Kia Carens Luxury (O) launched at Rs 17 lakh, check details - Sakshi
Sakshi News home page

దేశీయ మార్కెట్లో నయా కారు విడుదల చేసిన కియా మోటార్స్ - పూర్తి వివరాలు

Apr 6 2023 2:52 PM | Updated on Apr 6 2023 3:11 PM

Kia carens new luxury o launched price and detail - Sakshi

భారతీయ మార్కెట్లో 7 సీటర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కియా కారెన్స్ ఇప్పుడు 'లగ్జరీ (ఓ)' వెర్షన్ రూపంలో విడుదలైంది. ఈ లేటెస్ట్ కారు చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ ధరలు, ఫీచర్స్ పరంగా కొన్ని అప్డేట్స్ పొందింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..

ధరలు:
దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త కియా కారెన్స్ లగ్జరీ (ఓ) ధరలు రూ. 17 లక్షల నుంచి ప్రారంభమై రూ. 17.70 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఈ కారు రియల్ డ్రైవ్ ఎమిషన్ ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారవుతుంది, కావున డెలివరీలు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

(ఇదీ చదవండి: మారుతి సుజుకి ఫ్రాంక్స్ మైలేజ్ తెలిసిపోయింది: చూసారా..!)

కియా కారెన్స్ లగ్జరీ వేరియంట్ మాన్యువల్ వెర్షన్ అమ్మకానికి లేదు, ఇది కేవలం 7-సీటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటుంది. కావున సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, ఎంచుకున్న డ్రైవ్ మోడ్ వంటివి మారుతాయి. ఇప్పటికే ఉన్న లగ్జరీ ట్రిమ్ మాత్రమే 6 సీటర్‌గా లభిస్తుంది.

డిజైన్ & ఫీచర్స్:
కియా కారెన్స్ లగ్జరీ (ఓ) డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇందులో 16 ఇంచెస్ క్రిస్టల్ కట్ అల్లాయ్స్ చూడవచ్చు. ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో లెదర్డ్ స్టీరింగ్ వీల్, రెండవ వరుసలలో కూల్డ్ కప్‌హోల్డర్‌లు, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు నాలుగు స్పీకర్లు, ఐదు USB C-టైప్ ఛార్జర్‌ వంటివి పొందుతుంది. అన్ని సీట్లు 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు కలిగి ఉంటాయి.

సేఫ్టీ ఫీచర్స్:
కొత్త కియా కారెన్స్ ఇతర అన్ని మోడల్స్ మాదిరిగానే డ్రైవర్, ప్యాసింజర్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు కలిగి ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్‌ పొందుతుంది. అంతే కాకుండా ఇందులోని నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు అమర్చబడి ఉంటాయి కావున వాహన వినియోగదారులకు పటిష్టమైన భద్రత లభిస్తుంది.

ఇంజిన్ & పర్ఫామెన్స్:
లేటెస్ట్ కియా కారెన్స్ లగ్జరీ (ఓ) ట్రిమ్ కేవలం ఆటోమేటిక్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే లభిస్తుంది. ఇందులో మాన్యువల్ ఆప్షన్ లేదు. కావున ఇందులోని 1.5 లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ 7-స్పీడ్ DCTతో 160 హెచ్‌పి పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ కలిగి 116 హెచ్‌పి పవర్ అందిస్తుంది. 

(ఇదీ చదవండి: నాడు 150 సార్లు తిరస్కరించారు.. నేడు రూ. 65వేల కోట్లకు అధిపతి అయ్యాడు)

ప్రత్యర్థులు:
దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త కియా కారెన్స్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా, ఎక్స్ఎల్6 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ధరల పరంగా కారెన్స్ ఎక్కువ అయినప్పటికీ ఆధునిక ఫీచర్స్, శక్తివంతమైన ఇంజిన్ లభిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement