2023 Lexus RX Launched In India, Check Price Details And Special Features - Sakshi
Sakshi News home page

2023 Lexus RX: భారత్‌లో విడుదలైన కోటి రూపాయల లెక్సస్ కారు, ఇదే.. చూసారా?

Published Thu, Apr 20 2023 3:21 PM | Last Updated on Thu, Apr 20 2023 3:35 PM

2023 lexus rx india launched price and details - Sakshi

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న అన్యదేశ బ్రాండ్ కార్లలో లెక్సస్ (Lexus) ఒకటి. ఈ జపనీస్ కంపెనీ ఎట్టకేలకు ఓ కొత్త హైబ్రిడ్ కారు 'ఆర్ఎక్స్' SUVని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ లేటెస్ట్ లగ్జరీ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

ధర:
భారతీయ విఫణిలో విడుదలైన కొత్త లెక్సస్ నిజానికి 2023 ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేసింది. కాగా ఇప్పుడు మార్కెట్లో అధికారికంగా అడుగెట్టింది. ఈ కొత్త లెక్సస్ ఆర్ఎక్స్350హెచ్ లగ్జరీ వేరియంట్ ప్రారంభ ధర రూ. 95.80 లక్షలు. అదే సమయంలో హై పర్ఫామెన్స్ అందించే RX500h F-Sport+ ధర రూ. 1.18 కోట్ల వరకు ఉంటుంది (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ఇండియా).

డిజైన్:
2023 లెక్సస్ RX మంచి డిజైన్ పొందుతుంది. ఇందులో భాగంగానే ఈ లగ్జరీ ఎస్‌యువి స్పిండిల్ బాడీ డిజైన్ కలిగి దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఆధునికంగా ఉంటుంది. ఈ కారు పరిమాణం విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీని పొడవు 4890 మిమీ, వెడల్పు 1920 మిమీ, ఎత్తు 2850 మిమీ కలిగి 2850 మిమీ వీల్‌బేస్‌ పొందుతుంది.

(ఇదీ చదవండి: చదివింది ఐఐటీ.. చేసేది పశువుల వ్యాపారం.. ఆదాయం ఎంతనుకున్నారు?)

ఇంటీరియర్ ఫీచర్స్:
కొత్త లెక్సస్ ఆర్ఎక్స్ 14-ఇంచెస్ టచ్‌స్క్రీన్ కలిగి.. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో వైర్‌లెస్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటాయి. ఇంటీరియర్ బ్లాక్, డార్క్ సెపియా, సోలిస్ వైట్ అనే మూడు కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది.

ఇంజిన్ & పర్ఫామెన్స్:
2023 లెక్సస్ RX రెండు ఇంజిన్‌ల ఎంపికను పొందుతుంది. అవి CVTతో జతచేసిన 2.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ (RX350h లగ్జరీ). ఇది ఎలక్ట్రిక్ మోటారుతో కలిపి 250 హెచ్‌పి పవర్ మరియు 242 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ SUV కేవలం 7.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు.

ఇక RX500h F-Sport+ విషయానికి వస్తే.. ఇందులో 2.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 371 హెచ్‌పి పవర్ మరియు 460 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ లగ్జరీ కారు గంటకు 210 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది.

(ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!)

ప్రత్యర్థులు:
ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త లెక్సస్ ఆర్ఎక్స్ కారు జర్మన్ లగ్జరీ కారు అయిన మెర్సిడెస్ బెంజ్ GLE, బిఎండబ్ల్యు ఎక్స్5, రేంజ్ రోవర్ వెలార్, జాగ్వార్ ఎఫ్-పేస్, ఆడి క్యూ7 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement