Kia Seltos Facelift Debut: సౌత్ కొరియా కార్ తయారీ సంస్థ 'కియా మోటార్స్' దేశీయ మార్కెట్లో 'సెల్టోస్' విడుదల చేసి మంచి అమ్మకాలను పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఇందులో ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించింది. భారతీయ విఫణిలో విడుదలకానున్న కొత్త 'కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్' (Kia Seltos Facelift) గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
బుకింగ్స్
కియా మోటార్స్ ప్రవేశపెట్టిన కొత్త 'సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్' కోసం సంస్థ జులై 14 నుంచి బుకింగ్స్ స్వీకరించనున్నట్లు సమాచారం. 2019లో ప్రారంభమై దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత 2022లో ప్రపంచ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. ప్రారంభమైనప్పటి నుంచి సుమారు ఐదు లక్షల యూనిట్ల సెల్టోస్ కార్లు విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. కాగా ఇప్పుడు కొత్త రూపంలో మార్కెట్లో అడుగుపెట్టింది.
డిజైన్
సాధారణ మోడల్ కంటే కూడా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కొంచెం పెద్ద బంపర్, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌లో బాడీ కలర్ ఇన్సర్ట్‌లు, గ్రిల్‌లోకి విస్తరించే ఉండే కొత్త ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌లతో రీడిజైన్ హెడ్‌లైట్లు ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ 18 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. వెనుక భాగంలో కొత్త ఇన్వర్టెడ్ ఎల్ షేప్ టెయిల్ లైట్‌లు ఉన్నాయి.
ఫీచర్స్
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో రెండు 10.25 ఇంచెస్ డిస్‌ప్లేలతో డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఉంటుంది. ఇందులో ఒకటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మరొకటి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్. ఏసీ వెంట్స్, 360-డిగ్రీ కెమెరా, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 8 ఇంచెస్ హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రెయిన్ సెన్సింగ్ వైపర్ వంటివి ఉన్నాయి.
(ఇదీ చదవండి: హార్లే డేవిడ్సన్ బైక్ ధర ఇంత తక్కువంటే ఎవరైనా కొనేస్తారు - వివరాలు!)
సేఫ్టీ ఫీచర్స్
భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కియా మోటార్స్ కొత్త సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌లోఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తుంది. అంతే కాకుండా ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ కొలిషన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటి 17 కంటే ఎక్కువ ADAS ఫీచర్స్ కలిగి టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటివి పొందుతుంది.
(ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!)
పవర్‌ట్రెయిన్
2023 సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ 115 hp పవర్ 144 Nm టార్క్ అందించే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ & 116 hp పవర్, 250 Nm టార్క్ అందించే 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ పొందుతుంది. పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా CVTని.. డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ iMT అండ్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇవి కొత్త నిబంధలను అనుగుణంగా అప్డేట్స్ పొందాయి.
Comments
Please login to add a commentAdd a comment