Mercedes Benz AMG SL 55: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్ ఇండియా' (Mercedes Benz India) ఎట్టకేలకు దేశీయ విఫణిలో 'AMG SL 55' అనే మరో ఖరీదైన కారుని అధికారికంగా విడుదల చేసింది. ఈ కారు ధర, డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ధర
దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త మెర్సిడెస్ బెంజ్ 'ఏఎమ్‌జీ ఎస్ఎల్ 55' ప్రారంభ ధర రూ. 2.35 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది సీబీయు (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా మన దేశంలో అమ్ముడవుతుంది. రెండు డోర్లు కలిగిన ఈ కారు ఫోర్ సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది.
డిజైన్ & డైమెన్షన్ (కొలతలు)
డిజైన్ విషయానికి వస్తే, ఇందులో పనామెరికానా ఫ్రంట్ గ్రిల్, యాంగ్యులర్ ఎల్ఈడీ హెడ్‌లైట్, రెండు పవర్ డోమ్‌లతో కూడిన పొడవైన బోనెట్, పెరిగిన విండ్‌స్క్రీన్, క్వాడ్ ఎగ్జాస్ట్‌లు, 20 ఇంచెస్ అల్లాయ్ వంటివి ఉన్నాయి. ఇందులో ట్రిపుల్-లేయర్ ఫాబ్రిక్ రూఫ్ ఉంటుంది. ఇది ఓపెన్ చేయడానికి లేదా క్లోజ్ చేయడానికి కేవలం 16 సెకన్ల సమయం పడుతుంది. ఇది బ్లాక్, డార్క్ రెడ్, గ్రే కలర్ అనే మూడు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. కాగా కారు మొత్తం అబ్సిడియన్ బ్లాక్, సెలెనైట్ గ్రే, హైపర్ బ్లూ, ఆల్పైన్ గ్రే, ఒపలైట్ వైట్ బ్రైట్, స్పెక్ట్రల్ బ్లూ మాగ్నో, పటగోనియా రెడ్ బ్రైట్, మోన్జా గ్రే మాగ్నో అనే ఎనిమిది కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది.
ఏఎమ్‌జీ ఎస్ఎల్ 55 పరిమాణం పరంగా కూడా ఉత్తమంగా ఉంటుంది. దీని పొడవు 4705 మిమీ, వెడల్పు 1915 మిమీ, ఎత్తు 1359 మిమీ వరకు ఉంటుంది. కావున వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
ఇంటీరియర్ ఫీచర్స్
ఏఎమ్‌జీ ఎస్ఎల్ 55 ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 11.9 ఇంచెస్ వర్టికల్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఇది లేటెస్ట్ MBUX ఆపరేటింగ్ సిస్టమ్ కూడా పొందుతుంది. ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, దాని వెనుక ఆప్షనల్ హెడ్స్-అప్ డిస్‌ప్లే వంటి వాటితో పాటు అల్యూమినియం అండ్ కార్బన్ ఫైబర్ అనే రెండు ఇంటీరియర్ ట్రిమ్స్ మొదలైనవి లభిస్తాయి.
(ఇదీ చదవండి: మూడు పదుల వయసుకే కోట్ల విలువైన కారు - ఎవరీ యంగెస్ట్ ఇండియన్?)
ఇంజిన్
మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జీ ఎస్ఎల్ 55 4.0 లీటర్ లీటర్ ట్విన్ టర్బో, వి8 పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 476 హార్స్ పవర్ 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది కేవలం 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగాన్ని చేరుకునే ఈ కారు గరిష్ట వేగం 295 కిమీ/గం.
(ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ కన్నా ముందు రోల్స్ రాయిస్ కల్లినన్ కొన్న ఫస్ట్ ఇండియన్ ఇతడే!)
ప్రత్యర్థులు
దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జీ ఎస్ఎల్ 55 కారు పోర్స్చే 911 కర్రెరా ఎస్ క్యాబ్రియోలెట్, లెక్సస్ 500హెచ్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమాంకాల పరంగా ఇది కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము.
Comments
Please login to add a commentAdd a comment