Kia Carens
-
లక్షల విలువ చేసే కారులో 'హోమ్ మేడ్ ఫుడ్' బిజినెస్.. వీడియో వైరల్
కరోనా వైరస్ విజృంభించిన తరువాత భారతదేశంలో చాలా మందికి ఉద్యోగాలు పోయాయి. దీంతో కొందరు డబ్బు సంపాదించడానికి మార్గాలు వెతుక్కునే క్రమంలో కొత్త ఆలోచనలకు రూపం పోశారు. గతంలో కొందరు ఖరీదైన కార్లలో కూరగాయలు విక్రయించడం, టీ విక్రయించడానికి సంబంధించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీకి చెందిన వ్యక్తి తన కొత్త కియా కారెన్స్ కారులో ఫుడ్ విక్రయించాడు. దీనికి సంబంధించిన వీడియో హర్సిమ్రాన్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోలో గమనించినట్లతే ఒక వ్యక్తి తన కియా కారెన్స్ (Kia Carens) కారులో ఆహారం విక్రయిస్తుండం చూడవచ్చు. కియా కారు బూట్ స్పేస్‌లో హోమ్ మేడ్ ఫుడ్ విక్రయిస్తున్నాడు. ఆ ఫుడ్ మొత్తం తన భార్య తయారు చేసి ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ సంఘటన ఢిల్లీలో ఎక్కడనేది తెలియాల్సి ఉంది. ఖరీదైన కారులో ఆహారం విక్రయించడం వెనుక ఉన్న అసలు కథ కూడా స్పష్టంగా తెలియదు. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. కియా కారెన్స్ ప్రారంభ ధర రూ. 10.45 లక్షలు, కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 19.45 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు ఏకంగా 23 వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. కారెన్స్ MPV పటిష్టమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Harsimran Singh (@therealharryuppal) -
మార్కెట్లో కియా నయా కారు లాంచ్ - ధర ఎంతో తెలుసా?
భారతీయ మార్కెట్లో 7 సీటర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కియా కారెన్స్ ఇప్పుడు 'లగ్జరీ (ఓ)' వెర్షన్ రూపంలో విడుదలైంది. ఈ లేటెస్ట్ కారు చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ ధరలు, ఫీచర్స్ పరంగా కొన్ని అప్డేట్స్ పొందింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.. ధరలు: దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త కియా కారెన్స్ లగ్జరీ (ఓ) ధరలు రూ. 17 లక్షల నుంచి ప్రారంభమై రూ. 17.70 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఈ కారు రియల్ డ్రైవ్ ఎమిషన్ ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారవుతుంది, కావున డెలివరీలు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: మారుతి సుజుకి ఫ్రాంక్స్ మైలేజ్ తెలిసిపోయింది: చూసారా..!) కియా కారెన్స్ లగ్జరీ వేరియంట్ మాన్యువల్ వెర్షన్ అమ్మకానికి లేదు, ఇది కేవలం 7-సీటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటుంది. కావున సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, ఎంచుకున్న డ్రైవ్ మోడ్ వంటివి మారుతాయి. ఇప్పటికే ఉన్న లగ్జరీ ట్రిమ్ మాత్రమే 6 సీటర్‌గా లభిస్తుంది. డిజైన్ & ఫీచర్స్: కియా కారెన్స్ లగ్జరీ (ఓ) డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇందులో 16 ఇంచెస్ క్రిస్టల్ కట్ అల్లాయ్స్ చూడవచ్చు. ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో లెదర్డ్ స్టీరింగ్ వీల్, రెండవ వరుసలలో కూల్డ్ కప్హోల్డర్లు, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో పాటు నాలుగు స్పీకర్లు, ఐదు USB C-టైప్ ఛార్జర్ వంటివి పొందుతుంది. అన్ని సీట్లు 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు కలిగి ఉంటాయి. సేఫ్టీ ఫీచర్స్: కొత్త కియా కారెన్స్ ఇతర అన్ని మోడల్స్ మాదిరిగానే డ్రైవర్, ప్యాసింజర్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు కలిగి ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులోని నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు అమర్చబడి ఉంటాయి కావున వాహన వినియోగదారులకు పటిష్టమైన భద్రత లభిస్తుంది. ఇంజిన్ & పర్ఫామెన్స్: లేటెస్ట్ కియా కారెన్స్ లగ్జరీ (ఓ) ట్రిమ్ కేవలం ఆటోమేటిక్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే లభిస్తుంది. ఇందులో మాన్యువల్ ఆప్షన్ లేదు. కావున ఇందులోని 1.5 లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ 7-స్పీడ్ DCTతో 160 హెచ్‌పి పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ కలిగి 116 హెచ్‌పి పవర్ అందిస్తుంది. (ఇదీ చదవండి: నాడు 150 సార్లు తిరస్కరించారు.. నేడు రూ. 65వేల కోట్లకు అధిపతి అయ్యాడు) ప్రత్యర్థులు: దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త కియా కారెన్స్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా, ఎక్స్ఎల్6 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ధరల పరంగా కారెన్స్ ఎక్కువ అయినప్పటికీ ఆధునిక ఫీచర్స్, శక్తివంతమైన ఇంజిన్ లభిస్తాయి. -
2023 కియా కారెన్స్ విడుదల చేసిన కియా మోటార్స్ - పూర్తి వివరాలు
దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ 'కియా మోటార్స్' భారతీయ మార్కెట్లో రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ (RDE) ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేటెడ్ కారెన్స్ విడుదల చేసింది. ఇది అప్డేటెడ్ ఇంజిన్ ఆప్సన్ మాత్రమే కాకుండా ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. వేరియంట్స్ & ధరలు: అప్డేటెడ్ కియా కారెన్స్ ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ అనే ఐదు వేరియంట్స్‌లో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 10.45 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధర రూ. 18.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే టర్బో-పెట్రోల్, డీజిల్ వేరియంట్ల ధరలు దాని మునుపటి మోడల్ కంటే రూ. 50,000, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ వేరియంట్ ధరలు రూ. 25,000 ఎక్కువ. ఇంజిన్ ఆప్సన్స్: కొత్త కియా కారెన్స్ E20 (పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిక్స్డ్) కంప్లైంట్ ఇంజన్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులో 1.5 లీటర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ రాబోయే BS6 ఫేజ్ 2 & RDE ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉండి 157.8 బిహెచ్పి పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ iMT యూనిట్ పొందుతుంది. (ఇదీ చదవండి: మారుతి బ్రెజ్జా సిఎన్జి కావాలా.. ఇప్పుడే బుక్ చేసుకోండి!) డిజైన్ & ఇంటీరియర్ ఫీచర్స్: 2023 కియా కారెన్స్ డిజైన్ పరంగా దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది 4.2 ఇంచెస్ కలర్ MIDతో 12.5 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. అంతే కాకుండా 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, UVO కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, బోస్ సౌండ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, రియర్ వ్యూ కెమెరా వంటివి ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్: ఆధునిక కాలంలో డిజైన్, ఫీచర్స్ మాత్రమే కాకుండా సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్న వాహనాలను కొనుగోలుచేయడానికి కస్టమర్లు ఎక్కువ ఆస్కతి చూపుతున్నారు. ఈ కారణంగానే వాహన తయారీ సంస్థలు అప్డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ అందిస్తున్నాయి. 2023 కారెన్స్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX మౌంట్లు, హిల్-హోల్డ్ అసిస్టెన్స్ వంటి వాటిని పొందుతుంది. (ఇదీ చదవండి: విడుదలకు సిద్దమవుతున్న మారుతి కార్లు: కొత్త జిమ్నీ నుంచి ఫ్రాంక్స్ వరకు..) ప్రత్యర్థులు: అప్డేటెడ్ కియా కారెన్స్ దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి ఎర్టిగా, ఎక్స్ఎల్6 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ధరల పరంగా ఎర్టిగా రూ. 8.35 లక్షల నుంచి రూ. 12.79 లక్షల మధ్య ఉంటుంది. ఎక్స్ఎల్6 ధరలు రూ. 11.41 లక్షల నుంచి రూ. 14.67 లక్షల వరకు ఉంది. కావున ఈ విభాగంలో కారెన్స్ ధర కొంత ఎక్కువగానే ఉంది, కానీ రానున్న కొత్త నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంది. -
కియా మోటార్స్ ఈ కార్లను నిలిపివేస్తుందా?
భారతదేశంలో రోజురోజుకి ఆధునిక ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి, ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా ఉండటం గమనార్హం. కియా మోటార్స్ కూడా దేశీయ మార్కెట్లో కియా ఈవి6 ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసి మంచి అమ్మకాలను పొందుతోంది. ఈ తరుణంలో కంపెనీ తన డీజిల్ మాన్యువల్ వేరియంట్లను నిలివేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇప్పటికే చాలా కంపెనీలు మార్కెట్లో డీజిల్ ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేసి ఆ స్థానంలో కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. ఈ మార్గంలోనే కియా మోటార్స్ కూడా పయనించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. డీజిల్ ఔత్సాహికులు ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో సంతృప్తి చెందాలి, ఇది ఆటోమేటెడ్ క్లచ్ ఆపరేషన్‌తో కూడిన మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇప్పుడు సెల్టోస్ మాత్రమే 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లతో పాటు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 6-స్పీడ్ iMT ఆప్సన్ అందిస్తోంది. అయితే సొనెట్, కారెన్స్ డీజిల్ వేరియంట్స్ స్టాండర్డ్ మ్యాన్యువల్ & ఆటోమాటిక్లో లభిస్తున్నాయి. డీజిల్ వేరియంట్స్‌లో ఐఎమ్టికి అనుకూలంగా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను నిలిపివేసే ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. మాన్యువల్ గేర్‌బాక్స్, ఆటోమాటిక్ మధ్య బ్యాలెన్స్‌ని స్ట్రైక్ చేయడం ద్వారా డ్రైవర్‌ను క్లచింగ్ అండ్ డీ-క్లచింగ్ను ఆటోమేటిక్‌గా చూసుకుంటూ షిఫ్టింగ్ పార్ట్‌పై పూర్తి కంట్రోల్ కలిగి ఉండటానికి అనుమతిస్తుంది. గేర్ లివర్ ఉపయోగించి రెండు పెడల్ డ్రైవింగ్‌కు అలవాటు పడటానికి కొంత సమయం పట్టవచ్చు. ఇది బంపర్-టు-బంపర్ ట్రాఫిక్‌లో అనుకున్నంత సులభంగా ఉండదు. ఇటీవల చాలా మంది కస్టమర్లు క్లచ్‌లెస్ డ్రైవింగ్ వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే దీనికోసం కొంత ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ప్రస్తుతం బిఎస్6 ఉద్గార ప్రమాణాలు మరింత కఠినతరం అవుతున్నాయి, ఈ సమయంలో డీజిల్ కార్ల ధరలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అయితే కంపెనీ ఈ కార్ల డిస్కంటీన్యూ గురించి ఎటువంటి అధికారిక సమాచారం అందివ్వలేదు. -
ఎయిర్బాగ్స్ సమస్య: కియా కార్ల భారీ రీకాల్
సాక్షి, ముంబై: ప్రముఖ కార్ల కంపెనీ కియా తన పాపులర్ మోడల్ కియా కేరెన్స్ కార్లను భారీగా రీకాల్ చేస్తోంది. ఎయిర్‌బ్యాగ్ సమస్య కారణంగా దాదాపు 44,174 ఎంపీవీ యూనిట్లు రీకాల్ చేసింది. ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ మాడ్యూల్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను పరిశీలించనుంది. 6 ఎయిర్‌బ్యాగ్స్ అందిస్తున్న కియా కేరెన్స్ కార్ల స్వచ్ఛంద రీకాల్‌లో అవసరమైతే సాఫ్ట్వేర్ అప్డేట్తో ఎయిర్‌బ్యాగ్ సమస్యను కంపెనీ పరిష్కరించ నుంది. ఇందులో భాగంగా ప్రభావితమైన కారు యజమానులను నేరుగా సంప్రదిస్తుంది. లేదంటే సమస్యను పరిష్కరించేందుకు వీలుగా కియా కేరెన్స్ యజమానులు తమ కారును సమీపంలోని కియా డీలర్‌షిప్‌ల వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేదా కియా ఇండియా వెబ్సైట్, యాప్ లేదా వారి కాల్ సెంటర్లో గానీ సంప్రదించవచ్చు. (Akasa Air ఆఫర్: వారి సంబరం మామూలుగా లేదుగా!) కాగా గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో కియా కేరెన్స్ 3-స్టార్ ర్యాంక్ సాధించింది.1.5 పెట్రోల్, 1.4 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ మూడు వేరియంట్లలో ఇది లభ్యం. 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 8-స్పీకర్లు, స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ అనే 5 ట్రిమ్‌లలో ఇది లభ్యం. అన్నింటిలోనూ 6 ఎయిర్‌బ్యాగ్స్, 10 హై-సేఫ్టీ ప్యాకేజీలు కూడా అందింస్తున్న సంగతి తెలిసిందే. (జావా అదిరిపోయే కొత్త బైక్ చూశారా? ధర కూడా అంతే అదుర్స్) -
వామ్మో ఆ కారుకి అంత డిమాండా? ఏడాదిన్నర వెయిటింగ్ పీరియడ్!!
