంజ్, ఆడి కంపెనీలతో పాటు జపనీస్ కంపెనీ లెక్సస్ కూడా పండుగ సీజన్లో తమ అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నాయి. ఈ ఏడాది పండుగ సీజన్ నాలుగు నెలల పాటు ఉంటుందని ఈ సమయంలో అమ్మకాల వృద్ధి ఎక్కువగా ఉంటుందని బెంజ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ 'సంతోష్ అయ్యర్' తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో సాధారణ కార్లతో పాటు హై ఎండ్ కార్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఖరీదైన కార్లు దేశీయ మార్కెట్లో అరంగేట్రం చేస్తున్నాయి. గతం కంటే దేశంలో లగ్జరీ కార్ల మార్కెట్ వృద్ధి చెందుతోందని లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ 'నవీన్ సోనీ' అన్నారు. ఇదీ చదవండి: దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ ఎందుకు పెరుగుతోంది? కారణం ఇదేనా! 2022 పండుగ సీజన్‌తో పోలిస్తే ఈ ఏట లగ్జరీ కార్ల బుకింగ్స్ & అమ్మకాలు తప్పకుండా పెరుగుతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ఆడి ఇండియా హెడ్ 'బల్బీర్ సింగ్ ధిల్లాన్' ఈ ఏడాది ప్రథమార్థంలో కంపెనీ 3,474 యూనిట్లను రిటైల్ చేసి 97 శాతం వృద్ధిని సాధించిందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కష్టాలు భరించలేక ఆత్మహత్యాయత్నం.. నెలకు రూ.60 అందుకునే స్థాయి నుంచి వందల కోట్లు.. ఆడి ఏ4, ఏ6, క్యూ3 అండ్ క్యూ5 వంటి మోడళ్లకు దేశీయ విఫణిలో బలమైన డిమాండ్ ఉందని ధిల్లాన్ వెల్లడించారు. వీటితో పాటు క్యూ8 ఈ-ట్రాన్, క్యూ8 స్పోర్ట్‌బ్యాక్ ఈ-ట్రాన్లతో ఈవీ పోర్ట్‌ఫోలియో రోజు రోజుకి విస్తరిస్తోంది. ఇటీవల కంపెనీ క్యూ8 లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేసింది. ఈ ఏడాది పండుగ సీజన్ మొత్తంలో దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు 10 లక్షల యూనిట్లు దాటవచ్చని అంచనా. -
భారత్‌లో లెక్సస్ ఇండియా లగ్జరీ కార్ డెలవరీ ప్రారంభం
జపాన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ తాజాగా భారత్‌లో కొత్త ఐదవ తరం ఐదు సీట్ల ఆర్ఎక్స్ 350 హెచ్ (RX 350H) లగ్జరీ ఎస్యూవీ డెలివరీలను అధికారికంగా ప్రారంభించింది. ఈ కొత్త మోడల్‌ను జపాన్ సంస్థ లెక్సస్ ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్పో - 2023 ఈవెంట్లో ప్రదర్శనకు పెట్టింది. తాజాగా ఈ లగ్జరీ కార్లను కస్టమర్లకు డెలివరీ చేస్తున్నట్లు లెక్సస్ ఇండియా తెలిపింది. ఇక, చూపరులను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయడంలో లెక్సస్ ప్రసిద్ధి చెందింది. ఆ అంచనాలతో ఎక్స్ 350 కారును సైతం డిజైన్ చేసింది. ముఖ్యంగా స్కల్ప్టెడ్ లైన్, ఎల్ఈడీ ఇల్యూమినేషన్, బోల్డ్, ఐకానిక్ యాక్సెంట్లతో మోడల్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఇందులో అత్యాధునికమైన ఎలక్ట్రిఫైడ్ టెక్నాలజీని దాని అసాధారణమైన ఫీచర్లతో భారత ఆటోమొబైల్ రంగంలో ఉన్న విదేశీ ఆటోమొబైల్ కంపెనీల జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. లెక్సస్ ఆర్ఎక్స్ డ్రైవర్ కాక్‌పిట్ డిజైన్‌తో హీటెడ్, వెంటిలేటెడ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, మల్టీమీడియా డిస్ప్లే సౌలభ్యాన్ని కలిగి ఉంది.