రా మెటీరియల్ కాస్ట్ పెరిగిందంటూ వరుసగా ఆటో మొబైల్ కంపెనీలు ధరలు పెంచుతూ పోతున్నాయి. ఐనప్పటికీ కార్లకున్న డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ఇక లేటెస్ట్ ఫీచర్లతో విడుదలైన కార్లను కొనుగోలు చేసేందుకయితే ప్రజలు పోటీ పడుతున్నారు. దీంతో వెయిటింగ్ పీరియడ్ పెరుగుతూ పోతోంది. కరెన్స్ కావాలి ఈ ఏడాది రిలీజైన కార్లలో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న కారుగా కియా కరెన్స్ నిలుస్తోంది. ఈ కారుని 2022 ఫిబ్రవరి 15న ఇండియా మార్కెట్లో లాంచ్ చేశారు. ప్రారంభ ధరగా రూ.8.99 లక్షలుగా నిర్ణయించగా ఆ వెంటనే ధరలను సవరించి రూ.9.59 లక్షలకు పెంచారు. ఐనప్పటికీ ఈ కారుకి డిమాండ్ తగ్గడం లేదు. ఏప్రిల్ వరకు 12 వేల యూనిట్లు దేశీయంగా అమ్ముడైపోగా 50వేల కార్లకు బుకింగ్ జరిగింది. కనీసం 23 వారాలు కియా కరెన్స్‌లో ఐదే వేరియంట్లు ఉన్నాయి. ఇందులో పెట్రోల్/ డీజిల్, మాన్యువల్/ఆటో గేర్ షిఫ్ట్, 6/7 సీటర్ వేరియంట్లు ఉన్నాయి. ఇందులో ధర తక్కుగా ఉన్న బేసిక్ వేరియంట్ అయిన ప్రీమియం 1.5 లీటర్ పెట్రోల్ మాన్యువల్‌ను సొంతం చేసుకోవాలంటే గరిష్టంగా 75 వారాల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని కియా ప్రతినిధులు తెలిపారు. ఇక ఇందులో హైఎండ్ వేరియంట్ అయిన లగ్జరీ ప్లస్ అయితే 23 వారాల వెయింటింగ్ పీరియడ్ ఉంది. మహీంద్రా ఇక ఇండియాలో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న మోడల్‌గా మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఓఓ మోడల్ ఉంది. లేటెస్ట్ ఫీచర్లతో మహీంద్రా గతేడాది రిలీజ్ చేసిన ఈ మోడల్‌ను సొంతం చేసుకునేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. ముందస్తుగా బుకింగ్స్ చేసుకుంటున్నారు. దీంతో ఈ కారు పొందాలంటే 20 నెలల నుంచి రెండేళ్ల వరకు వెయింటింగ్ పీరియడ్ ఉంది. చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ, టయోటా వేలకోట్ల పెట్టుబడులు! -
హాట్‌కేకుల్లా బుక్కైన కియా నయా కార్..! ఏకంగా 50 వేలకు పైగా..కేవలం..
దక్షిణ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ భారత్‌లో రికార్డులు క్రియేట్ చేస్తూ అమ్మకాల్లో దూసుకుపోతుంది. భారత మార్కెట్లలో సరికొత్త మోడల్స్‌తో అదరగొడుతోంది.గత నెలలో కియా భారత్‌లోకి కియా ఎంపీవీ వెహికిల్ కియా కారెన్స్‌ను లాంచ్ చేసింది.జనవరి 14, 2022న కియా కారెన్స్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమవ్వగా.. కేవలం రెండు నెలల్లోనే 50,000 బుకింగ్‌లను దాటినట్లు కియా ఇండియా ప్రకటించింది. ఈ బుకింగ్స్‌లో ఎక్కువగా టైర్-1, టైర్-2 నగరాల్లోనే 60 శాతం పైగా బుకింగ్స్ జరిగాయి. దేశ వ్యాప్తంగా లగ్జరీ కార్లను కొనేవారిలో 45 శాతం మంది కియా కారెన్స్ తొలి ఎంపికగా నిలుస్తోందని కంపెనీ ప్రకటించింది. సమానంగా డిమాండ్..! కియా కారెన్స్ పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లకూ డిమాండ్ సమానంగా ఉందని కియా ఇండియా తెలియజేసింది. దాదాపు 50 శాతం మంది వినియోగదారులు డీజిల్ వేరియంట్లను బుక్ చేసుకున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే, కియా కారెన్స్ ఆటోమేటిక్ వేరియంట్ కేవలం 30% మంది కస్టమర్లను మాత్రమే ఆకర్షించగలిగింది. కారెన్స్ మాన్యువల్ ట్రిమ్‌ల వేరియంట్స్ ఎక్కువ బుకింగ్స్ నమోదయ్యాయి. ఫిబ్రవరిలో, కియా ఇండియా ప్రారంభించిన 13 రోజుల్లోనే 5,300 కారెన్స్ కార్లను విక్రయించింది. కియా కారెన్స్ కేవలం రెండు నెలల కంటే తక్కువ సమయంలో అద్భుతమైన మైలురాయి సాధించడంపై కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ మ్యుంగ్-సిక్ సోహ్న్ మాట్లాడుతూ..‘ఫ్యామిలీ మూవర్ కార్ల సెగ్మెంట్లో మునుపెన్నడూ లేని విధంగా కియా కారెన్స్ రికార్డు సృష్టించింది. ఇది మా ఇతర ఎస్‌యూవీల వలే అతి తక్కువ కాలంలోనే భారీ బుకింగ్స్‌ను సాధించింది. కస్టమర్లు మా ఉత్పత్తుల మీద పెట్టుకున్న నమ్మకానికి ధన్యవాదాలు తెలిపారు. ఇంజిన్ విషయానికి వస్తే..! కియా కరెన్స్ 1.5-లీటర్ CRDi డీజిల్ ఇంజిన్ లేదా 1.4-లీటర్ GDi టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఈ రెండు వేరియంట్లలో ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రామాణికంగా ఉంది. డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్, టర్బో పెట్రోల్‌తో 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కొనుగోలుదారులు ఎంపిక చేసుకోవచ్చును. ధర ఎంతంటే..! కియా కరెన్స్‌ను కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి ప్రి-బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ కారు ధర రూ. 8.99 లక్షల నుంచి రూ. 16.99 లక్షల వరకు ఉంది. ఈ కారు మొత్తం ప్రీమియం, ప్రెస్టిజ్, ప్రేస్టిజ్ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ అనే ఐదు రకాల వేరియంట్లలో రానుంది. చదవండి: వైరస్,బ్యాక్టిరియా ప్రూఫ్ ప్రొటెక్షన్‌తో కియా నుంచి అదిరిపోయే కారు లాంచ్..! -
వైరస్,బ్యాక్టిరియా ప్రూఫ్ ప్రొటెక్షన్‌తో కియా నుంచి అదిరిపోయే కారు లాంచ్..!