ఈ కార్ ధర రూ.95.80లక్షలు. లెక్సస్ ఇండియా మొత్తం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఆర్ఎక్స్ డిమాండ్‌ని సాధించింది. -
లెక్సస్ కారు @ రూ.2.39 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జపాన్ సంస్థ లెక్సస్.. తాజాగా భారత్‌లో కొత్త ఎల్సీ 500హెచ్ మోడల్‌ను పరిచయం చేసింది. నాలుగు సీట్లు ఉన్న ఈ లగ్జరీ కూపే ధర రూ.2.39 కోట్లు. గ్లాస్ బ్లాక్ మెటాలిక్ ఫినిష్, 3డీ మెషీన్డ్ టెక్స్చర్తో అలాయ్ వీల్స్, 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే, 3.5 లీటర్, 6 సిలిండర్, మల్టీ స్టేజ్ హైబ్రిడ్, లీటరుకు 12.3 కిలోమీటర్ల మైలేజీ, 264 కిలోవాట్ పవర్ ఏర్పాటు ఉంది. గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఇదీ చదవండి: ప్రొడక్టవిటీ కావాలంటే ఉద్యోగుల్ని పీకేయండి: టెక్ దిగ్గజాలకు మస్క్ సంచలన సలహా గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5 సెకన్లలోనే చేరుకుంటుంది. పనోరమిక్ వ్యూ మానిటర్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, 10 ఎయిర్‌బ్యాగ్స్, కార్బన్ ఫైబర్ రీ–ఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్స్ రూఫ్, డైనమిక్ హ్యాండ్లింగ్ సిస్టమ్, వేరియేబుల్ గేర్ రేషియో స్టీరింగ్, డ్రైవ్ స్టార్ట్ కంట్రోల్, వెహికిల్ డైనమిక్స్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్, ఈబీడీతో ఏబీఎస్, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు జోడించారు. భారత్‌లో హైదరాబాద్ సహా ఏడు నగరాల్లో లెక్సస్ షోరూంలు ఉన్నాయి. (వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్ వీడియో) లగ్జరీ కార్లు, స్మార్ట్ఫోన్లు, ఈవీల పై తాజా సమాచారం కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
భారత్‌లో విడుదలైన జపనీస్ బ్రాండ్ కారు: ధర ఎంతో తెలుసా?
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న అన్యదేశ బ్రాండ్ కార్లలో లెక్సస్ (Lexus) ఒకటి. ఈ జపనీస్ కంపెనీ ఎట్టకేలకు ఓ కొత్త హైబ్రిడ్ కారు 'ఆర్ఎక్స్' SUVని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ లేటెస్ట్ లగ్జరీ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. ధర: భారతీయ విఫణిలో విడుదలైన కొత్త లెక్సస్ నిజానికి 2023 ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేసింది. కాగా ఇప్పుడు మార్కెట్లో అధికారికంగా అడుగెట్టింది. ఈ కొత్త లెక్సస్ ఆర్ఎక్స్350హెచ్ లగ్జరీ వేరియంట్ ప్రారంభ ధర రూ. 95.80 లక్షలు. అదే సమయంలో హై పర్ఫామెన్స్ అందించే RX500h F-Sport+ ధర రూ. 1.18 కోట్ల వరకు ఉంటుంది (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ఇండియా). డిజైన్: 2023 లెక్సస్ RX మంచి డిజైన్ పొందుతుంది. ఇందులో భాగంగానే ఈ లగ్జరీ ఎస్యువి స్పిండిల్ బాడీ డిజైన్ కలిగి దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఆధునికంగా ఉంటుంది. ఈ కారు పరిమాణం విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీని పొడవు 4890 మిమీ, వెడల్పు 1920 మిమీ, ఎత్తు 2850 మిమీ కలిగి 2850 మిమీ వీల్‌బేస్ పొందుతుంది. (ఇదీ చదవండి: చదివింది ఐఐటీ.. చేసేది పశువుల వ్యాపారం.. ఆదాయం ఎంతనుకున్నారు?) ఇంటీరియర్ ఫీచర్స్: కొత్త లెక్సస్ ఆర్ఎక్స్ 14-ఇంచెస్ టచ్‌స్క్రీన్ కలిగి.. వైర్లెస్ ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో వైర్లెస్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటాయి. ఇంటీరియర్ బ్లాక్, డార్క్ సెపియా, సోలిస్ వైట్ అనే మూడు కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. ఇంజిన్ & పర్ఫామెన్స్: 2023 లెక్సస్ RX రెండు ఇంజిన్ల ఎంపికను పొందుతుంది. అవి CVTతో జతచేసిన 2.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (RX350h లగ్జరీ). ఇది ఎలక్ట్రిక్ మోటారుతో కలిపి 250 హెచ్‌పి పవర్ మరియు 242 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ SUV కేవలం 7.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు. ఇక RX500h F-Sport+ విషయానికి వస్తే.. ఇందులో 2.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 371 హెచ్‌పి పవర్ మరియు 460 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ లగ్జరీ కారు గంటకు 210 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. (ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!) ప్రత్యర్థులు: ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త లెక్సస్ ఆర్ఎక్స్ కారు జర్మన్ లగ్జరీ కారు అయిన మెర్సిడెస్ బెంజ్ GLE, బిఎండబ్ల్యు ఎక్స్5, రేంజ్ రోవర్ వెలార్, జాగ్వార్ ఎఫ్-పేస్, ఆడి క్యూ7 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
‘విక్రమ్’ భారీ విజయం, దర్శకుడికి కమల్ లగ్జరీ కారు బహుమతి
Kamal Haasan Gift a Lexus Car to Director Lokesh Kanagaraj: లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘విక్రమ్’. తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో వచ్చిన కమల్ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. విడుదలైన తొలి రోజే రూ. 45 కోట్లకు పైగా రాబట్టిన విక్రమ్ నిన్నటితో(జూన్ 6న) రూ.150 కోట్ల మార్క్‌ను దాటేసింది. చదవండి: ఇండియన్ రెస్టారెంట్లో జానీ డెప్ పార్టీ, రూ. 