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ భారత మార్కెట్లలోకి సెవెన్-సీటర్ యుటిలిటీ వెహికల్ (ఎంపీవీ) కియా కరెన్స్‌ను లాంచ్ చేసింది. సెల్టోస్, కార్నివాల్, సోనెట్ తర్వాత భారతదేశ లైనప్‌లో కియాకు చెందిన నాల్గో వాహనంగా కరెన్స్ నిలవనుంది. ఈ వాహనం ఆంధ్రప్రదేశ్‌లోని కియా ప్లాంట్‌లో తయారుకానుంది. ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా కియా కరెన్స్ సప్లై కానున్నట్లు తెలుస్తోంది. డిజైన్ విషయానికి వస్తే..! కియా సెల్టోస్ మాదిరిగా కాకుండా, కియా కరెన్స్ సొగసైన గ్రిల్ డిజైన్, ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌తో రానుంది. బోల్డ్ డిజైన్, హై-టెక్ ఫీచర్లు, ఇండస్ట్రీ-లీడింగ్ సేఫ్టీ సిస్టమ్స్‌తో కొత్త సెగ్మెంట్, ఇండస్ట్రీ బెంచ్ మార్క్‌గా కియా కరెన్స్ నిలవనుంది. ఎంపీవీ వెనుక భాగంలో టీ-ఆకారంలో ర్యాప్ రౌండ్ ఎల్ఈడీ క్లస్టర్స్‌ను కల్గి ఉంది. అంతేకాకుండా చిసెల్డ్ ఫ్రంట్ బంపర్, క్రోమ్ ఇన్సర్ట్లు, ఫాక్స్ స్కిడ్ ప్లేట్ , ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు కూడా ఉన్నాయి. ఇంటీరియర్స్‌లో క్రేజీ లుక్స్‌తో..! కియా కరెన్స్ ఇంటీరియర్స్ హై ఎండ్ డిజైన్‌ను పొందనుంది. ఈ కారులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.5-అంగుళాల డిజటల్ క్లస్టర్, ఆపిల్ కార్ప్లే , ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 8 స్పీకర్ల బాస్ సౌండ్ సిస్టమ్ 360-డిగ్రీ కెమెరాలు అమర్చారు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఈఎస్ఈ, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఫ్రంట్ , రియర్ పార్కింగ్ సెన్సార్ల ద్వారా కారులో ప్రయాణించే వారికి మరింత భద్రతను కరెన్స్ అందిస్తోంది. సెఫ్టీ విషయంలో రాజీ లేకుండా..! కియా కరెన్స్ కారులో భద్రత విషయంలో ఎక్కడ తగ్గకుండా పలు జాగ్రత్తలను కియా తీసుకుంది. సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్, ఆల్ ఫోర్ డిస్క్ బ్రేక్, ఎలక్ట్రానిక్ స్టాబిలిటీ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, రోల్ఓవర్ మిటిగేషన్, హిల్ అసిస్ట్ వంటి డ్రైవర్ అసిస్ట్ ఫీచర్స్‌తో రానుంది. జియోఫెన్సింగ్, లైవ్ వెహికిల్ స్టాటస్ అండ్ ట్రాకింగ్, క్లైమట్ కంట్రోల్ ఆపరేషన్‌తో రానుంది. దాంతోపాటుగా స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ఫ్యూరిఫైయర్ సిస్టమ్‌ను కల్గి ఉంది. దీని సహాయంతో వైరస్, బాక్టీరియా నుంచి ప్రయాణికులను కాపాడుతుంది. ఇంజిన్ విషయానికి వస్తే..! కియా కరెన్స్ 1.5-లీటర్ CRDi డీజిల్ ఇంజిన్ లేదా 1.4-లీటర్ GDi టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఈ రెండు వేరియంట్లలో ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రామాణికంగా ఉంది. డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్, టర్బో పెట్రోల్‌తో 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కొనుగోలుదారులు ఎంపిక చేసుకోవచ్చును. వీటికి గట్టిపోటీ..! కియా మోటార్స్ ఆవిష్కరించిన కియా కరెన్స్ కొత్త వాహనం పలు దిగ్గజం కంపెనీల ఎస్‌యూవీలతో పోటీ పడనుంది. హ్యుందాయ్ అల్కాజార్, మారుతి ఎర్టిగా, ఎంజీ హెక్టర్ ప్లస్, మహీంద్రా మరాజో, మహీంద్రా XUV700 వంటి వాటితో సెవెన్-సీటర్ కరెన్స్ పోటీపడే అవకాశం ఉంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే...కియా కరెన్స్ సెగ్మెంట్లో పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంది. ఈ వాహనం సిక్స్-సీటర్, సెవెన్-సీటర్ వేరియంట్లలో కూడా లభ్యం కానుంది. ధర ఎంతంటే..! కియా కరెన్స్‌ను కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి ప్రి-బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ కారు ధర రూ. 8.99 లక్షల నుంచి రూ. 16.99 లక్షల వరకు ఉంది. ఈ కారు మొత్తం ప్రీమియం, ప్రెస్టిజ్, ప్రేస్టిజ్ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ అనే ఐదు రకాల వేరియంట్లలో రానుంది. చదవండి: హోండా బంపరాఫర్..! ఆ బైక్‌పై ఏకంగా రూ. లక్ష తగ్గింపు..! -
అనంతపూర్‌లో తయారీ.. 80 దేశాలకు ఎగుమతి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా ప్లాంటు నుంచి కరెన్స్ మోడల్ తొలి కారు సోమవారం వెలువడింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ జిల్లాలో కియా అత్యాధునిక తయారీ కేంద్రం ఉన్న సంగతి తెలిసిందే. దక్షిణ కొరియాకు చెందిన కియా 2021 డిసెంబర్లో రిక్రియేషనల్ వెహికిల్ కరెన్స్‌ను భారత్ వేదికగా తొలిసారిగా ప్రదర్శించింది. ఫిబ్రవరిలో అధికారికంగా ఈ కారును ఆవిష్కరించనున్నారు. అనంతపూర్ ప్లాంట్ నుంచి 80కిపైగా దేశాలకు ఎగుమతి చేయనున్నారు. దేశీయ మార్కెట్లో కంపెనీ నుంచి ఇది నాల్గవ మోడల్. ఇప్పటికే సంస్థ సెల్టోస్, సోనెట్, కార్నివాల్ మోడళ్లను విక్రయిస్తోంది. ప్యాసింజర్ కార్ల విపణిలో కొత్త విభాగాన్ని కరెన్స్ సృష్టిస్తుందని కంపెనీ తెలిపింది. యువ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఈ మోడల్‌కు రూపకల్పన చేసినట్టు కియా ఇండియా ఎండీ, సీఈవో టే జిన్ పార్క్ ఈ స ందర్భంగా తెలిపారు. ఆధునిక భారతీయ కుటుంబాలను ప్రతిబింబించే ఉత్పత్తిని తీసుకురావడానికి తమ బృందాలు అవిశ్రాంతంగా పనిచేశాయని అన్నారు. ఇవీ కరెన్స్ విశిష్టతలు.. 1.4 లీటర్, 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అయిదు రకాల ఇంజన్ గేర్‌బాక్స్ ఆప్షన్స్, అయిదు రకాల ట్రిమ్ లైన్స్.. మూడు వరుసల్లో 6, 7 సీట్లతో కరెన్స్ లభిస్తుంది. 4,540 మిల్లీమీటర్ల పొడవు ఉంది. డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో 7 స్పీడ్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 6 స్పీడ్ పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రైన్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, హిల్ అసిస్ట్ కంట్రోల్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్, స్లైడింగ్ టైర్ సీట్ అండర్ట్రే, రిట్రాక్టేబుల్ సీట్‌బ్యాక్ టేబుల్, రేర్ డోర్ స్పాట్ ల్యాంప్, మూడవ వరుసలో బాటిల్, గ్యాడ్జెట్ హోల్డర్, 216 లీటర్ల లగేజ్ స్పేస్ వంటి హంగులు ఉన్నాయి. ధర ఎక్స్‌షోరూంలో రూ.14–19 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. చదవండి:AP: పెట్టుబడులకు పెట్టని కోట -
వచ్చేసింది కియా నయా కార్..! కళ్లు చెదిరే లుక్స్‌తో, సూపర్ డూపర్ ఫీచర్స్‌తో..!