49 లక్షల బిల్లుతో షాకిచ్చాడు వీకెండ్‌ను బాగా క్యాష్ చేసుకున్న ఈ మూవీ కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 పైగా కోట్లు అందుకుంది. వీకెండ్లో (జూన్ 3 నుంచి 5 వరకు) అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో విక్రమ్ మూడో స్థానంలో నిలవడం విశేషం. ఇక నేటితో ఈమూవీ సుమారుగా రూ. 200 కోట్లకు చేరువ కానుందని సినీ విశ్లేషకులు అంచన వేస్తున్నారు. ఇదిలా విక్రమ్ మూవీ భారీ విజయం అందుకోవడంతో కమల్ హాసన్ డైరెక్టర్‌కు సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఖరీదైన లెక్సాస్ లగ్జరీ కారును డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్‌కు, కమల్ బహుమతిగా అందించాడు. చదవండి: ‘ఒక్కడు’లో మహేశ్ చెల్లెలు ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుంది? కమల్ హాసన్ కారు కీని డైరెక్టర్‌కు అందిస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ కారు ధర సుమారు రూ. 59.50 లక్షల నుంచి రూ. కోటీకి పైగా ఉంటుందని అంచన. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని’రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో 'విక్రమ్: హిట్ లిస్ట్' పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ విడుదల చేశారు. ఇందులో కమల్ 67 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీగా యాక్షన్ సీన్స్ చేయడం విశేషం. -
లెక్సస్ నుంచి సరికొత్త ఎన్ఎక్స్ 350హెచ్ ఎస్యూవీ
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ తాజాగా ఎన్ఎక్స్ 350హెచ్ ఎస్‌యూవీలో సరికొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. వేరియంట్‌ను బట్టి ధర రూ. 64.9 లక్షలు, రూ. 69.5 లక్షలు, రూ. 71.6 లక్షలుగా (ఎక్స్–షోరూమ్) ఉంటుంది. జనవరిలో ప్రి–బుకింగ్స్ ప్రారంభించగా, భారీ స్పందన లభించిందని లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ నవీన్ సోని తెలిపారు. హైబ్రిడ్ సిస్టమ్, లెక్సస్ ఇంటర్ఫేస్, 14 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లేలో మల్టీమీడియా, డిజిటల్ సపోర్ట్, వైర్లెస్ చార్జింగ్, యూజర్ ప్రొఫైల్‌కు స్మార్ట్‌ఫోన్ కనెక్షన్, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు మొదలైన ప్రత్యేకతలు ఈ సరికొత్త వెర్షన్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా లగ్జరీ కార్ల మార్కెట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఇది తోడ్పడగలదని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమకు మూడు ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఉన్నాయని, త్వరలో మరో మూడింటిని ప్రారంభించనున్నామని సోని వివరించారు. చదవండి: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో కొత్త బైక్..! ఆ సెగ్మెంట్లో చవకైన బైక్‌గా..! -
లిమిటెడ్ ఎడిషన్‌లో ఎల్సీ 500హెచ్
ముంబై: టయోటా అనుబంధ సంస్థ లెక్సెస్ లిమిటెడ్ బుధవారం లిమిటెడ్ ఎడిషన్‌గా ఎల్సీ 500హెచ్ మోడల్ కారును విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.2.15 కోట్లుగా ఉంది. ఎయిర్ రేస్ పైలెట్ యోషిహిడే మురోయా, లెక్సెస్ ఇంజనీర్ల భాగసామ్యంలో ఈ కారు రూపకల్పన జరిగింది. ఏవియేషన్ డిజైన్ ప్రేరణతో వస్తున్న ఈ మోడల్‌ను కస్టమర్లు ఆదరిస్తారని భారత ప్రెసిడెంట్ పీబీ వేణుగోపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలలో ఈ లెక్సస్ కార్లు అమ్ముడవుతున్నాయి. -
లెక్సస్ సరికొత్త ఎస్యూవీ@2.33 కోట్లు
న్యూఢిల్లీ : లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ భారత్‌లోకి సరికొత్త ఎస్‌యూవీని విడుదల చేసింది. ఎల్ఎక్స్ 570 ఎస్‌యూవీని భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. శక్తివంతమైన 5.7లీటర్ల వీ8 పెట్రోల్ ఇంజిన్‌తో ఇది రూపొందింది. దీని ఎక్స్ షోరూం ధర 2.33 కోట్లుగా నిర్ణయించింది. క్లైమెట్ కంట్రోల్, బెటర్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్స్ మంచి డ్రైవింగ్ అనుభూతిని కల్పించనున్నాయి. ఈ కారులో విలాసవంతమైన 19 స్పీకర్లతో కూడిన ది మార్క్ లెవిన్సన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్‌ను అమర్చారు. మూడు వరుసల సీటింగ్‌ను దీనిలో అమర్చామని, ఒకవేళ అవసరమైతే అదనపు కార్గో స్పేస్‌కు ఇది ఉపయోగపడనుందని కంపెనీ తెలిపింది. వెనుక సీట్లకు 11.6 అంగుళాల లిక్విడ్ క్రిస్టల్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ డిస్ప్లే కూడా ఉంది. ‘ రహదారిపై అద్భుతమైన పట్టుసాధించే ఈ వాహనంతో వినియోగదారులు గొప్ప డ్రైవింగ్ అనుభూతిని ఆస్వాదిస్తారు’ అని లెక్సస్ ఇండియా చైర్మన్ ఎన్.రాజ తెలిపారు. నేటి నుంచి ఈ ఎల్ఎక్స్ 570 ఎస్యూవీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. -
లెక్సెస్ హైబ్రిడ్ ఎస్యూవీ...అందుబాటు ధరలో
సాక్షి, న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ ఇండియా హైబ్రిడ్ మోడల్ కార్లను తీసుకొస్తోంది. సరసమైన ధరలో ‘ఎన్ఎక్స్ 300హెచ్’ పేరుతో ఎస్‌యూవీని పరిచయం చేసింది. లగ్జరీ, ఎఫ్-స్పోర్ట్ అనే రెండు వేరియంట్లలో ఈ కారును కస్టమర్లకు అందుబాటులోకి తీసుకు రానుంది. దీంతో గ్లోబల్‌గా మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్‌యూవీగా నిలిచింది. 2018 జనవరి నాటికి భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. దీని ధర సుమారు రూ.60లక్షలుగా ఉంటుందని అంచనా. 2.5 లీటర్, 4 సిలిండర్ ఇంజిన్‌తో దీన్ని రూపొందించారు. ఇది మొత్తం ఎలక్ట్రిక్ మోటారుతో 194 బీహెచ్పీతో సోఫిస్టికేటెడ్‌గా, స్టయిలిష్ లుక్‌లో వస్తోంది. ఈ సరికొత్త హైబ్రిడ్ ఎస్యూవీ ప్రత్యర్థులు మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఏ, ఆడి క్యూ3లకు గట్టి పోటి ఇస్తుందని భావిస్తున్నారు. భారత్‌లో సరసమైన ధరలో అందుబాటులోకి తెస్తున్న ఎన్ఎక్స్ 300 హెచ్ కు మంచి డిమాండ్ ఉండనుందని కంపెనీ భావిస్తోంది. ఇది కారుగానే మాత్రమే కాదు..ఒక లైఫ్‌స్టయిల్‌గా ఉంటుందని ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అరుణ్ నాయర్ ప్రకటించారు. లెక్సస్ ఇండియా పునర్నిర్మాణం దేశంలో ఒక బలమైన పునాదిని స్థాపించడానికి సహాయపడుతుందన్నారు. -