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ రాబోయే సెవెన్-సీటర్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) 'కరెన్స్'ను గురువారం (డిసెంబర్ 16) ఆవిష్కరించింది. ఈ కారును రిక్రియేషనల్ వెహికిల్‌గా కియా పేర్కొంది. సెల్టోస్, కార్నివాల్, సోనెట్ తర్వాత భారతదేశ లైనప్‌లో కియాకు చెందిన నాల్గో వాహనంగా కరెన్స్ నిలవనుంది. ఈ వాహనం ఆంధ్రప్రదేశ్‌లోని కియా ప్లాంట్‌లో తయారుకానుంది. ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా కియా కరెన్స్ సప్లై కానున్నట్లు తెలుస్తోంది. డిజైన్ విషయానికి వస్తే..! కియా సెల్టోస్ మాదిరిగా కాకుండా, కియా కరెన్స్ సొగసైన గ్రిల్ డిజైన్, ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌తో రానుంది. బోల్డ్ డిజైన్, హై-టెక్ ఫీచర్లు, ఇండస్ట్రీ-లీడింగ్ సేఫ్టీ సిస్టమ్స్‌తో కొత్త సెగ్మెంట్, ఇండస్ట్రీ బెంచ్ మార్క్‌గా కియా కరెన్స్ నిలవనుంది. ఎంపీవీ వెనుక భాగంలో టీ-ఆకారంలో ర్యాప్ రౌండ్ ఎల్ఈడీ క్లస్టర్స్‌ను కల్గి ఉంది. అంతేకాకుండా చిసెల్డ్ ఫ్రంట్ బంపర్, క్రోమ్ ఇన్సర్ట్లు, ఫాక్స్ స్కిడ్ ప్లేట్ , ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు కూడా ఉన్నాయి. ఇంటీరియర్స్‌లో హై ఎండ్..! కియా కరెన్స్ ఇంటీరియర్స్ హై ఎండ్ డిజైన్‌ను పొందనుంది. ఈ కారులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే , ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 360-డిగ్రీ కెమెరాలు అమర్చారు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఈఎస్ఈ, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఫ్రంట్ , రియర్ పార్కింగ్ సెన్సార్ల ద్వారా కారులో ప్రయాణించే వారికి మరింత భద్రతను కరెన్స్ అందిస్తోంది. ఇంజిన్ విషయానికి వస్తే..! కియా కరెన్స్ 1.5-లీటర్ CRDi డీజిల్ ఇంజిన్ లేదా 1.4-లీటర్ GDi టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఈ రెండు వేరియంట్లలో ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రామాణికంగా ఉంది. డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్, టర్బో పెట్రోల్‌తో 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కొనుగోలుదారులు ఎంపిక చేసుకోవచ్చును. వీటికి గట్టిపోటీ..! కియా మోటార్స్ ఆవిష్కరించిన కియా కరెన్స్ కొత్త వాహనం పలు దిగ్గజం కంపెనీల ఎస్‌యూవీలతో పోటీ పడనుంది. హ్యుందాయ్ అల్కాజార్, మారుతి ఎర్టిగా, ఎంజీ హెక్టర్ ప్లస్, మహీంద్రా మరాజో, మహీంద్రా XUV700 వంటి వాటితో సెవెన్-సీటర్ కరెన్స్ పోటీపడే అవకాశం ఉంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే...కియా కరెన్స్ సెగ్మెంట్లో పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంది. ఈ వాహనం సిక్స్-సీటర్, సెవెన్-సీటర్ వేరియంట్లలో కూడా లభ్యం కానుంది. బుకింగ్స్ ఎప్పుడంటే..! కియా కరెన్స్‌ను కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి ప్రి-బుకింగ్స్ చేసుకునే అవకాశాన్ని కొనుగోలుదారులకు కల్పించింది. ఇప్పటికే బుకింగ్‌లను అంగీకరించడం ప్రారంభించింది. 2022 మొదటి త్రైమాసికంలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. కాగా ఈ కారు ధరలను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. చదవండి: టీఎంసీ బంపర్ ఆఫర్..!, 2025 వరకు రాయితీ వర్తింపు