టయోటా ‘లెక్సస్’.. వచ్చేసింది!
⇒ మూడు మోడళ్ల ఆవిష్కరణ ⇒ ధర శ్రేణి రూ.55.27 లక్షలు–రూ.1.09 కోట్లు న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టయోటా’ తాజాగా తన లగ్జరీ బ్రాండ్ ‘లెక్సస్’ను ఎట్టకేలకు భారత్‌లోకి తీసుకువచ్చింది. కంపెనీ తాజాగా ‘లెక్సస్’ బ్రాండ్ కింద ‘ఆర్ఎక్స్ 450హెచ్’, ‘ఈఎస్ 300హెచ్’, ‘ఎల్ఎక్స్ 450డీ’ అనే మూడు మోడళ్లను మార్కెట్లో ఆవిష్కరించింది. ఆర్ఎక్స్ 450హెచ్ మోడల్ ప్రధానంగా ‘ఆర్ఎక్స్ లగ్జరీ’, ‘ఆర్ఎక్స్ ఎఫ్ స్పోర్ట్’ అనే రెండు వేరియంట్లలో లభ్యంకానుంది. వీటి ధరలు వరుసగా రూ.1.07 కోట్లు, రూ.1.09 కోట్లుగా ఉన్నాయి. ఇక ‘ఈఎస్ 300హెచ్’ ధర రూ.55.27 లక్షలుగా ఉంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. ఇక టాప్ ఎండ్ ఎస్యూవీ ‘ఎల్ఎక్స్ 450డీ’ ధర తెలియాల్సి ఉంది. కంపెనీ ఈ కార్ల ఆవిష్కరణ కార్యక్రమంలో ఐదవ జనరేషన్ లెక్సస్ ఎల్ఎస్ 500 కారును కూడా ప్రదర్శనకు ఉంచింది. ఇది వచ్చే ఏడాది మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. తాజా మోడళ్లు ఢిల్లీ, గుర్గావ్, ముంబై, బెంగళూరు నగరాల్లోని డీలర్షిప్స్ వద్ద కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని లెక్సస్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ యొషిహిరో సావా పేర్కొన్నారు. చండీగఢ్, హైదరాబాద్, చెన్నై, కొచ్చి ప్రాంతాల్లో సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. టయోటా కంపెనీ లెక్సస్ బ్రాండ్‌తో దేశీ లగ్జరీ కార్ల విభాగంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. -
భారత్‌లో లెక్సస్ కార్ల ఎంట్రీ..
మార్చి 24న కార్ల విడుదల ∙మూడు మోడళ్లతో ప్రవేశం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల బ్రాండ్ లెక్సస్ భారత్‌లో అడుగుపెడుతోంది. టయోటాకు చెందిన ఈ బ్రాండ్ భారత్‌లో తొలుత మూడు మోడళ్లతో ఎంట్రీ ఇస్తోంది. మార్చి 24న ఇవి అధికారికంగా విడుదల కానున్నాయి. లెక్సస్ తొలి షోరూం ముంబైలో ఏర్పాటవుతోంది. దశలవారీగా హైదరాబాద్‌సహా మిగిలిన నగరాల్లో ఔట్లెట్లు తెరుచుకోనున్నాయి. ఆర్ఎక్స్450హెచ్ ఎస్యూవీ, ఎల్ఎక్స్450డీ ఎస్యూవీ, ఈఎస్300హెచ్ సెడాన్ ముందుగా రోడ్డెక్కనున్నాయి. ప్రస్తుతానికి పూర్తిగా తయారైన కార్లనే కంపెనీ జపాన్ నుంచి దిగుమతి చేస్తుంది. సొంత ప్లాంటు ఏర్పాటయ్యే వరకు టయోటాకు చెందిన యూనిట్లో రానున్న రోజుల్లో తయారీ చేపడతారు. ప్రస్తుతం 70కిపైగా దేశాల్లో లెక్సస్ కార్లు పరుగెడుతున్నాయి. 24 మోడళ్లు వివిధ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. ఇవీ కార్ల ఫీచర్లు: లెక్సస్ ఆర్ఎక్స్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. 3.5 లీటర్, వీ6 పెట్రోల్ మోటార్, టయోటా అభివృద్ధి చేసిన హైబ్రిడ్ సిస్టమ్‌ను ఆర్ఎక్స్450హెచ్ మోడల్‌కు పొందుపరిచారు. అంతర్జాతీయంగా ఆడి క్యూ5, బీఎండబ్లు్య ఎక్స్3 మోడళ్లకు ఇది పోటీనిస్తుంది. ఎక్స్‌షోరూంలో ధర రూ.1.17 కోట్లు ఉండొచ్చని సమాచారం. ఫ్లాగ్షిప్ మోడల్ అయిన ఎల్ఎక్స్ సిరీస్‌లో రెండు ఇంజన్ ఆప్షన్స్‌లో కార్లను ప్రవేశపెట్టింది. ఎల్ఎక్స్570 పెట్రోల్‌తో 5.7 లీటర్ వీ8 ఇంజన్, ఎల్ఎక్స్450డీ డీజిల్‌తో ట్విన్ టర్బో 4.5 లీటర్ వీ8 డీజిల్ ఇంజన్‌ను పొందుపరిచారు. ఎల్ఎక్స్450డీ తొలుత అయిదు సీట్లతో రానుంది. అక్టోబరులోగా 7 సీట్ల పెట్రోల్ వేరియంట్ అడుగుపెట్టనుంది. రేంజ్ రోవర్, ఆడి క్యూ7, మెర్సిడెస్ జీఎల్‌కు ఎల్ఎక్స్ సిరీస్ పోటీనిస్తుంది. -
లెక్సస్ బ్రాండ్ రాకకు మళ్లీ బ్రేక్
ముంబై : టయోటా కొత్త బ్రాండు లెక్సస్ ఆవిష్కరణకు భారత్‌లో మళ్లీ బ్రేక్‌లు పడ్డాయి. లెక్సస్, డాయ్ హాట్సూ బ్రాండులను భారత్‌లో ఇప్పట్లో ప్రవేశపెట్టకూడదని టయోటా నిర్ణయించింది. దేశ రాజధాని ప్రాంతంలో డీజిల్ వెహికిల్స్‌పై నిషేధం నేపథ్యంలో టయోటా తాజా నిర్ణయం తీసుకుందని, ఈ బ్రాండ్ల రాకకు మరికొంత కాలం ఆలస్యం కావొచ్చని లోకల్ యూనిట్ వైస్ చైర్మన్ చెప్పారు. ఆటోమొబైల్ ఇండస్ట్రిలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు క్లియర్ అయ్యేంత వరకు భారత్‌లో కొత్త పెట్టుబడులేమీ కూడా పెట్టకూడదని టయోటా సంచలన నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అయితే గత ఐదేళ్లలో ఇప్పటికీ మూడుసార్లు భారత్‌లోకి ప్రవేశించబోయి ఆగిపోయిన లెక్సస్ బ్రాండ్, టయోటా తాజా నిర్ణయంతో మరోమారు ఈ బ్రాండ్ భారత్‌లో ప్రవేశానికి నోచుకోవడం లేదు. లగ్జరీ లెక్సస్ బ్రాండ్‌ను 2017 మొదట్లో, ఫెస్టివల్ సీజన్లో డాయ్హాట్సూలను భారత రోడ్లపై పరుగులు పెట్టించాలని టయోటా నిర్ణయించింది. కానీ న్యూఢిల్లీలో పెద్ద డీజిల్ వాహనాలపై నిషేధం ఈ బ్రాండుల ప్రవేశానికి ఆటంకంగా మారిందని కంపెనీకి చెందిన ప్రతినిధులు చెప్పారు. ఫైనల్ కోర్టు ఆర్డర్లపై ఆటోమొబైల్ ఇండస్ట్రి చాలా ఆత్రుతగా ఎదురుచూస్తుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. డీజిల్ వాహనాల వల్ల వస్తున్న కాలుష్య ముప్పు సమస్యతో నేషనల్ రాజధాని ప్రాంతంలో పెద్ద డీజిల్ వాహన అమ్మకాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో 10ఏళ్లకు పైబడిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్ల పెట్రోల్ వాహనాలకు డీ-రిజిస్ట్రర్ చేయాలని ఎన్జీటీ గత నెలే ఆదేశాలు కూడా జారీచేసింది. అయితే ప్యాసెంజర్ వాహన అమ్మకాల్లో ఎన్సీఆర్ కనీసం 12శాతం నమోదుచేస్తోంది. ఈ ప్రాంతంలో డీజిల్ వెహికిల్స్ మొత్తం అమ్మకాలు 25-30 శాతంగా రికార్డు అవుతున్నాయి. డీజిల్ వాహన విక్రయంలో టాప్ సెల్లింగ్ మోడల్స్ గా ఉంటున్న టయోటా.. ఈ ఆదేశాలతో ఎక్కువగా నష్టపోతోంది.